
హైదరాబాద్: లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ సూర్యాపేట డీఎస్సీ పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తుల పత్రాలు గుర్తించారు.పార్థసారథికి సంబంధించిన ఇళ్లలో సోదాలు నిర్వహించింది ఏసీబీ. హయత్ నగర్ లోని ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల సోదాలు చేసింది ఏసీబీ. నిన్న (సోమవారం) డీఎస్పీ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు.
ఈ క్రమంలో నేడు(మంగళవారం) ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించగా భారీగా ఆస్తులకు సంబంధించి పత్రాలను గుర్తించారు. ఈ సోదాలు నిర్వహించే క్రమంలో ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లను గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై హయత్ నగర్ పోలీసులకు ఏసీబీ ఫిర్యాదు చేసినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో రిమాండ్‌కు పంపించకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసి.. రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అవినీతి కేసులో భాగంగా ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు.