నవలంకలో సందడి | - | Sakshi
Sakshi News home page

నవలంకలో సందడి

Dec 30 2025 6:59 AM | Updated on Dec 30 2025 6:59 AM

నవలంక

నవలంకలో సందడి

నవలంకలో సందడి

నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్‌ ఎదుట నది మధ్యలో తారసపడే చిరుదీవి ‘నవలంక’. ఇక్కడ ఇసుక తెన్నెలపై తరచూ సందర్శకులు సందడి చేస్తున్నారు. నది మధ్య ప్రకృతి పరచిన సహజ సైకత పరదాల అందాలు ఆకట్టుకోవడంతో చల్లపల్లికి చెందిన వాకర్స్‌ ఆదివారం రాత్రి ఆటపాటలు, క్యాంప్‌ ఫైర్‌ నృత్యాలతో ఎంజాయ్‌ చేశారు. చల్లపల్లి వాకర్స్‌ ఇసుకలో తొలుత ఇక్కడి నుంచి సూర్యాస్తమయ దృశ్యాలను ఆస్వాదిస్తూ తర్వాత బీచ్‌ బాల్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, ట్రాక్‌ సాంగ్స్‌ అంత్యాక్షరి లాంటి క్రీడలు నిర్వహించారు. వయసు, హోదా పక్కనపెట్టి డాక్టర్‌లు, టీచర్లు, వ్యాపారులు, ఉద్యోగులతో కూడిన వాకర్స్‌ బృందం సభ్యులు క్యాంప్‌ఫైర్‌ చుట్టూ ఆట పాటలతో చేసిన నృత్యాలు అలరించాయి. దివిసీమ ప్రాంత వాసులకు నవలంక సేద తీర్చే విడిదిగా మారడంతో సాయంత్రానికి శ్రీరామపాదక్షేత్రం ఘాట్‌, నవలంక సందర్శనకు ఉత్సాహంగా వస్తున్నారు. సంక్రాంతి సెలవులకు సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో నావల ప్రయాణంలో రక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. –నాగాయలంక

నవలంకలో సందడి 1
1/3

నవలంకలో సందడి

నవలంకలో సందడి 2
2/3

నవలంకలో సందడి

నవలంకలో సందడి 3
3/3

నవలంకలో సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement