
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డి బెయిల్‌పై ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ నెల 12న బెయిల్ పిటీషన్‌పై విజయవాడ ఏబీసీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.
ముగ్గురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎక్కడా మిథున్‌రెడ్డి పాత్ర ఉందని చెప్పలేదని ఆయన తరఫు లాయర్ తెలిపారు. అసలు లిక్కర్ స్కామే జరగలేదని న్యాయవాది తెలిపారు. ‘‘ఇప్పటివరకు మిథున్‌రెడ్డిని సిట్ కస్టడీకి కోరలేదు. పీఎల్‌ఆర్ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ అయిన నగదును తిరిగి మళ్లీ చెల్లించడం జరిగింది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలి’ అని న్యాయవాది కోరారు.