సాక్షి, తాడేపల్లి: వైకుంఠ ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని తెలుగు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అంటూ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా వైఎస్ జగన్ శుభాకాంక్షల సందేశాన్ని పంచుకున్నారు.

ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 30, 2025
శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
క్లిక్ చేయండి👉: ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి చిత్రాలు


