
బిగ్‌బాస్ 9 (Bigg Boss Telugu 9) నుంచి ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీశ్.. వరుసగా షోకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు ఐదో వికెట్ కోసం నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. కెప్టెన్ రాము మినహా అందరూ నామినేట్ అయినట్లు ప్రకటించాడు. కానీ ఇక్కడే ఓ అవకాశం కల్పించాడు. ఇమ్యూనిటీ దక్కించుకుని ఈ గండం గట్టెక్కవచ్చని తెలిపాడు.

బలమున్నోడిదే గెలుపు
అందుకోసం ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఓ పెద్ద బెడ్‌ను గార్డెన్ ఏరియాలో పెట్టాడు. నామినేట్ అయినవాళ్లంతా ఆ బెడ్ ఎక్కి.. ఒక్కొక్కరిని కిందకు తోసేస్తూ ఉండాలి. బెడ్‌పై చివరివరకు ఉన్నవారికి ఇమ్యూనిటీ అందుతుంది. మొదట అందరూ కలిసి ఫ్లోరాను, తర్వాత సంజనాను తోసేసినట్లు తెలుస్తోంది. సుమన్, డిమాన్ పవన్‌ను కూడా తోసేశారు. దివ్యను తీసేయడానికి వస్తుంటే ఆమె తిరగబడింది. ఏ కారణంతో తీసేస్తున్నారని నిలదీసింది. ఎవరికీ ఏం పాయింట్ లేదని ఇమ్మాన్యుయేల్ కూల్‌గా ఆన్సరిచ్చాడు.

నిలదీసిన దివ్య
దాంతో దివ్యకు మరింత తిక్కరేగింది. ఈ రౌండ్‌లో నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు, మీ ఫ్రెండ్‌షిప్పులు పోతాయి, మీ బాండ్లు పోతాయి.. అని ఆవేశంతో ఊగిపోయింది. దీంతో శ్రీజ.. ధైర్యం, దమ్ము అనే పదాలు అనవసరంగా వాడుతున్నావని కౌంటరిచ్చింది. భరణి అన్న నిన్ను తోసేయడానికి రాలేదు.. అంటే స్నేహం కోసం ఆగిపోయాడా? అని నిలదీసింది. అలా గొడవలు, తోసుకోవడాలతోనే ఈ గేమ్ కొనసాగింది. ప్రస్తుతానికైతే ఫ్లోరా, సుమన్, డిమాన్ పవన్, సంజనా, తనూజ, రీతూ చౌదరి, దివ్య నిఖిత నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఇది ఐదో నెల సీమంతం.. మళ్లీ గ్రాండ్‌గా జరుపుకుంటా!: శివజ్యోతి