తేలుస్తారా.. ముంచేస్తారా! | Chandrababu Naidu government to present annual budget to Assembly on Saturday | Sakshi
Sakshi News home page

తేలుస్తారా.. ముంచేస్తారా!

Feb 14 2026 5:16 AM | Updated on Feb 14 2026 5:17 AM

Chandrababu Naidu government to present annual budget to Assembly on Saturday

బడ్జెట్‌పై యువత గంపెడాశలు.. 

ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి అమలు కోసం ఎదురు చూపులు.. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేల చొప్పున ఇచ్చేందుకు కేటాయింపులుంటాయా? 

19–59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఇచ్చేలా బడ్జెట్‌ కేటాయిస్తారా?.. నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ను సమర్పించనున్న ఆర్థిక మంత్రి 

సాక్షి, అమరావతి : సూపర్‌ సిక్స్ లోని ప్రధాన హామీలను గత రెండు బడ్జెట్‌లలో అమలు చేయకుండా మోసానికి గురిచేసిన కూటమి సర్కారు.. ఈ బడ్జెట్‌లోనైనా తమకిచ్చిన హామీలను అమలు చేస్తుందనే గంపెడాశలతో యువతీ యువకులు ఎదురు చూస్తున్నారు. సూపర్‌ సిక్స్‌లో 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పన ఏడాదికి రూ. 18 వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే ఉద్యోగం కల్పించే వరకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. 

అయితే 2024–25 వార్షిక బడ్జెట్‌లో ఈ రెండు పథకాలకు పైసా కేటాయింపులు చేయలేదు. అలాగే 2025–26 వార్షిక బడ్జెట్‌లో కూడా ఒక్క రూపాయి కేటాయించ లేదు. ఈ నేపథ్యంలో 2026–27 వార్షిక బడ్జెట్‌ను చంద్రబాబు ప్రభుత్వం శనివారం అసెంబ్లీకి సమర్పించనుంది. కూటమి ప్రభుత్వానికి ఇది మూడో బడ్జెట్‌. ఉదయం 11.15 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ వార్షిక బడ్జెట్‌ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 

అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. మండలిలో హోం మంత్రి అనిత వార్షిక బడ్జెట్‌ను, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వ్యవసాయ బడ్జెట్‌ను చదువుతారు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చదువుతారు.  

ఈ బడ్జెట్‌లో ఏం చేస్తారో! 
»  ఆడబిడ్డ నిధిని పీ–4తో, నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేసి అమలు చేసేశామని, ఎవరైనా వీటి గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప ఇంకొకటి కాదని చంద్రబాబు పేర్కొన్న విషయం తెలిసిందే. నిరుద్యోగ భృతి కోసం నిరుద్యోగ యువత, ఆడబిడ్డ నిధి కోసం మహిళలు రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు.  

»   ఈ బడ్జెట్‌లోనైనా ఆడబిడ్డ నిధికి, నిరుద్యోగ భృతికి కేటాయింపులు చేసి అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, గత రెండు బడ్జెట్‌లలో సూపర్‌ సిక్స్‌ పథకాలకు సంబంధించి చంద్రబాబు సర్కారు రూ.1,43,000 కోట్లు ఎగనామం పెట్టింది. ఈ బడ్జెట్‌లోనైనా ఆ మేరకు నిధులను అదనంగా కేటాయిస్తారని హామీలు పొందిన ప్రజలు ఎదురు చూస్తున్నారు.  

» చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ హామీల అమలు బాధ్యత తాను తీసుకుంటానని పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, హామీల అమలు గురించి పవన్‌ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.  

» సూపర్‌ సిక్స్‌తో పాటు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. కానీ సూపర్‌ సిక్స్‌కే తొలి రెండు బడ్జెట్‌లలో దిక్కు లేకుండా చేశారు. ఇప్పుడు మూడో బడ్జెట్‌లో ఏమేరకు చేస్తారో నేడు తేలిపోనుంది. 

»   ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూ.3.22 లక్షల కోట్లతో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2026–27 వార్షిక బడ్జెట్‌ను దాదాపు పది శాతం మేర పెంచి రూ.3.46 లక్షల కోట్లకు పైగా ప్రవేశ పెడతారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement