
సాక్షి, విజయవాడ: అక్రమ లిక్కర్ కేసు బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ప్రాసిక్యూషన్ తరపున సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. లూథ్రాపై సీరియస్ అయిన ఏసీబీ కోర్టు జడ్జి.. కేసు విచారణ పూర్తయిందా? లేదా? సూటిగా చెప్పాలన్నారు. విచారణ కొనసాగుతుందని.. కొత్త విషయాలు గుర్తించాల్సి ఉందని కోర్టుకు లూథ్రా తెలిపారు.
ఇప్పటి వరకు మూడు సార్లు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చామని.. కొత్తగా ఆధారాలు కోర్టుకు తెలపలేదన్న ఏసీబీ జడ్జి.. ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారన్నారు. మెటీరియల్ ఎవిడెన్స్ కూడా సమర్పించలేదన్న న్యాయమూర్తి.. కోర్టుని మిస్ గైడ్ చేస్తున్నారంటూ లుథ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్చువల్ విధానంలో సిద్ధార్ధ లూథ్రా తన వాదనలు వినిపించారు.