
బిగ్‌బాస్ ఫేమ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శివజ్యోతి (Shiva Jyothi) త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. వచ్చే ఏడాది తన పొత్తిళ్లలోకి పండంటి బిడ్డ రానుందని ఈ మధ్యే ప్రెగ్నెన్సీ వార్తను షేర్ చేసింది. పెళ్లయిన పదేళ్లకు తల్లి కాబోతుండటంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా శివజ్యోతి సీమంతం జరిగింది. మా ఇద్దరి హృదయాలు ఓ చిన్ని గుండెచప్పుడి కోసం ఎదురుచూస్తున్నాయంటూ ఐదో నెల సీమంతం ఫోటోలను షేర్ చేసింది.
మీరు లేకుండా ఎలా?
ఇది చూసిన చాలామంది మమ్మల్ని ఎందుకు పిలవలేదు అక్కా? అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో శివజ్యోతి.. ఇది ఊర్లో జరిగిన వేడుక అని.. 7 లేదా 9వ నెలలో మళ్లీ ఘనంగా సీమంతం వేడుకలు జరుపుకుందామని చెప్పుకొచ్చింది. మీరు నాకు చాలా ఇంపార్టెంట్, నా బిడ్డ కోసం మీరంతా ఎదురుచూశారు. మీరు లేకుండా నా సీమంతం ఎలా జరుగుతుంది? అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. అంటే మరోసారి ఈ వేడుకను మరింత గ్రాండ్‌గా జరుపుకోనుందన్నమాట!
ఎవరీ శివజ్యోతి?
శివజ్యోతి.. తీన్మార్ వార్తలతో సావిత్రిగా గుర్తింపు పొందింది. తెలంగాణ యాసలో గలగలా మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అక్కడినుంచి బిగ్‌బాస్ మూడో సీజన్‌లో అడుగుపెట్టి పాపులారిటీ దక్కించుకుంది. ఈ షోలో టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షో తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిపోయింది. యూట్యూబ్ వీడియోలు చేస్తూ షోలలో పాల్గొంటూ బాగానే సంపాదించింది. తన ఊరికి చెందిన గంగూలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
చదవండి: రచయిత కోన వెంకట్ కూతురి రిసెప్షన్.. హాజరైన చిరంజీవి