హైదరాబాద్‌: ఇల్లీగల్‌గా లిక్కర్‌!.. పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై పోలీస్‌ రైడ్స్‌.. అరెస్టులు

Hyderabad Police Raids Pubs Farmhouses Over Illegal Liquor Sales - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలు పబ్‌లు, శివారుల్లోని ఫామ్‌హౌజ్‌లపై పోలీసులు శనివారం రైడ్స్‌ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌ పోలీసులు ఒకవైపు.. మాదాపూర్‌లోని పబ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొన్ని పబ్బులు నిబంధనలు ఉల్లంఘించి మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. బర్డ్‌ బక్స్‌, హాట్‌కప్‌ పబ్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఏడుగురిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

మరోవైపు.. మొయినాబాద్‌ పరిధిలోని ఫామ్‌హౌజ్‌లలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. సెలబ్రిటీ ఫామ్‌హౌజ్‌, ముషీరుద్దిన్‌, ఎటర్నిటీ ఫామ్‌హౌజ్‌లపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ మూడు ఫామ్‌ హౌజ్‌లపై కేసులకు గానూ పదిహేను మంది అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top