తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అరైవ్ అలైవ్ కార్యక్రమం ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది.
ఇందులో ప్రముఖులు, సామాన్యులు తమ బాధల్ని పంచుకున్నారు. ప్రమాదాల కారణంగా ఏర్పడిన లోట్లను వివరించారు.
రోడ్డు భద్రతపై రూపొందించిన పాటలు, అరైవ్-అలైవ్ పోస్టర్ను డీజీపీ బి.శివధర్రెడ్డి, సీపీ వీసీ సజ్జనర్ ప్రారంభించారు. డీజీపీ, కొత్వాల్ 'గుడ్ సమరిటన్ల'ను ఘనంగా సన్మానించారు. కుమారుడి మరణాన్ని గుర్తు చేసుకున్న నటుడు బాబూ మోహన్ కన్నీటి పర్యంతం అయ్యారు.


