తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సిల్వర్ జూబ్లీ దిశగా ప్రయాణం కొనసాగిస్తున్నారు హీరో ప్రభాస్. ‘ఈశ్వర్’ (2002) సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ 24 ఏళ్లుగా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన తొలి చిత్రం ‘ఈశ్వర్’ 2002 నవంబరు 11న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ లెక్కన నవంబరులో తన కెరీర్‌లో 25 ఏళ్ల మైల్‌స్టోన్‌లోకి (సిల్వర్ జూబ్లీ) అడుగుపెడుతున్న ప్రభాస్... వరుస భారీ పాన్ ఇండియా మూవీస్‌తో బిజీ బిజీగా దూసుకెళుతుండటం విశేషం.
పాన్ ఇండియా స్టార్‌డమ్ దాటేసి, గ్లోబల్ స్థాయిలో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ప్రభాస్ పుట్టినరోజు నేడు (అక్టోబరు 23). ‘బాహుబలి’ (2015) సినిమాతో మొదలైన ప్రభాస్ పాన్ ఇండియా జర్నీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ స్టార్స్‌తో పోటీ పడేంతగా ఉత్తరాదిలోనూ వసూళ్లు సాధిస్తున్నాయి. ‘బాహుబలి 2, కల్కి 2898 ఏడీ’ సినిమాలతో రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రెండు సార్లు సాధించిన ఏకైక స్టార్ ప్రభాస్.
ఓవర్‌సీస్ మార్కెట్‌లో పది మిలియన్లకు పైగా వసూళ్లను సాధించిన తొలి హీరోగా రికార్డ్ సాధించారు. ఇక కెరీర్‌లో 25 ఏళ్ల మైల్‌స్టోన్‌ని టచ్ చేయనున్న ప్రభాస్ హీరోగా దూసుకెళుతున్నారు. ఇందుకు నిదర్శనం ఈ హీరో డైరీలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉండటమే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ 2’ వంటి భారీ సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు.


