
సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో సిట్ అధికారులు తనను అక్రమంగా ఇరికించారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ‘‘మా కుటుంబం మద్యం జోలికి పోలేదు. వేద పాఠశాల నడుపుతున్నా.. నేనెప్పుడూ అబద్ధం చెప్పను.. పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు’’ అంటూ కోర్టు నుంచి జైలుకి తరలించే సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
గాడ్ ఈజ్ సుప్రీం.. నేచర్ ఈజ్ సుప్రీం. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. మద్యం ముట్టలేదు.. అమ్మలేదు. అమ్మను
రాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు మోపండి. చిన్నప్పటి నుంచి దూరం పెట్టిన మద్యాన్ని రుద్దడం భావ్యం కాదు. ప్రభుత్వ పెద్దలు తప్పు చేస్తున్నారు. దానిని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారు’’ అంటూ చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, లిక్కర్ అక్రమ కేసులో అరెస్టైన వారికి ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన వారికి ఆగస్ట్ 26 వరకూ రిమాండ్‌ను పొడిగించింది.
