సుభాష్‌ చంద్ర రుణదాతలకు నోటీసులు | NCLAT seeks creditor replies on Subhash Chandra insolvency appeal | Sakshi
Sakshi News home page

సుభాష్‌ చంద్ర రుణదాతలకు నోటీసులు

Sep 30 2026 8:13 PM | Updated on Sep 30 2026 8:16 PM

NCLAT seeks creditor replies on Subhash Chandra insolvency appeal

జారీచేసిన ఎన్‌సీఎల్‌ఏటీ  

న్యూఢిల్లీ: నేషనల్‌ కంపెనీ చట్ట అపిల్లేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) తాజాగా ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై విచారణను అక్టోబర్‌ 29, 30న చేపట్టనున్నట్లు పేర్కొంది.

నేషనల్‌ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)కి చెందిన ఐదుగురు సభ్యుల బెంచ్ సెప్టెంబ‌ర్‌ 1న జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ చంద్ర అపిల్లేట్‌ ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేశారు. చంద్ర వ్యక్తిగత దివాలా అంశంపై అంతక్రితం ఆయనకు అనుకూలంగా ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ, చంద్ర ఆస్తులను ఇతరులకు బదలాయించకుండా ఐదుగురు సభ్యుల బెంచ్‌ ఆదేశాలివ్వడం తెలిసిందే. 

ఇదీ చ‌ద‌వండి: ఐపీవో స్ట్రీట్‌.. 5 కంపెనీల లిస్టింగ్‌ బాట 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement