వచ్చే నెల సమ్మర్‌ హాలిడేస్‌ | Summer Holidays Movie is set for theatrical release on November 6 | Sakshi
Sakshi News home page

వచ్చే నెల సమ్మర్‌ హాలిడేస్‌

Oct 23 2026 4:36 AM | Updated on Oct 23 2026 4:36 AM

Summer Holidays Movie is set for theatrical release on November 6

సింజిత్, రోహన్, ధీరజ్, అరుణ్, శ్రీకర్‌

మాస్టర్‌ రోహన్, మాస్టర్‌ అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సమ్మర్‌ హాలిడేస్‌’. శ్రీకర్‌ దర్శకత్వంలో ధీరజ్‌ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు. నవంబరు 6న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ధీరజ్‌ మొగిలినేని మాట్లాడుతూ– ‘‘మా సినిమా రిలీజ్‌కు అక్టోబరు నెలలోనే కొన్ని రిలీజ్‌ డేట్స్‌ అనుకున్నాం. అక్టోబరు 30న కూడా అనుకున్నాం. ఆ రోజు వెంకటేశ్‌గారి సినిమా రిలీజ్‌ అవుతోంది.

దీంతో మా ‘సమ్మర్‌ హాలిడేస్‌’ని నవంబరు 6న రిలీజ్‌కు ఫిక్స్‌ చేసుకున్నాం. నవంబరు తొలి వారంలో కూడా ‘రామాయణం’ వంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి పెద్ద తెలుగు సినిమా లేదు. ఇది పిల్లల సినిమా అంటున్నారు.

కానీ పిల్లలకంటే వారి తల్లిదండ్రులే ఎక్కువగా ఈ సినిమాను ఎంజాయ్‌ చేస్తారు. ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడు పెద్దలకు వాళ్ల బాల్యం గుర్తుకు వస్తుంది. ఇక చిన్న సినిమాల మనుగడ బాగుండాలంటే ప్రభుత్వం టికెట్‌ రేట్స్‌ పెంచేందుకు అనుమతి ఇవ్వకూడదని నా అభి్రపాయం’’ అని అన్నారు. ‘‘కుటుంబమంతా కలిసి చూడదగిన సినిమా ఇది’’ అని తెలిపారు శ్రీకర్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement