కేఎస్‌ఆర్‌ లైవ్‌ షోలో కృష్ణంరాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: సాక్షి టీవీ | Sakshi Statement On Journalist Krishnam Raju Comments On Amaravati | Sakshi
Sakshi News home page

కేఎస్‌ఆర్‌ లైవ్‌ షోలో కృష్ణంరాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: సాక్షి టీవీ

Jun 7 2025 7:42 PM | Updated on Jun 7 2025 8:46 PM

Sakshi Statement On Journalist Krishnam Raju Comments On Amaravati

హైదరాబాద్‌: శుక్రవారం నాటి కేఎస్‌ఆర్‌ లైవ్‌ షోలో విశ్లేషకుడు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని సాక్షి టీవీ పేర్కొంది. కృష్ణంరాజు వ్యాఖ్యలను కూటమి నేతలు సాక్షి  టీవీకి ఆపాందించడం సరికాదని తీవ్రంగా ఖండించింది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలు చూపుతుందని.. సీనియర్‌ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను.. సాక్షి మీడియా ఎంత మాత్రం సమర్ధించదని సాక్షి టీవీ స్పష్టం చేసింది.

ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు: కృష్ణంరాజు
ఇదిలా ఉండగా, కృష్ణంరాజు కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైన కించపరిచి ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కృష్ణంరాజు అన్నారు.
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement