గుర్తుండిపొతుంది | Producer Naga Vamsi Superb Words About Daaku Maharaaj Movie | Sakshi
Sakshi News home page

గుర్తుండిపొతుంది

Published Wed, Dec 25 2024 12:04 AM | Last Updated on Wed, Dec 25 2024 12:04 AM

Producer Naga Vamsi Superb Words About Daaku Maharaaj Movie

‘‘డాకు మహారాజ్‌’ సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఊహించినదానికంటే బ్రహ్మాండమైన యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయి. అలాగే వినోదం, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. బాలకృష్ణగారి నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. మాస్, క్లాస్‌ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది’’ అని డైరెక్టర్‌ బాబీ కొల్లి చెప్పారు. బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్‌’.

ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి హీరోయిన్లుగా నటించగా, బాబీ డియోల్‌ కీలక పాత్ర చేశారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ –‘‘బాలకృష్ణగారి కెరీర్‌లో గుర్తుండిపొయే చిత్రాల్లో ఒకటిగా ‘డాకు మహారాజ్‌’ నిలుస్తుంది. జనవరి 2న హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుక, 4న అమెరికాలో ప్రీ రిలీజ్‌ వేడుక చేసి, ఒక పాట విడుదల చేయాలనుకుంటున్నాం. 8న ఏపీలో ప్రీ రిలీజ్‌ వేడుక ప్లాన్‌ చేస్తున్నాం’’ అని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement