ఢిల్లీ: బిహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బిహార్ ప్రజలు అద్భుత విజయం అందించారన్నారని.. ప్రజలు వికసిత్ భారత్‌కు ఓటేశారన్నారు. బిహార్‌లో ఇవాళ ప్రతీ ఇంట మఖానా పాయసం వండుకుని సంతోషిస్తారన్న మోదీ.. బిహార్ జంగిల్ రాజ్ అన్నప్పుడు ఆర్జేడీ నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేదని.. బిహార్‌లో ఆ జంగిల్ రాజ్ ఎప్పటికీ తిరిగిరాదన్నారు.
మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నాం. రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొని ఏన్డీఏకు అద్భుత విజయం అందించారు. బిహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్దలుకొట్టారు. జంగిల్ రాజ్‌లో ఏం జరిగిందో అందరికి తెలుసు. జంగిల్‌రాజ్‌లో దోపిడీ, అక్రమాలు, హింస ప్రజలు అనుభవమే. ఈ విజయంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. ఒకప్పుడు బిహార్‌లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. అరాచక శక్తుల కారణంగా ఎన్నికలు మధ్యాహ్నం 3 గంటలకే ముగిసిపోయేది. కానీ ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా, ధైర్యంగా వచ్చి రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొన్నారు.’’ అని మోదీ పేర్కొన్నారు.


సునామీ తరహాలో తీర్పు: జేపీ నడ్డా
ప్రధాని మోదీ నేతృత్వంలో బిహార్‌లో ఎన్డీఏ అద్బుత విజయం సాధించింది. బిహార్ ప్రజలు సునామీ తరహాలో తమ తీర్పును వెలువరించారు. ఈ అద్భుత విజయం బీజేపీని మరింత బలోపేతం చేసింది. బాధ్యత పెంచింది. ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి తమ ప్రేమను విశ్వాసాన్ని చూపించారు. మహారాష్ట, ఢిల్లీలో కూడా బీజేపీని ప్రజలు అద్భుతంగా ఆదరించారు. రికార్డు స్థాయిలో అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపించారు. మహాగఠ్ బంధన్‌ను బీహారీలు తిరస్కరించారు.


