పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 200 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న వేళ.. ఆసక్తికర పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం.. కాంగ్రెస్ కంటే ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం గమనార్హం.
సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం హవా
బిహార్‌లో ఎంఐఎం 25 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో ఎక్కువ భాగం సీమాంచల్ జిల్లా నియోజకవర్గాల్లోని అరరియా, కటిహార్, కిషన్‌గంజ్, పూర్నియా జిల్లాలు ఉన్నాయి. మొత్తం 24 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ ప్రాంతం ముస్లిం జనాభా అధికంగా ఉండటంతో ఏఐఎంఐఎం ఇక్కడ తన బలాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.
కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
ఎంఐఎం అభ్యర్థులు చేసిన విస్తృత ప్రచారం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. ఫలితంగా జేడీయూకి ఆధిక్యం లభించింది. సాయంత్రం 6.30గంటల సమయానికి ఎంఐఎం నాలుగు స్థానాల్లో గెలుపొందగా ఒక స్థానంలో లీడింగ్‌లో ఉంది.
ఓటు శాతం
ఆర్జేడీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఓటింగ్ శాతం23గా ఉంది. కాగా ఇది 2024 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన 22.6% కంటే స్వల్పంగా పెరిగింది. కాంగ్రెస్ ఓటు శాతం 9.4% (2024 లోక్‌సభ) నుంచి 7.9% (2025 అసెంబ్లీ)కి పడిపోయింది. మహాఘట్‌బంధన్ మొత్తం ఓటు శాతం 36.9%, ఇది గత ఎన్నికల 40.1% కంటే 3 శాతం తగ్గింది. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) వంటి చిన్న పార్టీల ఓటు శాతం కూడా గణనీయంగా తగ్గింది.
#WATCH हैदराबाद, तेलंगाना: AIMIM अध्यक्ष असदुद्दीन औवेसी ने कहा, "मैं बिहार की जनता का धन्यवाद करूंगा कि उन्होंने AIMIM के उम्मीदवारों को जिताया... बिहार में जो नतीजा है वह आवामी नतीजा है। हम उसे स्वीकार करते हैं। हमारी पार्टी की ओर से कोशिश होगी कि बिहार के साथ-साथ सीमांचल में… pic.twitter.com/AL6shpQeyk
— ANI_HindiNews (@AHindinews) November 14, 2025


