మొబైల్‌ రీఛార్జ్‌లపై కేంద్రం శుభవార్త | TRAI New Rule Prepaid Users to Get 30 Days Recharge Options | Sakshi
Sakshi News home page

మొబైల్‌ రీఛార్జ్‌లపై కేంద్రం శుభవార్త

Sep 27 2026 5:47 PM | Updated on Sep 27 2026 6:13 PM

TRAI New Rule Prepaid Users to Get 30 Days Recharge Options

మొబైల్‌ రీఛార్జ్‌లపై కేంద్ర శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు చాలా టెలికాం కంపెనీలు 28 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో నెలకు ఒకసారి రీఛార్జ్ చేస్తున్నామని భావించే వినియోగదారులు ఏడాదిలో 12 సార్లు కాకుండా.. 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కొత్త వ్యాలిడిటీ ఆప్షన్లు అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇది దేశీయ ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు శుభవార్త అనే చెప్పాలి.

30 రోజుల వ్యాలిడిటీ
సెప్టెంబర్ 22న ట్రాయ్ జారీ చేసిన టెలికాం వినియోగదారుల రక్షణ (13వ సవరణ) నిబంధనలు, 2026 ప్రకారం.. టెలికాం సంస్థలు 28 రోజుల ప్లాన్‌ల స్థానంలో, 30 రోజుల వ్యాలిడిటీతో వాయిస్, ఎస్ఎంఎస్ సేవలకు సంబంధించిన ప్లాన్లను అందుబాటులో ఉంచాలి.

నిజానికి ఈ సమస్యను రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మార్చి 11న పార్లమెంటులో ప్రస్తావించారు. 28 రోజుల వ్యాలిడిటీ కారణంగా వినియోగదారులు ఏడాదికి అదనంగా ఒకసారి రీఛార్జ్ చేయాల్సి వస్తోందని వివరించారు. వినియోగదారులకు 30 రోజుల వ్యాలిడిటీతో పాటు మరిన్ని సౌకర్యవంతమైన ఆప్షన్లు ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్పెషల్ ప్లాన్
మొబైల్ వాడే ప్రతి ఒక్కరికీ డేటా అవసరం ఉండదు. కొంతమంది ఫోన్‌ను కేవలం కాల్స్ చేయడానికి, ఎస్ఎంఎస్ పంపడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు. అలాంటి వారు డేటా ఉన్న ప్లాన్ కోసం అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ప్రత్యేకమైన వాయిస్+ఎస్ఎంఎస్ ప్లాన్‌ను ఎంచుకునే అవకాశం కల్పించాలని కోరారు.

ట్రాయ్ నిబంధనల ప్రకారం.. టెలికాం కంపెనీలు కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ సేవలు అందించే ప్రత్యేక టారిఫ్ వోచర్లను అందించాలి. వీటిలో 30 రోజుల ఆప్షన్ ఉండాలి. అలాగే.. ప్రతి నెల ఒకే తేదీన రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించే ప్లాన్ కూడా ఉండాలి. దీనితో పాటు కనీసం ఒక దీర్ఘకాలిక వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్ కూడా అందుబాటులో ఉండాలి.

ఇదీ చదవండి: ఖాతాదారులకు అలర్ట్‌: 5 రోజులు బ్యాంకులు బంద్!

అంటే.. ఇకపై డేటా అవసరం లేని వినియోగదారులకు తమ అవసరానికి తగ్గట్టుగా ప్లాన్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌ను ఎంచుకుంటే నెలకు ఒకసారి అదే తేదీకి రీఛార్జ్ చేసుకోవడం సులభంగా ఉంటుంది. అయితే.. ఏ కంపెనీ ఎంత ధరకు ఏ ప్రయోజనాలతో ప్లాన్ అందిస్తుంది? అనేది మాత్రం ఆయా టెలికాం సంస్థలపై ఆధారపడి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement