ఊహకందని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు! | Gold and Silver Prices Dropped 2nd Day Know The Latest Rates | Sakshi
Sakshi News home page

ఊహకందని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు!

Sep 29 2026 9:07 PM | Updated on Sep 29 2026 9:11 PM

Gold and Silver Prices Dropped 2nd Day Know The Latest Rates

రెండు రోజులుగా బంగారం ధరల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇది పసిడి ప్రియులకు తప్పకుండా ఊరటను ఇస్తుంది. ఈ కథనంలో గోల్డ్ రేటు ఎంత తగ్గింది?, రానున్న రోజుల్లో పసిడి ధరలు ఎలా ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో రూ.3880 తగ్గి రూ.1,48,800 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.3550 తగ్గి రూ.1,36,400 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఉంటాయి.

చెన్నైలో కూడా బంగారం ధర భారీగానే తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రెండు రోజుల్లో రూ.3930 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3600 తగ్గింది. ప్రస్తుతం ధరలు రూ.1,48,800 (24 క్యారెట్స్), రూ.1,36,400 (22 క్యారెట్స్) వద్ద నిలిచాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3880 తగ్గి రూ.148950 వద్ద, 22 క్యారెట్ల రేటు రూ.3550 తగ్గి రూ.136550 వద్దకు చేరింది.

వెండి ధరలు
వెండి ధరలు కూడా హైదరాబాద్, విజయవాడలలో రూ.10వేలు (రెండు రోజుల్లో) తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ.2.40 లక్షల వద్దకు చేరింది. చెన్నై, ఢిల్లీలలో కూడా కేజీ వెండి రేటు రూ.2.40 లక్షల వద్దనే ఉంది.

ధరలు తగ్గుతాయా?
ప్రస్తుతం బంగారం రేట్లు తగ్గి.. కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, రానున్నది పండుగ సీజన్. ఈ సమయంలో పసిడికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ధరలు కూడా మళ్లీ పెరిగవచ్చని నిపుణులు అంచనా.

ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏయే రోజుల్లో అంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement