breaking news
illegal liquor case
-
పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో సిట్ అధికారులు తనను అక్రమంగా ఇరికించారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ‘‘మా కుటుంబం మద్యం జోలికి పోలేదు. వేద పాఠశాల నడుపుతున్నా.. నేనెప్పుడూ అబద్ధం చెప్పను.. పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు’’ అంటూ కోర్టు నుంచి జైలుకి తరలించే సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.గాడ్ ఈజ్ సుప్రీం.. నేచర్ ఈజ్ సుప్రీం. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. మద్యం ముట్టలేదు.. అమ్మలేదు. అమ్మనురాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు మోపండి. చిన్నప్పటి నుంచి దూరం పెట్టిన మద్యాన్ని రుద్దడం భావ్యం కాదు. ప్రభుత్వ పెద్దలు తప్పు చేస్తున్నారు. దానిని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారు’’ అంటూ చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, లిక్కర్ అక్రమ కేసులో అరెస్టైన వారికి ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన వారికి ఆగస్ట్ 26 వరకూ రిమాండ్‌ను పొడిగించింది. -
ఆ విమానం సీఎం రమేష్‌ది..
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ అభాసుపాలై డైవర్షన్ వ్యవహారాలకు తెరదీస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా మరో తప్పుటడుగు వేసింది. ఈ కేసులో ఒక నిందితుడైన వెంకటేష్ నాయుడు ఉపయోగించిన ప్రత్యేక విమానం బీజేపీకి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్దనే విషయం బయటపడడంతో టీడీపీ అభాసుపాలైంది. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ విమానంలో ఈ ఏడాది ఏప్రిల్ 13న వెంకటేశ్ నాయుడు హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. హైదరాబాద్‌కు చెందిన మధు క్రియేషన్స్ రూ.17 లక్షలతో ఈ విమానం టికెట్‌ను బుక్ చేసింది. వీటీ వీఐఎన్ టైప్‌కి చెందిన ఈ ప్రత్యేక విమానంపై సీఎంఆర్ (సీఎం రమేష్) అనే పేరు కూడా రాసి ఉంది. అందులోనే సినీ నటి తమన్నా కూడా ప్రయాణించారు. ఆమె పక్క సీటులో కూర్చున్న వెంకటేష్ నాయుడి ఫొటోలను మాత్రమే సిట్ విడుదల చేసి తప్పుడు ప్రచారం చేసింది. దీంతో వెంకటేష్ నాయుడు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలకు ప్రధాన అనుచరుడని టీడీపీ నేతలు, సిట్ చేసిన ప్రచారం అంతా తప్పని తేలిపోయింది. సీఎం రమేష్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు ఆయన్ను బీజేపీలోకి పంపారు. రమేష్ బీజేపీలో ఉండి చంద్రబాబు కోసం పని చేస్తున్నారనే విషయం కూడా తెలిసిందే. మద్యం అక్రమ కేసులో వైఎస్సార్సీపీ నేతలపై ఎడాపెడా బురద జల్లే క్రమంలో సిట్, ఎల్లో మీడియా.. వెంకటేష్ నాయుడు డబ్బు లెక్కిస్తున్న ఎప్పటివో పాత వీడియోలు విడుదల చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అతను టీడీపీకే అత్యంత అనుకూల వ్యక్తని తేలిపోయింది. సీఎం రమేష్ విమానాన్ని ఉపయోగించడమే కాదు..చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసానితో వెంకటేష్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరలయ్యాయి. హైదరాబాద్‌లో దొరికినట్లు చెబుతున్న రూ.11 కోట్ల వ్యవహారంలో బుక్కయిన టీడీపీ.. దాన్ని డైవర్ట్ చేయడం కోసం వెంకటేష్ వీడియోలు విడుదల చేసిందని స్పష్టమైంది. ఇప్పుడీ వ్యవహారమూ బెడిసికొట్టింది. -
మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డి బెయిల్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డి బెయిల్‌పై ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ నెల 12న బెయిల్ పిటీషన్‌పై విజయవాడ ఏబీసీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.ముగ్గురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎక్కడా మిథున్‌రెడ్డి పాత్ర ఉందని చెప్పలేదని ఆయన తరఫు లాయర్ తెలిపారు. అసలు లిక్కర్ స్కామే జరగలేదని న్యాయవాది తెలిపారు. ‘‘ఇప్పటివరకు మిథున్‌రెడ్డిని సిట్ కస్టడీకి కోరలేదు. పీఎల్ఆర్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిన నగదును తిరిగి మళ్లీ చెల్లించడం జరిగింది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలి’ అని న్యాయవాది కోరారు. -
SIT బండారం బట్టబయలు.. మధ్యలో రెచ్చిపోతున్న బీజేపీ ఎంపీ
-
‘అదే జరిగితే నిజాలు బయటకు.. సిట్ అధికారుల్లో కలవరం’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కాంలో తాజాగా పట్టుబడినట్లు చెబుతున్న రూ.11 కోట్లు స్వాధీనం విషయంలో సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సొమ్ముకు, లిక్కర్ స్కాంకు సంబంధాన్ని చూపించడంలో సిట్ అధికారులు పంచనామా రికార్డులో సరైన ప్రొసీజర్స్‌ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.లేని స్కాంలో ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో సిట్ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు సంబంధించి కరెన్సీ నెంబర్లను రికార్డు చేయాలని, ఆ డబ్బును బ్యాంక్‌లో మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలంటూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో సిట్ అధికారుల్లో కలవరం మొదలైందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..హైదరాబాద్‌లోని సులోచనా ఫార్మ్ ఫాంహౌస్‌లో 2024 జూన్‌లో రాజ్ కసిరెడ్డి దాచిపెట్టిన లిక్కర్ స్కాంకు సంబంధించిన పదకొండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లుగా సిట్ అధికారులు ప్రకటించారు. పట్టుబడిన నగదును కోర్ట్‌కు సమర్పించారు. సిట్ ఆరోపణలపై ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఈ సొమ్ము తనకు చెందినది కాదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు.సదరు ఫాం హౌస్ యజమానులుగా ఉన్న తీగల విజయేందర్‌రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలు, దేశ వ్యాప్తంగా డయాగ్నసిస్ సెంటర్లు, హాస్పటల్స్ ఉన్నాయి. వారికి వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే వ్యాపారాలు ఉన్నాయి. వారు తనకు బినామీలు అని సిట్ ఆరోపించడం అన్యాయమంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నలబై అయిదేళ్ళకు పైగా వారు వ్యాపారాలు నిర్వహిస్తుంటే, నలబై ఏళ్ళ వయస్సు ఉన్న నాకు వారు బినామీలు అని చెప్పడం ఎంత వరకు సమంజసమని రాజ్ కసిరెడ్డి ప్రశ్నించారు. వారి ఆస్తులను కూడా నావిగా చిత్రీకరించడం బాధాకరణమని తన ఆవేదనను న్యాయస్థానం ముందుంచారు.సిట్ బృందం నిబంధనలను పాటించలేదు:హైదరాబాద్‌లో పట్టుబడిన రూ.11 కోట్లు కూడా వరుణ్‌కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నామని సిట్ అధికారులు చెబుతున్నారు. లిక్కర్ స్కాంపై 23.9.2024న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. వరుణ్ కుమార్ అనే వ్యక్తిపై 21.12.2024న కేసు నమోదు చేశారు. విట్నెస్ కింద నోటీస్ ఇచ్చి వాగ్మూలం నమోదు చేశారు. దీనినే కోర్ట్‌కు సమర్పించారు. దీనిలో తీగల విజయేందర్‌రెడ్డి, తీగల బాల్ రెడ్డిని కూడా 17.4.2025న సాక్షులుగా పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ రోజు విచారించిన దర్యాప్తు అధికారులే నేటికీ సిట్‌లో కొనసాగుతున్నారు. ఆనాడు విచారణ సందర్భంగా ఈ డబ్బు విషయం ఎక్కడా సిట్ రికార్డుల్లో ప్రస్తావించలేదు.అదే దర్యాప్తు అధికారి వరుణ్ కుమార్‌ను విచారిస్తే ఈ సొమ్ము బయటపడిందని తాజాగా చెప్పడం వెనుక కుట్ర కోణం ఉంది. గతంలో అదే వ్యక్తులను విచారించినప్పుడు ఈ డబ్బు ప్రస్తావన ఎందుకు రాలేదు.? హటాత్తుగా రాజ్ కసిరెడ్డి బెయిల్ విచారణ దశలో ఉండగా ఎలా బయటపడింది? పద్నాలుగు ఏ4 కాగితాలు పెట్టే బాక్స్‌ల్లో కొత్త కొత్త నోట్లతో ఈ సొమ్ము దొరికింది. ఏసీబీ కేసుల్లో ఎవరినైనా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సందర్భాల్లో ప్రతి నోట్‌పైనా ఉన్న నెంబర్‌ను రికార్డు చేస్తారు.వాటిని కోర్ట్‌కు సమర్పిస్తారు. కానీ ఈ కేసులో పట్టుబడిన పదకొండు కోట్ల రూపాయలకు చెందిన కరెన్సీ నోట్ నెంబర్లను ఎందుకు నోట్ చేయలేదు? వీడియో ఫుటేజీని ఎందుకు రికార్డు చేయలేదు? అలాగే సులోచనా ఫార్మ్ ఫాంహౌస్‌లో 2024 నుంచి సిసి కెమేరా ఫుటేజీని ఎందుకు సేకరించలేదు? దీనిపైన ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో నిందితులకు బెయిల్ రానివ్వకుండా చేయడానికి చేస్తున్న కుట్ర అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆ కరెన్సీ విషయంలో సిట్ ఎందుకు కంగారు పడుతోంది..?విజయేందర్ రెడ్డిని బెదిరించి వారికి చెందిన వ్యాపార సంస్థల నుంచి తెచ్చిన డబ్బును పట్టుకున్నారా లేక ప్రభుత్వమే ఒక ప్లాన్ ప్రకారం ఆ సొమ్మును సమకూర్చి కేసును పక్కదోవ పట్టిస్తోందా? అనే అనుమానాలు ఉన్నాయి. రాజ్ కసిరెడ్డి కోర్ట్‌లో మాట్లాడుతూ ఆ పదకొండు కోట్లు నేనే నా చేతితో ఇచ్చాను అని చెబుతున్నారు. ఆ సొమ్ముకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్‌ను రికార్డు చేయండి. ఆ కరెన్సీ ఏ సమయంలో ఆర్బీఐ ముద్రించారో దాని నెంబర్లపై దర్యాప్తు చేయించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.ప్రతి కరెన్సీ నోట్‌ను గుర్తించి పంచనామా నివేదికలో రికార్డు చేయాలని ఆదేశించింది. బ్యాంకుకు జమ చేసి ఉంటే, మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలని కూడా ఆదేశించింది. బ్యాంక్ వద్ద పోలీసులు రాత్రి నుంచే భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. రాత్రే బ్యాంకుకు జమ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ కరెన్సీపై విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయని సిట్ అధికారులు కంగారు పడుతున్నారా? వాటి విషయంలో సిట్ బృందం వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. -
బ్యాంక్ నుంచి ఆ డబ్బులు ఎవరు విత్ డ్రా చేశారు?: పొన్నవోలు
సాక్షి, విజయవాడ: రూ.11 కోట్ల విషయంలో సిట్ కుట్రలు చేస్తోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. సీరియల్ నంబర్స్ వీడియోగ్రఫి చేయాలని కోర్టు ఆదేశించినా కానీ.. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బ్యాంక్ నుంచి ఆ డబ్బులు ఎవరు విత్ డ్రా చేశారంటూ ఆయన ప్రశ్నించారు. నోట్లు వెరిఫై చేస్తే ఎవరు విత్ డ్రా చేశారో తెలుస్తుందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.కాగా, ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రూ.11 కోట్లు రూపాయలు సీరియల్ నెంబర్లు వీడియో గ్రఫి చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. రూ.11 కోట్లు ఎస్బీఐ బ్యాంక్‌లో డిపాజిట్ చేయడానికి సిట్ సన్నాహాలు చేస్తుండగా.. రూ. 11 కోట్లను కచ్చితంగా కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో వీడియో గ్రఫి చేయాలని పిటిషన్లో పేర్కొన్న న్యాయవాది.. సిట్ తొందరపాటు చర్యలకు పాల్పడుతుందన్నారు. -
సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై ఏసీబీ జడ్జి కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కామ్‌కు చెందిందిగా చెబుతూ సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై ఏసీబీ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్(తెలంగాణ)లోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నామని, ఇది రాజ్ కేసిరెడ్డిదేనని సిట్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే.. సీజ్ చేసిన ఆ రూ. 11 కోట్ల నగదును ఫొటోగ్రాఫ్ తీయాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. లిక్కర్ కేసులో ఇవాళ నిందితుల రిమాండ్ ముగియడం.. బెయిల్ పిటిషన్లపై కోర్టు వాదనలు వింది. ఆ సమయంలో.. ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి ముందు కన్నీటి పర్యంతమైన రాజ్ కేసిరెడ్డి.. ఎక్కడ డబ్బులు దొరికినా అవి లిక్కర్ డబ్బులేనని చూపుతున్నారన్నారు. రూ.11 కోట్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.‘‘సిట్ అధికారులు అవి నావేనని అబద్ధం చెప్తున్నారు. 2024 జూన్‌లో నేను వరుణ్‌కి ఇచ్చినట్టు చెబుతున్నారు. నేను పుట్టకముందు ఆస్తులను కూడా నా బినామీలుగా చూపిస్తున్నారు. నా వయస్సు 43 ఏళ్లు. 45 ఏళ్ల కిందటి ఫామ్ హౌస్‌కి నేను బినామీ అని చూపిస్తున్నారు. నేను పుట్టకముందే నాకు బినామీ ఆస్తులుంటాయా..?’’ అంటూ కేసిరెడ్డి ప్రశ్నించారు.‘‘ఆ రూ.11 కోట్లు నేనే నా చేత్తో ఇచ్చానని చెబుతున్నారు. ఆ డబ్బులపైనా వేలిముద్రలు చెక్ చేయాలని కోరుతున్నాను. 2024 జూన్‌లో ఆ డబ్బు వరుణ్‌కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముందించిందో తనిఖీ చేయాలి. ఆ నోట్లపై నంబర్లు రికార్డ్ చేయాలని కోరుతున్నాను. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను అటాచ్ చేశారు. వారసత్వ ఆస్తులను కూడా లిక్కర్ డబ్బులతో కొన్నట్టు చూపిస్తున్నారు. నా బెయిల్ అడ్డుకోవడానికి అబద్ధాలు చెప్తున్నారు’’ అంటూ ఏసీబీ న్యాయమూర్తి ముందు రాజ్ కేసిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తరుణంలోనే ఆ డబ్బులను ఫోటోగ్రాఫ్ తీయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. -
నోట్ల కట్టల మాటున బాబు
పాతాళభైరవి సినిమాలో నేపాలీ మాంత్రికుడిని తలదన్నే రీతిలో సీఎం చంద్రబాబు రోజుకో క్షుద్ర రాజకీయానికి తెరతీస్తున్నారు. తాను ఏంచెప్పినా ఎస్ బాస్ అనే పోలీసు అధికారులతో కూడిన సిట్‌ను మంత్రదండంగా చేసుకుని రాజకీయ కుతంత్రానికి పాల్పడుతున్నారు. సామాన్య ప్రజలనే కాకుండా ఏకంగా న్యాయస్థానాన్ని కూడా బురిడీ కొట్టించేందుకు తెగిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్టుతో డ్రామాను రక్తి కట్టించేందుకు ప్రయత్నించి సిట్ బోల్తా పడింది. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు గత శనివారం హైదరాబాద్‌లోని వికాట్ కంపెనీ కార్యాలయంలో సోదాల పేరిట సిట్ హడావుడి చేసింది. అది ఫలించకపోవడంతో తాజాగా నగదు జప్తు కుతంత్రానికి తెరలేపింది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు రెడ్‌బుక్ కుట్రతో చంద్రబాబు ప్రభుత్వం రోజుకో రీతిలో నడుపుతున్న హైడ్రామాలో తాజా ఎపిసోడ్ ఇదిగో ఇలా ఉంది..సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసు దర్యాప్తులో ఏస్థాయికైనా దిగజారతామనేలా సిట్ మరో బరితెగింపునకు పాల్పడింది. నిందితుల బెయిల్ మంజూరును అడ్డుకునేందుకు సరికొత్త నాటకానికి తెరతీసింది. ఇన్నాళ్లైనా ఒక్క ఆధారమూ చూపలేకపోయారని సాక్షాత్తు కోర్టు తప్పుబట్టడంతో నోట్ల ‘కట్ట’కథకు సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన తీగల విజయేందర్‌రెడ్డి శంషాబాద్ మండలం కాచారంలో వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ రూ.వందల కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయి. ఆ ఇంజినీరింగ్ కాలేజీ కేంద్ర బిందువుగానే సిట్ హైడ్రామాకు తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టు చూపేందుకు సిట్ ఇప్పటికే పలువురు అధికారులు, ఉద్యోగులు, డిస్టిలరీల ప్రతినిధులు, సాక్షులను బెదిరించి, వేధించిన విషయం తెలిసిందే. కాగా, లేని ఆధారాలు సృష్టించాలని, ఏదో ఒక విధంగా భారీగా నగదు జప్తు చేసినట్టు చూపించాలని సిట్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉంది. దాంతో రాజ్ కెసిరెడ్డికి చెందిన నగదును జప్తు చేసినట్టు చూపించేందుకు ప్రయత్నించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం స్క్రిప్ట్‌ను అమలులోకి తెచ్చింది. అదేమిటంటే... » వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన రూ.11 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా కాచారంలోని విజయేందర్‌రెడ్డికి చెందిన సులోచన ఫామ్‌హౌస్‌కు తరలించారు. అది కూడా ఇంజినీరింగ్ కాలేజీ సిబ్బందితోనే చేయించినట్టు తెలుస్తోంది. సిట్ పోలీసులే ఆ నగదు తీసుకెళ్తే ఎవరైనా మొబైల్ ఫోన్లతో వీడియోలు తీస్తారేమోనని సందేహించి ఈ విధంగా ముందు జాగ్రత్తపడ్డారు. నగదును ఫామ్‌హౌస్‌కు చేర్చాక కుట్రలో రెండో అంకం మొదలుపెట్టారు. బుధవారం తెల్లవారుజామున సిట్ అధికారులు విజయేందర్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌పై దాడి చేసినట్టు..రూ.11 కోట్లను జప్తు చేసినట్లు డ్రామా రక్తి కట్టించారు. ఈ నగదంతా రాజ్ కెసిరెడ్డిదేనని..2024 జూన్ నుంచే ఇక్కడ ఉంచారంటూ కట్టుకథను మీడియాకు లీకు చేశారు. కానీ, టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్ట్ ప్రకారం సాగిన ఈ పన్నాగం బూమరాంగ్ అయ్యింది. మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే సిట్ కుట్ర బెడిసికొట్టింది. చిత్తు కాగితాల అట్టపెట్టెల్లో అంత డబ్బు దాచారా?కట్టుకథతో నమ్మించేందుకు సిట్ చేసిన పన్నాగం నవ్వులపాలైంది. గతంలో ఎప్పుడూ సోదాల్లో దొరకని డబ్బు, అకస్మాత్తుగా పుట్టుకు రావడమే దీనికి కారణం. పైగా ఏకంగా 14 నెలలుగా అక్కడే ఉన్నట్లు తెలపడాన్ని బట్టి చూస్తే... ఇదంతా సిట్ పన్నాగం అని స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు విజయేందర్‌రెడ్డి అనుకూలంగా మారాకనే ఇదంతా జరగడం గమనార్హం. వాళ్లకు ఆ మనిషి అనుకూలంగా మారాకనే డబ్బు దొరకడం ఏమిటి? నివాసంలోని సొమ్మును వేరేవాళ్లదిగా ఆయనతోనే చెప్పించడం ఏమిటి? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇక అర్థరాత్రి చకచకా పుట్టుకొచ్చి పట్టుబడినది అని చెబుతున్న నగదు అంతా ఒకే తరహా అట్టపెట్టెల్లో (ఆఫీసుల్లో ఏ4 తెల్ల కాగితాల బండిల్స్ పెట్టేవి) ఉండడం ఆశ్చర్యపరిచింది. స్టేషనరీ సామగ్రి పెట్టే సాధారణ 12 అట్టపెట్టెల్లో రూ.11 కోట్లను ఉంచారని చెప్పడం సిట్ విస్మయకర తంతు ఏవిధంగా ఉందో తెలుస్తోంది.బెయిల్‌ను అడ్డుకోవడానికే సిట్ కుట్రలుసిట్ అధికారులు ఇంత చీప్ ట్రిక్కు ఎందుకు పాల్పడ్డారన్నదే కదా సందేహం... అక్కడే ఉంది అసలు కథ. ఈ కేసులో తాము అక్రమంగా అరెస్టు చేసినవారికి బెయిల్ రాకుండా కోర్టును తప్పుదారి పట్టించడమే సిట్ లక్ష్యం. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేకపోయింది. కేసులో ఏ1గా పేర్కొన్న రాజ్ కెసిరెడ్డిని సిట్ ఏప్రిల్ 21న అరెస్టు చేసింది. వంద రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కానీ, సిట్ ఆధారాలు చూపలేకపోయింది. దీంతో 90 రోజుల తరువాత బెయిల్ ఇచ్చేందుకు సాంకేతికంగా మార్గం సుగమైనట్టే. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు అదే విషయాన్ని ప్రస్తావించింది. వివిధ సంస్థల పేరిట బ్యాంకులో ఉన్న నగదును జప్తు చేయడం మినహా సిట్ అధికారులు దర్యాప్తులో ఏం గుర్తించారు? ఏం సాధించారు? అని ప్రశ్నించింది. దాంతో సిట్ అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అందుకే లేని ఆధారాన్ని ఉన్నట్టు చూపాలని భావించి హడావుడిగా విజయేందర్‌రెడ్డిని తమ కుట్రలో పావుగా చేసుకున్నారని స్పష్టమవుతోంది. రూ.11 కోట్లు జప్తు చేసినట్టు, ఆ నగదు రాజ్ కెసిరెడ్డిది అని కోర్టును తప్పుదారి పట్టించాలన్నది సిట్ పన్నాగం. » అక్రమ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరుల బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్ ఇదే రీతిలో శనివారం హైడ్రామా సాగించింది. హైదరాబాద్‌లోని వికాట్ గ్రూప్‌నకు చెందిన ప్రధాన కార్యాలయంలో సోదాల పేరుతో హడావుడి చేసింది. కోర్టు నుంచి అనుమతి లేకుండా సిట్ అ«దికారుల బృందం వికాట్ కంపెనీ కార్యాలయం వద్ద రాద్ధాంతం సృష్టించి...భయపెట్టేందుకు ప్రయత్నించింది.లోకేశ్ సన్నిహితుడు కిలారి సిట్ అధికార ప్రతినిధా!?రూ.11 కోట్ల జప్తు స్క్రిప్ట్ కథ టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే నడిపించారన్నది తేటతెల్లమైంది. ఆ నగదును జప్తు చేసినట్టు టీడీపీ అనుకూల ఎల్లో మీడియాకు మంత్రి లోకేశ్ సన్నిహితుడు కిలారి రాజేష్ తెలపడమే దీనికి నిదర్శనం. ఆయనకు ప్రభుత్వంలో ఎటువంటి పదవీ లేదు. సిట్‌తో అధికారికంగా సంబంధం లేదు. కానీ, సిట్ అధికార ప్రతినిధి అన్నట్టుగా బుధవారం తెల్లవారుజామునే రూ.11కోట్ల జప్తు చేసిన ఫొటోలు, సమాచారం ఇవ్వడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే, ఈ జప్తు కథ అంతా టీడీపీ కేంద్ర కార్యాలయం డైరెక్షన్లోనే సాగిందన్నది స్పష్టమైంది. కట్టుకథలో తాజా పాత్రధారి వరుణ్మద్యం అక్రమ కేసులో నిందితుడు వరుణ్ పురుషోత్తంను నోట్ల కట్టల కట్టు కథలో సిట్ పాత్రధారిగా చేసుకుంది. ఆయన ఇచ్చిన సమాచారంతోనే తాము ఫామ్‌హౌస్‌లో తనిఖీలు చేసి నగదును గుర్తించినట్టు చెప్పుకొచ్చింది. అక్రమ కేసులో ఏ 40గా పేర్కొన్న వరుణ్ విదేశాలకు పరారయ్యారని సిట్ ఇప్పటివరకు ప్రచారం చేస్తూ వచ్చింది. ఆయనపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేసింది. విదేశాల్లో ఉన్న వరుణ్ పురుషోత్తం హఠాత్తుగా హైదరాబాద్‌లో ఎలా ప్రత్యక్షమయ్యారో మరి...? అంటే సిట్ ఆయన్ను అక్రమంగా నిర్బంధించి వేధించి తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించిందని స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. కొసమెరుపు: విజయేందర్‌రెడ్డికి చెందిన వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ సరిగ్గా సులోచన ఫామ్‌హౌస్‌కు ఎదురుగానే ఉంటుంది. దీంట్లోనే రాత్రికిరాత్రే రూ.కోట్ల నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి. కానీ, అవి ఆయనవి కావు అని.. రాజ్ కెసిరెడ్డివని చెబుతుండడం. ఆ నగదు నాది కాదు.. రూ.11 కోట్ల జప్తు పేరుతో సిట్ కుట్రను రాజ్ కెసిరెడ్డి తిప్పికొట్టారు. ఆ నగదుతో తనకుగానీ తన కుటుంబానికి గానీ ఎటువంటి సంబంధం లేదని న్యాయస్థానానికి నివేదించారు. ఆ నగదుకు వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ యజమాని విజయేందర్‌రెడ్డే సమాధానం చెప్పాలన్నారు. ఈ మేరకు రాజ్ కెసిరెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం సాయంత్రం అఫిడవిట్ దాఖలు చేశారు. విజయేందర్‌రెడ్డి కుటుంబానికి హాస్పిటల్, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇంజినీరింగ్ కాలేజీ, ఇతర వ్యాపారాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఏటా వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ వ్యాపార సంస్థలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సిట్ జప్తు చేసింది ఆ వ్యాపార సంస్థలకు చెందిన నగదే కావచ్చని చెప్పారు. తాను ఫాంహౌస్‌లో నగదు దాచలేదని నివేదించారు. -
కోర్టును బురిడీ కొట్టించేందుకే బాబు కుట్ర
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో సోదాల పేరిట మరో ‘సెన్షేషన్’కు చంద్రబాబు సర్కారు తెరతీసింది. ఇంతకాలం ప్రపంచ ప్రఖ్యాత సంస్థ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టలేకపోయిన కూటమి ప్రభుత్వం... ఇది అక్రమ కేసేనని స్పష్టమవుతుండడంతో ఇప్పుడు మరో కుట్రకు పాల్పడుతోంది. కేసును ‘సెన్సేషన్’ చేయడానికి కొత్త డ్రామాను రక్తి కట్టిస్తోంది. ఏకంగా న్యాయస్థానాలనే తప్పుదారి పట్టించేందుకు బరితెగిస్తోంది. ఆ పక్కా పన్నాగంతోనే... బాలాజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా కోర్టును బురిడీ కొట్టించేందుకు హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో సోదాల పేరుతో కొత్త పన్నాగం పన్నుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసేనని సిట్ దర్యాప్తు తీరే స్పష్టం చేస్తోంది. టీడీపీ బాస్‌లకు అన్నింట్లోనూ ‘ఎస్’ అనే పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిట్ దర్యాప్తులో ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయింది. బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు తప్ప సాధించినదేమీ లేదన్నది తేటతెల్లమైంది. ఎల్లో మీడియా ద్వారా సాగిస్తున్న దుష్ప్రచార కుతంత్రమూ బెడిసికొడుతోంది. అసలు లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పన్నిన పన్నాగం బెడిసికొడుతుండడంతో చంద్రబాబు ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. దీంతో మరో కుతంత్రం రచించింది. బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేసి 75 రోజులైంది. ఎలాంటి ఆధారాలు లేకుండా నెలల పాటు దర్యాప్తు పేరిట రిమాండ్‌లో ఉంచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. దీంతో బెయిల్ ఇవ్వాలని బాలాజీ గోవిందప్ప కోర్టులో పిటిషన్ వేశారు. బాలాజీ గోవిందప్ప తదితరులకు త్వరలో బెయిల్ ఖాయమని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. కాగా, కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని సిట్ అధికారులను కోర్టు నిలదీస్తోంది. అందుకని సాంకేతిక అంశాలతో కోర్టును తప్పుదారి పట్టించేందుకు సిట్ కొత్త ఎత్తుగడ వేసింది. ఇటీవల సమర్పించిన ప్రాథమిక చార్జ్‌షీట్‌లో బాలాజీ గోవిందప్ప, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తదితరుల పేర్లను ప్రస్తావించలేదు. ఈ క్రమంలోనే బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్ కొత్త పన్నాగం పన్నింది. వికాట్ గ్రూప్‌నకు చెందిన ప్రధాన కార్యాలయం, బాలాజీ గోవిందప్ప నివాసంలో హఠాత్తుగా సోదాల డ్రామాకు తెరతీసింది. కోర్టు అనుమతి లేకుండానే 20 మందితో కూడిన సిట్ బృందం వికాట్ కంపెనీ కార్యాలయం వద్ద హంగామా చేసింది. సోదాలపై కోర్టు అనుమతి పత్రం చూపించాలన్న వికాట్ ఉద్యోగులతో సిట్ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీస్ మార్క్ గూండాగిరితో భయపెట్టేందుకు ప్రయత్నించారు.బాలాజీ గోవిందప్ప డైరెక్టర్‌గా ఉన్న వికాట్ కంపెనీ కార్యాలయంలో సిట్ సోదాలు పక్కా పన్నాగమే. ఎందుకంటే, మే 13న అక్రమంగా అరెస్టు చేసే సమయంలోనూ ఇదే రీతిలో ఆయన నివాసంలో సిట్ అధికారులు రోజంతా సోదాలు చేశారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో బాలాజీ గోవిందప్ప కుమారుడి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను జప్తు చేసి సిట్ తన దిగజారుడుతనాన్ని ప్రదర్శించింది. ఆ వస్తువులు తనవి కావని బాలాజీ గోవిందప్ప కోర్టులో పిటిషన్ కూడా వేశారు. సీజ్ చేసిన వస్తువులు తిరిగి అప్పగించాలని, సంబంధిత వ్యక్తులకు ఇచ్చేస్తామని కోరారు. ఇక ఆయన నివాసంలో గానీ, జప్తు చేసినట్టు ప్రకటించిన ఎలక్ట్రానిక్ పరికరాల్లో గానీ సిట్ ఆధారాలు చూపలేకపోయింది. దాంతో సిట్ పన్నాగం ఫలించలేదు. 75 రోజులు రిమాండ్‌లో ఉన్నా సరే దర్యాప్తులో కనీస పురోగతి సాధించలేదు. కుంభకోణం జరిగితేనే కదా?లేని కుంభకోణం ఉన్నట్టు చూపించాలన్న సీఎం చంద్రబాబు కుట్ర క్షేత్రస్థాయిలో బెడిసికొడుతోంది. ఈ పరిణామాలన్నీ సిట్ దర్యాప్తు డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. దాంతో బాలాజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్ వికాట్ కార్యాలయంలో సోదాలకు దిగింది. తద్వారా ఈ కేసు ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని చెబుతూ కోర్టును తప్పుదారి పట్టించాలన్నది సిట్ పన్నాగం. ఆ నెపంతో బాలాజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకోవాలన్నది లక్ష్యం.చెదిరిపోతున్న చంద్రబాబు కుట్రలురాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్లో 3.58 లక్షల జీబీల డేటాను వైఎస్సార్సీపీ వర్గీయులు నాశనం చేశారని... 375 పేజీల డేటాను డిలీట్ చేశారని ఈనాడు సహా ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. దీనిపై ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద బెవరేజెస్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేశారు. ‘‘అసలు మా వద్ద అలాంటి డేటానే ఏనాడూ లేదు. మేం ఎలాంటి డేటాను డిలీట్ చేయలేదు’’ అంటూ స్వయంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలోని బెవరేజెస్ కార్పొరేషనే లిఖితపూర్వకంగా తెలిపింది. అంటే, అక్రమ కేసుపై ఎల్లో మీడియా చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని నిర్ధారణ అయింది. చంద్రబాబు, లోకేశ్ సిట్‌ను అడ్డుపెట్టుకుని కట్టుకథలు అల్లుతూ... వందల కొద్దీ ఎల్లో యూట్యూబ్ చానళ్లను సృష్టించి, టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను నిపుణులు, పాత్రికేయులుగా నమ్మిస్తూ భారీగా డబ్బులు ఎరవేసి విష ప్రచారం సాగిస్తున్నారని స్పష్టమైంది.పచ్చ గ్యాంగ్ దాదాగిరీ... పరిశ్రమలు పరార్రాజకీయ కుట్రలు, కక్షసాధింపు కుతంత్రాలు, పారిశ్రామికవేత్తల నుంచి భారీ వసూళ్లు, దీనికోసం పరిశ్రమలపై దాడులు... ఇలా చంద్రబాబు ముఠా అరాచకాల కారణంగా రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ధ్వంసమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలకు వేధింపులు తీవ్రమయ్యాయి. భారీగా ముడుపులు, కాంట్రాక్టుల కోసం పారిశ్రామికవేత్తలను చంద్రబాబు గ్యాంగ్ వేధిస్తోంది. దీంతో పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తి వెళ్లిపోతున్నారు. » వలపు వల వేసి బడాబాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జిందాల్ స్టీల్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం వేధించింది. ఇది తట్టుకోలేక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టాలని నిర్ణయించిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలించింది.» సిమెంట్ దిగ్గజం వికాట్ గ్రూప్ యూరప్‌లో టాప్ కంపెనీల్లో ఒకటి. అంతటి ప్రతిష్ఠాత్మకఅంతర్జాతీయ కంపెనీలో బాలాజీ గోవిందప్ప పూర్తిస్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయనకు ఏపీతో గానీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో గానీ ఏమాత్రం సంబంధం లేదు. కేవలం రాజకీయ కుట్రతోనే వికాట్ కంపెనీని, బాలాజీ గోవిందప్పను చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు.» కాకినాడ సీ పోర్టులో వాటాలు వదిలేసుకోవాలని అరబిందో గ్రూప్‌ను కూటమి ప్రభుత్వ పెద్దలు బెదిరించారు. లేదంటే అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని సీఐడీనీ రంగంలోకి దించారు. దీంతో అరబిందో గ్రూప్ కాకినాడ సీ పోర్టులోని మెజారిటీ వాటాను వదిలేసుకోవాల్సి వచ్చింది.» అల్ట్రాటెక్ పరిశ్రమకు కర్ణాటక నుంచి ఎర్రమట్టి సరఫరా కాంట్రాక్టు కోసం ఏకంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాలు పరస్పరం దాడులకు దిగి బెంబేలెత్తించాయి. దాంతో ఆ పరిశ్రమ యాజమాన్యం బెదిరిపోయింది.» పల్నాడులో భవ్య, చెట్టినాడ్ సిమెంట్ కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రతి బస్తాకు ఇంత అని కప్పం కట్టాలని గూండాగిరీకి తెగబడ్డారు. దీనికి ఒప్పుకోకపోవడంతో ఓ కంపెనీ ఉత్పత్తిని 50 రోజలు, మరో కంపెనీని 30 రోజులు అడ్డుకున్నారు.» శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ డీజీఎం, సిబ్బందిపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాడి చేసి బెంబేలెత్తించారు. » రామాయపట్నం పోర్టు నిర్మాణంలో తనకు వాటా ఇవ్వాలని కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వేధించారు. ఆ కంపెనీకి నిర్మాణ సామగ్రి సరఫరాను అడ్డుకున్నారు. » శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బీర్ల ఫ్యాక్టరీపై కూటమి నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. తనకు నెలనెలా కప్పం కడితేనే బీరు ఉత్పత్తుల లోడ్ లారీలను బయటకు అనుమతిస్తానని బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తేల్చి చెప్పారు. » సత్తెనపల్లి నియోజకవర్గం మీదుగా ప్రయాణించే గ్రానైట్ లారీల నుంచి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ వర్గీయులు కప్పం వసూలు చేస్తున్నారు. షాడో ఎమ్మెల్యేగా పేరు పొందిన ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో కేడీ ట్యాక్స్ పేరుతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. » శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కియా భూములను కొల్లగొట్టేందుకు ఆ జిల్లా మంత్రి, అక్కడి టీడీపీ ఎమ్మెల్యే వర్గాలు కొట్లాటకు దిగాయి.» రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్య నేత కుమారుడు పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. » నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ రెండో ప్లాంట్ పనుల్లో తమ నీటి ట్యాంకర్లను పెట్టుకోవడం లేదని టీడీపీ నేతలు దాడి చేశారు. హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్పనివాసంలో సిట్ సోదాలువికాట్ కార్యాలయాల్లో కూడా..2 ప్రత్యేక బృందాలతో ఐదున్నర గంటల పాటు సోదాలు సాక్షి, సిటీబ్యూరో: మద్యం అక్రమ కేసులో సిట్ అధికారులు ఏఎస్పీ స్నేహిత నేతృత్వంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వికాట్ గ్రూప్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప నివాసంలో శనివారం సోదాలు నిర్వహించారు. సిట్ గతంలోనూ సుదీర్ఘంగా సోదాలు చేసినా.. ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ కోర్టులో ప్రవేశ పెట్టలేకపోయింది. మరోవైపు ఏసీబీ కోర్టులో బాలాజీ గోవిందప్ప వేసిన బెయిల్ పిటిషన్ ఈ నెల 29న విచారణకు రానుందని, దానిని అడ్డుకునేందుకే సోదాల పేరుతో సిట్ అధికారులు కొత్త నాటకానికి తెరలేపారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బంజారాహిల్స్‌లోని వికాట్ కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. డీఎస్పీ శ్రీనివాస్, ఆరుగురు పోలీసుల బృందంతో కలిసి సుమారు ఐదున్నర గంటలు సోదాలు చేశారు. బాలాజీ గోవిందప్ప చాంబర్లు, పరిసర ప్రాంతాలను సోదా చేసినట్లు తెలిపారు. కొన్ని డిజిటల్ డివైజ్‌లను సీజ్ చేశామని, వాటిలో ఏముందనేది విచారణలో తేలుస్తామని డీఎస్పీ చెప్పారు. కాగా, సోదాలు నిర్వహించేందుకు వస్తున్నామని సిట్ అధికారులు స్థానిక పోలీసు స్టేషన్లో ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఎవరు సోదాలు నిర్వహిస్తున్నారనేది బంజారాహిల్స్ ఠాణా రికార్డులో పేర్కొనలేదని తెలిసింది. కేవలం ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు మాత్రమే... బాలాజీ గోవిందప్ప నివాసం, వికాట్ ప్రధాన కార్యాలయంలో సోదాకు వస్తున్నట్లు రికార్డులో పేర్కొన్నట్లు సమాచారం. -
అక్రమ మద్యం కేసు.. ‘సిట్’ మరో కొత్త నాటకం
సాక్షి, హైదరాబాద్: అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి సిట్ తెరతీసింది. సోదాల పేరుతో హడావుడి సృష్టించేందుకు సిట్ ప్రయత్నించింది. హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్ అధికారులు హల్చల్ చేశారు. గతంలోనే బాలాజీ గోవిందప్ప ఇంటిలో సిట్ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు.మే 13న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసింది. 74 రోజులుగా ఆయన రిమాండ్‌లో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు సిట్ పెట్టలేకపోయింది. ఏసీబీలో కోర్టులో బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై ఈనెల 29న కోర్టు విచారణ చేపట్టనుంది.బాలజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్ అధికారులు మరో కొత్త నాటకానికి తెరలేపారు. కొత్తగా ఆధారాలు దొరికాయంటూ చెప్పేందుకే ఈ నాటకం చేస్తున్నారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బాలాజీ గోవిందప్ప.. ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ వికాట్ ఇంటర్నేషనల్‌లో ఫుల్‌టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వికాట్ గ్రూప్‌కు సంబంధించిన కార్యాలయంలో కూడా సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. -
కోర్టులో కంటతడి పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
-
ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించాలని చూస్తున్నారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: విజయవాడ కోర్టులో అక్రమ లిక్కర్ కేసుపై వాదనలు ముగిశాయి. న్యాయవాదితో పాటు స్వయంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండానే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.2024 ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట చిల్లకల్లు టోల్ గేట్ వద్ద 8.40 కోట్లు సీజ్ చేసిన పోలీసులు.. ఆ డబ్బును ఇప్పుడు లిక్కర్ డబ్బుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిల్లకల్లు టోల్ గేట్ వద్ద పట్టుకున్న డబ్బు తనదేనని అప్పట్లో ప్రద్యుమ్న అనే వ్యక్తి హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ డబ్బు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించొద్దని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలున్నా లిక్కర్ కేసులో ప్రస్తావించారు. డబ్బులు తరలించామని గన్ మెన్ గిరి ఒప్పుకున్నాడు. అలాంటపుడు అతనే ప్రధాన ముద్దాయి.ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఇలా డబ్బులు తరలించినందుకు గిరి నేరం చేసినట్లే కదా. ఇటీవల గిరికి ఆక్టోపస్‌లో ప్రమోషన్ ఇచ్చి రూ. 60 వేలు ఎలా పెంచారు. డబ్బులు తరలించిన వ్యక్తి ముద్దాయి అవుతారు కానీ సాక్షి ఎలా అవుతారు?. అతని సాక్ష్యం ఎలా చెల్లుతుంది. మదన్ అనే గన్ మెన్‌ను సిట్ అధికారులు కొడితే మణిపాల్‌లో చేరాడు. సిట్ అధికారులు భయబ్రాంతులకు గురుచేశారని డీజీపీకి లేఖ రాశాడు. గిరి చెప్పినది వాస్తవమా?. మదన్ చెప్పింది వాస్తవమా?చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడు ఇరికించారు. చౌదరి సామాజికవర్గానికి చెందిన వాడివి అయ్యుండి చౌదరి ప్రభుత్వానికి సపోర్ట్ చేయవా అని సిట్ అధికారులు బెదిరించారు. రెండు సార్లు వెంకటేష్ నాయుడిని సిట్ విచారించింది. అబద్ధపు సాక్ష్యం చెప్పమని తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా వెంకటేష్ నాయుడు అంగీకరించలేదు. ఈ కేసులో అంతా కట్ అండ్ పేస్ట్ తప్పుల తడకగా ఉంది. వెంకటేష్ నాయుడు వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. కానీ వెంకటేష్ నాయుడిని కేసులో ఐఏఎస్‌గా చూపించారు’ అని చెవిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. -
HYD: పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై పోలీస్ రైడ్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు పబ్‌లు, శివారుల్లోని ఫామ్‌హౌజ్‌లపై పోలీసులు శనివారం రైడ్స్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు ఒకవైపు.. మాదాపూర్‌లోని పబ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొన్ని పబ్బులు నిబంధనలు ఉల్లంఘించి మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. బర్డ్ బక్స్, హాట్కప్ పబ్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఏడుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. మొయినాబాద్ పరిధిలోని ఫామ్హౌజ్లలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. సెలబ్రిటీ ఫామ్‌హౌజ్, ముషీరుద్దిన్, ఎటర్నిటీ ఫామ్‌హౌజ్‌లపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ మూడు ఫామ్ హౌజ్‌లపై కేసులకు గానూ పదిహేను మంది అరెస్ట్ చేశారు పోలీసులు. -
అక్రమ మద్యం కేసులో మహిళకు 6 నెలల జైలు
విశాఖ లీగల్: అనుమతి లేకుండా ప్రభుత్వ మద్యాన్ని అక్రమంగా విక్రయించిన మహిళకు ఆరు నెలల జైలు, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ నగరంలోని ఎక్సైజ్ కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీకాంత్ గురువారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో రెండు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నూతన ఎక్సైజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తే కనీసం 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.2లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోనే తొలి తీర్పు కావడం విశేషం. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవతారం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజువాక పెదగంట్యాడ పితానివానిపాలెంకి చెందిన పితాని సన్యాసమ్మ (50) 2020 ఆగస్టు 18న పెదగంట్యాడ సమీపంలోని ఆటోనగర్‌లో 12 మద్యం సీసాలు విక్రయిస్తూ ఉండగా న్యూపోర్టు పోలీసులు పట్టుకున్నారు. ఆమె నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. -
అక్రమ మద్యం విక్రయిస్తూ పట్టుబడిన అధ్యాపకులు
సత్తెనపల్లి: అధ్యాపకులు సైతం తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తూ అధికారులకు దొరికిపోయారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) సీఐ ఈడె మారయ్యబాబు తెలిపిన వివరాలు.. సౌత్ సెంట్రల్ రైల్వే క్యాంటీన్ వర్కర్ రావూరి సాయికృష్ణ, పట్టణంలోని ఎస్వీఆర్ డిగ్రీ కళాశాల కామర్స్ అధ్యాపకుడు పొందుగల శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ గంటా శ్రీనివాసరావు, వంట మాస్టార్ షేక్ వలీ ఒక బృందంగా ఏర్పడి నిత్యం రైల్లో తెలంగాణ మద్యం తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ముందస్తు సమాచారం ప్రకారం సెబ్ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. పట్టణంలో రెండు ద్విచక్ర వాహనాల్లో మద్యం సీసాలు పెట్టుకుని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
అక్రమ మద్యం కేసులో ఏఎస్ఐ అరెస్ట్
సాక్షి, పశ్చిమగోదావరి: అక్రమ మద్యం కేసులో ఏఎస్ఐని అరెస్ట్ చేశారు. జీలుగుమిల్లి పీఎస్ పరిధి చెక్‌పోస్టు వద్ద నాలుగు రోజుల క్రితం రూ.20 లక్షలు విలువ చేసే అక్రమ మద్యం తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యంపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. విచారణలో మద్యం అక్రమ రవాణాకు ఏఎస్ఐ సహా ముగ్గురు సహకరిస్తున్నట్లు గుర్తించామని పోలవరం డీఎస్పీ తెలిపారు. ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. జీలుగుమిల్లి చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తూ.. మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్న ఏఎస్ఐ శ్రీనివాస్‌తో పాటు జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రసాద్, కాగితాల రామారావు, రమేష్ లను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
ఆ టీడీపీ నేతలను అరెస్టు చేయాలి: వాసిరెడ్డి పద్మ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ సాక్షి, హైదరాబాద్ : అక్రమ మద్యం కేసులో నిందితుడైన కర్నూలు జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గౌడ్, మాచర్లలో ఒక హత్య కేసులో నిందితునిగా ఉన్న టీడీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్‌ను తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఇలాంటి అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ వారు పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని, వారిపై ఎలాంటి చర్యలూ ఉండటంలేదని తెలిపారు.ఇదేమి అరాచకమని, ఇదేమి న్యాయమని అన్నారు. టీడీపీ వారికైతే ఒక న్యాయం, వైఎస్సార్ సీపీ నేతలకైతే మరో న్యాయమా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అవాకులు చవాకులు పేలుతున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక మనిషిలాగా మాట్లాడ్డంలేదని చెప్పారు. ఆయన మాట్లాడే తీరు చూస్తే ఎవరో తరుముకొస్తున్నారనే భయం ఆయనలో కనిపిస్తోందని, ఆయన మానసిక వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిదని సూచించారు. అసలు ఒక మహా పాతకం నుంచి పుట్టిన నాయకుడు ఉమామహేశ్వరరావు అని, ఆ పాతక భయం ఆయన్ని వెంటాడుతున్నందునే అలా అసహజంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీని మూసేస్తారని మంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఒక పార్టీని స్థాపించిన వ్యక్తిని నిలువునా చంపి ఆ పార్టీని లాక్కున్న చరిత్ర టీడీపీ నేతలదని పద్మ చెప్పారు. అందుకే టీడీపీని పదేళ్లపాటు రాష్ట్ర ప్రజలు అడ్రస్ లేకుండా చేశారని అన్నారు. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన వారు జగన్‌పై విమర్శలు చేయడం తగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎదిరించి సీబీఐ కత్తిని గుండెలపై పెట్టినా బెదరకుండా వైఎస్ ఆశయాల సాధన కోసం పార్టీ పెట్టిన జగన్‌కు దానిని ఎలా కాపాడుకోవాలో తెలుసునని చెప్పారు. అసలు వైఎస్సార్ సీపీ అంటే అధికారంలో ఉన్న వారు ఎందుకంత భయంతో గంగవైలెత్తి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బాబు విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి చింతాకంత ప్రయోజనం కూడా లేదని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.