breaking news
Bihar Election Results 2025
-
డిప్యూటీ సీఎం పోస్ట్.. చిరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తాను దురాశపరుడిని కాదంటున్నారు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్. ఎన్డీఏ కూటమికి ఎల్లప్పుడూ విధేయుడిగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి తమకు దక్కకపోవడం పట్ల ఎలాంటి విచారం లేదన్నారాయన. డిప్యూటీ సీఎం పదవి ఎల్జేపీకి రాకపోవడంపై పట్నాలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, జేడీయూ నుంచి విజయ్ కుమార్ సిన్హాలను ఉప ముఖ్యమంత్రులుగా నియమించిన సంగతి తెలిసిందే.బిహార్ ప్రభుత్వంలో తమకు దక్కిన దానితో సంతోషంగా ఉన్నానని, తనకు దురాశ లేదని చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) అన్నారు. తనపై విశ్వాసం ఉంచి శాసనసభ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసే అవకాశం తమ పార్టీకి ఇచ్చారని గుర్తుచేశారు. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో తమ పార్టీకి రెండు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారని తెలిపారు. ఇంతకంటే ఎక్కువ ఆశించడం దురాశ అవుతుందని వ్యాఖ్యానించారు.దురాశపరుడిని కాదు''ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశిస్తే నా కంటే కృతఘ్నడు, దురాశాపరుడు ఎవరు ఉండరు. మా పార్టీకి ఎన్డీఏ ఇంత చేసిన తర్వాత కూడా నేను బాధ పడుతూ ఉంటే.. సంతోషాన్ని ఎలా ఆస్వాదించాలో నాకు తెలియదన్నట్టుగా ఉంటుంద''ని చిరాగ్ పేర్కొన్నారు.విశ్వాసపాత్రుడిగా ఉంటాకష్టకాలంలో తన వెంటే నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి విశ్వాసపాత్రుడిగా ఉంటానని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ''నేను ఎక్కడి నుండి వచ్చానో మీరు ఆలోచించాలి. 2021లో నా చుట్టూ ఒక్క వ్యక్తి కూడా లేడు. మా పార్టీ చీలిపోయింది. ప్రధానమంత్రి నాపై నమ్మకం ఉంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీకి ఐదు సీట్లు ఇచ్చారు. వారి నమ్మకం కారణంగానే నేను మళ్లీ పుంజుకున్నాను. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాన''ని చెప్పారు.ఓడిపోయే సీట్లు ఇచ్చారు.. అయినా గెలిచాంబిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే స్థానాలను ఎల్జేపీకి కట్టబెట్టారనే కామెంట్స్‌పై చిరాగ్ స్పందిస్తూ.. అది నిజమేనని అంగీకరించారు. తమ పార్టీకి చెందిన 29 మంది అభ్యర్థుల్లో 26 మంది ఓడిపోయే స్థానాల్లో పోటీ చేశారన్నది ముమ్మాటికీ వాస్తమని పేర్కొన్నారు. అయితే తమ పార్టీ అంచనాలను తలకిందులు చేసి 19 సీట్లు గెలిచిందని తెలిపారు.చదవండి: బిహార్ కేబినెట్లో బిగ్ సర్ప్రైజ్!తమ పార్టీ తరపున ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) ఆశిస్తున్నట్టు ఎన్నికలకు ముందు చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, జేడీయూకు తిరుగులేని ఆధిక్యం లభించడంతో చిరాగ్ డిమాండ్ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇచ్చిన రెండు మంత్రి పదవులతో ఆయన సరిపెట్టుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బిహార్ కేబినెట్లో బిగ్ సర్ప్రైజ్!
పట్నా: ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నితీశ్ కుమార్ ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఎన్నిక కాని యువకుడితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఫార్మల్ షర్ట్, జీన్స్ పాంట్ ధరించిన యువకుడు మంత్రిగా ప్రమాణం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ యువకుడు ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అతడి పేరు దీపక్ ప్రకాశ్ (Deepak Prakash). రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కుమారుడు. విదేశాల్లో చదువుకుని వచ్చిన అతడికి అనూహ్యంగా మంత్రి పదవి దక్కడం చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలల్లో అతడు చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఆయనను ఆర్ఎల్ఎం తరపున ఎమ్మెల్సీని చేస్తారని సమాచారం.చక్రం తిప్పిన ఉపేంద్ర ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించింది. ఉపేంద్ర కుష్వాహా (Upendra Kushwaha) సతీమణి స్నేహలత.. ససారాం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నితీశ్ కుమార్ కేబినెట్లో ఆర్ఎల్ఎంకు దక్కే ఒక్క పదవి ఆమెకే కట్టబెడతారని ప్రచారం కూడా జరిగింది. అయితే తన వారసుడి రాజకీయ అరంగ్రేటం చేయిండానికి ఇదే సరైన సమయమని భావించిన ఉపేంద్ర సేఫ్ గేమ్ ఆడారు. తన కొడుకు దీపక్‌కు నేరుగా కేబినెట్ పదవి దక్కేలా చక్రం తిప్పారు. తన రాజకీయ వారసత్వం కొనసాగేలా దీర్ఘకాల వ్యూహంతో కుమారుడిని అనూహ్యంగా తెరపైకి తెచ్చారు. సామాజిక సమీకరణాలు కూడా దీపక్‌కు కలిసివచ్చాయి.చివరి నిమిషంలో తెలిసిందిమంత్రి పదవి గురించి తనకు కూడా చివరి నిమిషంలో తెలిసిందని దీపక్ తెలిపారు. "నాకు తెలిసినంతవరకు.. మా నాన్న, పార్టీ ముఖ్య నాయకుల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్దిసేపటి ముందే నాకు తెలిసి.. ఆశ్చర్యానికి లోనయ్యానని మీడియాతో చెప్పారు. యువత, మహిళల కోసం పనిచేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని ప్రమాణ స్వీకారం తర్వాత అన్నారు. పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అయితే నితీశ్ కుమార్, అమిత్ షా సానుకూలంగా లేకపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అతడికి మంత్రి దక్కిందన్న ఊహాగానాలు వచ్చాయి.బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన 36 ఏళ్ల దీపక్ ఇప్పటివరకు క్రియాశీలక రాజకీయాల్లో లేరు. ససారాం నియోజకవర్గంలో తన తల్లి తరపున ప్రచారం చేసి వెలుగులోకి వచ్చారు. దీపక్ భార్య సాక్షి మిశ్రా (Sakshi Mishra) కూడా అత్తగారి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2007లో పాట్నాలో పాఠశాల విద్యను పూర్తి చేసిన దీపక్ 2011లో మణిపూర్‌లోని MIT నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. 2011 నుంచి 2013 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విదేశాల్లో పనిచేసిశారు. 2019 నుంచి రాజకీయాల్లో తల్లిదండ్రులకు సాయంగా ఉంటూ వచ్చారు. దీపక్ తాత రామ్ నరేష్ కుష్వాహా ఎమ్మెల్యేగా పనిచేశారు. నానమ్మ మునేశ్వరి దేవి సామాజిక కార్యకర్త.చదవండి: లాలూ ఫ్యామిలీలో చిచ్చు.. ఎవరీ సంజయ్, రమీజ్?కేబినెట్లో వారసులకు చోటు కల్పించడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీపక్ ప్రకాశ్‌తో పాటు హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) వ్యవస్థాపకుడు జితన్ రాం మాంఝీ తనయుడు సంతోష్ కుమార్ సుమన్ (Santosh Kumar Suman) కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
ఇండియా కూటమికి టాటా చెప్పే యోచనలో..
తీవ్ర సంక్షోభం దిశగా ఇండియా కూటమి రాజకీయం నడుస్తోంది. బిహార్ ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీ వైఖరేనంటూ ప్రధాన మిత్రపక్షాలు వెలేత్తి చూపిస్తున్నాయి. ప్రధానంగా ఆ పార్టీ వ్యూహాలను, నాయకత్వ లోపాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటిదాకా అంతర్గతంగా ఉన్న అసంతృప్తిని ఆ ఒక్క ఫలితం ఇప్పుడు విమర్శల రూపంలో బహిరంగ సంక్షోభంగా మార్చింది. కూటమిలోనే కొనసాగాలా? స్వతంత్ర మార్గం ఎంచుకోవాలా?.. అనే డైలామాలో ఇండియా కూటమి పార్టీలను పడేసింది. బిహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాల్లో అలిగిన జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM).. స్వతంత్రంగా కూడా పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయింది. కూటమి పెద్దన్న తమను మోసం చేసిందని.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఓపెన్‌గా కాంగ్రెస్‌పైనే ఆరోపణలు గుప్పించింది. తమను జూనియర్ పార్ట్నర్లా అవమానకర రీతిలో చూస్తున్న కూటమిలో కొనసాగాలా.. వద్దా? అనేది త్వరలో నిర్ణయిస్తామని ప్రకటించింది కూడా.మరో ఇండియా కూటమి పార్టీ.. శివసేన (UBT) బీహార్ ఫలితాన్ని ‘‘వేకప్ కాల్’’గా అభివర్ణించింది. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమిష్టి వ్యూహం దెబ్బతిందని ఆరోపించింది. మిత్రపక్షాలతో జాతీయ పార్టీ సంప్రదింపులు లేకుండా ముందుకు వెళితే కూటమి నిలవదని హెచ్చరిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేశ్ యాదవ్ బీహార్ ఎన్నికల్లో మిత్రపక్ష కూటమి వ్యవహరించిన తీరు నుంచి లోపాల్ని ఎత్తిచూపారు. ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. భవిష్యత్తులో ఇలాంటి జోక్యాలు జరగకుండా చూసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్‌కు హితవు పలికారు. ఈ క్రమంలో ఇండియా కూటమి బాధ్యతల నుంచి కాంగ్రెస్ తప్పుకుని.. ఆ బాధ్యతల్ని అఖిలేష్‌కు అప్పగించాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ది మరో పంథా. కూటమిలో మొదటి నుంచి ఆ పార్టీ స్వతంత్ర ధోరణి అవలంభిస్తోంది. రాష్ట్ర స్థాయి విస్తరణను జాతీయ వేదిక కోసం త్యాగం చేయలేమని ఇప్పటికే స్పష్టం చేసింది. అంతెందుకు బీహార్‌లో స్వతంత్రంగా పోటీ చేసిన ఆప్ నిర్ణయం ఓ ముందస్తు హెచ్చరిక అని.. ఈ స్వతంత్ర ధోరణి ఇతర మిత్రపక్షాలకు కూడా ఆదర్శంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎంకే ఏమందంటే.. బిహార్‌లో ఎన్డీయే విజయం కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి ఓ పాఠం అని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అన్నారు. కూటమి వ్యూహం, నాయకత్వం, సమన్వయంపై పునరాలోచన అవసరమని సూచించారు.అబ్బే.. అలాంటిదేం లేదుబిహార్లో బలహీన ప్రదర్శనతో కాంగ్రెస్ పైనే విమర్శలు ఎక్కువగా వినవస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కార్నర్ చేస్తూ ప్రత్యర్థులూ సెటైర్లు సంధిస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక, సంస్థాగత విధానాల్లో మార్పులు చేయకపోతే కూటమి నిలవబోదంటూ మిత్రపక్షాలు హెచ్చరిస్తున్నాయి. అయితే కూటమి భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ భిన్నంగా స్పందించింది. మిత్రపక్షాలు నిష్క్రమించే యోచనలో ఉన్నాయన్న ప్రచారాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కొట్టిపారేశారు. ‘‘ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది. ఏ ఓటమి కూడా కూటమిని ప్రభావితం చేయలేదు. తమిళనాడు ఎన్నికలకు డీఎంకేతో.. అసోం ఎన్నికల కోసం అక్కడి మిత్రపక్షాలతో వెళ్లబోతున్నాం. రాబోయే రోజుల్లో కూటమిని మరింత బలోపేతం చేస్తాం. ప్రాంతీయ పార్టీలతో చిన్న చిన్న సమస్యలున్నా.. జాతీయ స్థాయిలో బీజేపీ రాజకీయాలను ఎదుర్కోవడానికి మిత్రపక్షాలతో కలిసి పనిచేసి తీరతాం’’ అని ప్రకటించారాయన. అలా అయితే కష్టమే!ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు ఆచితూచి ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిత్రపక్షాల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు తక్షణ సంప్రదింపులు జరపాలని, సీట్ల పంపకాల విషయంలోనూ జాగ్రత్తగా కాంగ్రెస్‌కు సూచిస్తున్నారు. నాయకత్వ లోపాలను సవరించుకోకపోతే.. మార్పును కోరుకునే గళాలు రాబోయే రోజుల్లో పెరగొచ్చని, అది కూటమి విచ్ఛిన్నానికి దారి తీయక తప్పదని హెచ్చరిస్తున్నారు. -
ఎవరీ సంజయ్, రమీజ్?
'వాళ్లే నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశారు. దారుణంగా అవమానించి పుట్టించి నుంచి వెళ్లగొట్టారు' అంటూ తేజస్వీ యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్‌లపై లాలూ ప్రసాద్ రెండో కుమార్తె రోహిణీ ఆచార్య తీవ్ర ఆరోపణలు చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా కారణం వారేనని ప్రకటించారు. లాలూ కుటుంబంలో చిచ్చు రేగడానికి కారణమైన సంజయ్ యాదవ్, రమీజ్ ఎవరు, ఎక్కడి వారు, వారి బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటిదో తెలుసుకునేందుకు నెటిజనులు ఆన్లైన్లో శోధిస్తున్నారు.ఎవరీ సంజయ్ యాదవ్?సంజయ్ యాదవ్ (Sanjay Yadav) ఆర్జేడీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. తేజస్వీ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన రాజకీయ సలహాదారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాన్ని రూపొందించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆర్జేడీ పార్టీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం హరియాణాకు చెందిన సంజయ్ 2010లో తొలిసారిగా తేజస్వీని కలిశాడు. 2012లో దాణా కుంభకోణంలో లాలూపై అభియోగాలు మోపిన సమయంలో.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఒక కార్యక్రమంలో తేజస్వీకి సంజయ్‌ను పరిచయం చేశారు. అప్పటి నుంచి వారి బంధం కొనసాగుతోంది. ఢిల్లీలో ఉద్యోగం వదిలేసి పట్నాకు వచ్చేశారు. మొదట్లో ఆర్జేడీ సోషల్ మీడియా వ్యవహారాలు చూసేవారు.ఆర్జేడీలో తేజస్వీ యాదవ్ బలం పెరగడంతో సంజయ్ కూడా త్వరగా ఎదిగాడు. ఆయనకు రాజకీయ వ్యూహకర్తగా, సలహాదారుగా ఉంటూ పార్టీలో కీలకంగా మారారు. గతేడాది ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడాన్ని లాలూ పెద్ద కుమార్తె, పాటలీపుత్ర ఎంపీ మీసా భారతి (Misa Bharti) తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టిక్కెట్లు అమ్ముకున్నారని ఆర్జేడీ మదన్ షా తీవ్రమైన ఆరోపణలు చేశారు. సంజయ్‌ను తేజస్వీ గుడ్డిగా నమ్మారని వాపోయారు. కాగా, సీనియర్ నేతలకు, తేజస్వీకి మధ్య గ్యాప్ పెంచారన్న ఆరోపణలు కూడా సంజయ్‌పై పార్టీ వర్గాల్లో బలంగా ఉంది.ఎవరీ రమీజ్?రోహిణీ ఆచార్య ప్రస్తావించిన రమీజ్ నేమత్ ఖాన (Rameez Nemat Khan).. తేజస్వీ యాదవ్‌కు చిరకాల స్నేహితుడు. వీరిద్దరినీ క్రికెట్ కలిపింది. ఇద్దరు కలిసి ఢిల్లీ, జార్ఖండ్‌లో క్రికెట్ ఆడారు. 2008-09 మధ్య కాలంలో జార్ఖండ్ అండర్ 22 జట్టుకు రమీజ్ కెప్టెన్‌గా వ్యవరించాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం తర్వాత బలపడింది. దీంతో 2016లో అధికారికంగా రమీజ్ ఆర్జేడీలో చేరాడు. తేజస్వీ యాదవ్ వ్యక్తిగత సోషల్ మీడియాను నిర్వహించడంతో సహా పలు కీలక బాధ్యతలు చేపట్టాడు.చదవండి: లాలూ ఫ్యామిలీ.. ఎందుకిలా?39 ఏళ్ల రమీజ్ ఉత్తరప్రదేశ్‌లోన బలరాంపూర్ ప్రాంతానికి చెందిన వారు. అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్ అల్లుడు. రమీజ్ భార్య జెబా రిజ్వాన్ తులసీపూర్ అసెంబ్లీ స్థానం నుండి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. మొదట కాంగ్రెస్ అభ్యర్థిగా, తరువాత జైలులో ఉన్నప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తులసీపూర్ నగర పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ ఫిరోజ్ పప్పు హత్య కేసులో రిజ్వాన్ జహీర్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇదే కేసులో రమీజ్, జెబా కూడా 2022లో అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్‌పై వీరిద్దరూ విడుదలయ్యారు. -
మంత్రి పదవులకు ‘ఫార్ములా’
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకున్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. నూతన మంత్రివర్గం కూర్పుపై బీజేపీ, జేడీ(యూ)తోపాటు కూటమి పక్షాల మధ్య తొలి దశ చర్చలు ఇప్పటికే ముగిశాయి. మంత్రి పదవుల పంపకంపై ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఒక ఫార్ములాపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున తీసుకోవడమే ఈ ఫార్ములా సారాంశం. ఈ లెక్కన ఎన్నికల్లో బీజేపీ 89 సీట్లు సాధించింది కాబట్టి ఫార్ములా ప్రకారం ఆ పారీ్టకి 14 మంత్రి పదవులు లభిస్తాయి. జనతాదళ్(యునైటెడ్)కు సైతం ఇదే సూత్రానికి అనుగుణంగా మంత్రి పదవులు కేటాయిస్తారు. ఎలాంటి గందరగోళానికి, వివాదానికి తావులేకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీయే పక్షాలు నిర్ణయానికి వచ్చాయి. ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించాలన్న దానిపై మరోసారి చర్చించబోతున్నారు ఢిల్లీలో నేడు కీలక సమావేశం జేడీ(యూ) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్ ఝా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు పూర్తి చేసుకొని ఆదివారం పట్నాకు తిరిగివచ్చారు. ఆయన సోమవారం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలుసుకోబోతున్నారు. జేడీ (యూ) శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటుపై చర్చిస్తారు. సోమవారమే ఈ సమావేశం జరుగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో ఎన్డీయే పక్ష నాయకుడిని ఎన్నుకొనే ప్రక్రియను ఈ నెల 18వ తేదీలోగా పూర్తిగా చేయాలని నిర్ణయానికొచ్చారు. ఎన్డీయేలోని చిన్న పారీ్టలు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నాయి. హిందుస్తానీ అవామీ మోర్చా నాయకుడు జితన్‌రామ్ మాంఝీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతోపాటు బీజేపీ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. రా్రïÙ్టయ లోక్‌మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. లోక్‌జనశక్తి పార్టీ(రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ సైతం బీజేపీ అధిష్టానంతో చర్చలకు సిద్ధమయ్యారు. మంత్రి పదవుల పంపకం విషయంలో ఎన్డీయే పక్షాల మధ్య కీలక భేటీ సోమవారం జరగనున్నట్లు సమాచారం. నేడు బిహార్ కేబినెట్ భేటీ బిహార్ 18వ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను ఎన్నికల సంఘం బిహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు సమరి్పంచింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వరలో సోమవారం కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రస్తుత 17వ శాసనసభను రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదిస్తారు. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకొని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమరి్పస్తారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్డీయే ప్రకటిస్తుంది. తమను ఆహా్వనించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తుంది. తదుపరి ముఖ్యమంత్రి నితీశ్ కుమారే? బిహార్ నూతన సీఎంతోపాటు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం కోసం పట్నాలోని గాంధీ మైదాన్‌లో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నెల 19 లేదా 20వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని ఎన్డీయే వర్గాలు వెల్లడించాయి. మోదీ షెడ్యూల్‌ను బట్టి తేదీని ఖరారు చేస్తామని తెలిపాయి. బిహార్ సర్కార్ ప్రమాణ స్వీకారానికి మోదీపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తదుపరి ముఖ్యమంత్రి నితీశ్ ప్రమా ణ స్వీకారం చేస్తారని జేడీ(యూ) నేతలు స్పష్టంచేస్తున్నారు. మరోవైపు కొత్త సీఎం ఎవరన్నదానిపై ఊహాగానాలకు ఇంకా తెరపడలేదు. నితీశ్ కుమార్‌కు మరోసారి అవకాశం ఇస్తారా? లేక బీజేపీ నాయకుడే సీఎం అవుతారా? అనేది అతి త్వరలో తేలిపోనుంది. 18 మంది మంత్రుల ప్రమాణం? సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో ముఖ్యమంత్రితోపాటు 18 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో మొత్తం నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరికి మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే పార్టీ నుంచి రాంకృపాల్ యాదవ్, మంగళ్ పాండే కూడా రేసులో ఉన్నారు. లోక్ జనశక్తి(రామ్‌విలాస్), రా్రïÙ్టయ లోక్‌మోర్చా కూడా బిహార్ కేబినెట్లో చేరబోతున్నాయి. ఈసారి మంత్రివర్గంలో 30 నుంచి 32 మంది ఉండవచ్చని తెలుస్తోంది. జేడీ(యూ), బీజేపీల నుంచి సమాన సంఖ్యలో మంత్రులు కానున్నారు. చిరాగ్ పాశ్వాన్ పారీ్టకి మూడు మంత్రి పదవులు, జితన్‌రామ్ మాంఝీ, ఉపేంద్ర కుషా్వహా పార్టీల నుంచి ఒక్కొక్కరికి చోటుదక్కే అవకాశం ఉంది. మొత్తం 36 మంది మంత్రులు ఉండవచ్చు. -
డర్టీ కిడ్నీ అంటూ దూషించారు.. చెప్పుతో కొట్టబోయారు
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో కలహాలు మరింతగా రచ్చకెక్కాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన నేపథ్యంలో లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య శనివారం పుట్టింటితో తెగదెంపులు చేసుకుంటున్నట్లు, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం తెల్సిందే. మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి కూడా అయిన తేజస్వీ యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్లే తన నిర్ణయా నికి కారణమని ఆమె ఆరోపించారు. ఆదివారం ఆమె మరోసారి సామాజిక మాధ్యమ వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టారు. పుట్టింట్లో తనను నానాదుర్భాషలాడారని, ఇంట్లోంచి బయటకు నెట్టివేయడంతోపాటు చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారని రోహిణీ ఆచార్య సంచలన ఆరోపణలు చేశారు. ‘నిన్న ఒక సోదరి, ఒక వివాహిత, ఒక తల్లికి అవమానం జరిగింది. నానా దుర్భాషలాడారు. మురికిదాన్నంటూ తిట్టారు. చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు. ఆత్మ గౌరవం విష యంలో రాజీప డబోను’అని ఆమె తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తల్లిదండ్రులను, తోబుట్టువులను వదిలేసి బయటకు వచ్చేశా. పుట్టింటి నుంచి నన్ను వాళ్లు దూరం చేశారు. నన్ను అనాథను చేశారు’అంటూ ఆమె ఉద్విగ్నంతో పోస్ట్ చేశారు. ‘నాన్న లాలూకు కిడ్నీ ఇవ్వాలని చెప్పారు. ఇచ్చాను. అయితే, బదులుగా నేను కోట్లాది రూపాయలు డబ్బులతోపాటు, లోక్‌సభ టికెట్ తీసుకున్నట్లు ప్రచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన లాంటి కుమార్తె, సోదరి మరెవరికీ ఉండరని, తాను నడిచిన బాటలో మరెవరూ నడవలేరని రోహిణి పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘నాకు కుటుంబమంటూ లేదు. తేజస్వీ యాదవ్, సంజయ్ యాదవ్, రమీజ్‌ల గురించి మీరడగొచ్చు. వాళ్లే నన్ను నా కుటుంబం నుంచి వేరు చేశారు. వాళ్లు బాధ్యతలు స్వీకరించేందుకు ఇష్టపడటం లేదు. బిహార్లోఅంత ఘోరమైన ఫలితాలు రావడానికి కారణమెవరని దేశ ప్రజలే అడుగుతున్నారు. అందుకు కారణం సంజయ్ యాదవ్, రమీజ్ అంటూ పేర్లు వెల్లడించడంతో వాళ్లు నన్ను అవమానించారు, దూషించారు. పుట్టింటి నుంచి వెళ్లగొట్టారు’అని ఆమె ఆరోపించారు.ఆమె బాటలో మరో ముగ్గురురోహిణీ ఆచార్య సంచలన ప్రకటన, నిర్ణయం నేపథ్యంలో ఆదివారం లాలూ కుటుంబంలో విభేదాలు మరింతగా ముదిరినట్లు సమాచారం. లాలు కుమార్తెలు రాజ్యలక్ష్మి, రాగిణి, చందా అనే వారు కూడా పట్నాలోని నివాసాన్ని వీడి తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి వెళ్లిపోయారు. రెండు రోజులుగా కుటుంబంలో జరుగుతున్న పరిణామాలతో వారు కలత చెందినట్లు చెబుతున్నారు. కాగా, ఈ పరిణామాలపై లాలూ కుటుంబం స్పందించలేదు. ఈ వివాదమంతా తేజస్వీయాదవ్ కేంద్రంగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించడం లేదు. దీంతో, లాలూ దంపతులతోపాటు ఆ ఇంట్లో మిసా భారతి మాత్రమే ఉన్నట్లు సమాచారం.నా గుండె బద్దలైంది: తేజ్ ç్ర³తాప్రోహిణీ ఆచార్య ఆరోపణల నేపథ్యంలో మరో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. పార్టీతోపాటు కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన రోహిణి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తన సొంత పార్టీ జనశక్తి జనతాదళ్ సోషల్ మీడియా అకౌంట్లో ఆయన..‘నా గుండె ముక్కలైంది. నాపై ఎన్ని దాడులు జరిగినా ఓర్చుకున్నా. కానీ, నా సోదరికి జరిగిన అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. సోదరి రోహిణికి జరిగిన అన్యాయానికి తగు రీతిలో బదులు తీర్చుకుంటానన్నారు. ‘నాన్నా, మీరు సరేనని ఒక్క మాట అంటే చాలు.. బిహార్ ప్రజలు ఈ కుట్ర దారులను పాతిపెడతారు. ఇది ఒక కుమార్తె మర్యాదకు, బిహార్ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం’అని తేజ్ ప్రతాప్ వ్యాఖ్యానించారు. లాలూ, రబ్డీ దేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖుల్లో అతిపెద్ద కుటుంబం లాలూదే. -
అనైతికత,అంకగణితం.. ఊడపొడిచింది ఏంటి..?
-
బిహార్ నూతన ప్రభుత్వంలో చేరుతాం
పట్నా: బిహార్‌లో కొత్తగా ఏర్పాటయ్యే ప్ర భుత్వంలో తామూ చేరాలనుకుంటున్నట్లు లోక్ జనశక్తి పార్టీ(రాం విలాస్) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. ముఖ్య మంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగాలని తా ను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసిన 28 సీట్లలో 19 చోట్ల విజయం సాధించింది. శనివారం చిరాగ్ పట్నాలో తన పార్టీ నూతన ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తామంతా సీఎం నితీశ్‌ను కలిసి ఘన విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపామన్నారు. అదేవిధంగా, నూతన ప్రభుత్వంలో తాము కూడా చేరుతామని చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఎవరనేది శాసనసభ్యులే నిర్ణయిస్తారన్నారు. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగాలని వ్యక్తిగతంగా భావి స్తున్నానన్నారు. నితీశ్ సారథ్యంలోని జేడీ యూకు బీజేపీ కంటే నాలుగు తక్కువగా 85 సీట్లు దక్కాయి. 2020 ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమి పక్షమైన బీజేపీ కంటే తక్కువ సీట్లే లభించాయి. నితీశ్ తనకు విభేదాలున్నట్లు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. శాసనసభలో ఒక్క సీటు కూడా తమకు లేకున్నా 29 స్థానాలను కేటాయించిన తమ కూటమి కేంద్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
జంగిల్‌రాజ్ భయంతో మా ఓటర్లు ఎన్డీయేకి ఓటేశారు: ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ఎన్డీయే గెలుపుపై తనదైన విశ్లేషణ చేశారు. ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠ్ బంధన్ అధికారంలోకి వచ్చిన పక్షంలో జంగిల్ రాజ్ మళ్లీ వస్తుందనే భయంతో తమ పార్టీ ఓటర్లు కొందరు ఎన్డీయే పక్షాల అభ్యర్థులకు ఓటు వేశారని వివరించారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో సీమాంచల్ ప్రాంతంలోని ఓట్లన్నీ ఒకే పక్షానికి గంపగుత్తగా పడ్డాయని ఆ పార్టీ నేత ఉదయ్ సింగ్ చెప్పారు. వీరిద్దరూ శనివారం పట్నాలో మీడియాతో మాట్లాడారు. జంగిల్ రాజ్ ఉందని తాను చెప్పలేనన్న ప్రశాంత్ కిశోర్..తమ పార్టీ ఓటర్లు మాత్రం ఆ భయం వల్లే ఎన్డీయేకు ఓటేశార న్నారు. కాంగ్రెస్‌తోగానీ, మహాగఠ్ బంధన్‌లోని ఏ ఇతర పార్టీతోనూ లేని ఇబ్బంది ఆర్జేడీతో ఉన్నట్లుగా ప్రజలు భావించారని తెలిపారు. ముస్లిం వర్గం తమను ఇంకా పూర్తిగా నమ్మలే దంటూ ఆయన..దీర్ఘకాలంలో వారి మద్దతుల భిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ నుంచి ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను ఎన్డీయే ప్రభుత్వం వెదజల్లిందన్నారు. ప్రపంచబ్యాంకు నుంచి రుణంగా తెచ్చిన రూ.14 వేల కోట్లను సైతం ఉచితాల మళ్లించారని ఆరోపించారు. -
ఆట, పాట గెలిచాయి
చాంపియన్ స్పోర్ట్ షూటర్ శ్రేయసి సింగ్, స్టార్ సింగర్ మైథిలీ ఠాకూర్లు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కొత్తలో.... ‘ఆడినంత సులువు కాదు’ ‘పాడినంత సులువు కాదు’ అన్నారు విమర్శకులు. అయితే ఈ ఇద్దరూ ఆడినంత తేలిగ్గానే, పాడినంత సులువుగానే బిహార్ తాజా ఎన్నికలలో విజయం సాధించారు. భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన ఈ యువ మహిళా నాయకుల గురించి...ఈసారి కూడా గురి తప్పలేదు!బిహార్ లోని జముయి నియోజక వర్గం నుంచి శాసనసభ్యురాలిగా గెలిచిన శ్రేయసి సింగ్ ఒకప్పుడు చాంపియన్ స్పోర్ట్ షూటర్. శాసనసభ్యురాలిగా ఇది ఆమె రెండో విజయం. బిహార్ జముయి జిల్లాలోని గిదౌర్కు చెందిన శ్రేయసి సింగ్‌కు ఘనమైన క్రీడా, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. తాత సెరేందర్‌సింగ్, తండ్రి దిగ్విజయ్ సింగ్ ఇద్దరూ ‘నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’కు అధ్యక్షులుగా పనిచేశారు. తండ్రి కూడా రాజకీయాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. తల్లి పుతుల్ కుమారి మాజీ ఎంపీ.దిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీలో చదువుకున్న శ్రేయసి ఫరిదాబాద్‌లోని మానవ్ రచనా ఇంటర్నేషల్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి షూటింగ్ చూస్తూ పెరగడం వల్ల సహజంగానే ఆ క్రీడపై ఆమెకు ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తికి నైపుణ్యం తోడు కావడంతో షూటింగ్లో గురి తప్పకుండా దూసుకుపోయింది. 61వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో బిహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ బంగారు పతకాన్ని గెలుచుకుంది.చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన శ్రేయసి సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరి 2020 బిహార్ శాసన సభ ఎన్నికల్లో జముయి నియోజక వర్గం నుంచి గెలిచింది. యువత, మహిళ ఓటర్లను ఆకర్షించగల చరిష్మా, కుటుంబ రాజకీయ నేపథ్యం వల్ల బీజేపీ శ్రేయసీకి సీటు ఇచ్చింది. పురుషాధిపత్యం కనిపించే బిహార్ రాజకీయ రణక్షేత్రంలో నిలదొక్కుకోవడం, విజయం సాధించడం అంత తేలికైన విషయమేమీ కాదు. అయితే క్షేత్రస్థాయి నుంచి బిహార్ రాజకీయాలపై లోతైన అవగాహన ఉన్న శ్రేయసి ఎప్పుడూ తడబడలేదు. వెనకబడిన రాష్ట్రమైన బిహార్‌లో మహిళల రాజకీయ భాగస్వామ్యానికి శ్రేయసి సింగ్ రోల్‌మోడల్‌గా మారింది. స్త్రీ విద్య, ఉపాధి కోసం రాజకీయ వేదికగా క్రియాశీలంగా పనిచేస్తోంది.చారిత్రక విజయ గీతం‘సంగీతంలో పుట్టింది. సంగీతంతో పెరి గింది’ అనే మాట మైథిలి ఠాకూర్‌కు సరిపోతుంది. బాల్యం నుంచి ఆమెకు శాస్త్రీయ, జానపద సంగీతంతో అనుబంధం ఉంది. ‘లిటిల్ చాంప్స్’ ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ లాంటి రియాలిటీ షోల ద్వారా చిన్న వయసులోనే సెలబ్రిటీగా మారింది. ‘జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్’ పోటీలో విజేతగా నిలిచింది. తొలి ఆల్బమ్ ‘యా రబ్బా’తో సంగీత అభిమానుల ప్రశంసలు అందుకుంది. మరుసటి సంవత్సరం ‘రైజింగ్ స్టార్’లో రన్నరప్‌గా నిలిచింది.ఆలీనగర్ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థిగా ఆర్జేడీ అభ్యర్థిపై విజయం సాధించిన మైథిలీ ఠాకూర్ బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సీటును గెల్చుకోవడం బీజేపికి ఇది మొదటిసారి. దీనిని చారిత్రక విజయంగా చెప్పుకోవచ్చు. బిహార్ అసెంబ్లీకి ఎంపికైన అతి పిన్న వయస్కురాలైన శాసనసభ్యురాలిగా సంచలనం సృష్టించి దేశమంతటి దృష్టిని ఆకర్షిస్తోంది 25 సంవత్సరాల మైథిలీ ఠాకూర్. ఎన్నికల ప్రచార యాత్రలలో జానపద, భక్తిగీతాలు ఆలపిస్తూ జనాలను ఆకట్టుకుంది. ఇతరుల కంటే భిన్నంగా సామాజిక సంస్కరణకు, సాంస్కృతిక పునర్జీవనాన్ని మిళితం చేసి తనదైన ఎజెండాను రూపొందించింది ఠాకూర్. మిథిల చిత్రకళను పాఠశాలల్లో పాఠ్యేతర అంశం (ఎక్స్ట్రా–కరికులర్ కంపోనెంట్)గా ప్రవేశపెడతామని, బాలికల కోసం బలమైన విద్యాకార్యక్రమాలు, స్థానిక యువత కోసం ఉపాధి–కేంద్రీకృత కార్యక్రమాలు, మిథిల చిత్రకళ సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించింది మైథిలీ ఠాకూర్. -
ఓట్లు వచ్చినా సీట్లు రాలే!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) కూటమి ఘోరంగా పరాజయం పాలయ్యింది. మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విపక్ష కూటమి తరఫున అంతా తానై వ్యవహరించారు. రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించారు. ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. తేజస్వీ సభలకు జనం పోటెత్తారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ నీడ నుంచి ఆయన బయటకు వచ్చినట్లే కనిపించింది. ఎన్నికల్లో కష్టపడి పనిచేసినప్పటికీ ఓటమి తప్పకపోవడం ఆర్జేడీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను పొత్తులో భాగంగా 143 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 స్థానాలు గెల్చుకుంది. అయితే, మిగతా పార్టీల కంటే ఆర్జేడీకే అత్యధికంగా ఓట్లు రావడం గమనార్హం. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీకి ఏకంగా 23 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ, జేడీ(యూ)లకు ఇన్ని ఓట్లు రాలేదు. ఓట్ల శాతం పరంగా చూస్తే ఏకైక అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. ఆ పార్టీ 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు గెల్చుకొని, 23.11 శాతం ఓట్లు దక్కించుకుంది. అంటే ఈసారి సీట్ల సంఖ్య తగ్గినా, ఓట్ల శాతం స్వల్పంగా మాత్రమే తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఆర్జేడీ పట్ల జనాదరణలో మార్పు రాలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తేజస్వీ యాదవ్ పార్టీకి 1.15 కోట్ల ఓట్లు ఆర్జేడీ ఓట్ల పరంగా కరోడ్‌పతిగా నిలిచింది. ఈ ఎన్నికల్లో 1,15,46,055 ఓట్లు సాధించింది. 101 సీట్లలో పోటీ చేసి, 89 సీట్లు కైవసం చేసుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి దక్కిన ఓట్లు కేవలం 20.08 శాతం. 2020లో 19.46 శాతం ఓట్లు లభించగా, ఈసారి స్వల్పంగా పెరిగాయి. బీజేపీకి మొత్తం 1,00,81,143 ఓట్లు దక్కాయి. బీజేపీ మిత్రపక్షం, సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యునైటెడ్) 101 సీట్లలో పోటీ చేసి, 85 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఆ పార్టీకి 19.25 శాతం ఓట్లు(96,67,118) వచ్చాయి. 2020లో 15.39 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 3.86 శాతం పెరిగాయి. నితీశ్ కుమార్ ప్రజా వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓట్ల శాతాన్ని మెరుగుపర్చుకోవడం విశేషం. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(రామ్‌విలాస్), హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలకు వచ్చిన ఓట్లు కూడా కలిపితే జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)కు దక్కిన మొత్తం ఓట్లు దాదాపు 47 శాతం. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠ్‌బంధన్‌కు దక్కిన మొత్తం ఓట్లు 35.89 శాతం. రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 11.11 శాతంగా తెలుస్తోంది. ఎక్కువ సీట్లలో పోటీ చేయడం వల్లే.. ఆర్జేడీ ఓట్ల శాతం భారీగా ఉన్నప్పటికీ సీట్లు పెరగలేదు. ఎన్నికల్లో ఒక పార్టీ లేదా ఒక అభ్యర్థికి మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయో ఓట్ల శాతాన్ని బట్టి నిర్ధారించవచ్చు. ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడానికి ఓట్ల శాతం తోడ్పడుతుంది. ఆర్జేడీ పాలన జంగిల్‌రాజ్ అంటూ ప్రత్యర్థులు పదేపదే నిందలు వేసినప్పటికీ ఆ పార్టీ పట్ల ప్రజాభిమానం చెక్కుచెదరలేదు. ఆర్జేడీ తాను పోటీ చేసిన చాలా నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చింది. ఆ పార్టీ ఓట్ల శాతం మెరుగ్గా కనిపించడానికి మరో కారణం కూడా చెప్పుకోవచ్చు. 143 స్థానాల్లో ఆర్జేడీ బరిలోకి దిగింది. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇన్ని స్థానాల్లో పోటీ చేయలేదు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన బీజేపీ 101, జేడీ(యూ) 101 సీట్లలో పోటీకి దిగా యి. బీజేపీ కంటే 42, జేడీ(యూ) కంటే 42 ఎక్కు వ సీట్లలో ఆర్జేడీ పోటీ చేసింది. ఎక్కువ సీట్లలో పోటీపడింది కాబట్టే ఎక్కువ ఓట్లశాతం కనిపిస్తోందని, ఇందులో ఆర్జేడీ కొత్తగా బలం చాటింది ఏమీ లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. గెలిచిన, ఓడిపోయిన నియోజకవర్గాల్లో పార్టీకి పోలైన మొత్తం ఓట్లను కలిపితే ఆర్జేడీకి 23 శాతం ఓట్లు పడినట్లు చెబుతున్నారు. ఆర్జేడీకి 2010 ఎన్నికల్లో 22 సీట్లు లభించాయి. ఆ తర్వాత అతి తక్కువ సీట్లు దక్కింది మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజకీయాలకు గుడ్‌బై!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య ప్రకటించారు. అంతేకాదు, తమ కుటుంబంతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు కూడా ఆమె స్పష్టం చేశారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలవడం తెల్సిందే. ఈ నేపథ్యంలో రోహిణి చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘నా సోదరుడు తేజస్వీ యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్ ఆలం సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. తప్పంతా నాపైనే వేసుకుంటున్నా’అని ఆమె శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. వృత్తిరీత్యా వైద్యురాలైన రోహిణి, లాలు సారథ్యంలోని ఆర్జేడీలో గతంలో క్రియాశీలకంగా ఉన్నారు. जनसेवा एक अनवरत प्रक्रिया है, एक अंतहीन यात्रा है!इसमें उतार चढ़ाव आना तय है। हार में विषाद नहीं, जीत में अहंकार नहीं!राष्ट्रीय जनता दल गरीबों की पार्टी है, गरीबों के बीच उनकी आवाज़ बुलंद करते रहेगी!@yadavtejashwi @laluprasadrjd— Rashtriya Janata Dal (@RJDforIndia) November 15, 2025లాలూ తనయ అయిన రోహిణి ఆచార్య డాక్టర్ కూడా. తన భర్త, పిల్లలతో సింగపూర్‌లో ఆమె స్థిరపడ్డారు. 2022లో తండ్రి లాలూకి తన కిడ్నీ దానం చేయడం ద్వారా అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆ సమయంలో అదంతా డ్రామా అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయితే దానిని నిరూపించాలంటూ విమర్శకులకు ఆమె ఘాటు కౌంటర్ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె సరన్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఓడారు.ఆ ఓటమి తర్వాత కూడా ఆమె రాజకీయంగా క్రియాశీలకంగానే వ్యవహరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగపూర్ నుంచి వచ్చి మరీ ఆమె సోదరుడు తేజస్వీ యాదవ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హర్యానాకు చెందిన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్‌తో ఆమెకు విబేధాలు మొదలయ్యాయి. తన సోదరుడిని, తనను సైతం పక్కన పెడుతూ పార్టీ వ్యవహారాల్లో సంజయ్ అతిజోక్యం చేసుకోవడాన్ని ఆమె భరించలేకపోయారు. ఓటర్ అధికార్ యాత్రలోనూ సంజయ్ వ్యవహార శైలిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆ సమయంలో తేజస్వి సోదరికి మద్ధతుగా నిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని సరన్ నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందే ఈమె ఎక్స్‌లో తండ్రి లాలూ, సోదరుడు తేజస్వీ యాదవ్‌లను అన్‌ఫాలో చేశారు. మరో సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడంతోపాటు, కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు లాలూ ప్రకటించడం తెల్సిందే. భార్యతో విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగా ఓ మహిళతో అతడు సంబంధం నడుపుతుండటం లాలూకు నచ్చలేదు. అయితే, ఈ నిర్ణయంపై రోహిణి అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో సొంతంగా పార్టీ ప్రకటించిన తేజ్ ప్రతాప్.. పార్టీ అభ్యర్థులను కూడా బరిలోకి దించారు. కానీ, స్వయంగా ఓటమి పాలైన తేజ్ ప్రతాప్, ఏ ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయారు. ఈ పరిణామాల నడుమ శనివారం ఆమె ఈ మేరకు ఎక్స్‌లో పోస్టులు పెట్టినట్లుగా భావిస్తున్నారు. కుటుంబంలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కినట్లుగా చెబుతున్నారు. తండ్రి లాలూకు రోహిణి 2022లో తన కిడ్నీని దానం చేశారు. రోహిణి వాస్తవానికి కిడ్నీ దానం చేయలేదనే పుకార్లు, ఆరోపణలే ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నట్లు చెబుతున్నారు. -
ఘోర పరాభవంపై ఆర్జేడీ ఫస్ట్ రియాక్షన్
పట్నా: బిహార్ ఘోర ఎన్నికల ఘోర పరాభవంపై రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ స్పందించింది. రాజకీయ ప్రయాణంలో ఓటమి అనేది ఒక భాగమేనని.. అలాగే ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియగా అభివర్ణించింది.‘‘ప్రజాసేవ అనేది అంతం లేని ప్రయాణం. ఇందులో ఆటుపోట్లు.. ఎత్తుపల్లాలు సహజం. విజయం దక్కిందని అహంకారం ఉండదు. అలాగే.. ఓటమితో కుంగిపోం. రాష్ట్రీయ జనతా దళ్ అనేది పేదల పార్టీ. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. పేదల మధ్య వారి గొంతును ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది’’ అని ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన తనయుడు తేజస్వి యాదవ్ పేరిట సోషల్ మీడియాలో ఆ పార్టీ ఓ పోస్ట్ చేసింది.जनसेवा एक अनवरत प्रक्रिया है, एक अंतहीन यात्रा है!इसमें उतार चढ़ाव आना तय है। हार में विषाद नहीं, जीत में अहंकार नहीं!राष्ट्रीय जनता दल गरीबों की पार्टी है, गरीबों के बीच उनकी आवाज़ बुलंद करते रहेगी!@yadavtejashwi @laluprasadrjd— Rashtriya Janata Dal (@RJDforIndia) November 15, 2025బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 202 సీట్లతో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరలించగా.. మిత్రపక్షం జేడీయూ రెండో స్థానంలో నిలిచింది. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ 19 స్థానాలు నెగ్గి.. అత్యధిక స్ట్రయిక్ రేట్ సాధించిన పార్టీగా నిలిచింది. ఇక.. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమిలోని ఆర్జేడీ (RJD) 143 స్థానాల్లో పోటీ చేసి కేవలం 25 సీట్లు సాధించింది. గత ఎన్నికల్లో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ.. ఈ ఎన్నికల్లో 25 స్థానాలకు పడిపోవడం గమనార్హం. 2010 తర్వాత ఆ పార్టీకి ఘోర పరాభవం ఇదే. మిత్రపక్షం కాంగ్రెస్ సైతం 61 స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది(గత ఎన్నికల్లో 19 స్థానాలు నెగ్గింది). మహా కూటమిలో గేమ్ చేంజర్ అవుతుందని భావించిన వీఐపీ పార్టీ 0 స్థానాలతో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. సీపీఐ, సీపీఎం వామపక్షాలు 3 స్థానాలు దక్కించుకున్నాయి. మొత్తంగా విపక్ష కూటమి 34 స్థానాలను మాత్రమే పరిమితమైంది. -
నితీష్ కు షాక్.. బీహార్ లో బీజేపీ సీఎం
-
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
-
బిహార్‌లో కాంగ్రెస్ కనుమరుగు!!
న్యూఢిల్లీ: సరిగ్గా 40 ఏళ్ల క్రితం బిహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100కుపైగా స్థానాల్లో విజయపతాక ఎగరేసింది. శుక్రవారం వెలువడిన ఎన్నికల్లో కేవలం ఆరు చోట్ల గెలిచింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 1952 ఎన్నికల్లో 41.38 శాతం ఓట్లను ఒడిసిపట్టిన కాంగ్రెస్ ప్రభ 1990వ దశకం నుంచి తగ్గుతూ వస్తోంది. ఈసారి 50కిపైగా స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్.. అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎం, జితన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎం)ల స్థాయికి పడిపోయింది. ఎంఐఎం, హెచ్ఏఎంలు చెరో 5 చోట్ల గెలిచాయి. 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు షేరు కాస్తంత పెరిగింది. 2010లో పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు 8.17 శాతం ఓట్లు పడితే ఈసారి కాస్తంత ఎక్కువగా 8.75 శాతం ఓట్లు పడ్డాయి. తిరుగుబాటు నేతలను దారి తెచ్చుకోవడం, కీలక నేతల మధ్య సమన్వయం పెంచడం, ఓడిన స్థానాల్లో తిరిగి పట్టుసాధించి విజయం సాధించే క్రమంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమవుతోంది. 1985లో వందకుపైగా సీట్లు గెలిచిన పార్టీ తర్వాత 1990లో కేవలం 71 స్థానాలకు పరిమితమైంది. అప్పటి నుంచి గెలుపు కోత మొదలైంది. 1995లో 29 చోట్ల, 2000లో 23 చోట్ల గెలిచింది. ఇక 2005లో పదంటే పది చోట్ల విజయం సాధించింది. శుక్రవారం ఫలితాలను చూస్తే హెచ్ఏఎం(సెక్యులర్) నేత చేతిలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌కుమార్ సైతం ఓడిపోయారు. ‘కుటుంబ’నియోజకవర్గంలో హెచ్ఏఎం అభ్యర్థి లలన్‌రామ్ .. రాజేశ్ కంటే 21,525 ఓట్లు ఎక్కువ సాధించారు. రాహుల్‌గాంధీ తలకెత్తుకున్న ఓటు చోరీ నినాదం బిహార్‌లో ఏమాత్రం పనిచేయలేదు. రాహల్ చేసిన ఓటర్ అధికార్ యాత్ర, ఓటర్లజాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై విమర్శలు, ప్రజాస్వామ్యాన్ని జెన్ జెడ్ యువతరం కాపాడాలన్న పిలుపులకు ఓటర్ల నుంచి ఎలాంటి స్పందనాలేదు. గతంతో పోలిస్తే బిహార్‌లో మౌలికవసతుల అభివృద్ధి వేగంగా జరగడంతో ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గుచూపడంతో కాంగ్రెస్ ఓటమి రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఆర్జేడీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యరి్థని నిలపలేకపోవడం, ఉన్న కొన్ని ఓట్లను కొత్తగా వచ్చిన జనసురాజ్ పార్టీ చీల్చడంతో మరికొన్ని స్థానాలు కాంగ్రెస్ చేతుల్లోంచి జారిపోయాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం విప్లవాత్మకంగా సంస్థాగత సంస్కరణలకు తెగించకపోతే అధికారాలను కోల్పోయే పరంపర కొనసాగుతుందని రాజకీయ పండితులు విశ్లేíÙంచారు. -
బిహార్ To జూబ్లీ.. ఫలితాలు ఇస్తున్న మెసేజ్ ఇదే..!
-
అందర్నీ గెలిపించి.. స్వరాష్ట్రంలో చతికిలపడి..
