AP: 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల | Election Schedule Released On 23 Urban Bodies In AP | Sakshi
Sakshi News home page

AP: 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

Nov 12 2026 1:04 PM | Updated on Nov 12 2026 1:13 PM

Election Schedule Released On 23 Urban Bodies In AP

సాక్షి, విజయవాడ: ఏపీలో మిగిలిన మున్సిపల్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠ విడుదల చేశారు.

శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, మంగళగిరి కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికలకు సంబంధించి ఈనెల 14 నుంచి 16వ తేదీవ వరకు నామినేషన్ల స్వీకరణ. ఈనెల 17న నామినేషన్ల పరిశీలన, 19 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు విధించారు. ఈనెల 16న పోలింగ్‌, 30వ తేదీన లెక్కింపు జరగనుంది. కాగా, కోర్టు కేసుల కారణంగా తొలి విడతలో నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగని విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: సర్పంచ్‌ సీటుకు డిమాండ్‌.. ఎకరం పొలం.. 50 లక్షలు..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement