సీఎంగా నితీశ్ కొనసాగాలని కోరుకుంటున్నా
సీఎం నితీశ్‌తో భేటీ అనంతరం చిరాగ్ పాశ్వాన్
పట్నా: బిహార్‌లో కొత్తగా ఏర్పాటయ్యే ప్ర భుత్వంలో తామూ చేరాలనుకుంటున్నట్లు లోక్ జనశక్తి పార్టీ(రాం విలాస్) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. ముఖ్య మంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగాలని తా ను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసిన 28 సీట్లలో 19 చోట్ల విజయం సాధించింది. శనివారం చిరాగ్ పట్నాలో తన పార్టీ నూతన ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తామంతా సీఎం నితీశ్‌ను కలిసి ఘన విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపామన్నారు. అదేవిధంగా, నూతన ప్రభుత్వంలో తాము కూడా చేరుతామని చెప్పారు.
సీఎం, డిప్యూటీ సీఎంలు ఎవరనేది శాసనసభ్యులే నిర్ణయిస్తారన్నారు. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగాలని వ్యక్తిగతంగా భావి స్తున్నానన్నారు. నితీశ్ సారథ్యంలోని జేడీ యూకు బీజేపీ కంటే నాలుగు తక్కువగా 85 సీట్లు దక్కాయి. 2020 ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమి పక్షమైన బీజేపీ కంటే తక్కువ సీట్లే లభించాయి. నితీశ్ తనకు విభేదాలున్నట్లు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. శాసనసభలో ఒక్క సీటు కూడా తమకు లేకున్నా 29 స్థానాలను కేటాయించిన తమ కూటమి కేంద్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