పట్నా: ఢిల్లీ, ప శ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఇలా పలు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలను సునాయాసంగా గెలుపుబాటలో నడిపించి అధికార పీఠాలపై కూర్చోబెట్టిన ఒకప్పటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ తీరా స్వరాష్ట్రం బిహార్‌లో సొంతంగా పార్టీ పెట్టి కూడా కనీసం ఒక్క స్థానంలో గెలవలేక ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఇలాంటి ఫలితాలను ముందే ఊహించిన ప్రశాంత్ ఇటీవల ఈ అంశంపై మాట్లాడటం విశేషం. ‘‘గెలిస్తే మహా ప్రభంజనం సృష్టిస్తాం. ఎవ్వరూ ఊహించనన్ని సీట్లు గెల్చుకుంటా. లేదంటే అత్యంత ఘోరంగా ఓడిపోతాం’’అని అన్నారు. రెండో మాట అచ్చంగా శుక్రవారం నిజమైంది. ఆయన స్థాపించిన జన సురాజ్ పార్టీ మొత్తం 243 స్థానాల్లో పోటీచేసి కనీసం ఒక్కచోట కూడా గెలుపుబోణీ కొట్టలేకపోయింది. చాలా చోట్ల పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. పాదయాత్రతో మొదలెట్టి.. 2022 అక్టోబర్ రెండో తేదీన చంపారన్‌లో ప్రశాంత్ పాదయాత్ర మొదలెట్టి వందల కిలోమీటర్లు నడిచారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సమస్యలు అడిగి తెల్సుకున్నారు. సమస్యలను తీర్చుతానని హామీ ఇచ్చారు. ఛాయ్ పే చర్చా అంటూ ప్రధాని మోదీకి కొత్త నినాదం ఇచి్చన ప్రశాంత్ తదనంతర కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్, ప శ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, బిహార్‌లో నితీశ్ కుమార్, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేలకు ఎన్నికల వ్యూహకర్తగా ఉండి ఆయా రాష్ట్రాల్లో వాళ్ల పార్టీలను గెలిపించారు. అదే వ్యూహంతో బిహార్‌లోనూ ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ అనూహ్యంగా చతికిలపడ్డారు. శుక్రవారం విడుదలైన బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో జన సురాజ్‌పార్టీ అభ్యర్థులు అందరూ ఓడిపోయారు. ఓటర్లను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. నితీశ్‌తో పొసగక సొంత పార్టీ.. ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐ–ప్యాక్) పేరిట ఎన్నికల వ్యూహాలు, సిద్ధాంతాలు, పథకాలను రచించే సంస్థను కొన్నాళ్ల క్రితం ప్రశాంత్ స్థాపించారు. ఇతర రాష్ట్రాల్లో వ్యూహకర్తగా విజయం సాధించాక స్వరాష్ట్రంలో అడుగుపెట్టారు. 2015లో నితీశ్‌కుమార్‌ను గెలిపించి నితీశ్ సర్కార్‌లో కేబినెట్ మంత్రి హోదాకు సమానంగా ప్రభుత్వసలహాదారు పదవిలో ప్రశాంత్ కొనసాగారు. మూడేళ్ల తర్వాత జేడీయూలో చేరి ఏకంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అయితే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో నితీశ్, ప్రశాంత్ మధ్య తీవ్రవిభేదాలు పొడచూపాయి. దీంతో ప్రశాంత్‌ను జేడీయూ నుంచి బహిష్కరించారు. ఈ అక్కసుతోనే సొంత పార్టీ పెట్టాడని బిహారీలు ఇంకా నమ్ముతున్నారు. పేలవ కేడర్, కొత్త అభ్యర్థులు ఎలాంటి నేరచరిత్రలేని అభ్యర్థులను రంగంలోకి దింపానని ప్రశాంత్ ఘనంగా ప్రకటించారు. కానీ ఏ రాష్ట్రంలోనైనా కాస్తంత ఛరిష్మా ఉన్న నేతలే ఎక్కువ ఓట్లను కొల్లగొట్టగలరని రాజకీయ చరిత్ర చెబుతోంది. కొన్ని నెలల క్రితమే స్థాపించిన జన సురాజ్ పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలోకి చొచ్చుకుపోలేదు. దీంతో పార్టీకి పెద్దగా కేడర్, కార్యకర్తల బలం లేదు. ఇవన్నీ పార్టీ విజయావకాశాలను బాగా దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బిహార్‌లో మార్పు తెస్తానని వాగ్దానంతో ఎన్నికల పద్మవ్యూహంలో దిగిన ప్రశాంత్ తొలి ప్రయత్నంలో జనం చావుదెబ్బ తీశారు. -
తేజస్వీ ఆశ.. అడియాస
పట్నా: తండ్రి నుంచి కుమారులకు ఆస్తిపాస్తులు వారసత్వంగా వస్తుంటాయి. కానీ బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు తండ్రి పరిపాలనాకాలం నాటి ఆటవికపాలన తాలూకు మాయని మచ్చలు అలాగే అంటుకుపోయాయి. జంగిల్‌రాజ్‌గా పేరుమోసిన లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలనాకాలంనాటి చేదు జ్ఞాపకాలు చివరకు తేజస్వీయాదవ్ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశాయి. ఆర్జేడీ అధికారంలోకి వస్తే ఆటవికపాలనకు ఆవాహన పలికినట్లేనని ఎన్డీఏ కూటమి చేసిన ప్రచారం బాగా పనిచేసి అది చివరకు మహాగఠ్‌బంధన్ కూటమికి ఓట్లు రాలకుండా చేసింది. దీంతో ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కల కలగానే మిగిలిపోయింది. స్నేహితుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం«దీతో కలిసి చేసిన జంట భారీ ర్యాలీలు సైతం జనాల మనసులను మార్చలేకపోయాయి. బిహార్ కీలకనేత కుమారునిగా రాజకీయ అరంగేట్రం అత్యంత సులభంగా జరిగినా ఎన్నికల రణరంగంలో గెలవడం అంతతేలికకాదని తేజస్వీకి శుక్రవారం నాటి ఫలితాలు రుచిచూపించాయి. మహాగఠ్‌బంధన్ తరఫున ముఖ్యమంత్రి అభ్యరి్థగా తేజస్వీ యాదవ్ పేరును ప్రకటించినప్పుడే కూటమిలోని కొందరు నేతలకు ఈ నిర్ణయం రుచించలేదు. సీఎం అభ్యర్థికి వ్యక్తిగత కరిష్మా తోడవ్వాల్సిందిపోయి కుటుంబ అప్రతిష్ట ఈయన గెలుపునకు అవరోధంగా మారొచ్చనే అనుమానాలకు ఆనాడే బీజాలు పడ్డాయి. ఇవి ఇప్పుడు నిజమయ్యాయని కొందరు రాజకీయనేతలు విశ్లేíÙస్తున్నారు. క్రికెట్‌కు గుడ్‌బై.. ఎన్నికల్లో కొత్త ఇన్నింగ్స్ రాష్ట్రవాళీ క్రికెటర్ అయిన తేజస్వీ పదేళ్ల క్రితం తనకిష్టమైన ఆటకు స్వస్తిపలికారు. తన అసలైన రాజకీయ వారసుడు తేజస్వీ అని భావించిన మరుక్షణమే లాలూ ఈయనతో రాజకీయరంగ ప్రవేశం చేయించారు. మిత్రధర్మం పాటించి కాలంలో జేడీయూతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పుడు నితీశ్ సర్కార్‌లో తేజస్వీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే కేంద్రంలో యూపీఏ–1 పరిపాలనాకాలంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ భూములు తీసుకుని రైల్వే ఉద్యోగాలు ఇచ్చాడనే కేసులో తేజస్వీ పేరు సైతం జతకూడడంతో తేజస్వీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. విచిత్రంగా ఆ అవకతవకల నాటికి తేజస్వీ ఇంకా టీనేజీ పిల్లాడు కావడం గమనార్హం. అయితే తర్వాత తేజస్వీ రాజకీయాల్లో అడుగుపెట్టడం 2020 బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఏకంగా 75 సీట్లు సాధించంతో ఈయన పేరు మార్మోగిపోయింది. ఆ హవాను తాజా ఎన్నికల్లో తేజస్వీ కొనసాగించలేకపోయారు. ఆర్జేడీ సారథ్యంలోని కూటమి అధికారంలోకి వస్తే జంగిల్‌రాజ్ పునరావృతమవుతుందన్న బీజేపీ ప్రచారాన్ని తేజస్వీ బలంగా తిప్పికొట్టలేకపోయారు. -
టైగర్ అభీ జిందాహై!
పట్నా: ‘టైగర్ అభీ జిందా హై’(పులి ఇంకా సజీవంగానే ఉంది) బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఇది. జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు ఈ టైటిల్ సరిగ్గా వర్తిస్తుంది. ‘నేను అలసిపోలేదు. రిటైర్ అవ్వాలనే మూడ్‌లోనూ లేను’అన్న పదాలకు నితీశ్‌కుమార్ నిలువుటద్దంలా కనిపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్లను ప్రస్తుతం దాదాపు రెట్టింపు చేసుకున్న నితీశ్, ఆ రాష్ట్ర రాజకీయాల్లో తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు. వదంతులను పటాపంచలు చేస్తూ.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం మొ దలు నితీశ్ కుమార్ పలు అంశాల్లో తన సత్తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇందులో ఒకటి ‘ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది’అన్న అంశంకాగా, ‘ఆయన ఆరోగ్యం సరిగా లేదు’అన్నది మరొకటి. ఈ రెండు అంశాలను ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షం ఉధృతంగా ప్రజల్లోకి తీసుకునివెళ్లింది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన సమర్థంగా ఎదుర్కొన్న ట్లు తాజా ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. పథకాల ప్రకటనలో దూకుడు అత్యంత కీలకమైన ఈ ఎన్నికలకు ముందుగా, 75 ఏళ్ల నితీశ్ దూకుడుగా పథకాలు ప్రకటించారు. సామాజిక భద్రతా పెన్షన్లు పెంచడం, జీవికా –ఆశా– ఆంగన్వాడీ సిబ్బందికి భత్యాలు ఇవ్వడం ఇందులో కొన్ని. అంతేకాదు ఎంతో ప్రచారం పొందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్ యోజన’కింద కోటి మందికిపైగా మహిళల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జమ చేసి ప్రజాకర్షక పథకాల్లో దూసుకుపోయారు. అయితే ఈ ‘‘ఫ్రీబీలు’’ప్రభావాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ముందుగానే గమనించారు. ఆయన మాజీ డిప్యూటీ తేజస్వి యాదవ్ (ఆర్జేడీ) ప్రభుత్వం ‘కాపీక్యాట్’గా మారిందని విమర్శించారు. నితీశ్‌కు గతంలో సహాయకునిగా వ్యవహరించిన పవన్ వర్మ ‘ఈ పథకాల ద్వారా ఓటర్లను లంచం ఇస్తున్నారు’అని విమర్శించారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం పవన్ వర్శ.. జేడీయూ సుప్రీమోకు ఒకప్పడు సన్నిహితునిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జన సురాజ్ పార్టీలో (జేఎస్పీ) ఉన్నారు. ఇక రాష్ట్ర ఖజానాను దెబ్బతీస్తున్నారన్న విమర్శలు సరేసరి. తొణకని, బెణకని నైజం అయితే రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ కాలం సీఎం గా పనిచేసిన నితీశ్ కుమార్ మాత్రం విమర్శలు, ఆరోపణలకు ఏమాత్రం కంగారు పడలేదు. బీజేపీ తనపై ‘మహారాష్ట్ర శిండే విధానం’అవలంబించబోతుందన్న ప్రత్యర్థుల మాటలకూ విలువ ఇవ్వలేదు. మహారాష్ట్రలో శివసేనను అధిగమించి బీజేపీ అధికారం చేపట్టిన తరహాలోనే, నితీశ్‌కూ బీజీపీ రాజకీయంగా భంగం కలిగిస్తుందన్న అర్థంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలకూ ఆయన విలువ ఇవ్వలేదు. అయితే ఈ విమర్శలకు ఆయన ఎందుకు తొణకడంలేదన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభలో స్వతంత్ర మెజారిటీ లేనందున.. బీజేపీ కేంద్రంలో అధికారంలో నిలవడానికి జేడీయూ మద్దతుపైనే ఆధారపడి ఉందన్న నిజం బహుశా ఆయన దృష్టిలో ఉండవచ్చన్నది ఇందులో ఒకటి. ఇక ఈ సందర్భంలో బీజేపీ విషయానికి వస్తే, రాష్ట్రంలో మోదీ 14 భారీ సభలు, ఒక రోడ్‌షో నిర్వహించారు. అయితే నితీశ్ కుమార్‌తో సమస్తీపూర్‌లో జరిగిన తొలి ఎన్నికల సభ మినహా వీరిరువురూ ఒకే వేదికపై ఎక్కడా కనిపించలేదు. అయినా, ‘నితీశ్ బాబు చేసిన మంచి పనిని గుర్తుంచుకోండి’అని ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రతి సభలో పేర్కొన్నారు. రాజకీయ ప్రస్థానం.. → బిహార్‌లోని బఖ్తియార్పూర్లో 1951లో జ న్మించిన కుమార్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. → విద్యుత్ శాఖలో వచి్చన ఉద్యోగాన్ని వదిలి జెపీ ఉద్యమం కాలంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. → జనతా పార్టీలో చేరి 1977లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేశారు కానీ ఓడిపోయారు. 1985లో తొలి విజయాన్ని సాధించారు. → దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తరచూ పక్షం–విపక్షం మారుతూ వచ్చారన్న విమర్శలతో ‘పల్టూ రాం’ (పల్టీ రాం) అన్న బిరుదు కూడా సంపాదించారు. -
గఠ్బంధన్ను ముంచిన ‘ఎం’ ఫ్యాక్టర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమిపై ఓట్ల చోరీ విమ ర్శనాస్త్రం సంధించి, బిహార్ యువత, మహిళలు, ముస్లింలు, మల్లాలుసహా ప్రతి వర్గంపై హామీల వరద పారించిన మహాగఠ్‌బంధన్ కూటమి గెలు పుపై పెట్టుకున్న గంపెడాశలు గంగపాలయ్యాయి. ముఖ్యంగా ‘ఎం ఫ్యాక్టర్’గా పిలిచే మహిళలు, ముస్లింలు, మల్లాలు తమకు ఓట్ల పోరులో తోడుగా నిలబడి విజయకేతనం ఎగరేస్తా రనుకుంటే అధికార కూటమికి విజయపతాకం కట్టబెట్టి విపక్ష కూటమి కంగుతినేలాచేశారు. కుటుంబానికో ప్రభు త్వ ఉద్యోగం, వేలాది మంది తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకణ ఇలా అన్ని వర్గాలపై హామీల వర్షం కురిపించిన మహాగఠ్‌బంధన్ కూటమి బిహారీల మనసుల్ని గెల్చుకోలేకపోయింది. ఎన్నికలకు ఆరు నెలల నుంచి ముందునుంచి సీట్ల పంపకాలపై చర్చలు మొదలైనా అవి అధికార ఎన్డీఏతో పోలిస్తే వేగంగా తేలలేదు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దు బాటు సరిగా కుదర్లేదు. కొన్ని స్థానాల్లో విపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలపడంలో ఘోరంగా విఫల మయ్యాయి. కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులు పోటా పోటీగా ఒకే స్థానంలో పోటీకి దిగి ఇద్దరూ ఓడిపో యారు. ఓట్లు కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య చీలిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సీఎం అభ్యర్థిని చాలా ఆలస్యంగా ప్రకటించడం, ప్రచార పర్వంలో కాంగ్రెస్, ఆర్జేడీ అగ్రనేతల సమన్యయ లోపం సైతం కూటమి విజయావకాశాలను దెబ్బతీశాయి. తమ ఎన్నికల హామీతో అండగా ఉంటారనుకున్న మహి ళలు హఠాత్తుగా చేయివ్వగా, తమతో కలిసివస్తార నుకు న్న ముస్లింలు ఇరువర్గాల వైపు చీలిపోయారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వజూపినా వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) పార్టీ చీఫ్ ముఖేశ్ సహానీ ఆసక్తి కనబర్చకపోవడంతో ఆ పార్టీకి చెందిన మల్లా వర్గపు ఓటర్లు సైతం విపక్షకూటమి వైపు కన్నెత్తి చూడలేదు. ఇలా ఎన్నో కారణాలు విపక్షాలను విజయతీరాలకు చేర్చకుండా మధ్య లోనే ముంచేశాయి. అండగా నిలవని ముస్లింలు..బిహార్‌లో 10 కోట్ల జనాభాలో 1.75 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. అంటే జనాభాలో 17.7 శాతమున్న ముస్లింలు కేవలం మహాగఠ్‌బంధన్‌కు ఓటేయకుండా అధికారకూటమి వైపూ మొగ్గుచూపారు. దీంతో ఓట్లు భారీగా చీలిపోయి మహాగఠ్‌బంధన్ విజయావకాశాలు పూర్తిగా నశించాయి. 243 స్థానాలకుగాను 87 స్థానాల్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. అందుకే 20 చోట్ల మహాగఠ్‌బంధన్ ముస్లింలకు సీట్లిచ్చింది. అయినాసరే ఇక్కడ మొత్తంగా గెల్చింది ఐదు సీట్లే. ముస్లింలకు 14 శాతం జనాభా ఉన్న యాదవులు కలిస్తే ఓటు బ్యాంక్ 32 శాతానికి పెరిగి తమకు బాగా కలిసి వస్తుందని మహాగఠ్‌బంధన్ వేసిన లెక్కలు తారుమార య్యాయి. దళిత, ఆదివాసీలు కలిసొస్తే కనీసం 40 శాతం ఓట్లు వస్తాయని కాంగ్రెస్ భావించింది. వాస్తవంలో కాంగ్రెస్‌కు కేవలం 8 శాతం, ఆర్జేడీకి 21 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా చాలా స్థానాల్లో ముస్లిం ఓట్లు చీలిపోయాయి. అనేక చోట్ల బీఎస్పీకి 4 నుంచి 6 శాతం ఓట్లు వచ్చింది. కొత్తగా ఏర్పడిన జనసురాజ్ పార్టీ మహాగఠ్‌బంధన్ విజయావకాశాలను దెబ్బతీసింది. విపక్షాలు పోటీ చేసిన స్థానాల్లో ముస్లిం ఓట్లు జనసురాజ్ పార్టీ చీల్చింది. సీమాంచల్‌లో 11 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం 5 స్థానాలు గెలిచింది. 60 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 6 చోట్ల మాత్రమే గెలిచింది. అధిక శాతం ఉన్న ముస్లింలను కాదని, మల్లా వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడం సైతం ముస్లింలకు కోపం తెప్పించింది. దర్భంగా, మధుబని, సివాన్, గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్, భగల్పూర్ వంటి ప్రాంతాల్లో ముస్లిం ఓట్లు భారీగా చీలిపోయాయి. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేశ్ సహానీకి చెందిన మల్లా వర్గం ఓటర్లు మిథిలాంచల్, సీమాంచల్, ముజఫర్‌పూర్, దర్భంగా, సుపాల్, వైశాలి, సీతామడి, షెయోహర్, కిషన్‌గంజ్, సహర్సా, ఖగారియా, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్ జిల్లాలలో ఎక్కువ. ఆయా జిల్లాల్లో గెలుపుపై విపక్షకూటమి గంపెడాశలు పెట్టుకుంటే కేవలం 18 చోట్ల గెలిచింది. వీఐపీ పార్టీ మల్లాలు అధికంగా ఉన్న 15 చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్లా ఓడింది.పెరిగిన ఓట్ల శాతం శరాఘాతమే..మహిళా ఓటర్లు తమ వెంటే ఉన్నా రని కూటమి తొలినుంచీ భావిస్తోంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏకంగా 66.91 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇందులో మహిళా ఓటర్లలో 71.6 శాతం పోలింగ్ నమోదైంది. ఓటేసిన మహిళలే రాష్ట్రంలో అధికంగా గెలుపోటములను నిర్దేశించారని తేటతెల్లమైంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 1.5 కోట్ల మంది మహిళల ఖాతాల్లో నితీశ్ ప్రభుత్వం ఏకంగా ఒకేసారి రూ.10,000 నగదు జమచేయడంతో వాళ్లంతా అధికార పార్టీకే కొమ్ముకాశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, ఉచిత సైకిల్ పథకం వంటివి ఎన్డీఏకు కలిసొచ్చాయి. ఇవి విపక్షాలకు ప్రతిబంధకాలుగా తయారయ్యాయి. ఆర్థికంగా వెనుకబడిన మహి ళలకు ఏటా రూ. 30వేల ఆర్ధిక సాయం, జీవికా దీదీల ఉద్యో గాల క్రమబద్ధీకరణ, రూ. 30 వేల గౌరవవేతనం, ‘మా’ (ఇల్లు, వంట సరుకులు, ఆదాయం) పథకం ప్రతి మహిళకు భరోసా ఇస్తామని హామీ ఇచ్చినా మహిళలు విపక్షాల మాటలను నమ్మలేదు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు ఆటవికంగా పరిపాలించారంటూ ఎన్డీఏ కూటమి చేసిన ప్రచారాన్ని జనం గుర్తుంచుకుని ఆర్జేడీ మాటలను విశ్వసించడం మానేశారు. కాంగ్రెస్ వరస వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా పాత వ్యూహాలనే అమలు చేయడం సైతం విజయపథంలో దూసుకుపోకుండా అడ్డుకుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. -
Bihar: ముఖ్యమంత్రి ఎవరు?
పట్నా: బిహార్‌లో ఎన్డీయే సీట్ల సునామీ సృష్టించింది. ఇక ముఖ్యమంత్రి ఎవరన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగుతారా? లేక మరో కొత్త నాయకుడికి పగ్గాలు అప్పగిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే.. మళ్లీ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే అంటూ సోషల్ మీడియాలో జేడీ(యూ) పోస్టు చేసింది. కొద్దిసేపటికే దాన్ని తొలగించడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. నితీశ్‌ను మరోసారి సీఎంను చేయడం బీజేపీకి ఇష్టంలేదని ప్రచారం సాగుతోంది. నితీశ్‌ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లి, బీజేపీ నాయకుడినే గద్దెనెక్కిస్తారని అంచనా వేస్తున్నారు. నిజానికి తమ కూటమి గెలిస్తే నితీశ్ కుమారే సీఎం అంటూ ఎన్నికల ముందు బీజేపీ పరోక్షంగా సంకేతాలిచి్చంది. ఆయన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించింది. నితీశ్ సైతం మళ్లీ కుర్చి ఎక్కాలని ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన భావిస్తున్నారు. శుక్రవారం రాజధాని పటా్నలో భారీగా పోస్టర్లు, బోర్డులు వెలిశాయి. ‘‘25 నుంచి 30.. మళ్లీ నితీశ్’’ అంటూ అభిమానులు వాటిని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర తరహా ప్రయోగం బిహార్ ఎన్నికల్లో బీజేపీ తన బలం చాటుకుంది. ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీ(యూ)పై ఆధారపడాల్సిన అవసరం చాలావరకు తగ్గిపోయింది. జేడీ(యూ)ను పక్కనపెట్టి, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్)తో పొత్తు కొనసాగిస్తే బీజేపీ సొంతంగా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడం తేలికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వం జేడీ(యూ) అండతో మనుగడ సాగిస్తోంది. కాబట్టి జేడీ(యూ) స్నేహాన్ని వదులుకొనే సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉండగా, బిహార్‌లో మహారాష్ట్ర తరహా ప్రయోగం చేసే అవకాశం లేకపోలేదు. మహారాష్ట్రలో 2024 ఎన్నికల్లో శివసేన(షిండే) నేత, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో కలిసి పోటీ చేసి అత్యధిక స్థానాలు గెల్చుకున్న బీజేపీ చివరకు తమ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎంగా కిరీటం అప్పగించింది. బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. సమీకరణాలు కలిసొస్తే ఆయన బిహార్ సీఎం అయ్యే అవకాశాలున్నాయి. బిహార్ ఎన్డీయేలో పెద్దన్న జేడీ(యూ). ఈసారి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. జేడీ (యూ)తో సమానంగా సీట్లు పంచుకుంది. రెండు పక్షాలు 101 సీట్ల చొప్పున తీసుకున్నాయి. ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు నెగ్గి, జేడీ(యూ)పై స్పష్టమైన ఆధిపత్యం సాధించింది. ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంది. -
బెంగాల్లోనూ ‘జంగిల్‌రాజ్’ను అంతం చేస్తాం
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. కార్యకర్తల కష్టంతోనే గెలుపు దక్కిందని అన్నారు. బిహార్‌లో సుపరిపాలన కొనసాగిస్తామని, ఇకపై ప శ్చిమ బెంగాల్లో ‘జంగిల్‌రాజ్’ను అంతం చేస్తామని ప్రతినబూనారు. పరోక్షంగా ఎన్నికల శంఖారావం పూరించారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై సమర భేరీ మోగించారు. బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవంలో పాల్గొన్నారు. నేతలకు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గంగా నది బిహార్ గుండా బెంగాల్లోకి ప్రవహిస్తోందని చెప్పారు. బిహార్ విజయం ఇక బెంగాల్లో విజయానికి దారిని ఏర్పర్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అది ముస్లింలీగీ మావోవాదీ కాంగ్రెస్(ఎంఎంసీ)గా మారిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ త్వరలో ముక్కలుచెక్కలు కావడం తథ్యమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పెద్దలు వారు మునిగిపోవడంతోపాటు నమ్ముకున్నవారిని కూడా ముంచేస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ మెడలో మిథిలా పెయింటింగ్‌లతో కూడిన గమ్చా(కండువా) ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తద్వారా బిహార్ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పారు. కొత్తగా ఎం.వై. ఫార్ములా బిహార్ విజయం కొత్తగా ఎం.వై.(మహిళలు, యువత) అనే ఫార్ములాను ఇచ్చిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. జంగిల్‌రాజ్ మనుషుల మతపరమైన ఎం.వై.(ముస్లిం–యాదవ్) ఫార్ములాను ఈ విజయం మట్టిలో కలిపేసిందని అన్నారు. ‘ప్రజాస్వామ్యానికి తల్లి’ అనే గొప్ప గౌరవాన్ని భారత్‌కు ఇచి్చన గడ్డ బిహార్ అని కొనియాడారు. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తే మట్టికరిపిస్తామన్న సందేశాన్ని ఇదే గడ్డ ఇచి్చందన్నారు. బిహార్‌లో ఎన్డీయే విజయం ప్రజాస్వామ్యానికి దక్కిన మహోన్నత విజయమని అభివరి్ణంచారు. అసత్యాలు ఓడిపోతాయని, ప్రజల విశ్వాసమే గెలుస్తుందని బిహార్ నిరూపించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పారీ్టకి మన దేశం పట్ల సానుకూల దృక్పథం గానీ, దార్శనికత గానీ లేవని మండిపడ్డారు. అదొక పరాన్నజీవి, మోయలేని భారం, నష్టదాయకం అంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలను హెచ్చరించారు. ఈసీ పట్ల ప్రజల విశ్వాసం బలోపేతం ఎన్డీయే ప్రభంజనంతో బిహార్‌లో నూతన శకం ఆరంభమైందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. రాబోయే ఐదేళ్లలో మరింత వేగంగా అభివృద్ధి కొనసాగుతుందని తేల్చిచెప్పారు. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. బిహార్ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలుస్తాయని వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల ఫలితాలతో ఎన్నికల సంఘం పట్ల ప్రజల విశ్వాసం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం కృషితో ఈ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైనట్లు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వ ప్రతిభను నరేంద్ర మోదీ శ్లాఘించారు. ఎన్డీయే పక్షాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్ఐఆర్ను యువత స్వాగతించారు నేడు దేశంలో అత్యధికంగా యువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ కూడా ఉందని మోదీ వెల్లడించారు. ఇక్కడి యువతలో అన్ని కులాలు, మతాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. వారి ఆశలు, ఆకాంక్షలు, కలలు జంగిల్‌రాజ్ మనుషుల కమ్యూనల్ ఎం.వై.ఫార్ములాను సర్వనాశనం చేశాయని వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనను యువత స్వాగతించారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)కు వారు మద్దతిచి్చనట్లు ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. జంగిల్‌రాజ్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో విచ్చలవిడిగా హింసాకాండ జరిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘం కృషి వల్ల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కొనియాడారు. బిహార్ విజయం పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో బీజేపీ కార్యకర్తలకు కొత్త శక్తిని ఇచి్చందని స్పష్టంచేశారు. -
ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)
-
బిహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్దలు కొట్టారు: ప్రధాని మోదీ
ఢిల్లీ: బిహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బిహార్ ప్రజలు అద్భుత విజయం అందించారన్నారని.. ప్రజలు వికసిత్ భారత్‌కు ఓటేశారన్నారు. బిహార్‌లో ఇవాళ ప్రతీ ఇంట మఖానా పాయసం వండుకుని సంతోషిస్తారన్న మోదీ.. బిహార్ జంగిల్ రాజ్ అన్నప్పుడు ఆర్జేడీ నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేదని.. బిహార్‌లో ఆ జంగిల్ రాజ్ ఎప్పటికీ తిరిగిరాదన్నారు.మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నాం. రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొని ఏన్డీఏకు అద్భుత విజయం అందించారు. బిహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్దలుకొట్టారు. జంగిల్ రాజ్‌లో ఏం జరిగిందో అందరికి తెలుసు. జంగిల్‌రాజ్‌లో దోపిడీ, అక్రమాలు, హింస ప్రజలు అనుభవమే. ఈ విజయంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. ఒకప్పుడు బిహార్‌లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. అరాచక శక్తుల కారణంగా ఎన్నికలు మధ్యాహ్నం 3 గంటలకే ముగిసిపోయేది. కానీ ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా, ధైర్యంగా వచ్చి రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొన్నారు.’’ అని మోదీ పేర్కొన్నారు.సునామీ తరహాలో తీర్పు: జేపీ నడ్డాప్రధాని మోదీ నేతృత్వంలో బిహార్‌లో ఎన్డీఏ అద్బుత విజయం సాధించింది. బిహార్ ప్రజలు సునామీ తరహాలో తమ తీర్పును వెలువరించారు. ఈ అద్భుత విజయం బీజేపీని మరింత బలోపేతం చేసింది. బాధ్యత పెంచింది. ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి తమ ప్రేమను విశ్వాసాన్ని చూపించారు. మహారాష్ట, ఢిల్లీలో కూడా బీజేపీని ప్రజలు అద్భుతంగా ఆదరించారు. రికార్డు స్థాయిలో అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపించారు. మహాగఠ్ బంధన్‌ను బీహారీలు తిరస్కరించారు. -
25 ఏళ్లకే ఎమ్మెల్యేగా అడుగుపెట్టనున్న సింగర్!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సింగర్ ఘనవిజయం సాధించింది. కేవలం 25 ఏళ్ల వయసులోనే జానపద సింగర్ ఎమ్మెల్యేగా ఎంపికైంది. బీజేపీ నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన మైథిలి ఠాకూర్ విక్టరీ సాధించింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సింగర్ మైథిలీ ఠాకూర్.. అలీనగర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 11 వేలకు పైగా మెజార్టీలో గెలుపొందింది.కాగా.. 25 ఏళ్ల మైథిలి ఠాకూర్.. బీహార్‌లోని మధుబన్ జిల్లా బెనిపట్టి ఆమె సొంతూరు. జానపద సింగర్‌గా శిక్షణ తీసుకున్న మైథిలి పలు రియాలిటీ షోల్లో పాల్గొంది. స రే గ మ ప లిటిల్ చాంప్స్, ఇండియన్ ఐడల్ జూనియర్, రైజింగ్ స్టార్ రియాలిటీ షోలలో కంటెస్టెంట్‌గా రాణించింది. మైథిలి సొంత యూట్యూబ్ ఛానెల్‌కు 5 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమెకు 6.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన గాత్రంతో అందరినీ ఆకట్టుకున్న మైథిలి.. ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా ఎలా రాణిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Youngest MLA of state , Maithali ThakurAll the best to her 🙏🏻 pic.twitter.com/BO70ciAzLW— Bihar_se_hai (@Bihar_se_hai) November 14, 2025 -
బీజేపీ, జేడీయూ కంటే ఆర్జేడీకి ఎక్కువ ఓట్లు!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అత్యధిక శాతం ఓట్లు సాధించింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన బీజేపీ, జేడీయూ కంటే ఆర్జేడీకి ఎక్కువ పోలైయ్యాయి. ఎన్నికల సంఘం అధికార వెబ్సైట్ తాజా డేటా ప్రకారం.. ఆర్జేడీకి 22.75 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ 20.67, జేడీయూ 18.89 శాతం ఓట్లు సాధించాయి. బీజేపీతో పోలిస్తే ఆర్జేడీకి 2.08 శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. జేడీయూ కంటే తేజస్వీ పార్టీ 3.86 శాతం ఓట్లు ఎక్కువ సాధించింది.243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో 143 స్థానాల్లో ఆర్జేడీ (RJD) పోటీ చేసింది. బీజేపీ- జేడీయూ చెరో 121 స్థానాల్లో బరిలోకి దిగాయి. 28 స్థానాల్లో అభ్యర్థులను నిలిపిన ఎన్డీఏ మిత్రపక్షం లోక్ జనశక్తి (రామ్ విలాస్) 5.03 శాతం ఓట్లు దక్కించుకుంది.2020 అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు సాధించిన ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ ఎన్నికల్లో ఆర్జేడీకి 23.11 శాతం ఓట్లు వచ్చాయి. 19.46 శాతం ఓట్లతో బీజేపీ 74 స్థానాలు దక్కించుకుంది. జేడీయూ 15.39 శాతం ఓట్లు తెచ్చుకుని 43 స్థానాలను సొంతం చేసుకుంది. 9.48 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు గెలిచింది. ఎన్డీఏ కూటమికి 37 శాతం, మహాగఠ్‌బంధన్‌కు 36 శాతం ఓట్లు వచ్చాయి.చదవండి: జేడీయూ హవా : ప్రశాంత్ కిషోర్ రాజకీయ సన్యాసం ?తాజా ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఇప్పుడు 27 స్థానాలకు పడిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే 48 సీట్లు తగ్గిపోయాయి. అదే సమయంలో బీజేపీకి 17 స్థానాలు జమ అయ్యాయి. జేడీయూ కూడా బాగా పుంజుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి ఏకంగా 35 స్థానాలు అదనంగా సాధించింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. హస్తం పార్టీ 14 స్థానాలను కోల్పోయింది. 2020 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 1.19, జేడీయూ 3.5 శాతం అదనంగా ఓట్లు దక్కించుకున్నాయి. చదవండి: నితీశ్ కుమార్ నియోజకవర్గం ఏదీ? -
అంధకారం నుంచి ‘చిరాగ్’ వెలుగులు!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం దాదాపు ఖాయం. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూనే మరో యువనేత చిరాగ్ పాశ్వాన్ గురించి కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో చిరాగ్ పార్టీ లోక్ జనశక్తి హవా మామూలుగా లేదు, రాబోయే కాలమంతా చిరాగ్దే అన్నంతంగా చాటిచెప్పాయి ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో 29 సీట్లను పట్టుబట్టి తీసుకున్న ఆయన.. ఏకంగా 19 సీట్లలో గెలుపు దిశగా పయనిస్తున్నారు. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు తగ్గ తనయుడిగా తనదైన ముద్రను వేశారు చిరాగ్ పాశ్వాన్. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో పోటీ చేసి అన్నింటిలోనూ విజయం సాధించిన చిరాగ్ పాశ్వాన్.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తన పార్టీ ప్రభావం ఏమిటో చెప్పకనే చెప్పేశారు. ఫీనిక్స్‌లా పుంజుకుని..చిరాగ్ పాశ్వాన్ తిరిగి పుంజుకున తీరు ఫీనిక్స్ పక్షిని గుర్తు చేస్తుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవిష్యత్ అంతా గందరగోళమే. జేడీయూ అధినేత నితీష్ కుమార్‌తో విభేదాల వల్ల ఆ సమయంలో ఒంటరిగానే పోటీకి సిద్దమయ్యారు. 130కి పైగా స్థానాల్లో పోటీ చేసిన చిరాగ్.. కేవలం ఒక్క సీటును మాత్రమే సాధించారు. దాంతో ఆయన రాజకీయ అంధకారంగా కనిపించింది. అదే సమయంలో చిరాగ్ అవమానాలను సైతం ఎదుర్కొన్నాడు. అందకారం నుంచి ఆకాశమంత వెలుగు..ఆపై 2021లో సొంత బాబాయ్ పశుపతి కుమార్ పారస్ పార్టీని చీల్చి, రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వం కోసం పోటీపడ్డారు. అప్పుడు చిరాగ్ రాజకీయ భవిష్యత్ అంతా అంధకారంగానే కనిపించింది. బిహార్ రాజకీయాల్లో ఓ శక్తిగా వెలిగిన రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని అందిపుచ్చుకునే లక్షణాలు చిరాగ్‌లో లేవనే విమర్శలు వినిపించాయి. తండ్రిలో ఉన్న చరిష్మా చిరాగ్‌లో లేదని విమర్శకులు అభిప్రాయాపడ్డారు. అయితే ఐదేళ్ల వ్యవధిలోనే ఎంతలా పుంజుకున్నారో తాజాగా ఆయన తన అభ్యర్థులను ముందువరుసలో నిలిపిన తీరే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వంద శాతం స్తైక్రేట్ సాధించిన చిరాగ్.. ఇప్పుడు కూడా అదే జోరుతో ముందుకు సాగుతున్నారు. #WATCH | पटना: केंद्रीय मंत्री और LJP(रामविलास) के राष्ट्रीय अध्यक्ष चिराग पासवान ने NDA के बहुमत का आंकड़ा पार करने पर कहा, "बिहार की जनता ने जिस तरह से NDA को प्रचंड बहुमत दिया है और अगले पांच साल बिहार को विकास की ओर ले जाने का फैसला किया है, उसके लिए मैं विशेष रूप से उन्हें… pic.twitter.com/Lz5lWpDYuA— ANI_HindiNews (@AHindinews) November 14, 2025 చిరాగ్ అంటే కాగడా అని అర్థం.. ఇప్పుడు బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఆయన ఎన్డీఏ కూటమిలో కాగడా మాదిరి మారి మరింత వెలుగు నింపారు. అదే సమయంలో ఆయన రాజకీయ జీవితాన్ని అంధకారం నుంచి ఆకాశమంత వెలుగుల వరకూ తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు చిరాగ్. ఇక బిహార్‌లో అంతా చిరాగ్ శకమే అన్నంత గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారాయన. -
200 మార్క్ దాటిన NDA సునామీలో కొట్టుకుపోయిన కాంగ్రెస్
-
బిహార్ లో NDA దిమ్మతిరిగే స్ట్రైక్ రేట్
-
నితీశ్ కుమార్ నియోజకవర్గం!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ కేతనం ఎగురవేసింది. డబుల్ సెంచరీతో మహాగఠ్‌బంధన్‌పై విజయ దుందుభి మోగించింది. ఎన్డీఏ ధాటికి ప్రతిపక్ష కూటమి కకావికలం అయింది. కనీసం హాఫ్ సెంచరీ కూడా కొట్టలేక కుదేలయింది. కొత్తగా వచ్చిన జన సురాజ్ పార్టీకి ఖాతా కూడా తెరలేకపోయింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై బిహార్ ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచారు. అఖండ మెజారిటీతో ఆయనకు మద్దతు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే శాసనసభ ఎన్నికల్లోనూ రావడంతో నితీశ్ కుమార్ ప్రాభవం శిఖరాలకు చేరింది.బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆసక్తికరమైన టాపిక్ గూగుల్‌లో ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. నితీశ్ కుమార్ నియోజకవర్గం (Nitish kumar Constituency). ఆయన నియోజకవర్గం గురించి గూగుల్‌లో జనం విపరీతంగా వెతికేశారు. దీనికి సంబంధించిన సెర్చ్ వాల్యూమ్ 100K వరకు ఉందని గూగుల్ ట్రెండ్స్ ద్వారా వెల్లడైంది. ఆసక్తికర విషయం ఏమిటంటే నితీశ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. చాలా ఏళ్లుగా ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.నితీశ్ కుమార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 40 ఏళ్లు అవుతోంది. 1985లో హర్నాట్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మళ్లీ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 1989- 2004 మధ్య కాలంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. పలుమార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో మంత్రి పదవులు కూడా నిర్వహించారు. 1990లో వీపీ సింగ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు అటల్ బిహారి వాజపేయి కేబినెట్లో పలు కీలక శాఖలు నిర్వహించారు. చదవండి: తేజస్వీకి చెమటలు పట్టించాడు.. ఎవరీ సతీశ్?వీరి గురించి తెగ వెతికారుబిహార్ ఎన్నికల సంబంధించి పలు అంశాలు శుక్రవారం మధ్యాహ్నం గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచాయి. నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ నియోజకవర్గాల గురించి ఎక్కవగా నెటిజనులు శోధించారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన భోజ్‌పురి సూపర్‌స్టార్, గాయకుడు ఖేసరీలాల్ యాదవ్ (Khesarilal Yadav) ఎన్నికల ఫలితం గురించి జనాలు ఆసక్తి కనబరిచారు. చప్రా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి చోటీ కుమారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలీనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రఖ్యాత జానపద గాయని మైథిలి ఠాకూర్ (Maithili Thakur) ఎన్నికల ఫలితం గురించి కూడా ఆన్లైన్లో తెగ వెతికారు.బిహార్ ఎన్నికల ట్రెండింగ్ టాపిక్స్1. నితీశ్ కుమార్ నియోజకవర్గం2. తేజస్వీ యాదవ్ నియోజకవర్గం3. తేజ్ ప్రతాప్ యాదవ్ నియోజకవర్గం4. ఖేసరీలాల్5. చప్రా విధానసభ ఫలితం 20256. మైథిలా ఠాకూర్ ఎన్నికల ఫలితం7. పవన్ సింగ్8. అనంత్ సింగ్ -
సీఎం రేంజ్ లో సవాల్ విసిరి తుస్సుమన్న PK
-
కాంగ్రెస్ చిత్తుచిత్తు.. 200 మార్క్ వైపు దూసుకుపోతున్న NDA
-
తేజస్వీకి టెన్షన్.. ఎవరీ సతీశ్?
బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ దుందుభి మోగించింది. 203 స్థానాల్లో జయ భేరి మోగించింది. మహాగఠ్‌బంధన్ ఘోరంగా ఓడిపోయింది. మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ముఖ్యనేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ (Raghopur) నుంచి గెలిచారు. అయితే తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాఘోపూర్‌లో తన విజయం నల్లేరు మీద నడక అని భావించిన ఆయనకు బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఓట్ల లెక్కింపు మొదలవగానే తేజస్వీ ఆధిక్యంలోకి వచ్చారు. కొన్ని రౌండ్ల వరకు ఆయన హవా కనిపించింది. కానీ ఒక దశలో ఆయన వెనుబడ్డారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. తేజస్వీపై 3 వేల పై చిలుకు ఆధిక్యం సాధించారు. దీంతో ఒక్కసారిగా మీడియా ఫోకస్ మొత్తం రఘోపూర్పై నిలిచింది. అయితే తర్వాత తేజస్వీ మెల్లగా పుంజుకోవడంలో మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో 129 ఓట్ల స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. కాసేపటికే సతీశ్ కుమార్ 343 ఓట్లతో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఒంటి గంట ప్రాంతంలో తేజస్వీ 585 ఓట్ల ఆధిక్యంతో తిరిగి పుంజుకున్నారు. మ. 1.40 గంటల సమయానికి 2288 ఓట్లతో సతీశ్ కుమార్ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. మ. 2 గంటలకు 3230 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మ. 2.30 గంటలకు 4829 మెజారిటీలో ఉన్నారు. అంతకంతకూ ఆయన మెజారిటీ పెరుగుతోంది. మ. 3 గంటలకు 4570 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మ. 3.45 గంటల సమయానికి 9705 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మ. 4.20 గంటల సమయంలో తేజస్వీ 4937 ఓట్లతో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. సాయంత్రం 5.30 గంటల సమయానికి 13880 ఓట్ల ఆధిక్యంతో విజయం దిశగా పయనిస్తున్నారు. సా. 6 గంటల సమయానికి 30 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, 14122 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 32 రౌండ్ల పాటు లెక్కింపు సాగింది. చివరకు 14532 ఓట్ల ఆధిక్యంతో తేజస్వీ యాదవ్ గెలిచారు. రబ్డీదేవిని ఓడించిన సతీశ్ కుమార్తేజస్వీకి చెమట పట్టించిన 59 ఏళ్ల సతీశ్ కుమార్ 15 సంవత్సరాల క్రితం ఇదే స్థానంలో తేజస్వీ తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్డీదేవిని ఓడించి సంచలనం సృష్టించారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఆర్జేడీ పార్టీ నుంచే ఆయన బీజేపీలోకి వెళ్లారు. 1995 నుంచి రఘోపూర్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి ఎదురు లేకుండా పోయింది. 2010 ఎన్నికల్లో సతీశ్ కుమార్.. లాలూ కుటుంబానికి షాక్ ఇచ్చారు. ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసిన లాలూ సతీమణి రబ్డీదేవిపై 13 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి సన్సేషన్ క్రియేట్ చేశారు.తేజస్వీకి టెన్షన్తాజా ఎన్నికల విషయానికి వస్తే రెండుసార్లు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తేజస్వీ యాదవ్‌ను కూడా సతీశ్ కుమార్ టెన్షన్ పెడుతున్నారు. తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రఘోపూర్‌లో తేజస్వీ ఓడిపోతే అంతకన్నా అవమానం మరోటి ఉండదు. అంతేకాదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పరాజయం పాలైతే మహాగఠ్‌బంధన్‌కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ముఖ్యంగా లాలూ కుటుంబం రాజకీయ ప్రతిష్ట మరింత బలహీనమవుతుంది. చదవండి: పార్టీల వారీగా ఎన్నికల ఫలితాలు ఇవే -
ఇది ముమ్మాటికీ ఆయన విక్టరీనే!
‘‘నితీశ్ కుమార్‌కు వయసు పైబడిపోయింది. ఆయన ఆరోగ్యమూ బాగోలేదు. ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జనాల్లో తిరిగే ఓపిక ఆయనకు ఉండడం లేదు. ఇక ఆయనకు విశ్రాంతి అవసరం. పైగా ఆయనకు అధికారంపైనే తప్ప ప్రజలపై మమకారం లేదు. బిహార్‌కు ఇప్పుడు కొత్త తరహా ఆలోచనలు అవసరం.’’.. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల నుంచి ప్రధానంగా వినిపించిన విమర్శలు ఇవి. అయితే ఆ విమర్శలకు ఆయన గ్రాండ్ విక్టరీతోనే చెంప పెట్టులాంటి సమాధానం ఇచ్చారు. నితీశ్ పాలనతో బిహారీలు విసిగిపోయారని.. అందుకే ఆయన్ని తప్పించాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ప్రధాని మోదీ వేరుగా ర్యాలీలు నిర్వహించమే అందుకు నిదర్శనమని.. రాజకీయ ప్రచారం విస్తృతంగా సాగింది ఎన్నికల ప్రచారం సమయంలో. అయితే ఇలాంటి ప్రచారాలను, తనపై వచ్చిన విమర్శలను నితీశ్ కుమార్ ఏనాడూ తిప్పి కొట్టింది లేదు. అయితే.. 74 ఏళ్ల వయసులో ప్రచారంలో చురుకుగా పాల్గొనడం ద్వారా హుందాగా ఆయన వాళ్ల నోళ్లు మూయించారు. టైగర్ అబీ జిందా హై(పులి పని ఇంకా అయిపోలేదు).. తనను తక్కువ అంచనా వేయొద్దంటూ ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ వచ్చారు. అంతేకాదు.. ప్రజలే నిజమైన తీర్పు ఇస్తారంటూ ఓ వ్యాఖ్య చేశారు. అదే సమయంలో.. బీజేపీ వ్యవహారంలోనూ ఆయన ట్రిగ్ అయిన దాఖలాలు కనిపించలేదు. అందుకు కారణం లేకపోలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ సాధించిన సీట్లు 43. బీజేపీ కంటే 31 సీట్లు తక్కువే. అయినప్పటికీ ప్రాంతీయత, అనుభవం పేరిట నితీశ్‌కుమార్‌కే సీఎం పగ్గాలు అప్పగించింది బీజేపీ. ఆ తర్వాత బీజేపీకి కటీఫ్ చెప్పినా.. మళ్లీ కొంతకాలానికి జట్టు కట్టి సీఎం అయ్యారు. ఈ పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకుని బీజేపీతో ఆయన స్నేహపూర్వకంగా మెదులుతూ వచ్చారు. బీజేపీ చివరిదాకా నితీశ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించపోయినా ఆయన నొచ్చుకోలేదు. ఈలోపు.. ఇటు బిహార్ ఓటర్లు మహాఘట్ బంధన్‌లో కీచులాటను సునిశితంగా గమనించారు. చివరకు సుదీర్ఘ నాయకత్వాన్ని గౌరవమిస్తూ ‘సుశాసన్ బాబు’కే ఓటు వేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 80 సీట్లు గెల్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు డబుల్ ఫలితం. తద్వారా పదో సారి ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ ప్రమాణం చేయబోతున్నారు. అయితే.. JD(U) విజయానికి నితీశ్ కుమార్ తిప్పిన రాజకీయ చక్రం ప్రధాన శక్తిగా ఉన్నా.. పార్టీకి చెందిన ఇతర నేతలు, ఎన్డీయే భాగస్వాములు, సామాజిక సమీకరణలు, యువతకు ప్రాధాన్యం వంటి అంశాలు కూడా విజయానికి దోహదపడ్డాయని చెప్పొచ్చు. -
పార్టీల వారీగా ఫలితాలు ఇలా..
దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిని రేకెత్తించిన బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అధికార ఎన్డీఏ కూటమి జయభేరి మోగించింది. డబుల్ సెంచరీతో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేసేలా జయ కేతనం ఎగుర వేసింది. మహాగఠ్‌బంధన్ ఊహించని విధంగా ఘోర పరాజయం చవిచూసింది.ఎన్డీఏ కూటమి 202 స్థానాల్లో విజయం సాధించగా, మహాగఠ్‌బంధన్ 35 స్థానాలకు పరిమితమైంది. ప్రశాంత్ కిశోర్ నాయకత్వంలోని జన్ సురాజ్‌పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం తన 5 స్థానాలను నిలబెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఎన్డీఏ కూటమి విజయం సాధించడం విశేషం. యువనేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) నాయకత్వంలోని లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ(ఆర్వీ) 28 స్థానాల్లో పోటీ చేయగా 19 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాగా, చిరాగ్ పాశ్వాన్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశముందని వార్తలు వ స్తున్నాయి.తాజా సమాచారం ప్రకారం పార్టీల వారీగా ఫలితాలు ఇలా.. పార్టీ ఆధిక్యం1 భారతీయ జనతా పార్టీ -బీజేపీ892జనతాదళ్ (యునైటెడ్)- జేడీయూ853రాష్ట్రీయ జనతాదళ్- ఆర్జేడీ254లోక్ జనశక్తి (రామ్ విలాస్)195ఇండియన్ నేషనల్ కాంగ్రెస్66 ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 57 హిందుస్థానీ అవామ్ మోర్చా- హెచ్ఏఎంఎస్ 58రాష్ట్రీయ లోక్ మోర్చా- ఆర్ఎస్హెచ్టీఎల్కేఎం49సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్210ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీ - ఐఐపీ111కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)112బహుజన సమాజ్ పార్టీ- బీఎస్పీ1 Total243 -
మహా కూటమికి ఘోర పరాభవం!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ప్రస్తుతం 190 ఫ్లస్ లీడ్‌తో హిస్టారికల్ విక్టరీ అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ట్రెండ్స్ ప్రకారం.. మహాఘట్ బంధన్ ఘోర పరాజయం దిశగా పయనిస్తోంది. మరోవైపు.. అయితే ఘనవిజయం లేదంటే ఘోర పరాజయం అంచనా వేసిన ఎన్నికల మాజీ వ్యూహకర్త, జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ జోస్యం మాత్రం నిజం కాబోతోంది. ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్‌కు ఇది తొలి ఎన్నికలు. అయితే ఆశించిన విజయాన్ని అందుకోకున్నా.. ఈ పార్టీ ఎక్స్ఫ్యాక్టర్గా పని చేయొచ్చని విశ్లేషకులు భావించారు. ఎగ్జిట్‌పోల్స్ మాత్రం జేఎస్పీ ఘోరంగా విఫలమవుతుందని, ఒక్క సీటు మాత్రమే గెలిచే అవకాశం అంతంత మాత్రంగా ఉందని అంచనా వేశాయి. కానీ, ఆ అంచనా కూడా తప్పేలా కనిపిస్తోంది.ఇవాళ్టి బిహార్ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్, ఆపై ఈవీఎం కౌంటింగ్‌లోనూ రెండు నుంచి 4 స్థానాల్లో ఆధిక్యం కనబర్చింది. ఆ తర్వాత నెమ్మదిగా సున్నాకే పరిమితమైంది. ఇప్పుడు ఒక్క స్థానం దక్కించుకోవడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. చివర్లో ఎలాంటి ఫలితం దక్కించుకుంటోందో చూడాలి. ఎన్నికల వ్యూహకర్తగా నితీశ్ కుమార్ సహా పలువురి విజయాల్లో పీకే కీలక పాత్ర పోషించారు. అయితే.. సొంత పార్టీతో మూడేళ్లుగా చేస్తున్న ప్రచారం మాత్రం వర్కవుట్ కాలేదనే స్పష్టం చేస్తోంది.ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీహార్ ఎన్నికల్లో జేడీయూ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా నితీశ్ పని అయిపోయిందని విపక్షాలు చేస్తున్న ప్రచారానికి ఈ ఫలితం పుల్‌స్టాప్ వేసిందని భావించొచ్చు. ఇక అధికార మిత్రపక్షం బీజేపీ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. తుది ఫలితాలు వెల్లడయ్యేలోపు ఈ లెక్క కొంచెం మారే అవకాశం లేకపోలేదు. గత ఎన్నికల్లో ఆర్జేడీ(75), బీజేపీ(74), జేడీయూ(43), కాంగ్రెస్(19).. ఇలా ప్రధాన పార్టీలు సీట్లు దక్కించుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎన్డీయే హవా చూస్తుంటే ఆర్జేడీ+కాంగ్రెస్+ఇతర పార్టీల కూటమి సగానికి పైగా స్థానాలను కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇక్కడో విచిత్రం ఏంటంటే.. 200 స్థానాల్లో పీకే జేఎస్పీ డిపాజిట్లు కొల్పోయింది. విపక్ష కాంగ్రెస్ కంటే.. పీకే జేఎస్పీ ఓటు శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు(అంచనా మాత్రమే). మొత్తంగా ప్రశాంత్ కిషోర్ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ.. మహాఘట్ బంధన్ ఓట్లను చీల్చడం ద్వారా NDAకి లాభం చేకూర్చిందనే చర్చ మొదలైందక్కడ. -
మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకుపోతున్న NDA


