పాశమైలారం ఘటన.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan Shocked Over Patancheru Pashamylaram Reactor Explosion Incident, More Details Inside | Sakshi
Sakshi News home page

పాశమైలారం ఘటన.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Jun 30 2025 4:32 PM | Updated on Jun 30 2025 4:56 PM

Ys Jagan Shocked Over Pashamylaram Reactor Explosion

సాక్షి, తాడేపల్లి: సంగారెడ్డి జిల్లా పాశమైలారం రియాక్టర్‌ పేలుడు ఘటనలో పలువురు మృతి చెందడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగటం  అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్న వైఎస్‌ జగన్‌.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

పటాన్‌చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలింది. పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌, మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ సహా చాలా భాగం దెబ్బతింది. ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. షిఫ్ట్‌లో 150 మంది కార్మికులు ఉండగా.. ప్రమాదం జరిగిన బ్లాక్‌లోనే 90 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. మృతుల సంఖ్య 14కి చేరింది. కంపెనీ మేనేజర్‌ ఒకరు సైతం మృతి చెందినట్లు సమాచారం.

 

 

Advertisement
 
Advertisement
Advertisement