
సాక్షి, విజయవాడ: రూ.11 కోట్ల విషయంలో సిట్ కుట్రలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. సీరియల్ నంబర్స్ వీడియోగ్రఫి చేయాలని కోర్టు ఆదేశించినా కానీ.. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బ్యాంక్ నుంచి ఆ డబ్బులు ఎవరు విత్ డ్రా చేశారంటూ ఆయన ప్రశ్నించారు. నోట్లు వెరిఫై చేస్తే ఎవరు విత్ డ్రా చేశారో తెలుస్తుందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
కాగా, ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రూ.11 కోట్లు రూపాయలు సీరియల్ నెంబర్లు వీడియో గ్రఫి చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. రూ.11 కోట్లు ఎస్‌బీఐ బ్యాంక్‌లో డిపాజిట్ చేయడానికి సిట్ సన్నాహాలు చేస్తుండగా.. రూ. 11 కోట్లను కచ్చితంగా కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో వీడియో గ్రఫి చేయాలని పిటిషన్‌లో పేర్కొన్న న్యాయవాది.. సిట్ తొందరపాటు చర్యలకు పాల్పడుతుందన్నారు.
