
రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి
విజయవాడ: రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టుకు ఆధారాల్లేవని, ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పష్టం చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ పై ఈరోజు(శనివారం) విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి.. ఈ కేసుకు సంబంధించి కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల తరఫున న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు
‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ సక్రమం కాదు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు. ఇద్దరి అరెస్ట్‌కు అధారాల్లేవ్. కోర్టుకు కూడా అరెస్ట్ కు సంబంధించిన ఆధారాలు ఏవీ ఇవ్వలేదు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చట్ట విరుద్ధం. సిట్ కు ఈ కేసు విచారించే అర్హత లేదు.అసలు రూ. 3200 కోట్లు స్కామ్ కి అసలు ఆధారాలు ఏవి?, రూ. 3200 కోట్లు స్కామ్ ఆధారాలు కోర్టుకి కూడా ఇవ్వలేదు.
ప్రభుత్వ సొంత కార్పొరేషన్ రికార్డుల్లో ఉన్న సమాచారం కూడా ఇవ్వలేదు. గత 5 ఏళ్ల పాలనలో లిక్కర్ ఆదాయం పెరిగింది. లిక్కర్ వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది. మరి రూ. 3200 కోట్లు స్కామ్ ఎక్కడ జరిగింది?, రూ. 16 వేల కోట్ల నుండి రూ. 24 వేల కోట్లకు ఆదాయ పెరిగింది. మరి ప్రభుత్వంకి నష్టం ఎక్కడొచ్చింది. అరెస్ట్ కారణాలను కూడా కాపీ పేస్ట్ చేశారు. ఇది రాజకీయ ప్రేరేపితం కూడా అయ్యి ఉండొచ్చు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది’ అని శ్రీరామ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: