సాక్షి, వికారాబాద్: రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొన్నారనే అనుమానం కలుగుతుందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ అవినీతిపై ఎందుకు కేసులు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మీడియా ముందు తొండలు జోర్రగొడతా అంటూ.. అసెంబ్లీలో కేసీఆర్ ముందు దండాలు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు.
హిల్ట్ పాలసీపై చర్చ ఎందుకు పెట్టడం లేదు? గ్లోబల్ సమ్మిట్, విదేశీ పెట్టుబడులపై చర్చించే దమ్ము దైర్యం ఉందా?. లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ పోయాయి?. ప్రతి వర్గానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై చర్చించే దమ్ము దైర్యం ప్రభుత్వానికి ఉందా?. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికి సమయం లేదా?. ప్రధాన ప్రతిపక్ష నేతతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని, పాలన గాలికి వదిలేశారు’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.


