స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక వివాహం (సెప్టెంబరు 11, 2006) జరిగి రెండు దశాబ్దాలు పూర్తయింది. ఈ సందర్భంగా ‘ది సీక్వెల్’ పేరుతో సూర్య, జ్యోతిక ఇటీవల మళ్లీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ‘ది సీక్వెల్’ వీడియోలు, ఫొటోలు, భావోద్వేగమైన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా వైరల్ అయ్యాయి. తన భర్త సూర్యను ఉద్దేశించి జ్యోతిక మాట్లాడిన మరో భావోద్వేగభరితమైన వీడియో తాజాగా బయటకు వచ్చింది.
‘‘నా చివరి క్షణాలను నీతోనే (సూర్యను ఉద్దేశించి...) గడపాలి. నువ్వు లేకుండా ఎలా నిద్రపోతానో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు నాకంటే ముందుగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతే, నేను నిన్ను వెతుక్కుంటూ అక్కడికే వస్తాను. ఎందుకంటే ఆ స్వర్గంలో కూడా నువ్వు నీ మాటలతో అందర్నీ బోర్ కొట్టిస్తావని నాకు తెలుసు (నవ్వుతూ). నీ ఒడిలోనే నేను నా తుది శ్వాసని వదలాలనుకుంటున్నాను’’ అని జ్యోతిక మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది.


