వాయిస్‌ కాల్స్‌కి కూడా చౌక స్పెషల్‌ వోచర్లు | Trai orders telcos to offer cheaper voice-SMS vouchers for users who do not need data | Sakshi
Sakshi News home page

వాయిస్‌ కాల్స్‌కి కూడా చౌక స్పెషల్‌ వోచర్లు

Sep 23 2026 4:50 AM | Updated on Sep 23 2026 4:50 AM

Trai orders telcos to offer cheaper voice-SMS vouchers for users who do not need data

టెల్కోలకు ట్రాయ్‌ నిబంధన

న్యూఢిల్లీ: డేటా సర్వీసులను కలపకుండా కేవలం వాయిస్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ సేవల కోసమే చౌకైన స్పెషల్‌ టారిఫ్‌ వోచర్లను (ఎస్‌టీవీ) ప్రవేశపెట్టాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఆదేశించింది. డేటా, వాయిస్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల సర్వీసులతో కలిపి 30 రోజులు లేదా అంతకన్నా తక్కువ వ్యవధికి అందించే ప్లాన్ల తరహాలోనే వీటి వేలిడిటీ కూడా ఉండాలని సూచించింది. 

ఎస్‌టీవీ అనేది ప్రీపెయిడ్‌ మొబైల్‌ కస్టమర్లకు కొంత అదనపు ప్రయోజనాలను పొందడానికి బూస్టర్‌ రీచార్జ్‌లాగా పని చేస్తుంది. వివిధ కాలావధులతో టెల్కోలు వాయిస్, ఎస్‌ఎంఎస్, డేటా కలిపి ఎస్‌టీవీలను అందిస్తున్నప్పటికీ.. కేవలం వాయిస్, ఎస్‌ఎంఎస్‌ ప్లాన్లకు అదే తరహా వేలిడిటీతో ప్రత్యేక టారిఫ్‌ వోచర్లను అందుబాటులో ఉంచడం లేదు. దీనితో డేటా అవసరం లేని వారు కూడా తప్పనిసరిగా డేటా ఉన్న బండిల్డ్‌ ప్యాక్‌లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని వారు, అధిక టారిఫ్‌లను చెల్లించలేని వారికి ఊరటనిచ్చేలా ట్రాయ్‌ నిబంధనలను సవరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement