ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్ | Drinker Sai Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT: చాన్నాళ్లకు ఓటీటీలో తెలుగు మూవీ సైలెంట్ స్ట్రీమింగ్

May 27 2026 2:35 PM | Updated on May 27 2026 2:45 PM

Drinker Sai Movie OTT Streaming Now

ప్రతివారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అలానే జెట్ లీ, కర, లీడర్, ఫేసెస్ అనే స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు కజిన్స్ అండ్ కల్యాణమ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్ లాంటి వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇప్పుడు ఇవలా ఉండగానే ఓ తెలుగు మూవీ చాన్నాళ్ల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది? పాక్‌తో ఈమెకు సంబంధమేంటి?)

ధర్మ మహేశ్, ఐశ్వర్య శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'డ్రింకర్ సాయి'. 2024 డిసెంబరు చివరి వారంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఘోరమైన డిజాస్టర్ అయింది. టీజర్, ట్రైలర్ లాంటివి పర్లేదనిపించినప్పటికీ.. అసలు సంగతి తేలిపోయింది. ఇప్పుడీ చిత్రం దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు జీ5 ఓటీటీలోకి వచ్చేసింది.

'డ్రింకర్ సాయి' విషయానికొస్తే.. తల్లిదండ్రులు కట్టించిన ఆస్పత్రి నుంచి వచ్చే డబ్బులతో సాయి(ధర్మ).. జల్సా చేస్తూ ముఖ్యంగా రోజంతా తాగుతూ ఓ ముగ్గురు ఫ్రెండ్స్‌ని వెనకేసుకుని ఎంజాయ్ చేస్తుంటాడు. తనకు యాక్సిడెంట్ చేసిన భాగి(ఐశ్వర్య శర్మ)ని ఇష్టపడి ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. భాగికి సాయి అంటే ఏ మాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ ఎక్కడ వయలెంట్ అయిపోతాడో అనే భయంతో ప్రేమని భరిస్తూ ఉంటుంది. ఈ బలవంతపు ప్రేమగాథ ఎక్కడివరకు సాగింది? చివరకు భాగి.. సాయిని మార్చుకోగలిగిందా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement