bureaucrat
-
అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్లు కథలు చెబుతున్నారా? ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారా? వీరికన్నా ఐపీఎస్‌లే మెరుగ్గా ఉన్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల్లో అర్థమేమిటి? ప్రతిగా కలెక్టర్లు అద్భుతాలు సృష్టిస్తామని అనడం పరోక్షంగా ఎద్దేవా చేసినట్లా?. ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం కొత్త కాదు. కానీ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే అందులో ఆయన సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుంటారు. తనకు అన్ని అంశాలపై అపారమైన పట్టు ఉందని అనిపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ఎక్కువ సార్లు ఇవి కాలక్షేపం సమావేశాలుగా మిగిలిపోతున్నాయన్న భావన అధికార వర్గాలలో ఉంది. .. కొద్ది రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సదస్సు(Collectors Conference)లో చంద్రబాబు అధికారులను ఉద్దేశించి ఉపన్యాసాలు చెప్పవద్దని అనడం. ప్రజెంటేషన్స్ ఇవ్వద్దని సూచించడం విశేషం. నిజానికి ఇలాంటి వాటిల్లో చంద్రబాబు ఒక ప్రత్యేకత సాధించారని అంటారు. ఉపయోగం ఉన్నా.. లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా ఆయన ఇచ్చినన్ని అంకెల ప్రజెంటేషన్లు మరెవ్వరూ ఇచ్చి ఉండకపోవచ్చు. వాటిలో ఎక్కువ భాగం కాకి లెక్కలే. పొంతన లేకుండా అంకెలు చెప్పేస్తూంటారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందని కాదు కానీ ప్రజలను గందరగోళపరిచి తను రాజకీయంగా లబ్ది పొందడం లక్ష్యంగా ఉంటుంది. కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన ధోరణి అలాగే ఉంటుంది. 👉మంచి జరిగితే తన ఖాతాలోకి, తప్పు జరిగితే అధికారుల అకౌంట్లలోకి జమ చేయడం ఆయన వైఖరి. కావచ్చు. కొన్ని జిల్లాల తలసరి ఆదాయం బాగోలేదని అంటూ కోనసీమ గురించి ప్రస్తావించారు. ఏలూరు జిల్లా తలసరి ఆదాయం బాగుందట. నిజంగానే అక్కడ అభివృద్ది జరిగి ఆదాయం పెరిగిందా? లేదంటే చంద్రబాబుకు నచ్చుతుంది కనుక ఆ విధంగా అంకెలు తయారు చేశారా? అనేది చెప్పలేం. చంద్రబాబు మాట్లాడితే వృద్ది రేటు అని అంటారు. అదేమిటో మామూలు ప్రజలకు అర్థం కాదు. కానీ పదే, పదే వాడడం ద్వారా ఏదో జరుగుతోందన్న భావన కలిగించడం ఆయన లక్ష్యం. పదిహేను శాతం వృద్ధి రేటు సాధిస్తేనే సంక్షేమం, అభివృద్ది చేయగలుగుతామని చంద్రబాబు చెప్పారు. అది నిజమే అనుకుందాం. కానీ ఇంత సీనియర్ అయిన చంద్రబాబుకు ఎన్నికల ముందు ఆ విషయం తెలియదా? ఇష్టం వచ్చిన రీతిలో హామీలు అడ్డగోలుగా ఎలా ఇచ్చారు? అనే ప్రశ్నకు ఏనాడైనా జవాబు ఇచ్చారా? కలెక్టర్లకు ఆ విషయం తెలియదా? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతలు ఎన్ని కథలు చెప్పింది వారు కూడా వినే ఉంటారు కదా? ఇప్పుడు దాన్నంతా కలెక్టర్ల మీద తోసేసి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తున్నట్లుగా కనిపించడం లేదా?.