ఆలూరు రూరల్: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఫోన్‌లో పరామర్శించారు.
ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆర్యోగంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.


