రేపు అందెశ్రీ అంత్యక్రియలు.. హాజరుకానున్న సీఎం రేవంత్‌ | Politicians And celebrities Condolences To Ande Sri | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

రేపు అందెశ్రీ అంత్యక్రియలు.. హాజరుకానున్న సీఎం రేవంత్‌

రేపు అంత్యక్రియలకు సీఎం రేవంత్‌రెడ్డి

  • ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • రేపు ఘట్కేసర్ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో అందెశ్రీ అంత్యక్రియలు
  • అంత్యక్రియలకు హాజరై అందెశ్రీ పార్దీవ దేహానికి నివాళులు అర్పించనున్న సీఎం రేవంత్‌
  • అందెశ్రీ ఆప్తులు, అభిమానులతో కలిసి అంతిమ యాత్రలో పాల్గొననున్న సీఎం రేవంత్‌
2025-11-10 15:52:52

అందెశ్రీ పార్థివదేహానికి కొనసాగుతున్న నివాళులు

  • లాలాపేట మున్సిపల్ గ్రౌండ్‌లో అందెశ్రీ భౌతికకాయం
  • నివాళులర్పిస్తున్న అభిమానులు, ప్రముఖులు
2025-11-10 13:59:08

మంత్రి దామోదర నివాళులు..

  • సహజ కవి అందెశ్రీకి మంత్రి దామోదర నివాళులు..
  • లాలాపేట మున్సిపల్ గ్రౌండ్‌లో అందెశ్రీ భౌతికకాయం
  • నివాళులర్పించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.
     
2025-11-10 13:59:08

ఎంపీ ఈటల నివాళులు..

  • అందెశ్రీ భౌతికకాయానికి నివాళులు అర్పించిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్.
  • వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.



 

2025-11-10 13:59:08

రేపు మధ్యాహ్నం అందెశ్రీ అంత్యక్రియలు..

  • ప్రజల సందర్శనార్ధం లాలాగూడ GHMC ఆచార్య జయశంకర్ గ్రౌండ్స్‌లో అందెశ్రీ భౌతిక కాయం.
  • ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఘట్‌కేసర్‌లో నిర్మాణంలో ఉన్న తన సొంత ఇంటికి తరలిస్తారు.
  • రేవు మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.
2025-11-10 13:33:20

కేటీఆర్‌, హరీష్‌ రావు నివాళి..

  • అందెశ్రీకి మాజీ మంత్రి కేటీఆర్‌, హరీష్ రావు, జగదీష్‌ రెడ్డి నివాళులు.
  • లాలాగూడ మున్సిపల్ స్టేడియంలో దివంగత కవి అందెశ్రీ గారి పార్థివ దేహాన్ని సందర్శించారు.
  • ఈ సందర్భంగా అందెశ్రీ గారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
2025-11-10 12:35:44

కిషన్‌ రెడ్డి, కవిత నివాళులు

  • లాలాపేట..
  • లాలాపేట మున్సిపల్ గ్రౌండ్‌లో అందెశ్రీ భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు
  • నివాళి అర్పించిన కల్వకుంట్ల కవిత.
  • నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
  • మధ్యాహ్నం లాలాపేటలోని అందెశ్రీ నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి..
  • అందెశ్రీకి నివాళులు అర్పించనున్న సీఎం
     
2025-11-10 11:41:09

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్భ్రాంతి

  • అందెశ్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కోమటిరెడ్డి
  • అందెశ్రీ నాకు అత్యంత ఆప్తుడు..
  • ఆయన అకాల మరణం వ్యక్తిగతంగా నన్ను తీవ్రంగా కలచివేసింది.
  • "జయ జయహే తెలంగాణ" జాతిని జాగృతం చేయడంలో వారి కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
  • అందెశ్రీ మరణం‌ యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటు.
  • తీవ్ర విషాదంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
  • అందెశ్రీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.
  •  
2025-11-10 10:43:14

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి..

  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర  దిగ్భ్రాంతి..
  • తెలంగాణ ఆవిర్భావానికి ఆయన రచనలు ఆత్మ వంటివి.
  • ప్రతీ తెలంగాణవాది రక్తంలో ఉత్సాహాన్ని, ఆవేశాన్ని, ఆత్మగౌరవాన్ని నింపాయి.
  • ప్రజల మనసు నుండి ఉద్భవించిన సాహిత్య ధారలు అందెశ్రీ గీతాలు, రచనలు..  
  • తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించాయి.
  • ప్రజల జీవన గాథలకు శాశ్వత స్వరాలునిచ్చాయి.
  • వారి కలం సామాజిక న్యాయం, సమానత్వం, స్వాభిమానం కోసం తుపాకీలా పనిచేసింది.
  • తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో అందెశ్రీ కృషి అపూర్వం.
  • తన కవిత్వం ద్వారా దళితులు, అట్టడుగు వర్గాల కష్టాల్ని గళమెత్తి ప్రపంచానికి వినిపించారు.
  • అందెశ్రీ లాంటి ప్రజాకవినీ కోల్పోవడం  తెలంగాణ  సాహిత్య ప్రపంచానికి  తీరని లోటు.
  • ఆయన కలం ఆగిపోయినా, ఆయన ఆలోచనలు తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెలో  ఎప్పుడు పదిలం.
  • దళిత ఆత్మగౌరవ ఉద్యమాలకు అందెశ్రీ రచనలు  శాశ్వత ప్రేరణగా నిలుస్తాయి.
  • అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. 
     
2025-11-10 10:37:05

అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

  • అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు
  • అందెశ్రీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్​ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేశారు.
2025-11-10 09:21:00

టీపీసీసీ చీఫ్‌ సంతాపం...

  • టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం..
  • అందెశ్రీ మరణం తెలంగాణకు తీరాని లోటు..
  • ఆయన ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. .
  • తెలంగాణ సాహితి దిగ్గజాన్ని కోల్పోయాము..
  • ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటు..
  • అందెశ్రీ పాట జయ జయహే తెలంగాణ పాట  తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలోపేతం చేసింది.
  • రాష్ట్ర అవతారంలో  ఆయన పాత్ర చాలా కీలకమైంది.
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
  • ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి..
2025-11-10 09:19:25

మంత్రి శ్రీధర్ బాబు సంతాపం

  • అందెశ్రీ హఠాన్మరణం పట్ల శ్రీధర్ బాబు తీవ్ర దిగ్బ్రాంతి
  • తెలంగాణ సమాజానికి, సాహితీ లోకానికి ఇది ఎప్పటికీ పూడ్చలేని లోటు
  • మలిదశ ఉద్యమ కెరటమై, రాష్ట్ర సాధన ఆకాంక్షను కోట్లాది ప్రజల గుండెల్లో బలంగా నిలిపిన చారిత్రక గీతాన్ని అందించిన అందెశ్రీ
  • ఆయన కలం నుండి జాలువారిన ప్రతి పదం, తెలంగాణ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.
  • ఆయన సాహితీ సంపద, జయ జయహే తెలంగాణ గీతం ఉన్నంత వరకు "అందెశ్రీ" మన గుండెల్లో చిరస్మరణీయులు.
  • పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
2025-11-10 09:19:25

హరీష్‌ రావు దిగ్భ్రాంతి..

  • హరీష్‌ రావు దిగ్భ్రాంతి..
  • ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ గారి అకాల మరణం బాధాకరం.
  • అందెశ్రీ గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం.
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
     
2025-11-10 09:04:45

కేసీఆర్ సంతాపం.

  • అందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం.
  • అందెశ్రీ అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్ ..
  • ఆయన మరణం పట్ల విచారం తెలుపుతూ తన సంతాపం ప్రకటించారు.
  • తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో, కవిగా తన పాటలతో,
  • సాహిత్యంతో, కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు.
  • ఉద్యమ కాలంలో అందెశ్రీ తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
  • అందెశ్రీ మరణంతో శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
  • దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.
     
2025-11-10 09:03:40

సీఎం రేవంత్‌ సంతాపం

  • అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.
  • తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు.
  • తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచింది. 
  • అందె శ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.  
  • ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నాం.
  • అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
  • తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ.. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
  • స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు.
  • అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు‌.
2025-11-10 09:00:21
Advertisement
 
Advertisement
Advertisement