బంగారం ధరల్లో భారీ మార్పు.. రూ.3000 తగ్గిన రేటు! | Gold Price Outlook Drops Sharply in A Week | Sakshi
Sakshi News home page

బంగారం ధరల్లో భారీ మార్పు.. రూ.3000 తగ్గిన రేటు!

Sep 27 2026 7:03 PM | Updated on Sep 27 2026 7:10 PM

Gold Price Outlook Drops Sharply in A Week

బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. గత వారం రోజుల్లో గోల్డ్ రేటు భారీగా తగ్గుతూ.. అదే స్థాయిలో పెరుగుతూ నేడు (ఆదివారం) స్థిరంగా ఉంది. ఈ కథనంలో ఏడు రోజుల్లో (సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు) పసిడి ధరల్లో జరిగిన మార్పుల గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో సెప్టెంబర్ 20న రూ.1,55,840 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సెప్టెంబర్ 26 నాటికి రూ.1,52,680 వద్దకు (రూ.3160 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850 నుంచి రూ.1,39,950 వద్దకు (రూ.2900 తగ్గింది) చేరింది.

చెన్నైలో సెప్టెంబర్ 20న రూ.1,55,840 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సెప్టెంబర్ 26 నాటికి రూ.1,52,730 వద్దకు (రూ.3110 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850 నుంచి రూ.1,40,000 వద్దకు (రూ.2850 తగ్గింది) చేరింది.

ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పు కనిపించింది. ఇక్కడ సెప్టెంబర్ 20న రూ.1,55,990 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సెప్టెంబర్ 26 నాటికి రూ.1,52,830 వద్దకు (రూ.3160 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,43,000 నుంచి రూ.1,40,100 వద్దకు (రూ.2900 తగ్గింది) చేరింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement