టాలీవుడ్ ఎందుకో ఆ విషయంలో వెనకబడింది! | Telugu And Tamil Movie Music Comparisons Rise After Jailer 2 | Sakshi
Sakshi News home page

Anirudh-Thaman-Sai: తమిళ vs తెలుగు.. ఎవరు ఎందులో బెటర్?

Oct 21 2026 2:46 PM | Updated on Oct 21 2026 3:06 PM

Telugu And Tamil Movie Music Comparisons Rise After Jailer 2

తెలుగు vs తమిళ సినిమా.. ఎన్నేళ్లయినా ఈ రచ్చ సాగుతూనే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులేమో తమ చిత్రాలు పాన్ ఇండియా రేంజులో దూసుకెళ్తున్నాయి. రూ.1000 కోట్లు దాటేశాయి. మేమే తోపు అని అంటున్నారు. తమిళ ప్రేక్షకులేమో తాము తీసేవి గొప్ప మూవీస్ అని సంబరపడుతున్నారు. వీటిలో నిజానిజల సంగతి కాసేపు పక్కనబెడితే ఓ విషయంలో టాలీవుడ్ కంటే కోలీవుడ్ బెటర్ అనే ఫీలింగ్ అయితే కలుగుతోంది. ఇంతకీ తెలుగు ఇండస్ట్రీలో ఏ విషయంలో మారాలి?

(ఇదీ చదవండి: ఏకంగా ముఖ్యమంత్రికి తెగ నచ్చేసిన ప్రేమకథా సినిమా)

రీసెంట్‌గా 'జైలర్ 2' సినిమా వచ్చింది. కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. కథ పరంగా పెద్దగా మెరుపులేం లేనప్పటికీ అనిరుధ్ సంగీతానికి దాదాపు అందరూ ఫిదా అయ్యారు. సీన్స్‌కి తగ్గట్లు డైరెక్టర్ రాసిన కామెడీకి తోడు అనిరుధ్ మ్యూజిక్ అద్భుతంగా వర్కౌట్ కావడం ఈ చిత్రానికి చాలా అంటే చాలా ప్లస్ అయింది. రజనీకాంత్ మేనియా ఎలానూ ఉండేసరికి నాలుగైదు రోజుల్లోనే రూ.400-500 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

అనిరుధ్ అనే కాదు సాయి అభ్యంకర్ అనే కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ కూడా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో చాలా తమిళ సినిమాలకు ప్రాణం పోస్తున్నాడు. చెప్పాలంటే వీళ్లిద్దరి వల్లే తమిళంలో రీసెంట్ టైంలో పలు మూవీస్ హిట్ అయ్యాయి, అవుతున్నాయి. అదే టైంలో తెలుగులో ఇలా సంగీతంతో సినిమాని నిలబెట్టి, హిట్ చేసేవాళ్లు కరువయ్యారు!

తెలుగులో ప్రస్తుతం తమన్, దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. కానీ వీళ్లలో మొనాటనీ వచ్చేసింది. అంటే రొటీన్ రెగ్యులర్ మ్యూజిక్ కొడుతున్నారు గానీ కొత్తగా, మళ్లీ మళ్లీ వినాలనిపించేలా అయితే ఉండట్లేదు. 'ఎల్లమ్మ' చిత్రంలో హీరోగా చేస్తుండటంతో డీఎస్పీ జోరు కాస్త తగ్గింది. దీంతో చిరంజీవి, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలకు తమన్ దిక్కయ్యాడు. కొన్నేళ్లముందు వరకు తమన్ కూడా బ్యాంగర్స్ ఇచ్చి సినిమాల్ని హిట్ చేశాడు గానీ ఈ మధ్య ఎందుకనో పెద్దగా మెప్పించేలేకపోతున్నాడు. 'ఆదర్శ కుటుంబం' పాటలనే తీసుకుంటే తమన్‌పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. అదే టైంలో అనిరుధ్, సాయి అభ్యంకర్ నుంచి వస్తున్న ఒక్కో పాట తెగ వైరల్ అయిపోతున్నాయి.

ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తెలుగు సంగీత దర్శకులు ఎందుకో వెనకబడినట్లు అనిపిస్తుంది. తప్పంతా మ్యూజిక్ డైరెక్టర్స్‌దేనా లేదంటే దర్శకులు అందుకు తగ్గ సీన్స్ రాయలేకపోతున్నారా? వేరే ఆప్షన్ లేక ఉన్న సంగీత దర్శకులనే హీరోలు రికమెండ్ చేస్తున్నారా(చేయాల్సి వస్తోందా?) అనేది ఇక్కడ ‍అర్థం కాని ప్రశ్న. ఏదేమైనా ఈ విషయంలో తెలుగు హీరోలు, దర్శకనిర్మాతలు ఓసారి ఆలోచించుకని మారాల్సిన టైమ్ అయితే వచ్చింది!

(ఇదీ చదవండి: ఇదేం పైత్యం.. కాయదు ఎంగిలి చేసిన బాటిల్ రూ.3 లక్షలా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement