ఆ ఎమ్మెల్యే సతీమణికి రూ.50 లక్షలు ఇచ్చా.. | AP ACB sleuths arrest EO for accepting Rs 50000 bribe | Sakshi
Sakshi News home page

ఆ ఎమ్మెల్యే సతీమణికి రూ.50 లక్షలు ఇచ్చా..

Mar 3 2025 8:01 AM | Updated on Mar 3 2025 8:01 AM

AP ACB sleuths arrest EO for accepting Rs 50000 bribe

చంద్రగిరిలో పోస్టింగ్‌ కావాలంటే డబ్బులిచ్చి తీరాల్సిందే..  

లంచం కోరుతూ ఓ కాంట్రాక్టర్‌తో పంచాయతీ ఈవో ఫోన్‌ సంభాషణ

ఆ కాంట్రాక్టర్‌ ఫిర్యాదుతో వలపన్ని ఈవోను పట్టుకున్న ఏసీబీ 

ఏసీబీ చేతిలో కీలక ఆడియో సంభాషణలు  

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: సీఎం చంద్రబాబు ఇలాకా చంద్రగిరిలో ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. పట్టుబడ్డ ఆ అధికారి, ఫిర్యాదుదారుడికి మధ్య ఫోన్‌ సంభాషణకు సంబంధించిన కీలక రికార్డులు ఏసీబీ చేతికి చిక్కినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ‘నేను ఆ సీటుకు రావడానికి ఎమ్మెల్యే సతీమణికి రూ.50 లక్షలు ఇచ్చాను.. మీలాంటి కాంట్రాక్టర్ల దగ్గర కూడా డబ్బు తీసు­కోకుండా పని చేయాలంటే.. నేను ఎలా బతకాలి? నేను ఇచ్చిన డబ్బు ఎలా సంపాదించుకోవాలి? నా కుటుంబం రోడ్డున పడితే ఎవరికి చెప్పుకోవాలి?’ అంటూ ఇటీవల చంద్రగిరిలో ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ ఈవో మహేశ్వ­రయ్య, కాంట్రాక్టర్‌ దినేష్‌ల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ఏసీబీ అధికారుల చేతికి చిక్కినట్టు తెలిసింది. 

చంద్రగిరిలో పంచా­యతీ తరఫున రా­వాల్సిన బి­ల్లుల మంజూ­రు­కు కాంట్రా­క్టర్‌ దినేష్‌ నుంచి పంచాయతీ ఈ­వో మహేశ్వ­రయ్య రూ.50 వేలు డి­మాండ్‌ చేయడంతో ఆ­యన ఏసీబీ­ని ఆ­శ్రయించాడు. దీంతో ఏసీబీ అధి­కా­రులు దినేష్‌కు ఓ రికా­ర్డింగ్‌ చిప్‌ ఇచ్చి నాలుగు రోజుల పాటు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను రికార్డ్‌ చేసినట్టు తెలిసింది. అనంతరం శుక్రవారం పంచాయతీ ఈవోను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

కాగా, ఆ సంభాషణలో పంచాయతీ ఈవో మహేశ్వరయ్య.. ఎమ్మెల్యే సతీమణికి రూ.50 లక్షలు ఇచ్చి ఆ ఉద్యోగాన్ని తీసుకున్నట్టుగా చెప్ప­డం కూడా అందులో రికార్డ్‌ అయినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల బదిలీల సమయంలో.. చంద్రగిరిలో ఉద్యోగం చేయడానికి వచ్చిన ఉద్యోగుల నుంచి స్థానిక ప్రజా ప్రతినిధికి ఎవరెవ్వరు ఎంత ముడుపులు ఇచ్చారో కూడా వారి సంభాషణల్లో నిక్షిప్తమై ఉన్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement