బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఎన్డీఏ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాగఠ్‌బంధన్ ఊహించని విధంగా ఘోర పరాజయం చవిచూడబోతోందని ఎన్నికల ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్‌ను బిహారీలు పట్టించుకోలేదని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం మూడు చోట్ల ఆధిక్యంలో ఉంది. బహుజన సమాజ్ పార్టీ ఒక చోట లీడింగ్‌లో ఉంది.
యువనేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) నాయకత్వంలోని లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎల్‌జేపీ(ఆర్వీ) 29 స్థానాల్లో పోటీ చేయగా 19 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాగా, చిరాగ్ పాశ్వాన్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశముందని వార్తలు వ స్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం పార్టీల వారీగా ఫలితాలు ఇలా..
పార్టీ | ఆధిక్యం | |
| 1 | జనతాదళ్ (యునైటెడ్)- జేడీయూ | 81 |
| 2 | భారతీయ జనతా పార్టీ -బీజేపీ | 90 |
| 3 | రాష్ట్రీయ జనతాదళ్- ఆర్‌జేడీ | 28 |
| 4 | లోక్ జనశక్తి (రామ్ విలాస్) | 20 |
| 5 | సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ | 4 |
| 6 | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | 5 |
| 7 | హిందుస్థానీ అవామ్ మోర్చా | 4 |
| 8 | రాష్ట్రీయ లోక్ మోర్చా- ఆర్‌ఎస్‌హెచ్‌టీఎల్‌కేఎం | 4 |
| 9 | ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | 5 |
| 10 | వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ- వీఐపీ | 1 |
| 11 | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | 1 |
| 12 | బహుజన్ సమాజ్ పార్టీ- బీఎస్పీ | 1 |
Total | 243 |


