ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు చొప్పున ఒక మంత్రి పదవి
బిహార్‌లో ఎన్డీయే పక్షాల మధ్య అంగీకారం
బీజేపీకి 14 మంత్రి పదవులు దక్కే అవకాశం
ఈ నెల 19 లేదా 20న నూతన సీఎం ప్రమాణ స్వీకారం
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకున్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. నూతన మంత్రివర్గం కూర్పుపై బీజేపీ, జేడీ(యూ)తోపాటు కూటమి పక్షాల మధ్య తొలి దశ చర్చలు ఇప్పటికే ముగిశాయి. మంత్రి పదవుల పంపకంపై ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఒక ఫార్ములాపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున తీసుకోవడమే ఈ ఫార్ములా సారాంశం.
ఈ లెక్కన ఎన్నికల్లో బీజేపీ 89 సీట్లు సాధించింది కాబట్టి ఫార్ములా ప్రకారం ఆ పారీ్టకి 14 మంత్రి పదవులు లభిస్తాయి. జనతాదళ్(యునైటెడ్)కు సైతం ఇదే సూత్రానికి అనుగుణంగా మంత్రి పదవులు కేటాయిస్తారు. ఎలాంటి గందరగోళానికి, వివాదానికి తావులేకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీయే పక్షాలు నిర్ణయానికి వచ్చాయి. ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించాలన్న దానిపై మరోసారి చర్చించబోతున్నారు
ఢిల్లీలో నేడు కీలక సమావేశం
జేడీ(యూ) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్ ఝా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు పూర్తి చేసుకొని ఆదివారం పట్నాకు తిరిగివచ్చారు. ఆయన సోమవారం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలుసుకోబోతున్నారు. జేడీ (యూ) శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటుపై చర్చిస్తారు. సోమవారమే ఈ సమావేశం జరుగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో ఎన్డీయే పక్ష నాయకుడిని ఎన్నుకొనే ప్రక్రియను ఈ నెల 18వ తేదీలోగా పూర్తిగా చేయాలని నిర్ణయానికొచ్చారు.
ఎన్డీయేలోని చిన్న పారీ్టలు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నాయి. హిందుస్తానీ అవామీ మోర్చా నాయకుడు జితన్‌రామ్ మాంఝీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతోపాటు బీజేపీ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. రా్రïÙ్టయ లోక్‌మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. లోక్‌జనశక్తి పార్టీ(రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ సైతం బీజేపీ అధిష్టానంతో చర్చలకు సిద్ధమయ్యారు. మంత్రి పదవుల పంపకం విషయంలో ఎన్డీయే పక్షాల మధ్య కీలక భేటీ సోమవారం జరగనున్నట్లు సమాచారం.
నేడు బిహార్ కేబినెట్ భేటీ
బిహార్ 18వ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను ఎన్నికల సంఘం బిహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు సమరి్పంచింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వరలో సోమవారం కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రస్తుత 17వ శాసనసభను రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదిస్తారు. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకొని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమరి్పస్తారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్డీయే ప్రకటిస్తుంది. తమను ఆహా్వనించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తుంది.
తదుపరి ముఖ్యమంత్రి నితీశ్ కుమారే?
బిహార్ నూతన సీఎంతోపాటు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం కోసం పట్నాలోని గాంధీ మైదాన్‌లో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నెల 19 లేదా 20వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని ఎన్డీయే వర్గాలు వెల్లడించాయి. మోదీ షెడ్యూల్‌ను బట్టి తేదీని ఖరారు చేస్తామని తెలిపాయి. బిహార్ సర్కార్ ప్రమాణ స్వీకారానికి మోదీపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తదుపరి ముఖ్యమంత్రి నితీశ్ ప్రమా ణ స్వీకారం చేస్తారని జేడీ(యూ) నేతలు స్పష్టంచేస్తున్నారు. మరోవైపు కొత్త సీఎం ఎవరన్నదానిపై ఊహాగానాలకు ఇంకా తెరపడలేదు. నితీశ్ కుమార్‌కు మరోసారి అవకాశం ఇస్తారా? లేక బీజేపీ నాయకుడే సీఎం అవుతారా? అనేది అతి త్వరలో తేలిపోనుంది.
18 మంది మంత్రుల ప్రమాణం?
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో ముఖ్యమంత్రితోపాటు 18 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో మొత్తం నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరికి మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే పార్టీ నుంచి రాంకృపాల్ యాదవ్, మంగళ్ పాండే కూడా రేసులో ఉన్నారు. లోక్ జనశక్తి(రామ్‌విలాస్), రా్రïÙ్టయ లోక్‌మోర్చా కూడా బిహార్ కేబినెట్‌లో చేరబోతున్నాయి. ఈసారి మంత్రివర్గంలో 30 నుంచి 32 మంది ఉండవచ్చని తెలుస్తోంది. జేడీ(యూ), బీజేపీల నుంచి సమాన సంఖ్యలో మంత్రులు కానున్నారు. చిరాగ్ పాశ్వాన్ పారీ్టకి మూడు మంత్రి పదవులు, జితన్‌రామ్ మాంఝీ, ఉపేంద్ర కుషా్వహా పార్టీల నుంచి ఒక్కొక్కరికి చోటుదక్కే అవకాశం ఉంది. మొత్తం 36 మంది మంత్రులు ఉండవచ్చు.


