‘ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు నోరు విప్పరేం?’ | Kurasala Kannababu Fires On Tdp Mp Putta Mahesh Kumar | Sakshi
Sakshi News home page

‘ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు నోరు విప్పరేం?’

Mar 15 2026 1:33 PM | Updated on Mar 15 2026 3:39 PM

Kurasala Kannababu Fires On Tdp Mp Putta Mahesh Kumar

సాక్షి, కాకినాడ జిల్లా: టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీలా మారిందన్న అనుమానం ప్రజలకు వచ్చిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్‌ పార్టీలో దొరికారు‌. ఇప్పటి వరకు దీనిపై  చంద్రబాబు కానీ.. టీడీపీ నేతలు కానీ నోరెత్తలేదు. తెల్లవారు లేస్తే ప్రవచనాలు చెప్పే చంద్రబాబు.. డ్రగ్స్ తీసుకుని దొరికిన ఎంపీపై ఏం చెబుతారు అని మేము అడుగుతున్నాం’’ అంటూ కన్నబాబు నిలదీశారు.

‘‘డ్రగ్స్ రహిత సమాజం సృష్టించాలని.. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ మంత్రి  లోకేష్ ఉద్యమంలా ప్రచారం చేశారు. డ్రగ్స్ వద్దని ప్రజలకు చెబుతారు కానీ.. మీ పార్టీలో వారు మాత్రం సేవిస్తూ ఉంటారు. ఎదుట వారికి చెప్పడానికే నీతులు.. మేము మాత్రం అన్ని పనులు చేస్తాం అన్నట్లు ఉంది టీడీపీ పరిస్థితి. ఒకాయన మహిళలతో రాసలీలలు.. మరోకరు డ్రగ్స్‌తో దొరికిన ప్రభుత్వ పరంగా ఏలాంటి చర్యలు ఉండవు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని హోమంత్రి అనిత ప్రకటించిన పది రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సొంత జిల్లాలో గంజాయి పట్టుబడింది.

..పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు.. తప్పుడు కేసులు కట్టడంలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే పార్టీ స్పందన ఏంటీ?. అంతకు ముందు కూటమి ఎమ్మెల్యేల బాగోతం.. తరువాత టీవీ 5 చైర్మన్ బాగోతం.. ఇప్పుడు ఏలూరు ఎంపీ బాగోతం చూస్తున్నాం’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement