ఈవీఎం గోడౌన్ పరిశీలన
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ త్రైమాసిక తనిఖీల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్‌ను తెరిచి ఈవీఎంలను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఈవీఎం నోడల్ అధికారి ఎం నిత్యానందం, మచిలీపట్నం మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్‌దాదా, సీపీఎం నాయకులు కొడాలి శర్మ, బూర సుబ్రహ్మణ్యం, పంతం గజేంద్ర, వీరంకి గురుమూర్తి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎంవీ శ్యామ్‌నాధ్ తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ పీజీ గైనకాలజీలో యూనివర్సిటీ టాపర్ జాహ్నవి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం ఈ నెల 28వ తేదీ విడుదల చేసిన పీజీ ఫలితాల్లో గైనకాలజీ విభాగంలో డాక్టర్ ఓ శ్రీజాహ్నవి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డాక్టర్ జాహ్నవి అత్యుత్తమ మార్కులతో గైనకాలజీ విభాగంలో మొదటి స్థానం పొందారు. భవిష్యత్‌లో గ్రామీణ మహిళలకు వైద్య సేవలు అందించడానికి కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఆమె తండ్రి జయరాజు ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు. జాహ్నవిని పలువురు అభినందించారు.
బాడీబిల్డింగ్‌లో బందరు యువకుడికి స్వర్ణపతకం
మచిలీపట్నంఅర్బన్: ఆంధ్ర బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ 2025 రాష్ట్రస్థాయి పోటీల్లో బందరుకు చెందిన యువకుడు స్వర్ణ పతకం సాధించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదివారం నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో స్థానిక మాచవరానికి చెందిన బీరం ప్రశాంత్ 65 కేజీల విభాగంలో మొదటి స్థానం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. న్యూ నవ్యాంధ్ర ఫిట్‌నెస్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన పోటీల్లో ప్రశాంత్ ప్రతిభ కనబర్చాడు. విజేతలకు సంఘ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గోల్డ్ మెడల్‌తో పాటు సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ విజయంతో బందరు ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చినందుకు క్రీడాభిమానులు, స్థానికులు అభినందించారు.
జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): కరాటే ఇండియా ఆధ్వర్యాన జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిర్వహించనున్న మొదటి జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌షిప్ పోటీలకు విజయవాడలోని క్రీడా కేంద్రంలో ఆదివారం ఎంపికలు జరిగాయి. దీనిపై ఏపీ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జె.హరనాఽథ్, ప్రధాన కార్యదర్శి జె.శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంపికల్లో భాగంగా అండర్ 21 కేటగిరిలో బాలబాలికల మధ్య సబ్ జూనియర్స్, క్యాడెట్–జూనియర్స్‌కు పోటీలు జరిగాయని తెలిపారు. ఇందులో కటా బాలికల జట్టులో అక్షిత, చార్వీ అగర్వాల్, ఆఫ్రిన్ షహనాజ్, తేజశ్రీ సాయి, కుసుమ శ్రీచరిత, షఫియ, హరిచందన బంగారు పతకాలను గెలుచుకుని జాతీయ టోర్న్‌మెంట్‌కు ఎంపికయ్యారని వివరించారు. కటా బాలుర జట్టుకు లీలా ఉదయ్ రెడ్డి, భువన్ సాయి, అబ్దుల్ రెహన్, అజయ్ శర్వణ్, వెంకట అవినాష్ గోల్డ్ మెడల్స్ సాధించారని పేర్కొన్నారు. కుమితే బాలికల జట్టుకు స్నిగ్ధ, వసుధ, లక్ష్మీదివ్య, బాలుర జట్టుకు గ్రిఫిన్ జోయల్, యశ్విన్, సాత్విక్, సుహాన్, కృష్ణ, మోనిష్, ప్రియతమ్, నితీష్ నాగసాయి, విఘ్నేష్ బంగారు పతకాలను సాధించారని తెలిపారు. ఎంపికలకు జక్కుల దినేష్, సీహెచ్ మహేష్, టి.మధు, బి.నరసింహ, టీవీ సాయికుమార్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలను ఏపీ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ అన్వర్ షేక్ అభినందించారు.
ఈవీఎం గోడౌన్ పరిశీలన
ఈవీఎం గోడౌన్ పరిశీలన
ఈవీఎం గోడౌన్ పరిశీలన


