Balkampet: ఎల్లమ్మా... మాయమ్మ | balkampet yllamma temple irregularities allegations | Sakshi
Sakshi News home page

Balkampet: ఎల్లమ్మా... మాయమ్మ

Mar 3 2026 7:21 AM | Updated on Mar 3 2026 11:31 AM

balkampet yllamma temple irregularities allegations

సనత్‌నగర్‌: ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి సంబంధించి వెలుగుచూడని మరెన్నో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓ అధికారి వచ్చిన దగ్గరనుంచి అంతా అస్తవ్యస్తంగా మారిందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు టెండర్లలో ఎలాంటి భాగస్వామ్యం ఉండకూడదు. కానీ, ఆ అధికారి కుమారుడు టెంట్‌హౌస్‌ టెండర్లలో భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. కార్య నిర్వహణాధికారి (ఈవో)గా ఎవరొచి్చనా పెత్తనం మాత్రం ఆ అధికారిదే అనే విమర్శలున్నాయి. భక్తులు సమరి్పంచే చీరల్లో రూ.10 వేలు దాటిన పట్టుచీరలు ఆ అధికారి చేతుల్లోకి వెళ్తాయన్న ఆరోపణలున్నాయి.  

  • టెండర్‌ దక్కించుకున్న వారు అధికారికి కమీషన్‌ ముట్టచెబితేనే బిల్లులు విడుదలవుతాయి. 

  •  బంగారం, వెండి ఆభరణాలు చేయించి ఇచ్చే సమయంలో ధర్మకాంటా వేసి ఆ రిసిప్టును జత చేసి  ఈవోకు సమరి్పస్తారు. ఎవరైతే దీనిని తీసుకున్నారో ఆ గుమాస్తా సంతకంతో పాటు ఈఓ సంతకం కూడా చేస్తారు. కాగా కానుకలు ఇచి్చన భక్తులకు రిసిప్టులు ఇవ్వలేదని తెలుస్తోంది. మంత్రి ఆకస్మిక పర్యటన అనంతరం.. రిసిప్టులు తీసుకోనివారు క్యూ కడుతున్నారు. ఒకవేళ విచారణకు వస్తే తమకే రిసిప్టు తీసుకోవడానికి కుదర్లేదని చెప్పాలంటూ సదరు అధికారి నుంచి ఫోన్లు కూడా వెళ్తున్నట్లు వినికిడి.  

  •  అమ్మవారికి మూగజీవం బలి ఇచ్చేందుకు రూ.550 నిర్దేశించారు. ఇక్కడ రూ.1000–1200 వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి.

ఈవోపై వేటు 
అమీర్‌పేట: బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఇన్‌చార్జి ఈవో (కార్యనిర్వాహణ అధికారి) తమ్మినేని శేఖర్‌ను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఇటీవల మంత్రి సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణ, పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆలయం రికార్డులను స్వా«దీనం చేసుకుని, పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శాఖ కమిషనర్‌ సోమవారం సాయంత్రం ఆలయ ఈవోను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.  

Advertisement
 
Advertisement
Advertisement