రూ.లక్షన్నర కిందే బంగారం.. పెట్రోల్‌తోపాటు వాటర్‌ సేల్‌! | today latest business news updates dont miss check full details | Sakshi
Sakshi News home page

రూ.లక్షన్నర కిందే బంగారం.. పెట్రోల్‌తోపాటు వాటర్‌ సేల్‌!

Sep 30 2026 8:15 PM | Updated on Sep 30 2026 8:51 PM

today latest business news updates dont miss check full details

ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం! 
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

భారత్‌లోకి యాపిల్ పే గ్రాండ్ ఎంట్రీ

భారత డిజిటల్ చెల్లింపుల రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ టెక్ దిగ్గజం యాపిల్ తన ప్రతిష్టాత్మక ‘యాపిల్ పే’ సేవలను అధికారికంగా భారతదేశంలో ప్రారంభించింది. దేశంలో ఈ సేవలను అందించేందుకు మొదటి భాగస్వామిగా యాక్సిస్ బ్యాంక్ నిలిచింది. ఈ భాగస్వామ్యం ద్వారా యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన ఆమోదిత వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు నేటి నుంచి యాపిల్ పే సేవలను వినియోగించుకోవచ్చు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

పెట్రోల్‌తోపాటు వాటర్‌ బాటిళ్లు అమ్మనున్న ఐఓసీఎల్‌

దేశంలోనే అతిపెద్ద చమురు విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఎసీఎల్‌) తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. కేవలం పెట్రోల్, డీజిల్ విక్రయాలకే పరిమితం కాకుండా సొంత బ్రాండ్ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న తన 43,000కు పైగా రిటైల్ అవుట్‌లెట్ల భారీ నెట్‌వర్క్‌‌ను వినియోగించుకుంటూ ఈ వ్యాపారాన్ని విస్తరించాలని ప్రతిపాదించింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

సూచీల నష్టాల బాట.. ఐదు కారణాలు

భారతీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయి 22,620 స్థాయికి చేరుకోగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 48 పాయింట్లు క్షీణించి 72,480 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ అస్థిరతలు, ఇంధన ధరల తీవ్రత, విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు ప్రధానంగా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement