తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో తొమ్మిదోవారం ఎలిమినేషన్‌కు సమయం ఆసన్నమైంది. ఈసారి భరణి, తనూజ, సుమన్, రాము, సాయి శ్రీనివాస్, సంజన, కల్యాణ్ నామినేషన్స్‌లో ఉన్నారు. ఎప్పటిలాగే తనూజ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెను ఓటింగ్‌లో అగ్రస్థానలో నిలబెడుతూనే వస్తోంది. రెండో స్థానంలో కామన్ మ్యాన్ కల్యాణ్ దూసుకెళ్తున్నాడు. సుమన్ చిన్నగా నవ్వినా, ఒక్క కన్నీటి బొట్టు రాల్చినా సరే.. ఓట్లు దానంతటదే వస్తాయి.
చివర్లో వాళ్లిద్దరు
అలా అతడికి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. సంజన ఎలిమినేషన్ గండానికి కాస్త దూరంలోనే ఉంది. భరణికి ఆమె కంటే తక్కువ ఓట్లే పడుతున్నాయి. చివర్లో రాము (Ramu Rathod), సాయి శ్రీనివాస్ మిగిలారు. ఇద్దరికీ చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి. వైల్డ్‌కార్డ్‌గా వచ్చిన సాయికి తానేంటో నిరూపించుకునే టాస్క్ ఒక్కటికూడా పడలేదు. కానీ, నామినేషన్స్‌లో బాగానే మాట్లాడాడు. ఓట్లు పడాలంటే ఇది సరిపోదు.
వెళ్లిపోవడానికి రెడీ?
కనీసం కెప్టెన్సీ కంటెండర్ టాస్కులో అయినా ఇరగదీద్దాం అనుకుంటే దివ్య, రీతూ.. అతడికి ఆ ఛాన్సు రాకుండా, లేకుండా చేశారు. ఫలితంగా అతడి మెడపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. ఇక రాము విషయానికి వస్తే.. ఎప్పుడు వెళ్లిపోదామా? అని చూస్తున్నాడు. ప్రతి గేమ్‌లో తనంతట తానే పక్కకు తప్పుకుంటున్నాడు. ఆటలో గెలుపోటములు సహజం.. కానీ, ఆడటం కూడా ఇష్టం లేదన్నట్లుగా పక్కకెళ్లి కూర్చుంటున్నాడు. అన్నింట్లోనూ గివప్ ఇచ్చేస్తున్నాడు. ఇల్లు గుర్తొస్తుందంటూ చాలాసార్లు ఒంటరిగా ఒక్కడే కూర్చుంటున్నాడు. చాలా డల్ అయిపోయాడు.
రామును ఎలిమినేట్ చేస్తే బెటర్!
ఆరెంజ్ టీమ్‌లో అందరూ సేఫ్ బ్యాడ్జ్ కోసం పోట్లాడుతుంటే నాకూ కావాలని మాటవరసకైనా అనలేదు. నాకొద్దని సింపుల్‌గా తేల్చేశాడు. కనీసం కెప్టెన్సీ కంటెండర్ అవుతాననీ వాదించలేదు. తనే స్వయంగా వదిలేసుకున్నాడు. తనకేదీ అవసరమే లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అతడి వాలకం చూసి జనాలకు సైతం చిరాకొస్తోంది. ఇంత హోమ్ సిక్ అయితే రామును పంపించేయండి నాగార్జునగారూ అని కామెంట్లు చేస్తున్నారు. ఇతడికి ఓట్లేసి కాపాడే బదులు ఏదో ఒకటి చేయాలని తాపత్రయం చూపిస్తున్న సాయిని హౌస్‌లో ఉంచితే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి!