👉ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక, వండర్ పుల్ సర్, మిరాకిల్ సర్ అని వారు చెప్పవచ్చు. అనవచ్చు. కాని అర్థం చూస్తే అవేవో జరగడం సాధ్యం కాని అద్భుతాలు అన్నమాట. వాటిపై సీఎం కథలు చెబుతూ తమను అలా అంటారేమిటని కలెక్టర్లు అనుకోకుండా ఉంటారా! కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సైతం గత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం, తోచినన్ని అబద్దాలు చెప్పడం, చివరికి వివేక హత్య కేసు వంటివాటిని కూడా అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని ఆయన యత్నించారు. కలెక్టర్లు మెదడుకు పదును పెట్టాలని అంటున్నారు. ఎక్కువ సందర్భాలలో కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికే టైమ్ చాలదు. అందులోను మారిన రాజకీయ వాతావరణంలో కూటమి నేతల పైరవీలను తట్టుకోవడమే కలెక్టర్లకు ఇతర అధికారులకు పెద్ద సవాల్ అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. 👉ఆయా చోట్ల అధికారులపై దురుసుగా వ్యవహరిస్తున్న కూటమి ఎమ్మెల్యేలను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. వాటిపై స్పందించలేని నిస్సహాయ స్థితిలో కలెక్టర్లు ఉంటున్నారు. లేకుంటే ఒక తెలుగుదేశం పత్రిక కొందరు ఐఎఎస్‌ల భార్యలు స్టార్ హోటళ్లలో కౌంటర్లు ఓపెన్ చేశారని, ఆయా పనులకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక కథనాన్ని ఇస్తే.. ఐఎఎస్ అధికారుల సంఘం కనీసం ఖండించినట్లు లేదు. చంద్రబాబు కార్యాలయం దానిపై స్పందించలేదు. దీన్ని బట్టే ఐఎఎస్ అధికారులు కూడా ఈ రెడ్ బుక్(Red Book) పిచ్చిగోలకు భయపడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే కొందరు ఐఎఎస్, ఐపిఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా, ఎదురు కేసులు పెడుతూ, సస్పెన్షన్లు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న తీరు ఎదురుగా కనిపిస్తున్నప్పడు వారు మాత్రం ఏమి చేస్తారు?. ప్రజా ప్రతినిధులను కలుపుకుని వెళ్లండి, సొంతంగా ఆలోచించండి, సమస్యలు పరిష్కరించి క్రెడిట్ రాజకీయ నేతలకు ఇవ్వండని చంద్రబాబు అంటున్నారు. అంటే గతంలో చెప్పిన రాజకీయ పాలనను పరోక్షంగా మరోసారి చెప్పడమే కదా! కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు కలెక్టర్లను సొంతంగా పని చేసుకోనివ్వడం లేదని ఎల్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. 👉ఉదాహరణకు.. నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ఎక్సైజ్ కార్యాలయంలో తిష్టవేసి నిరసన చెబితే అధికారులు ఏమీ చేయలేకపోయారు. అసెంబ్లీలో సీఎం ఆఫీస్ వద్దే విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అధికారులపై దూషణలకు దిగినా అదేమిటని ప్రశ్నించ లేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఐఏఎస్‌లకన్నా ఐపీఎస్‌లు నచ్చారట. అవును..నిజమే.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ను సంతోషపెడుతున్నందున బహుశా వారే బాగా నచ్చారేమో!. 👉ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వంపై అప్పుల విషయంలో ఎన్ని అసత్యాలు చెప్పారో అందరికి తెలుసు. అధికారంలోకి వచ్చాక సైతం అవే అబద్దాలను కొనసాగిస్తున్నారు. సంపద సృష్టిస్తానని, అప్పులు చేయనని చెప్పేవారు. కాని ఇప్పుడు ఏమంటున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలుకు కొంతమేర అప్పులు చేస్తామని చెబుతున్నారు. కలెక్టర్లు, ఐఏఎస్‌లు దీనిని గమనించలేనంత అమాయకులా?. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, తిడుతుంటే దానికి కలెక్టర్లు ఎలా జవాబుదారి అవుతారు?. ఎన్నికల సమయంలో చెప్పిన హామీల అమలుకు నిధులు కేటాయించి, వాటిని విడుదల చేస్తే, అప్పుడు అమలు చేయకపోతే కలెక్టర్లు బాధ్యులవుతారు తప్ప, నిధులు ఇవ్వకుండా సీఎం అది చేయండి.. ఇది చేయండి అని చెబితే వారు కూడా ఎస్ సార్ అంటూ వినయం నటించక తప్పదు కదా!. గతంలో జగన్ టైమ్‌లో హామీలు, స్కీమ్‌ల వారీగా సమీక్షలు చేసేవారు ఎన్నికల మానిఫెస్టోని వారి ముందు పెట్టి ఏ మేరకు అమలు చేయగలిగాం.. ఎంత ఖర్చు అయింది? ఎంత డబ్బు అవసరం అన్నదానిపై చర్చించి విడుదల చేసేవారు. అలా సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికను అధికారులకు ఇచ్చి అమలు చేయాలని చెప్పే సాహసం చంద్రబాబు చేయగలరా?. మాట్లాడితే అధికారుల ఆలోచన తీరు మారాలని చెబుతారు?. అదేమిటో చెప్పరు! పడికట్టు పదాలు వాడి ప్రసంగం చేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది. తల్లికి వందనం కింద మే నెలలో డబ్బులు ఇస్తామని అంటున్నారు. అది ఇప్పుడు గడచిపోయిన సంవత్సరానికా? లేక వచ్చే సంవత్సరానికా అని జనం అడిగితే అధికారులు ఏమి చెప్పాలి? పైగా స్కూళ్లు తెరవక ముందే పిల్లలందరికి డబ్బులు ఇస్తామని అనడంలో మతలబు ఏమిటి? జూన్ లో కొత్తగా నమోదయ్యే పిల్లలకు కూడా ఇస్తారా? ఇవ్వరా? ఇలాంటి వాటిపై కలెక్టర్ల సమావేశంలో ఎందుకు చర్చించలేదు? ఇదే సమస్య అన్నదాత సుఖీభవ స్కీముకు కూడా వస్తుంది కదా?. 👉అమరావతి నిర్మాణంపై కూడా పాత అసత్యాలే మళ్లీ చెప్పినట్లు అనిపిస్తుంది. ఒకపక్క బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు పెట్టి, రూ.31 వేల కోట్ల వరకు అప్పు తెచ్చి వ్యయం చేస్తున్నా, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో రోడ్లు తదితర నిర్మాణాలు చేపడుతున్నామని చెబుతున్నట్లుగా ఉంది. కలెక్టర్లు.. అధికార దర్పం వద్దని చంద్రబాబు అన్నారట. అంటే ఏమిటి? మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని వచ్చినా, టీడీపీ ఐడీ కార్డులు పెట్టుకుని వచ్చినా, వారికి ఎదురేగి స్వాగతం పలకాలని సూచించడమా? లేక వైఎస్సార్సీపీ అభిమానులు ఎవరైనా తమ సమస్యలపై అధికారుల వద్దకు వస్తే వారికి ఏమీ చేయవద్దని చెప్పడమా? ఆయన మనసులోని మాటను గుర్తెరిగి అధికారులు వ్యవహరిస్తే సరిపోతుందా? ఏపీలో మాట ఇచ్చినట్లే మంచి పాలన జరుగుతోందని చంద్రబాబు అన్నట్లుగా ఎల్లో మీడియా బానర్ కథనాలు ఇచ్చినంత మాత్రాన వాస్తవాలు అధికారులకు తెలియకుండా ఉంటాయా? నిజమే..అధికారులు క్షేత్ర స్థాయిలో బాధ్యతగా ఉండాలి. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చాలి. అంతవరకు చంద్రబాబు అయినా, మరెవరైనా చెప్పడం తప్పు కాదు. కాని తాము ఇచ్చిన హామీలన్నిటికి ఐఏఎస్ అధికారులు జవాబుదారులు అయినట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను వారిపైకి నెట్టివేస్తే, అర్థం చేసుకోలేని అమాయకులుగా అధికారులు ఉండరు కదా! కాకపోతే ఇప్పటికైతే ప్రభుత్వ పెద్దలు చేసే అవమానాలను మౌనంగా భరించక తప్పదేమో!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
'నలుపే అందం'..శక్తిమంతమైనది!: వర్ణ వివక్షపై కేరళ సీఎస్ స్ట్రాంగ్ రిప్లై..
జాతి వివక్షకు మించిన అతిపెద్ద రోగం వర్ణ వివక్ష. మనుషులంతా ఒకేలా ఉంటే ఏముంది ఘనత అని పెద్దలు అంటుంటారు. కానీ కొందరికి అవేం పట్టవు. ఒక మనిషి తన శరీర రంగుని బట్టి.. చిన్నబుచ్చేలా మాట్లేడుస్తుంటారు చాలామంది. అవతలి వ్యక్తి ఎంత పెద్ద విద్యావేత్త లేదా అధికారి అన్న స్ప్రుహ ఉండదు. కేవలం శరీర వర్ణం నల్లగా ఉంటేనే..అతడు/ఆమెని ఏమైనా అనే అవకాశం వచ్చేస్తుందా..? లేక నలుపు రంగు అంటేనే లోకువ అనేది ఎవ్వరికీ అర్థంకానీ బాధని రగిల్చే సున్నితమైన అంశం. ఆ వ్యాఖ్యలన్నింటికి కేరళ సీనియర్ బ్యూరోక్రాట్ చాలా శక్తిమంతమైన రిప్లై ఇచ్చారు. ఇప్పుడది నెట్టింట హాట్‌టాపిక్‌గా మారడమే గాక శెభాష్ మేడమ్ బాగా చెప్పారంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె చెప్పిన తీరు చూస్తే నలుపులో ఇంత అందం దాగుందా అనిపిస్తుంది. మరి అదేంటో చూసేద్దామా..!కేరళ ప్రధాన కార్యదర్శి శారద మురళీధరన్ తన వంటి రంగు(నల్లటి రంగును )పై సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు చాలా స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చారు. చెప్పాలంటే ఆ వ్యాఖ్యాలను తిప్పి కొట్టేలా కంటే ఆలోచింప చేసేలా నల్లనిదనంలోని అందాన్ని వెలికితెచ్చారామె. మరోమారు నల్లటి రంగు అని అవహేళన చేసే సాహసమే చేయనీకుండా చాలా చక్కగా పోస్ట్‌లో రిప్లై ఇచ్చారు. ఆమెపై చేసిన వ్యాఖ్య ఏంటి..?, ఏం చెప్పారామె అంటే..1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి శారద మురళీధరన్ ఆమె ప్రస్తుతం కేరళలో చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరూ ఆమె పనితీరుని భర్త (మాజీ కేరళ ప్రధాన కార్యదర్శి వి వేణు) రంగుతో పోలుస్తూ..ఆమె భర్త ఒంటి రంగు తెలుపులా నల్లగా ఉందని వెటకారంగా పోస్టులు పెట్టారు. ఆమె వాటిని చూసి వెంటనే ఆ పోస్టులని డిలీట్ చేసేశారు. అయితే కొందరూ శ్రేయోభిలాషుల విజ్ఞప్తి మేరకు దీనిపై మాట్లాడుతున్నా అంటూ ఆ పోస్టులను రీ పోస్ట్ చేస్తూ.. రాసుకొచ్చారు. శారద మురళీధరన్ పోస్ట్‌లో.." నా నల్లదనాన్ని సొంత చేసుకునేందుకు మాట్లాడుతున్నా.. చీకటి హదయం నలుపు రంగు. సాయంత్రానికి సంకేతం. వర్షం వాగ్దానం(నల్లిని మేఘాలే వర్షం రాక). అదికేవలం రంగు మాత్రమే కాదు. అనారోగ్యానికి, చెడుకి సంకేతంగా కూడా భావిస్తారు. అసలు అది లేకపోతే ఎలా గుర్తించగలరు మంచిని. నలుపు అనగానే చులకన భావం వచ్చేస్తోంది. ఈ నల్లని రంగు విశ్వం సర్వవ్యాప్త సత్యం. అందుండబట్టే అంతరిక్షం, నక్షత్రాలు అన్న వాటి గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగింది. ఇది అత్యంత శక్తిమంతమైన కలర్. ఏ రంగునైనా తనలో ఇముడ్చుకోగలదు. ఆఫీస్ దుస్తుల నుంచి ఇంటికి వెళ్లాక వేసుకునే క్యాజువల్ వరకు అన్నింట్లో ఈ నలుపు తప్పక ఉంటుంది. ఆఖరికి కంటి పాపకూడా నలుపు ఉంటేనేగా చూసేది. అలాంటి నలుపైపై ఎందుకింత అక్కసు, చులకనభావం అని నిలదీశారు. తాను కూడా ఒకప్పుడూ ఈ నలుపుని తక్కువగానే చూశా అంటూ తన చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్ల వయసులో అమ్మా నేను తెల్లగా పుడతాను కదా మళ్లీ నీ గర్భంలోకి వెళ్లితే అని అంటుండేదాన్నిఅలా 50 ఏళ్లు నా ఒంటి రంగు మంచిది కాదనే భావనలోనే బతికేశా. కానీ ఆ నలుపులోని అందాన్ని గుర్తించడంలో నా పిల్లలే సాయం చేశారు. వాళ్లు తమ నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నలుపులో ఉన్న అద్భుతాన్ని, అందాన్ని నాకు కళ్లకు కట్టినట్లు చూపించాక గానీ నేను గుర్తించలేదు నలుపు ఇంత అందంగా ఉంటుందని" అని పోస్టులో రాసుకొచ్చారామె.రంగు తక్కువ అనేభావం మాయం..సీనియర్ బ్యూరోక్రాట్ మురళీధరన్ పోస్టులో రాసిన ప్రతి మాట మనస్సుని హత్తుకునేలా ఉంది. అని కేరళ అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు సతీశన్ అన్నారు. తన తల్లి కూడా నలుపురంగులోనే ఉందని, ఇది చర్చకు రావాలని కోరుకున్నా అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.కాగా, శారద మురళీధరన్ తన భర్త వి. వేణు పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో గతేడాది ఆగస్టు 31న ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో ఆమె నియామకం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే కేరళ చరిత్రలోనే తొలిసారిగా భర్త నుంచి ఆమె ఛీప్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకారించారామె. ఇక ఆమె గతంలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్‌గా, నేషనల్ రూరల్ లైవ్లిహుడ్స్ మిషన్‌లో సీఓఓగా, కుటుంబంశ్రీ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కీలక పాత్రల్లో పనిచేశారు.(చదవండి: ఉషా వాన్స్ నటి దీపికా పదుకునే స్టైల్‌ని రీక్రియేట్ చేశారా..? వివాదాస్పదంగా ఇవాంకా పోస్ట్) -
చండీగఢ్ కోర్టులో కలకలం.. ఐఆర్ఎస్ అల్లుడిపై ఐపీఎస్ మామ కాల్పులు
చండీగఢ్: చండీగఢ్ కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం రేగింది. పెళ్లి వివాదంపై రెండు బృందాలు ఫ్యామిలీ కోర్టుకు రాగా, అదే సమయంలో పంజాబ్ పోలీస్ మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన అల్లుడు హర్‌ప్రీత్ సింగ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన మృతిచెందాడు. మల్వీందర్ అల్లుడు వ్యవసాయ శాఖలో ఐఆర్ఎస్గా విధులు నిర్వర్తిస్తున్నారు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. కేసు దర్యాప్తు ప్రారంభించారు.హర్‌ప్రీత్ సింగ్‌కు అతని భార్యతో విడాకుల కేసు నడుస్తోంది. విచారణ సందర్భంగా అతని బావ, సస్పెండైన ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ కూడా కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. కోర్టులో విచారణ సందర్భంగా ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.ఈ సమయంలో నిందితుడైన మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన తుపాకీతో ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. కోర్టులో న్యాయవాదులు నిందితుడిని పట్టుకుని గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్‌ప్రీత్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. -
MP: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వీర రాణా.. రెండో మహిళగా రికార్డ్
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి వీర రాణా నియమితులయ్యారు. రాష్ట్ర సీఎస్‌గా గురువారం ఆమె అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. వీర రాణా ప్రస్తుతం మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండు సార్లు పొడిగింపుల తర్వాత పదవీ విరమణ చేయనున్న అవుట్గోయింగ్ సీఎస్ ఇక్బాల్ సింగ్ బెయిన్స్ స్థానంలో 1988 బ్యాచ్‌కు చెందిన వీర రాణా నియమితులయ్యారు. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన బెయిన్స్ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2022 డిసెంబర్ 1 నుంచి 2023 మే 31 వరకూ మొదటిసారి పదవీ కాలాన్ని పొడిగించగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 2023 జూన్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు మరోసారి పొడిగించారు. రెండో మహిళగా రికార్డ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రెండో మహిళగా వీర రాణా రికార్డు సృష్టించారు. 1990వ దశకం ప్రారంభంలో మధ్యప్రదేశ్‌కు తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిణి నిర్మలా బుచ్ నియమితులయ్యారు. ఈమె ఈ ఏడాది జూలైలో కన్నుమూశారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం బెయిన్స్‌కు వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు
బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు సుమారు రూ. 40 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు ప్రశాంత్ కుమార్ మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్‌ను తయారు చేసే ప్రభుత్వ యజమాన్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్(కేఎస్డీఎల్) కార్యాలయం నుంచి అరెస్టు చేశారు. లోకాయుక్త వర్గాల సమాచారం మేరకు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు(బీడబ్ల్యూఎస్ఎస్బీ) చీప్ అకౌంట్స్ ఆఫీసర్‌గా ప్రశాంత్ కుమార్ పనిచేస్తున్నాడు. అయితే అతన్ని మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్‌ని తయారు చేసే ప్రభుత్వ యజమాన్యంలోని కేఎస్‌డీఎస్ కార్యాలయం నుంచి అరెస్టు చేశారు. ఆ కార్యాలయం నుంచి సుమారు మూడు బ్యాగుల నగదు లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐతే ఆయన తండ్రి విరూపక్షప్ప దావణగెరె జిల్లా చన్నగిరి ఎమ్మెల్యే కేఎస్డీఎల్ చైర్మన్‌గా ఉండటం గమనార్హం. ఈ ప్రశాంత్ కుమార్ 2008 బ్యాచ్ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి. అతను సబ్బు, ఇతర డిటర్జెంట్లు తయారికీ అవసరమైన ముడిసరుకు కొనగోలు చేసే డీల్ కోసం ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఆ కాంట్రాక్టర్ నుంచి సుమారు రూ. 81 లక్షలు డిమాండ్ చేయడంతో లోకాయుక్తను ఆశ్రయించాడు. దీంతో అధికారులు సాయంత్రం 6 గంటలకు పకడ్బందిగా ఉచ్చు బిగించారు. ఐతే ఈ డబ్బు అందుకుంది తండ్రీకొడుకులని సీనియర్ లోకాయుక్త తెలిపారు. (చదవండి: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. రోబోల సాయంతో మంటలు అదుపులోకి.. ) -
రాజకీయాలు ఇక చాలు, గుడ్ బై చెప్పిన షా
కశ్మీర్: ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించిన షా ఫైజల్ నేడు రాజకీయాలకు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించారు. సుమారు 16 నెలల తర్వాత ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించారు. సోమవారం జమ్ము కశ్మీర్ పీపుల్స్ మూమెంట్స్ పార్టీ(జేకేపీఎమ్) అధ్యక్షుడిగా తప్పుకున్నట్లు వెల్లడించిన ఆయన మళ్లీ తన ఉద్యోగంలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా షా ఫైజల్ 2010 సివిల్ సర్వీస్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడంతో జమ్ము కశ్మీర్ ప్రభుత్వంలో ఐఏఎస్‌గా తన సేవలందించారు. అయితే ఆయన 2019 జనవరిలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. అలా గతేడాది మార్చి 21న జమ్ము కశ్మీర్ పీపుల్స్ మూమెంట్స్ పార్టీ స్థాపించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు సమయంలో కశ్మీర్‌లోని అనేకమంది నేతలతోపాటు షాను కూడా ప్రజా భద్రత చట్టం కింద నిర్బంధించారు. అనంతరం ఈ ఏడాది జూలైలో ఆయనను విడుదల చేశారు. (కశ్మీర్ ఓ నివురుగప్పిన నిప్పు) -
కరోనాపై పోరులో మహిళా అధికారి కన్నుమూత
సాక్షి, కోల్‌కతా: కరోనా మహమ్మారి మరో సీనియర్ అధికారిని పొట్టన పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్ కరోనా వైరస్‌పై పోరులో ముందుండి పనిచేసి విశేష సేవలందించిన ప్రభుత్వ అధికారి దేబ్దత్తా రే(38) వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో ఆమె సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూర్తీభవించిన మానవత్వంతో, క్లిష్ట వ్యవహారాలను కూడా సునాయాసంగా పరిష్కరించడంలో ఆమె సునిశిత శైలిని గుర్తు చేసుకుని కన్నీంటి పర్యతమయ్యారు. హూగ్లీ జిల్లా, చందానగర్ సబ్ డివిజన్ డిప్యూటీ మేజిస్ట్రేట్ దేబ్దత్తా ఇటీవల కోవిడ్ అనుమానిత లక్షణాలతో హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆదివారం శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో సెరాంపూర్‌లోని శ్రమజీబీ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆమెకు భర్త, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. (అధ్వాన్నం: దేశాధినేతలకు డబ్ల్యూహెచ్ఓ అక్షింతలు ) మరోవైపు దత్తా ఆకస్మిక మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మహమ్మారిపై పోరులో రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించిన ఆమె మరణం తీరని లోటని ట్వీట్ చేశారు. ప్రభుత్వం తరపున, ఆమె సేవలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. కాగా ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు కరోనాతో మరణించడం తమ రాష్ట్రంలో ఇదే తొలిసారి అని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. (పరిస్థితి మెరుగయ్యేదాకా షూటింగ్‌లు ఆపాలి!) I, on behalf of the Govt of West Bengal, salute her spirit & the sacrifice she's made in service of the people of #Bengal. Spoke to her husband today & extended my deepest condolences. May the departed soul rest in peace & lord give her family strength to endure this loss. (2/2) — Mamata Banerjee (@MamataOfficial) July 13, 2020 -
అధికారిపై ముఖ్యమంత్రి చెంపదెబ్బ
సాక్షి, బళ్లారి: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రమేశ్ చెంప చెళ్లుమనిపించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ వైరస్‌లా సామాజిక మాధ్యమాల్లో, ఇతర టెలివిజన్ చానళ్లలో ప్రసారమైంది. దీంతో తాను కమిషనర్‌పై చేయి చేసుకోలేదని.. కేవలం ముందుకు తోశానని సిద్ధరామయ్య కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వివరాలిలా ఉన్నాయి... బళ్లారిలో నూతనంగా నిర్మించిన వాల్మీకి భవనం ప్రారంభోత్సవంలో శనివారం సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ రమేశ్‌పై చెంపపై చేయి చేసుకున్నారు. ప్రజల మధ్య బహిరంగంగా ఈ ఘటన జరగటంతో మొత్తం వ్యవహారం రచ్చకెక్కింది. వీడియో క్లిప్పింగ్ వెల్లడవ్వడంతో ముఖ్యమంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను కమిషనర్‌పై చేయి చేసుకోలేదని.. కేవలం ముందుకు తోశానని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
అధికారిపై ముఖ్యమంత్రి చెంపదెబ్బ