lb stadium
-
ఇందిరమ్మ ఇళ్లలో దళిత క్రైస్తవులకు ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో దళిత క్రైస్తవులకు ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పదవుల్లోనూ వారికి తగిన స్థానం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా చూడడమే తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. ఎల్బీస్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేకు కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజలకు డిసెంబర్ ఒక అద్భుతమైన మాసం. ఇదే నెలలో ఏసుక్రీస్తు పుట్టారు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన ఈ నెలలోనే వచ్చిoది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎంతో ఉత్సాహాన్నిచ్చే నెల కూడా ఇదే. ఎందుకంటే పార్టీ నేత సోనియాగాంధీ పుట్టిన రోజు కూడా ఈ నెలలో ఉంది. మా ప్రభుత్వం ఏర్పాటైంది కూడా డిసెంబర్లోనే’అని గుర్తుచేశారు. క్రిష్టియన్ మిషనరీల సేవలు అద్భుతం నిన్ను నువ్వు ప్రేమించుకో, పొరుగువారిని ప్రేమించు అన్న ఏసుక్రీస్తు బోధనలు అనుసరిస్తే జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందని సీఎం అన్నారు. మానవ సమాజానికి అత్యంత ప్రధానమైన విద్య, వైద్యం అందించటంలో క్రైస్తవ మిషనరీలు ప్రభుత్వాలతో పోటీ పడుతున్నాయని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ పదవుల్లోనూ దళిత క్రైస్తవులకు అవకాశం కల్పిస్తామని, ఆసక్తి ఉన్నవాళ్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు వివరాలు ఇవ్వాలని సూచించారు. సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబి్ధదారులను ఎంపిక చేస్తామని, వారిలో దళిత క్రైస్తవులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా కమిటీల్లో వారి కోటా తప్పకుండా వారితోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, పొంగులేటి పాల్గొన్నారు. -
దేశ ప్రతిష్ఠను పెంచేది క్రీడా మైదానాలే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదికగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం కప్-2024 ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. 25 ఏళ్ల క్రితం కామన్వెల్త్, ఆప్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించి హైదరాబాద్ క్రీడలకు తలమానికంగా నిలబడింది. క్రీడల్లో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా ఉండేది. తెలంగాణ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేశారు. హైదరాబాద్ నగర యువత క్రీడల వైపు వెళ్లకుండా వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఇది బాధ కలిగిస్తోంది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదికగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాను.నిఖత్ జరీన్ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇండియాకు బాక్సింగ్‌లో తలమానికంగా మారారు. జరీన్‌ను డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. తెలంగాణలో క్రీడల్లో రాణిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనడానికి నిఖత్ జరీన్ నిదర్శనం. నిబంధనలు సడలించి మహ్మద్ సిరాజ్‌కు కూడా డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాము. పీవీ సింధు, అజారుద్దీన్ లాంటి హైదరాబాదీలు దేశానికే పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. పుట్ బాల్ కోచ్ రహీమ్ సార్ హైదరాబాద్ నగరానికి చెందిన వారు కావడం గర్వకారణం. హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావాలని అండర్-17 పుట్ బాల్ నేషనల్ టీంను తెలంగాణ దత్తత తీసుకుంటోంది.చిన్న దేశం దక్షిణ కొరియా ఒలంపిక్స్‌లో 36 పతకాలు సాధించింది. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తాం. దక్షిణ కొరియా కోచ్‌లను ఇక్కడికి రప్పించి శిక్షణ ఇస్తాం. మతాలకు అతీతంగా అందరూ కలిసేది క్రీడా మైదానంలోనే. దేశ ప్రతిష్ఠను పెంచేది క్రీడా మైదానాలే. ఎల్బీ స్టేడియాన్ని అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్దుతాం. యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు. క్రీడల్లో రాణిస్తే దేశ ప్రతిష్టను పెంపొందించే అవకాశం ఉంటుంది. 2028 ఒలింపిక్స్‌లో దేశం తరపున తెలంగాణ క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలి. రాష్ట్ర క్రీడాకారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని కష్టపడి పనిచేస్తే సాధించలేనిది లేదు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
9న టీచర్ నియామక పత్రాలు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2024 కింద ఎంపికయ్యే ఉపాధ్యాయులకు అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో నియామక పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దసరా నాటికి టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ మేరకు 65 రోజుల్లోనే డీఎస్సీ పూర్తి చేశామని.. విద్యను పేదవాడి ముంగిటకు చేర్చడ మే ధ్యేయంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.తమ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని తెలిపారు. డీఎస్సీ రాసిన వారి మెరిట్ జాబితాల్లోంచి ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున ఎంపిక చేస్తామని.. ఆ జాబితాలను జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)కి పంపుతామని సీఎం చెప్పారు. అక్కడ తుది ఎంపిక జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని.. అదీ 7,857 మంది టీచర్లనే నియమించిందని పేర్కొన్నారు. అదే తాము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. పది నెలల్లోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అడుగులు వేశామని చెప్పారు. ఉపాధ్యాయులంటే.. ఓ భావోద్వేగం ఉపాధ్యాయులు అంటే ఉద్యోగి కాదని, ఓ భావోద్వేగమని సీఎం అభివర్ణించారు. కీలకమైన ఈ రంగం గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. విద్యా రంగానికి భవిష్యత్‌లో మరిన్ని నిధులు ఇస్తామని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రా«ధాన్యమిస్తామని ప్రకటించారు. పబ్లిక్ సరీ్వస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, వివాదాలకు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించామని సీఎం తెలిపారు. గ్రూప్–1 పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు సీఎం రేవంత్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఒకే చోట ఉంచి విద్యను అందించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతీ రెసిడెన్షియల్ స్కూల్‌ను 20 నుంచి 25 ఎకరాల్లో రూ.125 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం మధిర, కొడంగల్ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా వీటిని చేపడుతున్నామని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీల మీడియాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.గత పదేళ్లు ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ బడులను కొనసాగిస్తామని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. తాము జాతీయ నూతన విద్యా విధానం కన్నా.. రాష్ట్ర విద్యా విధానంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తు మ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేం దర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు. -
మీ చేతుల్లోనే రాష్ట్ర భవిత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భవిష్యత్ టీచర్ల చేతుల్లోనే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. ఉపాధ్యాయులు తేనెతుట్టె వంటి వారని.. వారికి ఎవరైనా అపకారం చేస్తే తేనెటీగల్లా ఎదురుదాడి చేస్తారని వ్యాఖ్యానించా రు. తమ ప్రభుత్వానికి ఉపాధ్యాయులే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం ఆతీ్మయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే క్రమంలో ముందుంటాం. 15 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న 30వేల మంది టీచర్ల పదోన్నతులు చేపట్టడం గర్వకారణం. బడ్జెట్లో విద్యారంగానికి 10% కేటాయించాలనుకున్నా.. హామీల అమలు దృష్ట్యా 7.3% నిధులే ఇవ్వగలిగాం. స్కూళ్లలో దారుణ పరిస్థితులు.. గురుకులాలతో కలిపి రాష్ట్రంలో 30వేల ప్రభుత్వ స్కూళ్లుంటే వాటిలో 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే ప్రైవేటు స్కూళ్లు 10వేలు ఉంటే వాటిలో 33 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రైవేటు స్కూళ్లలో గొప్ప టీచర్లున్నారా? టెన్త్, ఇంటర్ ఫెయిలైన వాళ్లతో పాఠాలు చెప్పిస్తున్నారు. ఎక్కడో లోపం ఉంది. దీనికి ప్రభుత్వ విధానాలూ కారణమే. మౌలిక వసతులు లేక విద్యార్థులు ప్రైవేటుబాట పడుతున్నారు.మహిళా టీచర్లు పనిచేసే ప్రాంతాల్లో కూడా టాయిలెట్లు లేవు. కొన్నిచోట్ల స్కూళ్లలో పశువులను కట్టేసే పరిస్థితి. మేం పాఠశాలలను మెరుగుపరిచే బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించాం. ప్రతీ ప్రభుత్వ స్కూల్‌కు ఉచిత విద్యుత్ అందిస్తాం. పారిశుధ్య కారి్మకులను నియమిస్తాం. మీరే అంబాసిడర్లు.. తెలంగాణ సాధనలో టీచర్ల పాత్ర కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకునే వారి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిచ్చాం. టీచర్లతో పెట్టుకోవద్దని చాలామంది నాకు సలహా ఇచ్చారు. కానీ వారిలో విశ్వాసం నింపుతాననే నమ్మకం నాకు ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేదల భవిత టీచర్ల చేతుల్లోనే ఉంది. గత ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు 2 లక్షల మేర తగ్గాయి. అందువల్ల టీచర్లు ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలను పంపడం ఆత్మగౌరవంగా భావించే పరిస్థితి తేవాలి..’’అని సీఎం రేవంత్ కోరారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీజేఎస్ చీఫ్ కోదండరాం, ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. పేరుకేనా ముఖాముఖి: టీచర్ల అసంతృప్తి ప్రమోషన్లు పొందిన వారితో సీఎం ముఖాముఖి అని చెప్పి అధికారులు తమను తీసుకొచ్చారని.. కానీ ఒక్కరికైనా మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని సమావేశం అనంతరం టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి విద్యాశాఖ అధికారులు వారం రోజుల నుంచే ఈ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఉపాధ్యాయులను తరలించేందుకు ప్రతీ జిల్లా నుంచి పెద్ద ఎత్తున వాహనాలు ఏర్పాటు చేశారు. దీంతో టీచర్లు ఏమేం మాట్లాడాలో ముందే సిద్ధం చేసుకున్నారు.కనీసం జిల్లాకు ఒకరినైనా సీఎంతో మాట్లాడిస్తారని భావించామని.. కానీ సమావేశం కేవలం ప్రసంగాలకే పరిమితమైందని టీచర్లు పేర్కొన్నారు. గతంలో చెప్పినవే ఇప్పుడూ చెప్పారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా విద్యా రంగ సమస్యల పరిష్కారానికి హామీ ఇచి్చన సీఎంకు పీఆరీ్టయూటీఎస్ నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. -
తెలంగాణ భవిష్యత్ మా చేతుల్లో కాదు.. మీ చేతుల్లోనే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్ టీచర్ల చేతుల్లోనే ఉందన్నారు. ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ భవిష్యత్ ఎక్కడుందని.. ఈ క్షణం తనను అడిగితే.. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతానన్నారు.‘‘30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్‌ను మీ చేతుల్లో పెట్టారు. రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం.. ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నాం.. కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్యలాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నాం.. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశాం.. గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశాం’’ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘ఈ బడ్జెట్లో విద్యకు 10 శాతం కేటాయించాలని భావించాం. కానీ హామీల అమలు దృష్ట్యా 7.3 శాతం అంటే రూ.21 వేల కోట్లకు పైగా కేటాయించాం. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30 వేల పాఠశాలల్లో.. 26 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు.. 10వేల ప్రయివేట్ పాఠశాలల్లో.. 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.. ప్రైవేట్ పాఠశాలలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా?. మౌళిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు’’ అంటూ రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.‘‘తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా ఉంది... ఇది కఠోర నిజం. టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు.. హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేందుకు ప్రతీ నెలా 1వ తేదీనే జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నాం. పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించాం. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘తెలంగాణ భవిష్యత్ మా చేతుల్లో కాదు.. మీ చేతుల్లో ఉందని చెప్పేందుకే ఈ సమావేశం.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేను ఈ స్థాయికి చేరా.. అలాంటి ప్రభుత్వ టీచర్లను కలుసుకునేందుకే ఈ ఆత్మీయ సమావేశం. టీచర్లంతా నిబద్ధతతో పనిచేయాలి.. విద్యార్థులకు విద్యనందించాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.‘‘గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షలకుపైగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మ గౌరవమని భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి. ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మాకు ఎలాంటి భేషజాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యత అప్పగించాం. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘తెలంగాణ బలపడాలంటే మనందరం కార్యదీక్షతో పనిచేయాలి. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల్లో మినీ స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరుగుతోంది. అందుకే ముచ్చెర్లలో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. స్కిల్ యూనివర్సిటీలో యువకులకు నైపుణ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం. మీరు నేర్పే విద్యనే రేపటి తెలంగాణ భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే మీ లక్ష్యం కావాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు. -
జూన్ 4న దేశం గెలుస్తుంది: ప్రధాని మోదీ.
సాక్షి,హైదరాబాద్: జూన్ 4న దేశం గెలుస్తుందని, 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే పాత రోజులను ఆహ్వానించినట్లే.. దేశం ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లకూడదు.2012లో దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు జరిగాయి. ఎంతో మంది అమాయకులు కాంగ్రెస్ పాలనలో బలయ్యారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకే బాంబు పేలుళ్లు ఆగాయి. అందుకే మోదీని దించాలని చాలామంది చూస్తున్నారు. కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్ వద్దు. మజ్లిస్ వద్దని తెలంగాణ అంటోంది. బీజేపీ కావాలంటోంది. లూటీ లూటీ లూటీ, వారసత్వ రాజకీయాలు ఇవే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు. మీ సంపదను లాక్కునే వాళ్లు కావాలా.. మీ సంపదపై మీ పిల్లలకు హక్కుఉండాలా వద్దా. రాముడికి పూజ చేయడం తప్పా. నాకు హైదరాబాద్ చాలా ప్రత్యేకం. యువరాజుకు ట్యూషన్ చెప్పే నేత రామ నవమి చేసుకోవడం తప్పన్నారు. కాంగ్రెస్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు కోత పెట్టి ముస్లింలకు కోటా ఇచ్చింది. ఇదీ కాంగ్రెస్ పార్టీ మోడల్. తెలంగాణకు ఎయిమ్స్, వందేభారత్ రైళ్లు ఇచ్చిందెవరో చెప్పాలి’అని మోదీ ప్రసంగించారు. -
Directors Day 2024: డైరెక్టర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహిస్తాం
దివంగత దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని మే 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దాసరి జయంతి అయిన మే 4న ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ– ‘‘దాసరి నారాయణరావుగారి జయంతిని ఈ ఏడాది మే 4న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ ఈవెంట్ ద్వారా ఫండ్ రైజ్ చేసి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం, మిడ్ డే మీల్స్, అసోసియేషన్‌కు కొత్త బిల్డింగ్ నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమాల కల్చరల్ కమిటీలో డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, నందినీ రెడ్డి, అనుదీప్ కేవీ, విజయ్ కనకమేడల ఉంటారు’’ అన్నారు. -
ధర్మయుద్ధానికి సిద్ధం కావాలి
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే ధర్మ యుద్ధానికి (లోక్‌సభ ఎన్నికలకు) పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని కేంద్రమంత్రి బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అందరూ కష్టపడి పనిచేసి ధర్మం, న్యాయం కోసం కృషిచేస్తున్న మోదీని మరోసారి ప్రధానిని చేయాలని కోరారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ముఠా వందరోజుల్లో రాష్ట్రంలోని బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పరిశ్రమలు, కాంట్రాక్టర్ల దగ్గర రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. ‘మన అందరి ఎజెండా ఒకటే..ఏప్రిల్‌లో జరగనున్న ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలి. గత పదేళ్లలో మోదీ సర్కార్ తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. 12 సీట్లు గెలుస్తాం : డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ...‘ఆరు నూరైనా.. తెలంగాణలో 12 సీట్లు గెలుస్తాం, కాషాయ జెండా ఎగరేస్తాం. తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఈసారి మోదీకే ఓటని ప్రజలు చెప్తున్నారు. కాంగ్రెస్ అరుగ్యారంటీలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. తెలంగాణలో 17 సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతాడా..? రాహుల్‌ను ప్రధాని అభ్యరి్థగా ఇండియా కూటమే ఒప్పుకోవడం లేదు. రాష్ట్రంలోకాంగ్రెస్ మోసపూరిత పాలనతో ప్రజలు విసుగు చెందుతున్నారు’ అని అన్నారు. బీజేపీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘రాబోయే 40 రోజులు పోలింగ్బూత్లకే కార్యకర్తలు పరిమితమై పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంఐఎంలను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉంది. గ్యారంటీల పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారు’ అని అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ...‘మేము రాముని పేరు చెప్పి బరాబర్ ఓట్లు అడుగుతాం. మీకు దమ్ముంటే బాబర్ పేరు చెప్పి ఓట్లు అడగండి’ అని సవాల్ విసిరారు. ‘అసలు కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరు? ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు చుక్కలు చూపెడతారు. ఒకట్రెండు హామీలు నెరవేర్చి ఎన్నికల కోడ్ వస్తే కాలం గడపొచ్చని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది’ అని అన్నారు. నిజామాబాద్ ఎంపీ అరి్వంద్ ధర్మపురి మాట్లాడుతూ...‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా మోదీకే ఓటేస్తామని జనం అంటున్నారు. వచ్చే నెల, నెలన్నర రోజుల్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ అత్యధిక సీట్లలో గెలిచేలా కృషిచేయాలి’ అని చెప్పారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులకుప్పగా మారిస్తే, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్ ఉందన్నారు. -
ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేసిన సీఎం (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎల్బీ స్టేడియం క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి (ఫొటోలు)
-
సెక్యులర్ ప్రభుత్వంతోనే మత సామరస్యం
సాక్షి, హైదరాబాద్: సెక్యులర్ ప్రభుత్వాల పాలనలోనే మత సామరస్యం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, కేంద్రంలో తిరిగి సెక్యులర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ జి.ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలసి రేవంత్ పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పాలనలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం దక్కుతుందని చెప్పారు. ‘‘డిసెంబర్లో తెలంగాణలో మిరాకిల్ జరుగుతుందని నేను ముందుగానే చెప్పాను. మొన్న హిమాచల్, నిన్న కర్ణాటక, నేడు తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి.పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును అన్ని వర్గాల ప్రజలు కోరుకోవాలి.. అని పేర్కొన్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటా.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చివరి లబ్ధిదారు వరకు అందించే దిశగా పాలన సాగిస్తామని రేవంత్ చెప్పారు. తామంతా పాలకుల మాదిరి కాకుండా సేవకుల్లా పనిచేస్తామని.. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఆ దిశగానే గడీలను బద్దలుకొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించామని.. వారంలో రెండ్రోజులు ప్రజావాణి వింటున్నామని చెప్పారు. మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రజల్లోకి వచ్చిన తాను ఇప్పటివరకు ప్రజలతోనే ఉన్నానని, ఇకపైనా నిత్యం ప్రజల్లోనే ఉంటానని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం మైనార్టీలు ఎన్నో ప్రార్థనలు చేశారని, ఇప్పుడు దేశంలోనూ కొత్త ప్రభుత్వం కోసం అదే తరహాలో ప్రార్థనలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని సీఎం రేవంత్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, డీజీపీ, బిషప్‌లు పాల్గొన్నారు. -
LB Stadium: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, పలువురు పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున అందించే కానుకలను సీఎం రేవంత్ పంపిణీ చేశారు. ఇక, క్రిస్మస్ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘దేశంలో మతసామరస్యానికి పెద్దపీట వేసింది కాంగ్రెస్. అన్ని మతాలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుంది. డిసెంబర్ నెల మిరాకల్ నెల అని ముందే చెప్పా. నేను చెప్పిన మాట నిజమైంది. ఎర్రకోటపై మువ్వెనెల జెండా ఎగిరినప్పుడే దేశంలో మత సామరస్యం పరిడవిల్లుతుంది. మణిపూర్‌లో జరిగిన మారణ కాండ కళ్ల ముందే కనిపిస్తోంది. మణిపూర్‌కు రాహుల్ గాంధీ వెళ్లి శాంతి నెలకోల్పడానికి ప్రయత్నించారు. దాన్ని కూడా ప్రధాని విమర్శించారు. మాకు బలమైన శక్తి వచ్చేలా బిషప్ లంతా ప్రార్థనలు చేయాలి. ఏకే ఆంటోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ లాంటి వారికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చింది. గుడిలో పూజలు చేసే బ్రాహ్మణులకు, చర్చిలో ప్రార్దనలు చేసే బిషప్‌లకు, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇస్తాం. ఏసుక్రీస్తును ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు అండగా ఉంటాం. మీ సమస్యలు చెప్పుకునేందుకు సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ముళ్ళ కంచలు బద్దలు కొట్టి ప్రజావాణి ప్రారంభించాం’ అని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: TSRTC: ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన -
22న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం తరఫున ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. కాగా, రాష్ట్రమంతా ఈ వేడుకలను నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కాంతి వెస్లీ వెల్లడించారు. ప్రభుత్వం ఏటా ఆనవాయితీగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తోందని ఆమె వివరించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు వెల్లడించారు. -
సొంత పెన్ తో రేవంత్ సీఎంగా సంతకం
-
రేవంత్‌రెడ్డి అనే నేను..
ఉదయం నుంచి కాంగ్రెస్ అగ్రనేతల రాక, ఆహ్వానాలు.. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారాలు, సభ.. కొత్త సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం.. అధిష్టానం నేతలకు వీడ్కోలు.. సాయంత్రం సచివాలయం వద్ద హడావుడి.. సీఎం చాంబర్లో రేవంత్ బాధ్యతల స్వీకరణ.. తర్వాత కాసేపటికే కొత్త కేబినెట్ తొలి సమావేశం.. రాత్రిదాకా వాడీవేడిగా చర్చలు.. మొత్తంగా రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిరోజు హడావుడిగా కనిపించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు రేవంత్‌రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. వారంతా తాజ్‌కృష్ణ హోటల్‌కు వెళ్లగా.. రేవంత్ తన నివాసానికి వెళ్లి, అక్కడి నుంచి కుటుంబంతో కలసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మళ్లీ తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకుని, కాంగ్రెస్ అగ్రనేతలతో కలసి ఎల్బీ స్టేడియానికి వచ్చారు. గవర్నర్ తమిళిసై సీఎంగా రేవంత్‌తో, ఇతర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారాలు ముగిశాక గవర్నర్, ఏఐసీసీ నేతలు వెళ్లిపోగా.. రేవంత్ ప్రజలను ఉద్దేశించి సీఎంగా తొలి ప్రసంగం చేశారు. తర్వాత మళ్లీ తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లారు. ఏఐసీసీ పెద్దలతో కలసి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డి సచివాలయానికి వచ్చారు. గౌరవ వందనం స్వీకరించి, సచివాలయమంతా కలియతిరిగారు. సీఎం చాంబర్లో లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై మంత్రివర్గం చర్చించింది. ఇక శనివారం అసెంబ్లీ సమావేశం నిర్వహించి కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గురువారం మధ్యా హ్నం 1:19 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్ర మార్క, కేబినెట్ మంత్రులుగా ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ధనసరి అన సూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాందీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, కర్ణాటక, హిమాచల్ సీఎంలు సిద్ధరామయ్య, సుఖి్వందర్సింగ్ సుక్కు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పవిత్ర హృదయంతో అంటూ ఇద్దరు.. ఒకరు ఇంగ్లిష్‌లో.. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు 9 మంది మంత్రులు దైవసాక్షిగా ప్రమాణం చేయగా.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క మాత్రం పవిత్ర హృదయంతో అంటూ ప్రతిజ్ఞ చేశారు. దామోదర రాజనర్సింహ ఇంగ్లి‹Ùలో, మిగతా అందరూ తెలుగులో ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 1:04 గంటలకు రేవంత్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా కొంత ఆలస్యమైంది. ట్రాఫిక్ సమస్య కారణంగా గవర్నర్ 1:17 గంటలకు సభా వేదిక వద్దకు వచ్చారు. రేవంత్ వేదిక దిగి వెళ్లి ఆమెకు స్వాగతం పలికారు. ఆ వెంటనే ప్రమాణ స్వీకారాలు మొదలయ్యా యి. 28 నిమిషాల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం 1:46 గంటలకు ముగిసింది. తర్వాత గవర్నర్ తమిళిసై, కాంగ్రెస్ అగ్రనేతలు వెళ్లిపోయారు. ఓపెన్ టాప్ జీపులో.. కలియదిరిగి.. సోనియాగాంధీతో కలసి రేవంత్‌రెడ్డి ఓపెన్‌టాప్ జీప్‌లో ఎల్బీ స్టేడియంలోకి వచ్చారు. సోనియా గాంధీ ముందు నిలబడగా.. ఆమెకు కాస్త వెనుకగా రేవంత్ నిలబడి స్టేడియంలో కలియదిరిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. తర్వాత రేవంత్ స్వయంగా సోనియాను తోడ్కొని వేదికపైకి వచ్చారు. రాహుల్, ప్రియాంక నడుచుకుంటూ, ప్రజలకు అభివాదం చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. కార్యక్రమం ముగిశాక సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు రేవంత్ స్వయంగా వీడ్కోలు పలికారు. తర్వాత మళ్లీ వేదికపైకి వచ్చి ముఖ్యమంత్రిగా తన తొలి ప్రసంగం చేశారు. సీతక్క.. హోరెత్తిన స్టేడియం మంత్రులందరిలో సీతక్క ప్రమాణ స్వీకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రిగా సీతక్క పేరు ప్రకటించగానే ఎల్బీ స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో హోరెత్తింది. ఆ హోరులో సీతక్క ఒక నిమిషం పాటు ఆగిపోవాల్సి వచ్చింది. ఇది చూసి వేదికపై ఉన్న పెద్దలు, నేతలంతా ఆశ్చర్యపోయారు. ప్రమాణం కొనసాగించాలంటూ గవర్నర్ తమిళిసై సైగ చేయడంతో సీతక్క ఆ హోరులోనే ప్రమాణ స్వీకారం కొనసాగించారు. తర్వాత సోనియా వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. సోనియా లేచి నిలబడి సీతక్కను హత్తుకుని అభినందించారు. అగ్రనేతలతో.. ఒకే వాహనంలో.. గురువారం ఉదయం రేవంత్‌రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరి పెద్దమ్మ గుడికి వెళ్లారు. అక్కడ పూజలు చేసిన తర్వాత తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌గా ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకలతో కలసి రేవంత్ ఒకే వాహనంలో కూర్చున్నారు. సోనియా సభావేదికపై వచ్చాక రేవంత్‌రెడ్డి మనువరాలిని చూసి ముద్దాడారు. ప్రమాణ స్వీకారాలు ముగిశాక.. రేవంత్‌రెడ్డి వేదికపైనే ఉన్న తన సతీమణితో కలసి సోనియా దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేశారు. తన కుమార్తెను, అల్లుడిని సోనియా, రాహుల్, ప్రియాంకలకు పరిచయం చేశారు. ప్రమాణ స్వీకారం.. పదనిసలు ► గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ► ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొదట, చివరిలో నల్లగొండ గద్దర్ స్వయంగా రాసి, పాడిన ‘మూడు రంగుల జెండా పట్టి’ పాట పార్టీ శ్రేణులకు హుషారెక్కించింది. ► సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండే సోనియాగాంధీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ం కొలువుదీరే సందర్భంగా హాజరవడం గమనార్హం. గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆమెతోపాటు, రాహుల్, ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ► మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరిని రేవంత్‌రెడ్డి దగ్గరికి తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత మంత్రులు వేదికపై ఉన్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఇతర అగ్రనేతలకు మర్యాదపూర్వకంగా నమస్కరించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రతి మంత్రిని భుజం తట్టి ఆశీర్వదించారు. ► ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. ► రేవంత్ ప్రసంగిస్తూ.. ‘ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే, అక్కడ ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెలు బద్దలుగొట్టాం. ఇకపై అందరూ ప్రగతిభవన్‌కు రావొచ్చు’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమోగింది. ► ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి వస్తున్న పలువురు ప్రముఖుల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. కాగా,ఏపీకి చెందిన టీడీపీ నాయకులు ఆ పార్టీ జెండాలు పట్టుకొని స్టేడియంలో హల్చల్ చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతూ.. టీడీపీ కార్యకర్తలను చితకబాదడంతో అక్కడి నుంచి పారిపోయారు. కాంగ్రెస్ సభలో టీడీపీ జెండాలు ఏమిటని, మళ్లీ టీడీపీ జెండాలు కనిపిస్తే పీకి పారేయాలని సీనియర్ లీడర్లు కార్యకర్తలకు సూచించారు. -
TS CM Revanth Reddy: తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం (ఫొటోలు)
-
సీఎంగా రేవంత్ తొలి ప్రసంగం.. ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి తొలిసారి ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు చేసిందని, దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. ‘‘ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. ప్రమాణ స్వీకారం మొదలైనపుడే అక్కడ ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా... ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలు బద్దలు కొట్టాం. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. ‘‘మేం పాలకులం కాదు.. మేం సేవకులం.. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా.. గుండెల్లో పెట్టుకుంటా’’ అని రేవంత్ చెప్పారు. చదవండి: తెలంగాణ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసింది వీరే -
రేవంత్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీ..
-
Live: ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను..
-
రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపు కొత్త సర్కార్ కొలువుదీరనుంది. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎల్బీ స్టేడియానికి వచ్చే మార్గాల్లో కాకుండా వేరే మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు, ఎస్బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి వైపు, సుజాత స్కూల్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లించనున్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లను సీఎస్ శాంతకుమారి, డీజీపీ రవి గుప్తా పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రేపటి సభలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక.. రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్ రెడ్డికి స్వాగత ఏర్పాట్లు చేశారు. అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ, తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ, ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేశారు. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: తెలంగాణలో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్ -
ఉ.10.28 గంటలకు ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణ స్వీకారం
-
సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం.. కేసీఆర్‌తోపాటు వీరికి ఆహ్వానం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో విజయం సాధించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుపై హస్తం పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు(గురువారం) ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు, అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించారు. రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉండగా.. ఇప్పటికే సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఇక, కాంగ్రెస్ నేతలు రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు. వీరికి ఆహ్వానం పంపనున్నారు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రులు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్. తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపనున్నారు. గతంలో ఇంఛార్టీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్, మరికొందరు ముఖ్యులు. తెలంగాణ ఏర్పాటు కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్, మరికొందరు నేతలు. తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలు కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్య తోపాటు మరికొందరు ఉద్యమ కారులు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపనున్నారు మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటులకు ఆహ్వానం పంపనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు వివిధ కులసంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం పంపనున్నారు. -
నేడు తెలంగాణకు మోదీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ తరపున ప్రచారంకోసం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ప్రధాని మళ్లీ శనివారం మాదిగల విశ్వరూప మహాసభకు హాజరుకానున్నారు. తొలుత బీసీ సీఎం నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రధాని, ఈసారి తెలంగాణతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే కమంలో జరుగుతున్న బహిరంగసభకు హాజరవు తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 9 లేదా 10 శాతానికి పెంచే విషయంపైనా మోదీ ఏదైనా ప్రకటన చేయవచ్చునని ఊహాగానాలు సాగుతు న్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టా త్మకంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర జనాభాలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కలిపి 80 శాతానికి పైగానే ఉండటంతో వీరి మద్దతును కూడగట్టే దిశలో పార్టీ జాతీయ నాయకత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా.. శనివారం సాయంత్రం 5 గంటలకు ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభ’లో ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.35 నిముషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4.45కు ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుని సాయంత్రం 5 నుంచి 5.40 వరకు బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీనేతల సమాచారం. సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. అదేవిధంగా ఈ నెల 26న నిర్మల్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో కూడా మోదీ పాల్గొననున్నట్టు పార్టీనేతల సమాచారం. దీంతో పాటు రాష్ట్రపార్టీ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించే సభకు సైతం మోదీ హాజరవుతారని పార్టీవర్గాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: అమలు గ్యారంటీ -
ఎల్బీ స్టేడియంలో భాజపా బీసీ ఆత్మ గౌరవ సభ
-
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ
-
అవినీతిని అంతం చేస్తాం.. ఇది మోదీ గ్యారంటీ
PM Modi Meeting at LB stadium-Updates.. బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ ప్రసంగం ►పీఎం ఆవాజ్ యోజన్ కింద తెలంగాణలో 2.5 లక్షల ఇళ్లు ఇచ్చాం ► కోవిడ్ కష్టకాలంలో ప్రతీ పేదకుటుంబాన్ని ఆదుకున్నాం. ►పేదలకు ఇచ్చిన ఉచిత రేషన్‌ను మరో 5 ఏళ్లు పెంచుతున్నాం ►బీసీ కమిషన్‌కు మా ప్రభుత్వం రాజ్యాంగ మోదా కల్పించింది. ►తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ►బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంబంధాలు ఉన్నాయి. ►లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తుంటే.. ఈడీ, సీబీఐని ఇక్కడి నేతలు తిడుతున్నారు. ►అవినీతిని అంతం చేస్తాం.. ఇది మోదీ గ్యారంటీ. ►అవినీతి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ►ఎవరు ప్రజాధనాన్ని దోచుకున్నారో.. వాటిని తిరిగి రాబడతాం. ►2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ►బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోంది. ►బీఆర్ఎస్ వైఫల్యం వల్ల టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది. ►అన్నీ నియామకాల పరీక్షల్లో అవకతకవకలు కామన్ అయిపోయాయి. ►ఒక తరం భవిష్యత్తును బీఆర్ఎస్ నాశనం చేసింది. ► తెలంగాణలో వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ►అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది బీజేపీనే ►బీజేపీకి పూర్తి మెజార్టీ ఇచ్చి ఓబీసీ వర్గానికి చెందిన నన్ను ప్రధానిని చేశారు. ►కేంద్ర కేబినెట్లో అత్యధిక మంది బీసీలు మంత్రులుగా ఉన్నారు. ►లోక్‌సభ తొలి దళిత స్పీకర్‌గా బాలయోగిని చేసింది బీజేపీనే. ►ఇదే మైదదానం సాక్షిగా బీసీ ముఖ్యబమంత్రి రాబోతున్నారు ►తెలంగాణలో మార్పు తుఫాన్ కనిపిస్తోంది ►తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీనే ముఖ్యమంత్రి చేస్తాం ►యువతను మోసం చేసిన బీఆర్ఎస్ను సాగనంపాలా.. వద్దా? ►సమ్మక్మ- సారలమ్మకు జై అంటూ ప్రసంగం మొదలు పెట్టిన మోదీ ►బీసీ ఆత్మగౌరవ సభలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా ►ఎల్బీ స్టేడియంతో నాకు సంబంధం ఉంది ►నాటి సభలో నా ప్రసంగం కోసం టికెట్ పెట్టారు ►భారతదేశంలో అది ఒక కొత్త ప్రయోగం ►ఇదే గ్రౌండ్లో ప్రజలు ఆశీర్వదించడంతో నేను ప్రధాని అయ్యాను. ►ఇదే మైదానం సాక్షిగా బీజేపీ బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారు ►తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ►నీళ్లు నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమించింది. ►తెలంగాణ ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్షలను అణగదొక్కారు. ►9 ఏళ్లుగా తెలంగాణలో బీసీ, స్సీ, ఎస్టీ వ్యతిరేక ప్రభుత్వం ఉంది. ►బీసీ ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు. ►కాంగ్రెస్.. బీఆర్ఎస్కు సీ టీమ్‌గా పనిచేస్తుంది. ►బీఆర్ఎస్ కేవలం తన కుటుంబ సభ్యుల కోసమే పనిచేసింది. ►కాంగ్రెస్, బీఆర్ఎస్లలో కుటుంబ పాలన, అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలే ►కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఎప్పుడూ బీసీలకు పదవులు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు అమ్ముడు పోయారు: కిషన్ రెడ్డి ►తమ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు అమ్ముడుపోయారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ►అమ్ముడుపోయే పార్టీ కాంగ్రెస్.. కొనుగోలు చేసేపార్టీ బీఆర్ఎస్. ►బీఆర్ఎస్, కాంగ్రెస్ నియంతృత్వ పార్టీలే.. డీఎన్ఏ ఒక్కటే. ►తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. ►తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీ రావాలి. సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో మంగళవారం బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధానికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో మోదీ స్టేడియమంతా కలియతిరిగారు. బీసీ ఆత్మగౌరవ సభలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల రాజేందర్, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. Live : Shri Narendra Modi BC Aatma Gourava Public Meeting at LB Stadium. https://t.co/Hs18g62m3V — BJP Telangana (@BJP4Telangana) November 7, 2023 కాగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ఇప్పటికే ప్రకటించడం నేపథ్యంలో.. మరో అడుగు ముందుకేసి సదరు బీసీ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు. బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునే చర్యలనూ పేర్కొనవచ్చని అంటున్నారు. కేవలం గంటన్నర సేపట్లోనే ప్రధాని పర్యటన ముగియనుంది. తెలంగాణ మదిలో మన మోదీ! A wave of love and admiration for PM Modi in Telangana!#BCsWithBJP pic.twitter.com/g4tfuRefUj — BJP (@BJP4India) November 7, 2023 -
బీసీ గర్జన సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
నేడే మోదీ బీసీ గర్జన సభ
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హైదరాబాద్‌లో జరిగే బీజేపీ బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ఇప్పటికే ప్రకటించడం నేపథ్యంలో.. మరో అడుగు ముందుకేసి సదరు బీసీ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు.బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునే చర్యలనూ పేర్కొనవచ్చని అంటున్నారు. బీసీలను ఆకట్టుకునేందుకు.. నిజానికి గతంలో ఎప్పుడు కూడా ఏ వర్గం నుంచి, ఎవరు సీఎం అవుతారని ముందే ప్రకటించే ఆనవాయితీ బీజేపీలో లేదని.. తెలంగాణ జనాభాలో 54శాతందాకా ఉన్న బీసీలను ఆకట్టుకునేందుకు సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో ఇప్పటివరకు బీసీ వర్గానికి చెందిన వారెవరూ ముఖ్యమంత్రి కాలేదని.. ఈ క్రమంలో బీసీ ఎజెండా, బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా మారిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎస్టీల రిజర్వేషన్లను 10–12 శాతానికి పెంచుతామన్న హామీ ఇవ్వొచ్చని అంటున్నారు. గంటన్నర పాటు పర్యటన ప్రధాని మోదీ యూపీలోని ప్రయాగ్‌రాజ్ నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5.30 గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. -
డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఖాయం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని, డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అదే రోజు ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయమన్నారు. పరిగి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కుమారుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్, మాజీ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి, మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన ఇల్లంతకుంట, మానకొండూర్ ఎంపీపీలు, ఇతర నేతలు గాంధీభవన్‌లో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారని విమర్శించారు. డీజీపీని తొలగించాలని డిమాండ్ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని రేవంత్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వేధించిన అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర డీజీపీని తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిపై, కాంగ్రెస్ నాయకుల ఫోన్ లపై నిఘా పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకు సాయం చేస్తున్న 75 మంది జాబితాను కేటీఆర్ తయారు చేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇచ్చారని, కొంతమందిని కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారని నిందించారు. అర్వింద్ కుమార్, జయేశ్ రంజన్, సోమేశ్ కుమార్ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మోదీ, కిషన్ రెడ్డి, రాజాసింగ్‌లా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో చేరిన గాజర్ల అశోక్ సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ మాజీ నేత గాజర్ల అశోక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన ఆయన గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా రు. ఉద్యమపంథా వీడి సాధారణ జనజీవనం గడుపుతున్న అశోక్ ప్రజలకు తనవంతు సేవ చేసేందుకు ఏ రాజకీయ పార్టీలో చేరాలన్న దానిపై కొంతకాలంగా సన్నిహితులు, అభిమా నులతో చర్చలు జరుపుతున్నారు. అందరి అభీష్టం మేరకు ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. అశోక్ చేరిక అటు ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పరకాల అసెంబ్లీ టికెట్ అశోక్‌కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
Lb Stadium: రణరంగంలా కుస్తీ పోటీలు.. కుర్చీలతో కొట్టుకున్న పహిల్వాన్లు
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కుస్తీ పోటీలో వివాదం చెలరేగింది. దీంతో కుస్తీ పోటీలు రణరంగంలా మారాయి. మోదీ కేసరి ఫైనల్ కాంపిటీషన్లో పహిల్వాన్ల గ్రూప్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జఫర్, పైల్వాన్, సాలం పైల్వాన్ గ్రూప్‌లు కుర్చీలతో కొట్టుకున్నాయి. దీంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. కుస్తీలో గెలిచింది మేమంటే.. మేమని వాగ్వాదానికి దిగారు. ఈ కొట్లాటలో పదిమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రిని తరలించారు. ఇరువర్గాలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అమెరికాలో ఎన్నారై కుటుంబం దారుణ హత్య?! -
మానవీయ కోణంలో సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అన్నివర్గాలను పేదరికం నుంచి బయటపడేసేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించే పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగిస్తూ ముస్లిం, క్రైస్తవ మైనారిటీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో మైనారిటీల సంక్షేమం కోసం సుమారు రూ.15 వేల కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. మైనారిటీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి వంద శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధి దారుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఈ పథకం కింద రాష్ట్రం మొత్తం మీద 27 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేల మందికి రూ.లక్ష చొప్పున అందిస్తున్నామని తెలిపారు. మైనారిటీలకు కార్పొరేట్ స్థాయి విద్య.. మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సుమారు 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ విద్య అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం లక్షకు పైగా విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నామని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు అబ్దుల్ అహ్మద్ బిన్ బలాలా, జాఫర్ హుస్సేన్, కాలేరు వెంకటేశ్, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గద్దర్ అంత్యక్రియలు.. తరలివచ్చిన జనసంద్రం (ఫొటోలు)
-
ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివదేహం.. ప్రముఖుల నివాళులు
-
గద్దర్ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళులు
-
ముగిసిన గద్దర్ అంత్యక్రియలు
►గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి.. రాత్రి 8గంటల ప్రాంతంలో అధికారిక లాంఛనాలతో బౌద్ధ మత ఆచారంలో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించారు. ► గద్దర్ అంత్యక్రియల్లో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో గద్దర్‌కు అత్యంత ఆప్తుడిగా పేరున్న జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. ► బౌద్ధ ఆచారాల ప్రకారం గద్దర్ అంత్యక్రియలు.. ► గద్దర్ అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనం.. అభిమానులను అదుపుచేయలేక పోతున్న పోలీసులు.. ► గద్దర్ ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఘనంగా నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ► అల్వాల్‌కి చేరుకున్న అంతిమ యాత్ర ► పార్టీలకు అతీతంగా అంతిమ యాత్రలో పాల్గొన్న నేతలు ► సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్‌కు గద్దర్ అంతిమయాత్ర చేరుకుంది. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. ►మధ్యాహ్నం 2.30 నిమిషాల తరువాత సీఎం కేసీఆర్ గద్దర్ ఇంటికి చేరుకోనున్నారు. ►కాసేపట్లో మహా భోది విద్యాలయ లో గద్దర్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. పోలీసులు పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నారు. రిహార్సల్ నేపథ్యంలో సెట్ రైట్ అయిన పోలీసులు. ప్రభుత్వ లాంచనాలతో మధ్యాహ్నం గద్దర్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ►అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న గద్ధర్ అంతిమ యాత్ర ► గద్దర్ అంతిమ యాత్రలో కళాకారులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. అంతిమ యాత్ర సందర్భంగా పోలీసులు అల్వాల్ భూదేవినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ► గద్దర్ అంతిమ యాత్ర వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. ►ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. గన్‌పార్క్, అసెంబ్లీ, నెక్లెస్‌రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం, ట్యాంక్‌బండ్, జేబీఎస్, తిరుమల మీదుగా అల్వాల్ చేరనుంది. గద్దర్ ఇంటివద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణంతో తెలంగాణ పాట మూగబోయింది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సందర్శనార్థం ప్రస్తుతం గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. గద్దర్ పార్థివ దేహాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులు ఘటించారు. ► అల్వాల్ భూదేవి నగర్‌లోని మహాభోది విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాభోధి విద్యాలయంలోని గ్రౌండ్ వెనకాల సమాధి కోసం చేస్తున్న ఏర్పాట్లను గద్దర్ కూతురు వెన్నెల దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏర్పాట్లను డీసీపీ సందీప్‌రావు పరిశీలిస్తున్నారు. ►గద్దర్ పార్థివదేహానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే, జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజనీ కుమార్ యాదవ్, అజారుద్దీన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, బూర న్సయ్య గౌడ్, గరికపాటి నర్సింహరావు నివాళులు అర్పించారు, ►గద్దర్ అంతిమ యాత్ర వాహానాన్ని జీహెచ్ఎంసీ అధికారులు. సిద్ధం చేశారు. వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను ఏర్పాటు చేశారు. గద్దర్ పార్దివదేహానికి వీచ్ హనుమంతరావు నివాళులు అర్పించారు ►రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఖమ్మం సభలో దివించారు: వీహెచ్ ►గద్దర్ మరణం పట్ల రాహుల్ తన ఆవేదన తెలియజేశారు. ►గద్దర్ చనిపోయినా గద్దర్ కోరుకున్నట్లు గా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. గద్దర్ చనిపోవడం బాధాకరం: మాజీమంత్రి జానారెడ్డి ► గద్దర్‌కు ఉన్న స్ఫూర్తి యువత నేర్చుకోవాలి. ►నేను హోం శాఖామంత్రిగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన్నప్పుడు గద్దర్ సూచనలు సేకరించాం. ►తన సూచనాలతోనే అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను హైదరాబాద్‌కు రప్పించాం. ►మావోయిస్టులతో ప్రభుత్వం చర్చల్లో గద్దర్ మధ్యవర్తిత్వం వహించారు. ►అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు నన్ను ఆనాడు కలిశాడు ►గద్దర్ పార్థివ దేహానికి సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీరమణ నివాళులు అర్పించారు. గద్దర్ తన రూమ్ మెట్ అని, రిటైర్మెంట్ తర్వాత తనను రాజకీయాల్లో రావాలని గద్దర్ కోరారని చెప్పారు. ► ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులు అర్పించారు. ►గద్దర్ పార్ధివదేహానికి తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. ►ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివ దేహానికి టీపీసీ రేవంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు నివాళులు అర్పించారు. ►నటుడు మోహన్ బాబు, బండ్ల గణేష్, మంచు మనోజ్, సింగర్ మధు ప్రియ గద్దర్‌కు నివాళులు అర్పించారు. ►అల్వాల్‌లోని గద్దర్ నివాసం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. ►తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. 74 ఏళ్ల వయసులో కూడా గోష్టిగొంగడితో సమాజాన్ని మేల్కొలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా: స్పీకర్ పోచారం ►గద్దర్ అంటే మెదక్.. మెదక్ అంటే ఉద్యమాలు: ఎమ్మెల్యే రఘునందన్ రావు ►వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని గద్దర్ కోరుకున్నారు. ►4 దశాబ్దాల ఆశయ సాధక కోసం పోరాటం చేసి.. దానికి దూరం అయ్యారు. ►గద్దర్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా. గద్దర్ మృతి బాధాకరం: కిషన్ రెడ్డి గద్దర్ పార్ధివ దేహానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. గద్దర్ మృతి బాధాకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యలపై తిరుగులేని పోరాటం చేసిన ఉద్యమకారుడని కొనియాడారు. తన గొంతు ద్వారా తెలుగు సమాజానికే కాకుండా యావత్ భారతదేశానికి రోల్‌మాడల్‌గా నిలిచారని ప్రశంసించారు. గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించిన విషయమని అన్నారు. ‘నాకు గద్దర్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధం ఉంది. నేను లేకున్నా మా ఇంటికి వచ్చి భోజనం చేసే వాళ్ళు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఉండాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి. * ఆయన కలగన్న రాజ్యం రాకముందే స్వర్గస్తులయ్యారు. చివరి కోరిక తిరకముందే కాలం చెల్లించారు. గద్దర్ మనల్ని విడిచి వెళ్లిపోవడం దూరంగా మరి వెళ్లిపోవడం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సమాజాని, కవులు, కళాకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు ఎంతో బాధాకరం. గద్దర్ ఆకస్మిక మృతికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం’ అని తెలిపారు సాక్షి, హైదరాబాద్: గద్దర్ అంతిమయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్ స్టేడియం నుంచి ప్రారంభం కానుంది. కళాకారులతో భారీ ర్యాలీగా గద్దర్ పార్థివదేహాన్ని తీసుకెళ్లనున్నారు. కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీ నేతలు ఈ అంతిమయాత్రలో పాల్గొననున్నారు. స్టేడియం నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా, జగ్జీవన్‌రామ్ విగ్రహం మీదుగా.. గన్‌పార్క్ వైపు సాగనుంది. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు గద్దర్ పార్ధివ దేహం చేరుకోగా.. కాసేపు అక్కడ పాటలతో కళాకారులు నివాళులు అర్పించనున్నారు. అనంతరం అమరవీరుల స్థూపం నుంచి సికింద్రాబాద్ మీదుగా భూదేవినగర్‌లోని తన నివాసానికి చేరుకోనుంది. అల్వాల్్ మహాబోధి గ్రౌండ్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. -
ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ ‘ఇఫ్తార్ విందు’.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, సీఎం కేసీఆర్ ప్రసంగించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 9 ఏండ్ల కిందట తెలంగాణ అంటే వెనుకబడింది అనేవారు. ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. తెలంగాణతో దశ మారింది. తలసరి ఆదాయం పెరిగింది. పారిశ్రామిక రంగంలో అనూహ్య ప్రగతి సాధించాం. మంచినీళ్లు, కరెంట్ సమస్యలు తీరాయి. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు పదేండ్లలో కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ. 1200 కోట్లు మాత్రమే. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మైనార్టీల కోసం గత 9 ఏండ్లలో రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం అని తెలిపారు. ఈ దేశం మనందరిది.. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడాలి. ఆవేశంతో కాదు.. ఆలోచనతో ఈ దేశాన్ని కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు న్యాయమే గెలుస్తుంది. ఇక, ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు మహముద్ అలీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా మీర్జా, ముస్లిం మతపెద్దలతో పాటు 13 వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 12న ఇఫ్తార్ విందు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న ఇఫ్తార్ విందు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి తన కార్యదర్శి భూపాల్‌రెడ్డిని ఆదేశించారు. ఇఫ్తార్ విందుకు కోసం ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. -
బాలీవుడ్ vs టాలీవుడ్ టీ20 మ్యాచ్ (ఫొటోలు)
-
మార్చి 12న యూత్ కార్నివాల్ ‘ప్రోస్ట్’
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, స్టూమాగ్జ్ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 12న ఎల్బీ స్టేడియం వేదికగా అతిపెద్ద యూత్ కార్నివాల్ ‘ప్రోస్ట్’ను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఆవిష్కరించారు. తెలంగాణలో తొలిసారిగా నిర్వహించనున్న ఈ కార్నివాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న 15 వేల మంది విద్యార్థులను భాగస్వాములను చేయనున్నారు. ఈ కార్నివాల్లో అధునాతన సాంకేతికత, స్వదేశీ ఆవిష్కరణలను ప్రభావితం చేసే వినూత్న ఆలోచనా విధానాలను, టెక్నాలజీ సంబంధిత అంశాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా స్టూమాగ్జ్ వ్యవస్థాపకుడు శ్రీచరణ్ లక్కరాజు మాట్లాడుతూ..ఎమర్జింగ్ టెక్నాలజీలో భవిష్యత్ అవకాశాలను అన్వేషించే వారికి స్టూమాగ్జ్ ‘స్టూడెంట్ ట్రైబ్ ఇనిషియేటివ్’ సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రోస్ట్ కార్నివాల్ రూపొందించినట్లు తెలిపారు. యువతలో ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి తెలంగాణ స్టేట్ ఇన్నోవేటివ్ సెల్ కృషి చేస్తుందని చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తోటం అన్నారు. -
హైదరాబాద్: కుస్తీలో పుష్ప.. తగ్గేదేలే! (ఫొటోలు)
-
హైదరాబాద్: దంగల్ మే దమ్ (ఫొటోలు)
-
క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు
గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక అంక్షలు విధించారు. ఎల్బీ స్టేడియం మీదుగా వచ్చే వాహనాలను దారి మళ్లించేలా నగర ట్రాఫిక్ పోలీసులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల మీదుగా కాకుండా ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ ♦అబిడ్స్ చాపెల్ రోడ్డు, నాంపల్లి నుంచి బిజెఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. వాటిని ఎఆర్ పెట్రోల్ పంపు మీదుగా మళ్లిస్తారు. ♦బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ మూసివేసి ఆ వాహనాలను ఎస్బిఐ గన్ఫౌం డ్రీ వైపు మళ్లిస్తారు. ♦రవీంద్రభారతి, ఆదర్శ్‌నగర్ ప్రాంతాల మీదుగా వచ్చే వాహనాలను నాంపల్లి వైపు వెళ్లాలి. ♦నారాయణగూడ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా హిమయత్‌నగర్ వై జంక్షన్ వైపు వెళ్లాలి ♦కింగ్‌కోఠి నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను అబిడ్స్ తాజ్‌మహల్ హోటల్ రోడ్డు వైపు మళ్లిస్తారు. ఆర్టీసీ బస్సులు ఇలా... ♦కెపిహెచ్బి, మెహదీపట్నం నుంచి వచ్చే బస్సులు ఏఆర్ పెట్రోల్ పుంపు మీదుగా నాంపల్లి వైపు మళ్లించారు ♦కోఠి నుంచి సికింద్రాబాద్ వెళ్లే బస్సులు కాచిగూడ, నారయణగూడ, హిమయత్‌నగర్ మీదుగా వెళ్లాలి పార్కింగ్ ఇలా... ♦వీఐపీ, అధికారుల కోసం టెన్నిస్ గ్రౌండ్ వద్ద. ♦ప్రింట్ ఆండ్ మీడియా ప్రతినిధుల కోసం సర్వశిక్ష అభియాన్ కార్యాలయం వద్ద. ♦ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం నిజాం కళాశాల మైదానం వద్ద.. -
ఎల్బీ స్టేడియంలో వైభవంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు (ఫొటోలు)
-
వైభవంగా ముగింపు వేడుకలు
సాక్షి, హైదరాబాద్/హిమాయత్‌నగర్: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో సోమవారం వైభవంగా జరిగింది. వేడుకలకు రాష్ట్రం నలు మూలల నుంచి విద్యార్థులు, మహిళలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తొలుత మహాత్మాగాంధీ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను సీఎం ఘనంగా సన్మానించారు. సురవరం ప్రతాపరెడ్డి వారసుడు సురవరం అనిల్ కుమార్‌రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ వారసుడు అజయ్‌గౌతమ్, కొమురం భీం వారసుడు కొమురం సోనేరావు, కల్నల్ సంతోష్‌బాబు తండ్రి బిక్కుమల్ల ఉపేందర్, భూదాన్ రాంచంద్రారెడ్డి తనయుడు అరవింద్‌రెడ్డి, వనజీవి రామయ్య, రా వెల్ల వెంకట్రామారావు తనయుడు రావెల్ల మాధవరావు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, మహ్మద్ హుసాముద్దీన్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణ, ప్రముఖ నాట్య కళాకారిణులు అలేఖ్య పుంజాల, వైష్ణవి విఘ్నేష్, సంగీత, నాటక అకాడమీ చైర్ పర్సన్ దీపికారెడ్డి, ఖవ్వాలీ నిర్వాహకులు వార్షీ బ్రదర్స్‌ను సన్మానించారు. సీఎం తాతయ్యా.. సూపర్.. ►స్క్రీన్‌పై కేసీఆర్ కనిపించిన ప్రతిసారీ విద్యార్థులు ‘సీఎం తాతయ్యా సూపర్’ అంటూ కేరింతలు కొట్టారు. సీఎం సభా వేదికపైకి వెళ్తుండగా ఆ దృశ్యాలు ప్లే అవుతున్న క్రమంలో విద్యార్థులు సెల్ఫీలు తీసుకున్నారు. ►వేడుకల్లో శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ►సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి ప్రదర్శించిన ‘వజ్రోత్సవ భారతి‘ నృత్య రూపకంతో వేడు కలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అనంతరం.. గంగా జమున తెహజీబ్ కు ప్రతీకగా వార్షీ బ్రదర్స్ ఖవ్వాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ►గణపతి ప్రార్థనతో ప్రారంభమైన శంకర్ మహదేవన్ సంగీత విభావరి కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఇంటి పండుగలా వజ్రోత్సవాలు: సీఎస్ వజ్రోత్సవాల నివేదికను సీఎస్ సోమేశ్‌కుమార్ విడుదల చేశారు. వేడుకల్లో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తమ ఇంటి పండగలా భావించి మమేకమయ్యారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 1.20 కోట్ల జాతీయ పతా కాలను ఉచితంగా అందచేశామని, ప్రతి ఇంటిపై ఎగుర వేసిన ఈ జెండాలన్నీ మన రాష్ట్రంలోనే తయారు కావడం సంతోషకరమన్నారు. 18,963 ప్రాంతాల్లో 37,66,963 మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈనెల 16న 95.23 లక్షల మంది సామూహిక జాతీయ గీతాలాపన చేశారన్నారు. -
ఎంతోమంది త్యాగాలతోనే స్వాతంత్ర్యం వచ్చింది: కేసీఆర్
-
వజ్రోత్సవాల ముగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాలుగా ఘనంగా నిర్వహిస్తున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిధిగా హాజరు కాను న్నారు. ఈ వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులను, ఇటీవల అంతర్జాతీయ వేదికపై ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను సీఎం సన్మానించనున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ సంగీత విభావరి, వాయిద్య కళాకారుడు శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజారెడ్డి బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన, వార్సీ బ్రదర్స్ ఖవ్వాలి, కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. వజ్రోత్స వాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే లఘు వీడియో ప్రదర్శిస్తారు. అనంతరం లేజర్ షో, ఆ తర్వాత బాణాసంచా కార్యక్రమా లుంటాయని అధికారులు తెలిపారు. వజ్రోత్స వాల్లో భాగంగా థియేటర్లలో ప్రదర్శించిన గాంధీ సినిమాను దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు తిలకించినట్టు అధికారులు పేర్కొన్నారు. -
తెలంగాణ చెస్ టోర్నీ విజేత రామకృష్ణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీనియర్ పురుషుల చెస్ చాంపియన్‌షిప్‌లో జె.రామకృష్ణ చాంపియన్‌గా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో తొమ్మిది రౌండ్లపాటు జరిగిన టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ, పోలూరి భరత్ కుమార్ రెడ్డి (కో దాడ) 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టై బ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా రామకృష్ణకు టాప్ ర్యాంక్... భ రత్ కుమార్ రెడ్డికి రెండో ర్యాంక్ లభించాయి. రామకృష్ణ, భరత్ కుమార్ రెడ్డి ఏ డు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. 7.5 పాయింట్లతో ఆదిరెడ్డి అర్జున్(రంగారెడ్డి) మూడో స్థానంలో, 7 బాషిక్ ఇమ్రోజ్ (నల్లగొండ) నాలుగోస్థానంలో నిలిచారు. రామకృష్ణ, భరత్ కుమార్, అర్జున్, ఇమ్రోజ్ ఈనెల 25 నుంచి కా న్పూర్లో జరిగే జాతీయ సీనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు ప్రా తినిధ్యం వహిస్తారు. సీనియర్ చెస్ కోచ్ జొన్నలగడ్డ ప్రసాద్ ట్రోఫీలు అందజేశారు. -
విశ్వానికి గొప్పకానుక భగవద్గీత
సాక్షి, హైదరాబాద్: వేల ఏళ్ల క్రితమే ప్రపంచానికి లభించిన గొప్ప బహుమతి భగవద్గీత అని, అది భారతీయుల వారసత్వ సంపదని పలువురు ప్రముఖులు ఉద్ఘాంటించారు. భగవద్గీత ఆవిర్భావ దినోత్సవం గీతాజయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన లక్ష యువ గళ గీతార్చన కన్నుల పండువగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు, విశ్వహిందూ కార్యకర్తలు, పిల్లలు, పెద్దలు, మహిళలు, వివిధ రంగాల వారు భగవ ద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గంగాధర శాస్త్రి నేతృత్వంలో భగవద్గీతలోని 40 శ్లోకాలను పది నిమిషాల పాటు పారాయణం చేశారు. వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీరామజన్మభూమి ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ మహారాజ్ మాట్లాడుతూ సంపూర్ణ విశ్వశాంతి కోసం భగవద్గీత ప్రవచించిన మార్గనిర్ధేశం ఒక్కటే పరిష్కారమన్నారు. ఇది ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప బహుమానం అని చెప్పారు. అనేక దేశాల్లో ప్రజలు భగవద్గీతను తమ జీవితానికి అన్వయించుకొని ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారని చెప్పారు. కార్యక్రమం లో చినజీయర్ స్వామి మాట్లాడుతూ భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి గొప్ప వారసత్వ సంపద భగవద్గీత, రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథాలని చెప్పారు. లక్ష యువ గళ గీతార్చన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు విజ్ఞాన శాస్త్రానికి అందని ఎన్నో రహస్యాలను భారతీయ వైదికగ్రంథాలు, ఉపనిషత్తులు వివరించాయన్నారు. జీవితం, ఖగోళం, కాలం వంటి అనేక అంశాలపై ప్రపంచానికి అవగాహనను, జ్ఞానాన్ని ప్రబోధించిన మహోన్నతమైన భారతదేశం, భగవద్గీత విశ్వగురువులుగా నిలిచాయన్నారు. గీత సందేశం ఎప్పటికీ కొత్తగా, వైవిధ్యంగానే ఉంటుందన్నారు. అనేక చోట్ల ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని, ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటి పరిరక్షణకు ఉద్యమించాలన్నారు. ఉడుపి పెజావర్ పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి మాట్లాడుతూ అందరం అర్జునుడిలాగా కర్తవ్య నిర్వహణ చేస్తే సంపద, విజయం వరిస్తాయన్నారు. వీహెచ్‌పీ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిళింద పరాండే, జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో, భక్తి నృత్య గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
కోచ్‌ల ఆందోళన.. ‘క్రీడాబంధు’ కావాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: లాల్ బహదూర్ స్టేడియం వద్ద కోచ్‌లు మంగళవారం ఆందోళన చేపట్టారు. 28 ఏళ్ల నుంచి కాంట్రాక్డ్ పద్ధతిలో పని చేస్తున్న తమను క్రమబద్ధీకరరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా 30 మంది కోచ్‌లు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పీఆర్సీ అమలు జీఓకి విరుద్ధంగా క్రీడా శాఖా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. సెప్టెంబర్ 29వ తేదీ వరకు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అల్టిమేటం జారీ చేశారు. దళిత బంధు మాదిరి తమకు కూడా క్రీడా బంధు ప్రవేశపెట్డాలని కోరారు. తెలంగాణ నుంచి క్రీడాకారులు తయారవ్వాలంటే కోచ్‌ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్రీడా శాఖపై కనీస అవగాహన లేదు విమర్శించారు. శాట్స్ చైర్మన్, క్రీడా శాఖ మంత్రి ఫొటోలకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. తమ క్రమబద్ధీకరణపై హై కోర్ట్ అదేశాలను బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తమకు జీతాలు అరకొర ఉన్నాయని, నెలాఖరుకు ముష్టి వేస్తున్నట్లు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఖాళీగా ఉన్న 500 కోచ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
ఎల్బీ స్టేడియం ముందు కోచ్‌ల మెరుపు ధర్నా
సాక్షి, నాంపల్లి: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ముందు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కాంట్రాక్ట్ కోచ్ శాట్స్ కోచ్‌లు శనివారం మెరుపు ధర్నాకు దిగారు. 27 ఏళ్లుగా ఒప్పంద కోచ్ లగా పని చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కాంట్రాక్ట్ కోచ్ శాట్స్ కోచ్ లు నిరసనకు దిగారు. రెగులరైజ్ చేయాలని ప్రభుత్వ పెద్దలని ఎన్ని సార్లు వేడుకున్నఎలాంటి స్పందన రాకపోవడంతోనే మెరుపు ధర్నాకు దిగినట్లు తెలిపారు. తెలంగాణ వచ్చాక అయిన తమ బతుకులు బాగుపడతాయి అనుకుంటే... సీన్ రివర్స్ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమకు జీతాలు కూడా టైమ్ కి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంట్రాక్ట్ కోచ్ నేత రవి శంకర్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కోచ్ లను క్రమబద్ధీకరించాలి. సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని కోచ్‌లు ఆవేదన చెందుతున్నారు. క్రీడలు ఎంతో పవిత్రమైనది.. ఈ రంగంలో మేము 1993 నుంచి సేవలు అందిస్తున్నాం.. మమ్మల్ని రెగ్యులర్ చేయాలి.. ఈ విషయంలో ప్రభుత్వం న్యాయం చేస్తుందని భావిస్తున్నాం. మేము ఎవరిని విమర్శించటం లేదు.కోచింగ్ వల్ల సమాజం లో క్యారెక్టర్ అభివృద్ధి అవుతుంది. ఇప్పటివరకు 30 జాతీయ మల్ల యోధులను తయారు చేశాం. మా చైర్మన్ వెంకట్ రెడ్డి సమస్యలు పరిష్కరించాలి. అని డిమాండ్ చేశారు. -
ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ బహిరంగ సభ ఫోటోలు
-
విజ్ఞతతో ఆలోచించండి.. మోసపోవద్దు
సాక్షి, హైదరాబాద్: విచ్చిన్నకర శక్తులు ప్రజల మధ్య చిచ్చుపెట్టి విడదీయాలని చూస్తున్నాయని, వాటి వలలో పడొద్దని, ఆగం కావొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హైదరాబాద్ ప్రజలను కోరారు. విద్వేషపూరిత ప్రసంగాలతో ఆవేశానికి లోను కావొద్దని, విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని కోరారు. హైదరాబాద్ ప్రగతి కోసం టీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘హైదరాబాద్‌ల ఇప్పుడు చానా తమాషా జరుగుతా ఉంది. వరద వచ్చింది ఆదుకోండి, పది రూపాయలు ఇవ్వండి అంటే ఇయ్యలె. కాని ఇప్పుడు వరదలా వస్తున్నరు హైదరాబాద్‌కు. ఇది మున్సిపల్ ఎలక్షనా? నేషనల్ ఎలక్షనా? ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింత మందా? అబ్బాబ్బాబ్బా... ఎంత మందయ్యా. జోగడు, బాగడు, జోకెటోడు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక... భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వస్తరా? ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరుగుతా ఉంది? ఏందీ కథ?’అని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విపక్షాలపై ధ్వజమెత్తారు. అన్నివర్గాలు కలిసి ఉండే పూలబొకేలాంటి హైదరాబాద్ కావాలి. ఇందులోకి ఉడుములు చొచ్చినట్టు చొచ్చి... పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు కొందరు. వారి పంథా మనకు మంచిది కాదు. పక్కరాష్ట్రమోడు వచ్చి నాలుగు తియ్యటి మాటలు చెప్పిపోతడు. వాడిది నెత్తా? కత్తా? వాడికేం బాధ్యతుంటది. మందిమాటలు నమ్మి మార్మానం బోతే మళ్లొచ్చేటప్పటికి ఇల్లు గాలిపోయిందన్న తీరు అవుతుంది. వారి మాటలకు మోసపోవద్దు. హైదరాబాద్‌లో ఉండే ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆలోచించాలి’అని కేసీఆర్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్‌తో ముచ్చటిస్తున్న కేసీఆర్. టీఆర్ఎస్ శనివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘నేను చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన విషయం మీకు తెలుసు. అందుకే నాకు తపన ఉంటది. హైదరాబాద్‌తో పాటు ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంచు అన్ని విధాలుగా బాగుపడాలనే కల నాకు ఉంటది. ఎంతో తపన, ఎంతో ఆలోచన, నిధుల కూర్పు, ఆ సంయమనం, ఆ అమలు ఉంటే తప్ప సాధ్యమయ్యేవి కావు. మీరు ఆశీర్వదించి పంపిస్తే, గెలిపిస్తే ఇంకా బ్రహ్మాండంగా మా ప్రయత్నాలు చేస్తాం’అని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... మేము భారతీయులం కాదా? బాధ ఏమిటంటే ప్రధానమంత్రిని నేను అడిగిన .. అయ్యా మేము మునిగిపోయినం. ఇబ్బందుల్లో ఉన్నం. రైతుల పంటలు కొన్ని పోయినయి. నగరం దెబ్బతిన్నది. ఏమన్నా గింత సహాయం చేయండయ్యా. ఏడెనిమిది వేల కోట్లు నష్టపోయినం. ఒక రూ.1,350 కోట్లు ఇవ్వమని అడిగినం.. 13 పైసలు కూడా ఇయ్యలె. మేము కనబడ్తలేమా? మేము భారతీయులం కాదా? భారతదేశంలో లేమా? అదే బెంగళూరు, అహ్మదాబాద్‌కు ఇవ్వలేదా? ఉరికి ఉరికి ఇచ్చిన్రు కదా. మేమేం తప్పు చేసినం అని అడుగుతున్నాం. ఈ వివక్ష జరుగుతా ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరికి ఎవరు కర్రు కాల్చి వాతపెట్టాల్నో, ఎవరికి బుద్ధి చెప్పాల్నో నగర ప్రజలు నిర్ణయం చేయాలని నేను కోరుతున్నా. ఢిల్లీకి వస్తానని గజగజ వణుకుతున్నరు ‘కేసీఆర్ మీ బిడ్డ. తెలంగాణ గడ్డ బిడ్డ. రక్తం, పౌరుషం ఉన్నటువంటి బిడ్డ. ఈ దేశంలో జరుగుతున్న అనేక దుర్మార్గాలు జూసి తడి, మానవత్వం ఉన్న వ్యక్తిగా కొన్ని కఠోర వాస్తవాలు నేను బయటపెట్టిన. ఈ రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) ఘోరంగా విఫలమైనాయి. అందుకే నేను ఓ నినాదం ఇచ్చాను. కానీ ఫ్రంట్ లేదు గింట్ లేదు అన్నరు. నేనన్ననా ఫ్రంట్ ఉంటదని? ఎందుకు ఢిల్లీలో గజగజ వణుకుతున్నరు. తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు.. ఏ వీడొక్కడు ఏం చేస్తడు. బొండిగ పిసికితే అయిపోతది అన్నరు. ఎవరి బొండిగ పిసకాలో పిసికి బాజాప్తా తెలంగాణ తెచ్చిన. నేను ఢిల్లీకి బయలుదేరకుండా ఇక్కడే ఆపేయాలని వరదలాగా, బురదలాగా వస్తున్నరు. 40 కోట్ల మంది సభ్యులున్న, రూ.30 లక్షల కోట్ల ఆస్తులున్న ఎల్ఐసీని, రైల్వే, బీహెచ్ఈఎల్ను ఎందుకు అమ్ముతున్నారు. నన్ను కిందిమీద చేయాలని, మాయా మశ్చీంద్ర చేస్తూ ఇంతమంది వస్తున్నరు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మనకు నీతి చెప్తాడట, ఆయనకే ఠికానా సరిగా లేదు. తెలంగాణ వచ్చినప్పుడు తలసరి ఆదాయంలో 13వ స్థానంలో ఉన్న మనం ఐదో స్థానానికి వచ్చాం. ఉత్తరప్రదేశ్ 28వ స్థానంలో ఉంది. ఆ స్థానంలో ఉన్నాయన ఐదో ర్యాంకులో ఉన్న మనకు చెప్తాడట. బిల్డర్ మిత్రలు ఆలోచించాలి. బీపాస్ కావాలా? కర్ఫ్యూ పాస్ కావాలా? ఆలోచించాలి. వర్తక వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక వేత్తలు నగరాన్ని కాపాడేందుకు ముందుకు రావాలి. ప్రజలను విడదీసే కుట్రలు... ఉజ్వలంగా ప్రగతిబాటలో ముందుకు పరుగుపెడుతున్న హైదరాబాద్ పురోగతిని అస్థిరపరిచే శక్తులు కుయుక్తులతో ముందుకొచ్చాయి. ప్రజల్లో చిచ్చుపెట్టి విడదీసే కుట్రలు చేస్తున్నాయి. వారి నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన తరుణమొచ్చింది. వెంటనే మేల్కొనండి, విజ్ఞతతో ఆలోచించండి. మన కోసమే కాదు, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ శక్తులను తరిమికొట్టాలి. ప్రగతిశీల ఆలోచనతో ఉన్న పార్టీకి మద్దతు తెలపండి. విద్యాధికులు, నిపుణులు, ఉద్యోగులు కూడా ఆలోచించాలని కోరుతున్నాను. కొన్ని విచ్చిన్నకరశక్తులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాయి, వాటి వలలో చిక్కొద్దు, ఏదో పిచ్చి ఆవేశానికి పోయి వాటి మాటలు నమ్మకండి. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, ఈ రాష్ట్ర పెద్దగా, ముఖ్యమంత్రిగా అభ్యర్థిస్తున్నాను, తెలివితో ఆలోచించండి, మీరు ఆగం కాకండి, హైదరాబాద్‌ను ఆగం చేయకండి. ఇప్పుడు పొరపాటు చేస్తే హైదరాబాద్ పురోగతి పూర్తిగా నిలిచిపోతుంది, భూముల ధరలు పడిపోతాయి, వ్యాపారాలు బంద్ అవుతాయి. ఇది హైదరాబాద్‌కు ఏమాత్రం క్షేమం కాదు. అందుకే ఇంతకాలం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ టీఆర్ఎస్కు అండగా నిలవండి, నగరంలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. మంచిపేరు ఉన్న వారు, సేవాగుణం ఉన్నవారినే అభ్యర్థులుగా నిలబెట్టాం. వారికి మద్దతు ఇవ్వండి. గతం కంటే ఓ ఐదారు సీట్లు ఎక్కువే ఇచ్చేలా ఓటు వేసేందుకు ముందుకు రండి. ముఖ్యంగా యువకులు పిచ్చి ఆవేశానికి వెళ్లొద్దు. భవిష్యత్తు మీది, భావి హైదరాబాద్ గొప్పగా ఉండాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి. కేంద్రం మెడలు వంచి, నిధులు రప్పించి అభివృద్ధి చేస్తాం. శనివారం ఎల్బీస్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల బహిరంగ సభకు పోటెత్తిన మహిళలు తలుచుకుంటే నశ్యం కింద కొడతాం బిడ్డ కొందరు నన్ను కూడా రారా, పోరా అని మాట్లాడుతున్నారు. అన్నీ వింటున్నా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యతలో ఉన్న వ్యక్తిగా వాటికి స్పందించటం లేదు. తిరిగి తిట్టేందుకు చేత కాక కాదు, మాకు కార్యకర్తలు లేక కాదు. నేను తలుచుకుంటే అంతకంటే ఎక్కువే తిట్టగలను. తలుచుకుంటే దుమ్ముదుమ్ము నశ్యం కింద కొడతాం బిడ్డ. మాకు 60 లక్షల కార్యకర్తల బలం ఉన్నా ఆ చిల్లర మాటలకు టెంప్ట్ కావద్దని ఊరుకుంటున్నం. మనకు ఎవరూ బాస్‌లు లేరు. ఢిల్లీకి గులాములం కాదు. మనకు ప్రజలే బాస్‌లు. గతం కంటే ఎక్కువ సీట్లతోనే బ్రహ్మాండమైన విజయాన్ని సాధించబోతున్నాం. ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలి ఎలక్షన్లు చాలా జరుగుతూ ఉంటాయి. మీ విచక్షణ ఉపయోగించి.. పార్టీలకు ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలి. ఒక పార్టీ, నాయకుడు, ప్రభుత్వం ఎలా ఆలోచిస్తా ఉంది, ఎలా పని చేస్తా ఉంది, వారి దృక్పథం, వైఖరి ఏ విధంగా ఉంది? ప్రజల గురించి, అభివృద్ధి గురించి, భవిష్యత్తు కోసం వారు ఏ విధంగా ఆలోచిస్తున్నరు అనే విషయం మీద చర్చ జరగాలి. ఆలోచించుకుని ప్రజలు నిర్ణయానికి రావాలి. అప్పుడు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మంచి పార్టీలు ఎన్నుకోబడ్తయి. పనిచేసే వాళ్లు పుట్టుకొస్తారు. పనితనంలో, ప్రజలకు సేవ చేయడంలో పోటీతత్వం పెరుగుతంది. తద్వారా ప్రజలకు, సమాజానికి చాలా మేలు జరుగుతుంది. అలవోకగా, గాలివాటంగా ఓటు వేయకూడదు. నగర ప్రజలకు 24 గంటలు నల్లా నీళ్లు.. రాష్ట్రం ఏర్పడ్డాక ఏడెనిమిది మాసాల్లో మొత్తం కరెంట్ బాధలు తీర్చినం. మిషన్ భగీరథను ఐదేళ్లలో చేసి ఇవ్వకపోతే ఓట్లు అడగం అని చెప్పిన మగతనం ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు 24 గంటల మంచి నీటి సదుపాయం కల్పించాలని కేసీఆర్ కల. రాబోమే కొద్ది నెలలు, సంవత్సరాల్లో నగరంలో 24 గంటలూ మంచినీరు సరఫరా చేస్తం. పేదలు, మధ్యతరగతి ప్రజలకు నల్లా బిల్లు బాధలు తొలగించాలని 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించాం. ఇది ఎన్నికల తాయిళం కాదు. నగర ప్రజలకు, పేదలకు కేసీఆర్‌గా, మీ బిడ్డగా నేను అందించిన శాశ్వత కానుక. 97 నుంచి 98 శాతం ప్రజలకు ఈ స్కీం వర్తిస్తుంది.. ప్రతి అపార్ట్మెంట్లలోని కుటుంబాలకు సైతం 20 వేల లీటర్లు ఉచితంగా ఇస్తాం. సంక్షేమంలో నంబర్ 1 కరోనా రక్కసితో రాష్ట్రానికి రూ.52 వేల కోట్ల నష్టం వచ్చింది. అయినా సంక్షేమం ఆపలే. సంక్షేమ కార్యక్రమాల్లో మనకెవరూ సాటి లేరు. ఏటా రూ.40 వేల కోట్లకు పైచిలుకు డబ్బుతో కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలు చేస్తున్నం. ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసినం. సాగులో ఇండియాలోనే నంబర్ వన్‌కు పోతున్నం. నంబర్ టూ స్థానానికి వచ్చినం. లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ధాన్యరాశులతో తెలంగాణ కళకళలాడుతోంది. అదంతా కూడా మీ కళ్ల ముందే ఉంది. అవన్నీ జరిగినయి. నలువైపులా విస్తరించిన నగరంలోని బస్తీలు, వాడలు, కాలనీల్లో సరైన సదుపాయాలు కోసం టీఆర్ఎస్ దాదాపు రూ.60, 70 వేల కోట్ల ఖర్చు పెట్టి శ్రమపడ్డది. హైదరాబాద్‌లో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. వరదల నుంచి శాశ్వత విముక్తి వరదల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాలె. దీనికి సంవత్సరానికి రూ.10 వేల కోట్లు ప్రతి బడ్జెట్లో కేటాయిస్తం. నాలాలన్నీ కబ్జా అయినయి. మురుగు కాల్వలన్నీ మూసుకుపోయాయి. వాటన్నింటిని తొలగించాలి. తాత్కాలిక, మధ్యతరహా, దీర్ఘకాలిక ప్రణాళిక అమలు కావాలె. జీహెచ్ఎంసీలో మీరు భారీగా గెలిపించండి. ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అండగా ఉంటుంది. ఈ వరదల బారి నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తి కల్పిస్తుంది. నగరం నుంచి కాలుష్యకారక పరిశ్రమలను తరలించి కాలుష్యం లేకుండా చేస్తాం. మెట్రో రైలును మరిన్ని ప్రాంతాలకు, ఏయిర్‌పోర్టుకు విస్తరిస్తం. మురికిగా మారిపోయిన మూసీ నదిని గోదావరితో అనుసం«ధానం చేస్తాం. దానిని తప్పకుండా ప్రక్షాళన చేసి యుద్ధ ప్రాతిపదికన... ఒక అందమైన మూసీని హైదరాబాద్‌కు అందించే బాధ్యత నాది. చల్లటి, చక్కటి హైదరాబాద్ కావాలి. అన్ని రకాల సామరస్యంతో, పిల్లాపాపలతో ప్రజలందరూ ఆనందంగా, చిరునవ్వులతో బతికే హైదరాబాద్ కావాలి. కిరికిరి పెడ్తరు నా కొడుకులు వరదల్లో సర్వం కోల్పోయిన నగర ప్రజలకు రూ.10 వేలు సహాయం చేయాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నం. చరిత్రలో ఎవ్వడూ ఇవ్వలేదు. ఢిల్లీ, ముంబైలో ఇవ్వలే. బీజేపీ, కాంగ్రెస్ పరిపాలించిన కాడ ఇవ్వలె. కానీ ఈడ మాత్రం కిరికిరి పెడ్తరు నా కొడుకులు.... బాధపడి అంటున్న ఈ మాట. ఎక్కడా ఇచ్చింది లేదు. కాని ఇచ్చేకాడ కిరికిరి పెడ్తరా? ఇదేనా మీ విజ్ఞత? మీ తెలివి? ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 6.5 లక్షల వరద బాధిత కుటుంబాలకు రూ.650 కోట్లను అందించింది ఈ కేసీఆర్ ప్రభుత్వం కాదా? నగర ప్రజానీకం ఆలోచన చేయాలి. ఒకడు పత్రం రాస్తడు... ఒక ఉత్తరం రాస్తడు.. నేను రాయలేదు అంటడు. ఎలక్షన్లలో ఈసీని ఇబ్బంది పెట్టి బంద్ చేయించితిరి. ఎంతమంది పేదలు, అర్హులు మిగిలి ఉన్నారో... వారిలో ప్రతి ఒక్క కుటుంబానికి డిసెంబర్ 7 నుంచే రూ.10 వేలు పంపిణీ చేసే బాధ్యత నాదే. ఆరున్నర లక్షల కుటుంబాలకు ఇచ్చినం. ఇంకో మూడు నాలుగు లక్షల కుటుంబాలు ఉండవచ్చు. ఇంకో రూ.నాలుగు వందల కోట్లు ఇవ్వడానికి మా ప్రభుత్వం వెనక్కి పోదు. శాంతిభద్రతల విషయంలో రాజీలేదు గత ఆరేళ్లుగా శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీపడలేదు. కొందరు ముష్కరులు, రౌడీ మూకలను ఏ విధంగా అణిచివేశామో మీరు చూశారు. పీడీ యాక్టు పెట్టినం. నేరగాళ్లందరినీ వణికించినం. ఒక శ్రేష్టమైన, అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ తయారు కావాలి. కొందరి కోసం పనిచేసి అందరి హైదరాబాద్‌ను ఆగం చేసే ఎజెండా మాది కాదు. టార్చిలైట్ వేసి చూసినా వివక్ష కనపడదు అందరి అంచనాలు తలకిందులు చేసి ఏ రకమైన కార్యక్రమాలు టీఆర్ఎస్ తీసుకుందో, ఏ రకంగా పురోగమించిందో, ఏ రకమైనటువంటి సోదర, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించిందో చూశారు. హైదరాబాద్‌లో కానీ, రాష్ట్రంలో కానీ కుల, మత జాతి, ప్రాంత వివక్ష చూపలేదు. ఒకసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎవరూ ఊహించని పరిణితిని, పరిపక్వతను, ఎనలేని ఓపికను తెచ్చుకుని ఈ గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డా మా బిడ్డే .. భారతదేశంలో ఏ మూల నుంచి వచ్చినా హైదరాబాద్‌లో ఉన్న ప్రతి బిడ్డా మా బిడ్డే. వారి సంరక్షణ మా బాధ్యత అని నేను ధైర్యంగా చెప్పిన. గత ఏడేళ్లు అదే విధంగా వ్యవహారం జరిగింది. ఎక్కడా మత, కుల, ప్రాంతీయ వివక్ష టార్చిలైట్ వేసి చూసినా కనబడదు. టీఆర్ఎస్ ఏనాడు కూడా పాక్షిక, పక్షపాత నిర్ణయాలు చేయలె. ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టినా జాతి, కులం, మతం చూడలేదు. భారతదేశంలో ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఆచరణ చేయని కార్యక్రమం కంటి వెలుగు. కళ్యాణలక్ష్మి అందుకోని ఏ కులం, ఏ మతం వాళ్లు అయినా ఉన్నరా?. కేసీఆర్ కిట్టు సూపర్ హిట్టు. రైతుబంధు ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నగరంలో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినం. కుల వృత్తుల వారందరినీ ఆదుకున్నం. దోబిఘాట్లకు వాడుకునే మోటార్లకు, లాండ్రీలు కరెంట్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఆ భారం భరిస్తుంది. ఎంబీసీల కార్పొరేషన్ పెట్టినం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి వెయ్యి గురుకులాలను ప్రారంభించినం. ఇవన్నీ కుల, మత, వర్గబేధం లేకుండా అందరి కోసం ప్రారంభించిన సంక్షేమ పథకాలు. అందరికీ అందబాటులో ఉన్న పథకాలు. ఇదంతా స్టోరీ కాదు. ఎక్కడ్నో అమెరికాలో జరిగిన కథ కాదు. మన రాష్ట్రంలో మన కళ్ల ముందు ఈ ఆవిష్కరణలన్నీ జరిగాయి. చిత్రంలో అభివాదం చేస్తున్న శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి, మహమూద్ అలీ, మధుసూదనాచారి, కేశవరావు,తలసాని, కేటీఆర్, ఈటల, కొప్పుల ఈశ్వర్, పద్మారావుగౌడ్, పువ్వాడ, సత్యవతి, సబితా ఇంద్రారెడ్డి -
హైదరాబాదీలకు కేసీఆర్ మరిన్ని వరాలు..
సాక్షి, హైదరాబాద్: 20 వేల లీటర్ల వరకు నల్లా బిల్లులు రద్దు చేశాం.. ఢిల్లీ తర్వాత దేశంలో తెలంగాణలో మాత్రమే నల్లా బిల్లులు రద్దు.. దీన్ని అపార్ట్మెంట్లకూ వర్తింపజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ చాలా చైతన్యవంతమైన నగరమని, ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ కోసం నాయకుడి ప్రణాళికలపై నిర్ణయం తీసుకోవాలని.. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. (చదవండి: బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?) అదే నా లక్ష్యం.. ‘‘అపోహలు, అనుమానాలపై సుదీర్ఘపోరాటం ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. కరెంట్ ఉండదు, నీళ్లు రావు, పరిశ్రమలు వెళ్లిపోతాయన్నారు. హైదరాబాద్ ఖాళీ అవుతుందని శాపాలు పెట్టారు. అందరి అంచనాలను తలక్రిందలు చేసి అభివృద్ధి సాధించాం. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి బిడ్డా.. మా బిడ్డే. ఎక్కడా కుల, మత, ప్రాంతీయ వివక్షలు లేకుండా ముందుకెళ్లాం. కరెంట్ సమస్యను పరిష్కరించాం. 24 గంటలూ కరెంట్ ఇస్తున్నాం. ఏరోజు మేం పక్షపాత నిర్ణయాలు చేయలేదు. అంచనాలను మించి మిషన్ భగీరథను విజయవంతం చేశాం. రాష్ట్ర ప్రజలకు 24 గంటలూ మంచినీరు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ఢిల్లీ, నాగపూర్లలో ఇప్పటికే అధ్యయనం చేశాం. కల్యాణలక్ష్మీ, కంటి వెలుగు, కేసీఆర్ కిట్ పథకాలు ఎక్కడా లేవని’’ ఆయన పేర్కొన్నారు. (చదవండి: ‘ఇంట్లో చెప్పే వచ్చా.. చావుకు భయపడేది లేదు’) కేసీఆర్ కిట్టు... సూపర్ హిట్టు.. కేసీఆర్ కిట్టు... సూపర్ హిట్టు అని కేసీఆర్ అన్నారు. ప్రతి రైతుకు రైతు బీమా పథకాన్ని అందించాం. 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని, సెలూన్లకు ఉచిత విద్యుత్ అందించామని, దేశంలో ఎక్కడాలేని విధంగా వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభించామని తెలిపారు. కరోనాతో 52 వేల కోట్ల ఆదాయం కోల్పోయినా సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. మరోసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వరదల నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తిని కలిగిస్తామని పేర్కొన్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను తెస్తున్నామని, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో సేవలను పొడిగిస్తామని చెప్పారు. గోదావరితో మూసీనదిని అనుసంధానం చేసి ప్రక్షాళన చేస్తామని, హైదరాబాద్‌కు అందమైన మూసీని అందించే బాధ్యత నాదని ఆయన పేర్కొన్నారు. నా కళ్లలో నీళ్లొచ్చాయి.. ‘‘గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాం. ముష్కరులు, రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాం. తలకుమాసినవాడి మాటలను పట్టించుకోను. హైదరాబాద్ నగరం, రాష్ట్రం అభివృద్ధే నా లక్ష్యం. ముంబైని 10 రోజులకుపైగా వరద ముంచెత్తింది. చెన్నైని 21 రోజులకుపైగా వరద ముంచెత్తింది. ఢిల్లీ, అహ్మదాబాద్‌లకు కూడా వరద ముప్పు తప్పలేదు. హైదరాబాద్ నగరానికి వరద కష్టం వస్తే మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజల దగ్గరకే వెళ్లి సహాయక చర్యలు అందించారు. ఆ దృశ్యాలను చూసి నా కళ్లలో నీళ్లొచ్చాయి. ఇంటికి రూ.10వేల సహాయం అందించాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నా. బీజేపీ, కాంగ్రెస్‌లు పరిపాలించే ఏ నగరంలోనూ ఆర్థికసాయం అందించలేదు. అయినా కిరికిరి పెడుతున్నారు.. బాధతో ఈ మాట అంటున్నా. డిసెంబర్ 7 నుంచి అర్హులైనవారందరికీ రూ.10 వేల వరదసాయం అందిస్తామని’’ కేసీఆర్ తెలిపారు. బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా? 1350 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే.. 13పైసలు కూడా ఇవ్వలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. మేం భారతీయులం కాదా?.. భారతదేశంలో లేమా? అని ప్రశ్నించారు. పక్కనే ఉన్న కేరళ, కర్ణాటకకు ఇచ్చారని ఆయన విమర్శించారు. వరద సాయం చేయకుండా కేంద్రమంత్రులు ఇప్పుడు వరదలా వస్తున్నారు. ఇవి స్థానిక ఎన్నికలా? జాతీయస్థాయి ఎన్నికలా? బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా? అంటూ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. గజగజ వణుకుతున్నారు.. ‘‘ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కూడా వస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీకి వస్తున్నాడని గజగజా వణుకుతున్నారు. ఎల్ఐసీ, బీహెచ్ఈఎల్, రైల్వేలను ఎందుకు అమ్ముతున్నారు?. యూపీ సీఎం ఇక్కడి వచ్చి ప్రచారం చేస్తున్నారు. 28 ర్యాంకులో ఉన్నాయన మనకేం చెబుతాడు. హైదరాబాద్‌కు వెల్లువలా పరిశ్రమలు వస్తున్నాయి. బిపాస్ కావాలా?, కర్ఫ్యూ పాస్ కావాలో? బిల్డర్లు ఆలోచించుకోవాలి. హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి. ప్రగతిశీల ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలిపించి టీఆర్ఎస్ను ఆశీర్వదించాలని’’ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. -
ఎల్బీ స్టేడియం గులాబీమయం
-
బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?
కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు హైదరాబాద్ చాలా చైతన్యవంతమైన నగరం.ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి.భవిష్యత్ కోసం నాయకుడి ప్రణాళికలపై నిర్ణయం తీసుకోవాలి.అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది అపోహలు, అనుమానాలపై సుదీర్ఘపోరాటం ద్వారా తెలంగాణ సాధించుకున్నాం.కరెంట్ ఉండదు, నీళ్లు రావు, పరిశ్రమలు వెళ్లిపోతాయన్నారు.హైదరాబాద్ ఖాళీ అవుతుందని శాపాలు పెట్టారు.అయినా ప్రజలు టీఆర్ఎస్ను విశ్వసించారు హైదరాబాద్‌లో ఉన్న ప్రతి బిడ్డా.. మా బిడ్డే. ఎక్కడా కుల, మత, ప్రాంతీయ వివక్షలు లేకుండా ముందుకెళ్లాం. కరెంట్ సమస్యను పరిష్కరించాం.. 24 గంటలూ కరెంట్ ఇస్తున్నాం. ఏరోజు మేం పక్షపాత నిర్ణయాలు చేయలేదు. అంచనాలను మించి మిషన్ భగీరథను విజయవంతం చేశాం. రాష్ట్ర ప్రజలకు 24 గంటలూ మంచినీరు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ఢిల్లీ, నాగపూర్లలో ఇప్పటికే అధ్యయనం చేశాం. 20వేల లీటర్ల వరకు నల్లా బిల్లులు రద్దు చేస్తాం. ఢిల్లీ తర్వాత దేశంలో తెలంగాణలో మాత్రమే నల్లా బిల్లులు రద్దు చేసింది. దీన్ని అపార్ట్మెంట్లకూ వర్తింపజేస్తాం. కల్యాణలక్ష్మీ, కంటి వెలుగు పథకాలు ఎక్కడా లేవు. కేసీఆర్ కిట్టు... సూపర్ హిట్టు. ప్రతి రైతుకు రైతు బీమా పథకాన్ని అందించాం. 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశాం. సెలూన్లకు ఉచిత విద్యుత్ అందిస్తాం. దేశంలో ఎక్కడాలేని విధంగా వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కరోనాతో రాష్ట్రానికి రూ.52వేల కోట్ల ఆదాయం కోల్పోయినా..ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదు. హైదరాబాద్ నగరం అశాస్త్రీయంగా పెరిగింది. సరైన మౌలిక వసతులు లేకుండా కాలనీల నిర్మాణాలు జరిగాయి.కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు హైదరాబాద్‌లో గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోంది. అభివృద్ధిని కొనసాగించాలి. మరోసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించండి. వరదల నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తిని కలిగిస్తాం. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను తెస్తున్నాం.శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో సేవలను పొడిగిస్తాం. గోదావరితో మూసీనదిని అనుసంధానం చేసి ప్రక్షాళన చేస్తాం.హైదరాబాద్‌కు అందమైన మూసీని అందించే బాధ్యత నాది. గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాం.ముష్కరులు, రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాం.తలకుమాసినవాడి మాటలను పట్టించుకోను.హైదరాబాద్ నగరం, రాష్ట్రం అభివృద్ధే నా లక్ష్యం. ముంబైని 10 రోజులకుపైగా వరద ముంచెత్తింది. చెన్నైని 21 రోజులకుపైగా వరద ముంచెత్తింది.ఢిల్లీ, అహ్మదాబాద్‌లకు కూడా వరద ముప్పు తప్పలేదు.హైదరాబాద్ నగరానికి వరద కష్టం వస్తే... మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజల దగ్గరకే వెళ్లి సహాయక చర్యలు అందించారు.ఆ దృశ్యాలను చూసి నా కళ్లలో నీళ్లొచ్చాయి ఇంటికి రూ.10వేల సహాయం అందించాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నా.బీజేపీ, కాంగ్రెస్‌లు పరిపాలించే ఏ నగరంలోనూ ఆర్థికసాయం అందించలేదు అయినా కిరికిరి పెడుతున్నారు నాకొడుకులు.. బాధతో ఈ మాట అంటున్నా ఎన్నికల అయిపోయాక డిసెంబర్ 7 నుంచే అర్హులైనవారందరికీ రూ.10వేల వరదసాయం అందిస్తాం ముఖ్యమంత్రి కేసీఆర్ సభా వేదికకు చేరుకున్నారు. వేదికపైకి ఎక్కి ప్రజలను అభివాదం చేసి సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీ నేతల తీవ్రవిమర్శల నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వరద సాయం కింద 1350 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే.. 13పైసలు కూడా ఇవ్వలేదు. మేం భారతీయులం కాదా?.. భారతదేశంలో లేమా? సాయం చేయని కేంద్రం.. ఎన్నికలు అనగానే వరదలా కేంద్రమంత్రులు వస్తున్నారు. బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?.ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ల పరిస్థితే సక్కగలేదు కానీ వచ్చి మనకు చెప్పుతారు. కేసీఆర్ ఢిల్లీకి వస్తున్నాడని గజగజా వణుకుతున్నారు. ఎల్ఐసీ, బీహెచ్ఈఎల్, రైల్వేలను ఎందుకు అమ్ముతున్నారు? యూపీ సీఎం ఇక్కడి వచ్చి ప్రచారం చేస్తున్నారు. జీడీపీలో 28 ర్యాంకులో ఉన్నాయన మనకేం చెబుతాడు? హైదరాబాద్‌కు వెల్లువలా పరిశ్రమలు వస్తున్నాయి. ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్ ఉంటాడు. టీపాస్ కావాలా?, కర్ఫ్యూ పాస్ కావాలో? బిల్డర్లు ఆలోచించుకోవాలి హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి.ప్రగతిశీల ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలిపించి టీఆర్ఎస్ను ఆశీర్వదించాలి. స్పందించాల్సిన అవసరం లేదు : కేటీఆర్ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ బండి సంజయ్ మద్యంతర ఎన్నికల వ్యాఖలపై మాట్లాడుతూ.. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పిచ్చోడి మాటలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. 104 స్థానాల్లో గెలుస్తాం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 104 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. సంక్షేమం, అభివృద్ధే తమ పార్టీని గెలిస్తాయాని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ పిచ్చి మాటలు మాట్లాతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్సీ కవిత ఎల్బీ స్టేడియలో జరిగే కేసీఆర్ బహిరంగ సభకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్టీసీ బస్సులో బయలు దేరారు.కవాడిగూడ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఎల్బీ స్టేడియంకు ఆర్టీసీ బస్సులో ప్రజలతో బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత బస్సు స్టార్ట్ కావడానికి మోరాంచడంతో, ఆ ఆర్టీసీ బస్సు దిగి మరో ఆర్టీసీ బస్సులో సభకు బయలుదేరి వెళ్లారు కేసీఆర్ సభకు భారీ బందోబస్త్ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్బీ స్టేడియం చుట్టూ పోలీస్ సిబ్బందిని పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలీసు శాఖ నుంచి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొత్తం 50వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో హాజరకానునున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య సభ జరగనుంది. కోవిడ్ నిబంధనల మధ్య సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని డివిజన్ల నుంచి భారీగా జన సమీకరణ జరుగుతోంది. ఎల్బీ స్టేడియం మొత్తం గులాబీమయమైంది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బహిరంగ సభ నేపథ్యంలో ఎల్బీస్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. రాత్రి 8గంటల వరకు ఎల్బీస్టేడియం వద్ద వాహన రాకపోకలకు అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ సభలో సిఎం కేసీఆర్ ఆరేళ్లుగా హైదరాబాద్ లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు. -
నేడు ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ బహిరంగ సభ
-
నేడు కేసీఆర్ ‘గ్రేటర్’ సభ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకోవడంతో నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియం వేదికగా శనివారం భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎజెండాను ప్రజ ల్లోకి బలంగా తీసుకెళ్లడంతోపాటు విపక్షాల విమర్శలకు సభా వేదికగా దీటుగా సమాధానం ఇవ్వనున్నట్లు తెలిసిం ది. ఈ నెల 23న పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా రాజకీయ అంశాలు, విపక్షాల విమర్శల జోలికి పెద్దగా వెళ్లని కేసీఆర్.. ఆదివారంతో గ్రేటర్ ఎన్నికల ప్రచా రం ముగియనుండటంతో ఆరేళ్ల తమ పాలనలో హైదరాబాద్ అభివృద్ధికి చేసిన కృషిని వివరిస్తారని భావిస్తున్నారు. ప్రధాని పర్యటనపై ఆచితూచి స్పందిద్దాం.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పక్షాన పరోక్ష ప్రచారం కోసమే కోవిడ్ వ్యాక్సిన్ తయారీ పురోగతి పేరిట ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు వస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఒకవేళ ఏవైనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తే అప్పుడు ఆచితూచి స్పందించాలని ఆ పార్టీ భావిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తదితరుల వరుస పర్యటనల నేపథ్యంలో వారు చేస్తున్న విమర్శలు, ఓటర్ల స్పందన తదితరాలకు సంబంధించిన వివరాలను టీఆర్ఎస్ క్రోడీకరిస్తోంది. శనివారం జరిగే సభలో కేసీఆర్ వాటన్నంటికీ సమాధానం ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. జన సమీకరణపై ప్రత్యేక దృష్టి... బహిరంగ సభకు భారీగా జనసమీకరణపై టీఆర్ఎస్ నేతలు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. 150 డివిజన్ల నుంచి సుమారు 30 వేల నుంచి 40 వేల మందిని సభకు తరలించాలని భావిస్తున్నారు. నగరం నలుమూలల నుంచి బైక్ ర్యాలీలతో సభాస్థలికి చేరుకోవాలని పార్టీ డివిజన్ ఇన్చార్జీలను అధినాయకత్వం ఆదేశించింది. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని సభకు హాజరయ్యే వారు మాస్క్‌లతో రావాలని, లేని వారికి స్టేడియం ప్రధాన ద్వారం వద్ద మాస్క్‌లను పంపిణీ చేస్తామని ఆ పార్టీ చెబుతోంది. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నానికి సభా వేదిక, స్టేడియం పరిసరాలను శానిటైజ్ చేయనున్నారు. కాగా, సభ ఏర్పాట్లను పూర్తిచేసినట్లు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ శుక్రవారం మీడియాకు తెలిపారు. నగరంలో నేడు.. సీఎం కేసీఆర్ వేదిక: ఎల్బీ స్టేడియం (ఎన్నికల బహిరంగ సభ) సమయం: సాయంత్రం 4 గంటలకు ప్రారంభం ప్రధాని మోదీ వేదిక: భారత్ బయోటెక్, జినోమ్ వ్యాలీ, శామీర్‌పేట సమయం: మధ్యాహ్నం 1.30 నుంచి ప్రారంభం -
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రేపు సీఎం కేసీఆర్ ప్రచారం
-
ఎల్బీ స్టేడియంలో చోరీ, దొంగ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ట్రోఫీలను చోరీచేసిన దొంగను సైఫాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అదనపు ఇన్స్పెక్టర్ (డీఐ) రాజు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బెల్గాం జిల్లాకు చెందిన శివ సంజీవ షిండే (30) నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పై గడుపుతుంటాడు. ఇటీవల ఎల్బీ స్టేడియంలోని ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయం తలుపులు నెట్టి అందులో ఉన్న పలు ట్రోఫీలను చోరీచేశాడు. వాటిని మాంగార్ బస్తీలో తనకు తెలిసిన ఓ వృద్ధుడి ఇంట్లో ఉంచాడు. అసోసియేషన్ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. చోరీకి గురైన వాటిలో వెండి ట్రోఫీతో పాటు ఇత్తడి ట్రోఫీలు 15 ఉన్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే అక్కడ తెలుపు రంగులో ఉన్నవేవీ దొంగిలించలేదని తేలింది. అతని వద్ద నుంచి ట్రోఫీలను స్వాధీనం చేసుకున్నారు. -
‘సరిలేరు నీకెవ్వరూ’ ఈవెంట్, ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7 నుంచి రాత్రి 10 గంటల వరకూ ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండటంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నారు. ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా వాహనాల మళ్లింపు ఉంటుందని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏఆర్ పెట్రోల్ పంప్, అబిడ్స్, గన్‌ఫౌండ్రీ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్‌కోఠి, లిబర్టీ, రవీంద్రభారతి నుంచి ఎల్బీ స్టేడియం మీదగా వెళ్లే వాహనాలకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ముఖ్య అతిథిగా చిరంజీవి కాగా మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరూ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరు కానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. -
అందరినీ ఆదరిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఎవరికి ఏరకమైన అభ్యంతరాలు ఉన్నా తెలంగాణ రాష్ట్రం నూటికి నూరు శాతం సెక్యులర్ రాష్ట్రంగానే ఉంటుందని, ఇక్కడ అన్ని మతాలకు సమాన గౌరవం లభిస్తుందని, అందరినీ ఆదరించే రాష్ట్రమని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భారత్ గొప్ప దేశ మని ఇక్కడ జరుపుకున్నన్ని పండుగలు ప్రపంచంలో మరెక్కడా జరుపుకోరన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇస్లామిక్ దేశాలలో రంజాన్, బక్రీద్ పండుగలు, ఇతర దేశాలలో నాలుగైదు పండుగలు జరుపుకుంటారని, కానీ భారత్‌లో జరుపుకు నేవి చాలా ఉన్నాయన్నారు. ‘ఉత్సవాలు జరుపుకునే గుణం, సహనంతోపాటు మనుషులను ప్రేమించే తత్వం ఉంటే ఇది సాధ్యపడుతుంది. దానికి నా తెలంగాణ రాష్ట్రమే నిదర్శనం. క్రిస్మస్ వేడుకల సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు ఇదే ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్, బతుకమ్మ, ఇప్పుడు క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్నాము’అని సీఎం అన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అందరితో పాటు క్రైస్తవులకు అందిస్తున్నామని, ఎవరికైనా పథకాలు అందకపోతే మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి చెప్పాలని సూచించారు. త్వరలో క్రైస్త్త్తవ మత నాయకులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి 2 పంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 70 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని సీఎం ప్రకటించారు. ఉత్సవాల్లో బిషప్ షపర్డ్ రెవరెండ్ గొల్లపల్లి జాన్, బిషప్ తుమ్మ బాల, మంత్రులు శ్రీనివాసగౌడ్, శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
లెజెండ్స్ లైవ్
-
‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
నా జీవితంలో ఇదొక అద్భుతమైన రోజు : చిరంజీవి
నా మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు సెప్టెంబర్ 22నే విడుదలైందని..అప్పుడు ఎలాంటి ఫీలింగ్ కల్గిందో.. మళ్లీ 41ఏళ్ల తరువాత అప్పటి ఫీలింగే మళ్లీ కలుగుతోంది. దానికి కారణం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. దాదాపు పుష్కర కాలం నుంచి ఈ కథ నా మదిలో మెలుగుతూ ఉండేదంటూ నేటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరంజీవి మాట్లాడారు. పూర్తి ప్రసంగం కోసం కింది వీడియోను చూడండి. పవన్‌కళ్యాణ్ మట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్‌కు నన్ను పిలిచింనందు అదృష్టంగా భావిస్తున్నాను.. ఆయనకు మీలా నేనూ ఓ అభిమానినే. ఆ విధంగానే నేను ఇక్కడకు వచ్చాను. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి. మీ అభిమానుం నాకు దక్కిందటే.. ఆయన నేర్పిన పాఠాలే కారణం. ఆయన అప్పుడు ఇచ్చిన ధైర్యం.. నన్ను ఇప్పుడు మీ ముందు నిలబెట్టింది’అంటూ మాట్లాడారు. రాజమౌళి మాట్లాడుతూ.. ఇంత పెద్ద సినిమా వేడుక జరుగుతుందంటే.. పరుచూరి బ్రదర్స్ గారికిథ్యాంక్స్ చెప్పాలి. బ్రిటీష్ వారిపై మొట్టమొదటగా పోరాడింది మన తెలుగు వాడని అందరికీ తెలిసేలా మా హీరో రామ్ చరణ్ చేశాడు. ఇది మీ డాడీకే గిఫ్ట్ కాదు.. మొత్తం తెలుగు వారికి అందిస్తున్న గిఫ్ట్’అని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ... ‘అందరికీ నమస్కారం.. వర్షం ఇంత కురుస్తున్నా మీరు ఇలా ఉంటూ.. మెగాస్టార్‌పై మీకున్నా అభిమానాన్ని చూపిస్తున్నారు.. సమయం లేనందున.. అందరి గురించి చెప్పలేకపోతున్నాను. ఎవరికీ తెలియని ఓ విషయాన్ని చెబుతాను. పవర్స్టార్కూడా తెలియనిది చెబుతాను. నేను సైరాను చూశాను.. నేను మొట్టమొదటి ప్రేక్షకుడిని. సినిమా చూసి కింద పడిపోయాను.. ఈ మూవీ సూపర్‌హిట్’ అని అన్నారు. . చిత్ర నిర్మాత, హీరో రాంచరణ్ మాట్లాడుతూ.. ‘ఇక్కడకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సినిమాకు పనిచేసిన అన్ని శాఖల వారికి థ్యాంక్యూ. షూటింగ్ చేసిన ప్రతి రోజు వారందరికీ థ్యాంక్స్ చెబుతూనే ఉన్నాను. వారంతా సహకరించడం వల్లే ఈ సినిమా పూర్తి చేయగలిగాం. ఎక్కువసేపు నాన్నగారిని, బాబాయ్‌ని వెయిట్ చేయించి మాట్లాడలేను. అందుకే ముగించేస్తున్నాను. అంతేకాకుండా వర్షం వచ్చేలా కూడా ఉంది కాబట్టి మరోసారి అందరికి ధన్యవాదాలు చెబుతూ ముగించేస్తున్నాను’ అని తెలిపాడు. హైదరాబాద్‌లో సముద్రం లేదని ఎవరు చెప్పారు..? తరలిరాదా తనే వసంతం తనదరికి రాని వనాల కోసం అంటూ రుద్రవీణ పాట పాడాడు మాటల రచయిత సాయి మాధవ్‌బుర్రా. చిరంజీవి పిలిస్తే.. వసంతాలు కాదు సముద్రాలే తరలివస్తాయన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. మా అమ్మమ్మకు 80లో ఉన్న హీరోలు ఎవరూ తెలీదు. ఒక్క చిరంజీవి తప్పా.. ఆయన పాటను వింటూనే ఉంటుంది. నేను సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు చిరంజీవికి మాటలు రాయమని మా అమ్మమ్మ అనేది. ఆకాశాన్ని అందుకోమని అంటే ఎలా అది కుదరని పని అంటూ చెప్పేవాడ్ని కానీ ఆయన సినిమాకు ఇప్పుడు మాటలు రాశాను. ఆయనకు ఒక్క మాట రాసినా చాలు అనుకునే వాడిని.. ఖైదీ నెం.150కు డైలాగ్స్రాయమని పిలిచారు. ఆయన డైలాగ్చెబితే.. ఆయన మాత్రమే చెప్పేలా ఉండాలి.. అందుకే ఓ డైలాగ్రాశానని.. పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది అనే మాటలు రాశాను. అది ఆయనకు తప్పా ఇంకెవరికి సెట్ కాదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ టెక్నీషియన్‌ను రామ్ చరణ్ బాగా చూసుకున్నాడు. అతనొక గొప్ప హీరో మాత్రమే కాదు.. గొప్ప ప్రొడ్యూసర్. ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయంటే.. నా ఒక్కడి కృషి కాదు.. అది అందరి సమష్టి కృషి. ఈ సినిమా ద్వారా సురేందర్ రెడ్డి ఓ మంచి స్నేహితుడయ్యాడు. ఈ సినిమా తమకు పదేళ్ల కల అని.. కల ఎపపుడు చెదిరపోదని పరుచూరి వెంటేశ్వర్రావు అన్నారు. ఈ కథను చిరంజీవి కోసమే ఎంతోమంది పెద్దొళ్లు వదిలేశారని అనిపిస్తుంది. అందుకే పదేళ్ల తరువాత కూడా చిరు కోసమే ఈ సినిమా ముందుకు కదల్లేదు. ఆయన ఇప్పుడు కూడా ఆలానే కనిపిస్తున్నాడు. తన తండ్రి కోసం రామ్ చరణ్.. ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించాడు. తండ్రిని ఎక్కడో కూర్చోబెట్టాలని ఈ చిత్రాన్ని తీశాడు. సినిమాలోని ఓ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు. తన గురువైన గోసాయి వెంకన్న దగ్గరికి ఉయ్యాల వాడ నరసింహారెడ్డి వెళ్లి.. భార్యాబిడ్డల్నీ వదిలేసి యుద్దానికి వెళ్తున్నా ఆశీర్వందించండి అనే చెప్పే సందర్భంలో వచ్చే ఈ డైలాగ్‌ను స్టేజ్‌పై చెప్పాడు. ‘భార్య కోసం యుద్దం చేస్తే పురాణం అవుతుంది.. భూమి కోసం యుద్దం చేస్తే ఇతిహాసం అవుతుంది.. జాతి కోసం యుద్దం చేస్తే చరిత్ర అవుతుంది’ అంటూ అమితాబ్ చెప్పే అద్భుతమైన డైలాగ్‌ను ఆయన స్టేజ్‌పైనే చెప్పారు. తన తండ్రి అచ్చం నరసింహారెడ్డిలా కనిపించాలని దగ్గరుండి మరీ సుష్మిత క్యాస్టూమ్స్‌ను డిజైన్ చేసిందని కొనియాడారు. ఎవరిని ఎంతగా వాడుకోవాలో.. ఎవరి చేత ఎంతగా నటింపజేయాలో సురేందర్ రెడ్డికి బాగా తెలుసంటూ.. ఈ సినిమా హిట్ కాబోతోన్నందుక ముందుగానే అతని కంగ్రాట్స్ చెప్పారు. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మొదలైంది. ఈ వేడుక కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. అభిమానుల మధ్య ‘సైరా’ ప్రీ–రిలీజ్ వేడుక కన్నుల పండవగా జరుగనుంది. రెండు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఈ వేడుకకు భారీగా హాజరయ్యారు. ముందుగా చిరంజీవి నటించిన హిట్ చిత్రాలలోని పాటలను గాయనీ,గాయకులు ఆలపిస్తూ, అభిమానులను అలరిస్తున్నారు. కాగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అక్టోబరు 2న ‘సైరా’ చిత్రం విడుదల కానుంది. సాయంత్రం 6 గంటల నుంచి సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం -
గాలివాన బీభత్సం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. సోమవారం సాయంత్రం గంటకు 78 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఈ గాలులకు హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ప్రజలు గడగడలాడి పోయారు. కురిసింది కొద్ది సేపయినా నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఇంటి పైకప్పులు గాల్లో ఎగిరిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురు గాలుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ అతలాకుతలం.. జడివాన గ్రేటర్ హైదరాబాద్‌ను గజగజలాడించింది. విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడటంతో పలు ప్రాంతాల్లో గంటల తరబడి అంధకారం అలుముకుంది. భారీ వృక్షాలు విరిగిపడటంతో పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. వర్షం 2 సెంటీమీటర్ల లోపే కురిసినా.. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీరు చేరాయి. దీంతో ఆ ప్రాంతాల్లో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. సికింద్రాబాద్, చార్మినార్‌లో విద్యుత్ తీగలు తెగిపడటంతో కొద్ది గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎల్బీనగర్, మారేడ్‌పల్లి, అంబర్పేట్, రామకృష్ణమఠం, ఉప్పల్‌లోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. మల్కాజ్‌గిరిలో వరదనీరు పోటెత్తింది. ఎన్టీఆర్ స్టేడియంలో పలు షెడ్లు, హోర్డింగ్‌లు కుప్పకూలాయి. ఈదురుగాలుల బీభత్సంతో విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. సుల్తాన్‌షాహీ ప్రాంతంలో ఇంటిపై కప్పు రేకులు కొట్టుకుపోయాయి. అల్వాల్‌లో చెట్లు విరిగి ప్రధాన రహదారిపై పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కుప్పకూలింది. ఫ్లడ్ లైట్ కూలి ఒకరు.. ఈదురు గాలుల తీవ్రతకు ఎల్బీ స్టేడియంలోని భారీ ఫ్లడ్ లైటు టవర్ కుప్పకూలింది. అదే సమయంలో విధులు ముగించుకుని మెట్రో రైలు ఎక్కేందుకు స్టేడియం మీదుగా వెళ్తున్న జీఎస్టీ ఉద్యోగి సుబ్రమణ్యం (55) టవర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు ఉన్న తోటి ఉద్యోగి రమేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్, పోలీసు అధికారులు సందర్శించి సహాయచర్యలు చేపట్టారు. కాగా, సాధారణ రోజుల్లో సాయంత్రం సగటు విద్యుత్ వినియోగం 2,700 మెగావాట్లు నమోదు కావాల్సి ఉండగా, సోమవారం రాత్రి అనూహ్యంగా 1,400 మెగావాట్లకు పడిపోయింది. డిస్కం ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అప్రమత్తమై ఆయా డివిజన్ల పరిధిలోని ఇంజనీర్లను రంగంలోకి దింపారు. గాల్లో కలిసిన బాలుడి ప్రాణం.. గాలి దుమారం ముక్కుపచ్చలారని బాలుడిని మింగేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ గ్రామానికి చెందిన ఎల్లేశ్ ఓల్డ్ మలక్‌పేట శంకర్ నగర్, హౌజింగ్‌బోర్డు కాలనీలో నివసిస్తున్నాడు. అతని కుమారుడు నవనీతరాజు (7) శ్రీ సాయి గ్రామర్ స్కూల్లో 1వతరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవురోజు కావడంతో ఇంటిపక్కనే ఉన్న పెద్దమ్మ వాళ్ల ఇంటికి ఆడుకోవడానికి వచ్చాడు. రేకుల ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ముంచెత్తిన గాలి దుమారం ధాటికి ఆ ఇంటిపై రేకులు ఎగిరి నవనీతరాజుపై పడ్డాయి. ఒక్కసారిగా రెండు రేకులు పడటంతో నవనీత రాజు వాటి మధ్య ఇరుక్కుపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మహబూబ్‌నగర్‌లో ఇలా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, వడగండ్లు పంటలకు తీవ్రనష్టం మిగిల్చాయి. మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తికి చెందిన గొల్లగోపి (35) అనే వ్యక్తి పిడుగుపాటుకు మృత్యువాత పడ్డాడు. కాగా, వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం ఖానాపూర్‌లో వందేళ్లనాటి రావిచెట్టు కూలిపోయింది. మెదక్ జిల్లాలో.. మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. చేగుంట, తూప్రాన్, రామాయంపేట, నిజాంపేట, టేక్మాల్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వర్షం అతలాకుతలం చేసింది. ఈదురు గాలులతో ఇళ్ల రేకుల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్లపై ఆరబోసిన ధాన్యం వానకు తడిసి ముద్దయింది. నిజాంపేట మండలం కె.వెంకటాపూర్‌లో ఓ కోళ్లఫారం నేలమట్టమైంది. వైరా, కొణిజర్ల మండలాల్లో వర్షం కురిసింది. వైరాలోని మార్కెట్లో యార్డులో దాదాపు 10 వేల క్వింటాళ్ల ధాన్యం తడిచిపోయింది. ఇల్లెందు పట్టణంలో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. రాష్ట్రంపై ఉపరితల ద్రోణి.. నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ కర్ణాటక వరకు తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అలాగే శ్రీలంకకు ఆగ్నేయ దిశగా హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలలో ఈ నెల 25వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తదుపరి 48 గంటలలో ఇది వాయుగుండంగా మారి శ్రీలంక తూర్పు ప్రాంతం మీదుగా వాయవ్య దిశగా తమిళనాడు వైపుకు ప్రయాణించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. దీంతో మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. బుధవారం పొడి వాతావరణం ఉంటుందన్నారు. ఇదిలావుండగా గత 24 గంటల్లో నల్లగొండ జిల్లా మర్రిగూడ, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లెలో రెండు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు సోమవారం ఆదిలాబాద్, హన్మకొండ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 40 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో కురిసిన వర్షపాతం.. ప్రాంతం నమోదైన వర్షపాతం (సెంటీమీటర్లలో) కుత్బుల్లాపూర్ 1.5 ముషీరాబాద్ 1.3 మోండామార్కెట్ 1.3 నారాయణగూడ 1.0 వెస్ట్‌మారేడ్‌పల్లి 1.5 అంబర్పేట్ 1.0 -
నేడు ఎల్బీ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీస్టేడియంలో గురువారం జనసేన, బీఎస్పీ పార్టీల బహిరంగ సభ జరగనుండటంతో నగర పోలీసులు ట్రాఫిక్ అంక్షలు విధించారు. దీంతో ఎల్బీ స్టేడియం పరిసరాలలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సభను దృష్టిలో ఉంచుకుని వాహనాదారులు ప్రత్యమ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలిలా... ⇔ ఏఆర్ పెట్రోల్ పంపు జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్ళే వాహనాలను నాంపల్లి వైపు మళ్ళిస్తారు. ⇔ అబిడ్స్, గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను ఎస్బీఐ గన్‌ఫౌండ్రి నుంచి చాపేల్ రోడ్డులో అనుమతిస్తారు. ⇔ బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి జీపీఓకు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి హైదర్‌గూడ, కింగ్‌కోఠి మీదుగా మళ్ళిస్తారు. ⇔ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ జంక్షన్ వైపునకు మళ్ళిస్తారు. ⇔ రాజమోహల్లా రోడ్డు నుంచి వచ్చే వాహనాలను పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి కింగ్ కోఠి, లేదంటే నారాయాణగూడ వైపున పంపిస్తారు. ⇔ కింగ్ కోఠి నుంచి బషీర్ బాగ్‌కు వచ్చే వాహనాలను భారతీయ విద్యాభవన్ వద్ద కింగ్‌కోఠి క్రాసు రోడ్డు మీదుగా తాజ్‌మహల్ వైపు అనుమతిస్తారు. ⇔ అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్ నుంచి హిమాయత్‌నగర్ రోడ్డులో అనుమతిస్తారు. ⇔ ట్రాఫిక్ కంట్రోల్ రూం నుంచి బషీర్ బాగ్‌కు వచ్చే వాహనాలను నాంపల్లి మార్గంలో పంపిస్తారు. ⇔ హిల్ ఫోర్టు నుంచి వచ్చే వాహనాలను బషీర్ బాగ్ వైపు అనుమతించరు. ఆ వాహనాలను పీసీఆర్ జంక్షన్ నుంచి నాంపల్లి రోడ్డులో పంపిస్తారు. పార్కింగ్ ప్రాంతాలిలా... ⇔ సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్ మీదుగా ఆయ్కార్ భవన్ వద్దకు చేరుకుని కార్యకర్తలను దించి. వాహనాలను నెక్లెస్ రోడ్డు లేదా ఎన్జీఆర్ స్టేడియంలో పార్క్ చేసుకోవాలి. ⇔ ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మెహదీపట్నం, పాత నగరం నుంచి వచ్చే వాహనాలు పబ్లిక్ గార్డెన్లో వాహనాలను నిలపాలి. ⇔ ముషీరాబాద్, అంబర్పేట్, హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదురుగా ఉన్న నిజాం కాలేజీ గేటులో వాహనాలను పార్క్ చేయాలి. ⇔ వీఐపీ వాహనాలను వ్యవసాయ శాఖ కార్యాలయం, ఎస్సీఈఆర్టీ, మహబూబియా కాలేజీలో వాహనాలను పార్క్ చేసుకోవాలి. ⇔ మీడియా ప్రతినిధులు డి గేటు వద్ద దిగి అలియా కాలేజీ వద్ద పార్క్ చేసుకోవాలి. -
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం ఫోటోలు
-
హైదరాబాద్‌లో భారీ ఆగ్నిప్రమాదం
-
కమల వికాసం
-
మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
-
మైనారిటీ విద్యకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాబోయే పది పన్నెండేళ్లలో మైనారిటీ వర్గాల్లో విద్యాపరంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన దావత్–ఏ–ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసి గురుకులాల్లో ఉచిత విద్య, వసతి అందిస్తున్నామన్నారు. తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యార్థులు నాసా వరకు వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. అన్ని అంశాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, ప్రగతిపథంలో దూసుకెళ్తోందని చెప్పారు. ‘‘దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట వేశాం. దేశం మొత్తమ్మీద మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయిస్తే.. తెలంగాణలో రూ.2 వేల కోట్లు కేటాయించాం. ఈ బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో ఖర్చు చేస్తాం’’అని అన్నారు. రాజస్తాన్‌లో హైదరాబాద్ రుబాత్ అల్లా కృపతో తెలంగాణ సాధించగలిగామని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అల్లాను వేడుకున్నామని, అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరిపామన్నారు. దేవుడు న్యాయమైన కోరికను కరుణించడంతో రాష్ట్రం సిద్ధించిందన్నారు. మక్కా మదీనాలో మాదిరిగా రాజస్తాన్‌లోని అజ్మీర్ షరీఫ్‌లో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో హైదరాబాద్ రుబాత్ భవన సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. ఇందుకు రాజస్తాన్ ప్రభుత్వం 8 ఎకరాల భూమి కేటాయించిందని, త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రత్యేక రైలు వేసి 31 జిల్లాల నుంచి ముస్లింలను శంకుస్థాపన కార్యక్రమానికి తీసుకెళ్తామన్నారు. హైదరాబాద్‌లో సుమారు 10 ఎకరాల్లో ఇస్లామిక్ సెంటర్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా మైనారిటీ వర్గాలకు కూడా అన్ని పథకాలు వర్తింపచేసినట్లు వివరించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. దేశంలో మైనారిటీ వర్గాలు సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ ఇఫ్తార్ విందులో మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్బీ స్టేడియంలో మెగా ఇఫ్తార్
-
అద్వితీయం...
భాగ్యనగరం రెండోరోజూ తెలుగు వెలుగులతో జిగేల్మంది. సాహితీ సౌరభాలతో గుబాళించింది. కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల హోరులో తడిసి ముద్దయింది. నగరంలో ఏర్పాటు చేసిన ఆరు ప్రాంగణాలు భాషా, సాహిత్య అభిమానులతో కిక్కిరిసిపోయాయి. అమ్మ భాషను అందలం ఎక్కిస్తూ అంగరంగవైభవంగా కార్యక్రమాలు కొనసాగాయి. ఎల్బీ స్టేడియంలో ‘సాహిత్య సభ.. తెలంగాణలో తెలుగు భాషా వికాసం’, తెలంగాణ సారస్వత పరిషత్‌లో శతావధానం, తెలుగు వర్సిటీ ప్రాంగణంలో పద్య కవితా సౌరభం, రవీంద్రభారతిలో అష్టావధానం, బాలసాహిత్యం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్ కవి సమ్మేళనాలు జరిగాయి. ఆయా కార్యక్రమాల విశేషాలివీ.. అమ్మ భాషకు అభయం తెలుగు కనుమరుగవుతుందా? యునెస్కో హెచ్చరిక త్వరలోనే నిజమవుతుందా? దీనిపై భాషాభిమానుల్లో కలవరమెంతో. ప్రపంచంలో అద్భుత సాహితీ ప్రక్రియలున్న గొప్ప భాషల్లో ఒకటిగా వెలుగొంది ఇక చరిత్రపుటలకు పరిమితమవబోతోందన్న మాటలు పెద్ద భయాన్నే రేకెత్తించాయి. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీదుగా వెలువడుతున్న మాటలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. భయం వద్దు.. కాస్త మనసు పెడితే భాష మళ్లీ శాఖోపశాఖలుగా వికసిస్తుంది, మనకే ప్రత్యేకమైన సాహితీ ప్రక్రియలు విలసిల్లుతాయి, విరాజిల్లుతాయంటూ కొత్త అభయాన్ని ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఘనంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభల తొలిరోజే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ‘శతదా, సహస్రదా.. అమ్మ భాషను రక్షించుకునేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతుంద’ని బమ్మెర పోతన వేదిక సాక్షిగా గట్టిగా చెప్పారు. ఇప్పుడు సాహితీ ప్రముఖులు ఇదే మాటను పునరుద్ఘాటిస్తున్నారు. మన భాషకు వచ్చిన భయమేమీ లేదని, అది అద్భుతంగా వికసించి తీరుతుందంటున్నారు. సభల రెండో రోజైన శనివారం లాల్‌బహదూర్ క్రీడా మైదానంలోని పాల్కురికి సోమన ప్రాంగణం, బమ్మెర పోతన వేదికపై సాయం వేళ నిర్వహించిన సాహిత్య సభ, సాంస్కృతిక సమావేశంలో వక్తలు తెలుగు భాష విషయంలో భయం వద్దంటూ తేల్చి చెప్పారు. అంతా కలిస్తే అమ్మ భాష మనతో శాశ్వతంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య సభలో డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ముదిగొండ సుజాతారెడ్డి, డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ ప్రసంగించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కూడా ప్రసంగించారు. పంజాబీ రచయిత్రి డాక్టర్ వనిత, తమిళ రచయిత్రి సల్మాలను ఘనంగా సత్కరించారు. ఇందులో ఎవరెవరు ఏమన్నారంటే.. తెలంగాణ గొప్ప సాహిత్యానికి పుట్టినిళ్లు. తెలుగు భాషలో ఎన్నో ప్రయోగాలు ఈ నేల మీదుగానే శ్రీకారం చుట్టుకున్నాయి. మనుచరిత్ర కంటే ముందే తెలంగాణ నేలపై ప్రబంధ కావ్యాలొచ్చాయి. – ప్రముఖ సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం శ్రామికుల చెమట చుక్కల్లోంచి మన భాష వికసించింది. దాన్ని పండితులు తీర్చి దిద్దారు. ఆ అద్భుత భాషలో సాహిత్యం పుట్టింది తెలంగాణలో. నవాబులు అణచివేత చర్యలనూ ఎదుర్కొని నిలబడ్డ ఈ భాషకు ప్రమాదం లేదు. యునెస్కో తాత దిగొచ్చి చెప్పినా మన భాషకు వచ్చే నష్టం లేదు. – ఆచార్య ఎస్వీ సత్యనారాయణ 935 ఏళ్ల క్రితమే ముదిగొండ చాళుక్యుల శాసనం, గూడూరు శాసనం, జినవల్లభుడు తయారు చేయించిన కురిక్యాల శాసనాలు తెలంగాణలోనే తొలి తెలుగు వైభవాన్ని చాటి చెబుతున్నాయి. – డాక్టర్ సుజాతారెడ్డి శాతవాహనులు నాటిన తెలంగాణ మొక్క ఊడల్లేచి పెరిగింది మర్రిచెట్టు లెక్క. – నటుడు తనికెళ్ల భరణి జ్ఞాపకాల దొంతరలో దొరికిన బాల్యం ‘వీరగంధము తెచ్చినాము– వీరుడెవ్వడో తెల్పుడి... అమ్మా అమ్మా చెప్పమ్మా ఆకాశం అంత ఎత్తున ఎందుకుంది... చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి...’ అంటూ వేదిక మీదున్న కథాకారులు తన్మయత్వంతో ఉచ్చరిస్తుంటే... ఎవరు మాత్రం బాల్యంలోకి పరుగులు తీయకుండా ఉండగలరు? రవీంద్రభారతిలోని డాక్టర్ యశోదారెడ్డి ప్రాంగణంలోని బండారు అచ్చమాంబ వేదిక మీద సరిగ్గా ఇదే జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బాలసాహిత్య సదస్సు హాలు నిండిపోయింది. ఆహూతులంతా ట్రంకు పెట్టెలో దుస్తుల అడుగున జ్ఞాపకాల దొంతరలలో దాచుకున్న బాల్యాన్ని వెతుక్కోవడానికి వచ్చినట్లే ఉన్నారు. తమ బాల్యాన్ని దాటి సమాజంలో జీవితాన్ని ఈది అలసిపోయిన కథాపిపాసులకు ఈ సదస్సు ఓ బంగారు అవకాశమైంది. పిల్లలమర్రి రాములు అధ్యక్షతన జరిగినఈ సదస్సులో చొక్కాపు వెంకటరమణ, పత్తిపాక మోహన్, ఐతా చంద్రయ్య, దాసరి వెంకటరమణ, వేదకుమార్, దేవేంద్ర, గిరిజారాణి, రంగయ్య పాల్గొన్నారు. ‘‘జానీ జానీ, ఎస్ పపా, ఈటింగ్ షుగర్, నో పపా గేయంలో... చక్కెర తినడం లేదని చెప్పిన పిల్లాడు నోరు తెరిస్తే నోటి నుంచి చక్కెర జారిపడుతుంది. ఈ గేయంలో పిల్లలకు ఏ సంస్కారాన్ని నేర్పుతున్నాం?’’ అని ఆవేదన చెందారు కథకుడు ఐతా చంద్రయ్య. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి అంటూ సాగే మన గేయాలలో పిల్లలకు సమాజాన్ని పరిచయం చేస్తాయన్నారు. మన స్థానిక సాహిత్యమైనా, తెలుగులోకి అనువదించుకున్న సింద్బాద్ సాహస యాత్ర వంటి పొరుగు సాహిత్యమైనా సరే అందులో పిల్లలకు సంస్కారాన్ని, మంచిని నేర్పే ఇతివృత్తం ఉండాలన్నారు. తెనాలి రామకృష్ణుని కథలలోని హాస్యాన్ని, మర్యాద రామన్న కథల ద్వారా యుక్తిని పిల్లలు ఆస్వాదిస్తారన్నారు. పిల్లల భాష తియ్యగా ఉండాలి! పిల్లలు పాలమీగడను ఇష్టపడినట్లే కథలనూ ఇష్టపడతారు. వాళ్లకు చెప్పే కథలు కూడా తేలిక పదాలతో మీగడ తరకల్లా ఉండాలి. పిల్లల కథల్లో ప్రకృతిలోని ప్రతి వస్తువూ మాట్లాడుతుంది. అదే పిల్లల కథకు అందం. పిల్లలకు ఆనందం. వీరమాత కథలు చెప్పాలి, దేశభక్తుల కథలు వినిపించాలన్నారు వక్తలు. ప్రతి స్కూల్లోనూ లైబ్రరీ పీరియడ్ ఒక గంట తప్పని సరిగా ఉండాలని వాసా నర్సయ్య తన సందేశంలో తెలియచేశారు. తమకు పాఠశాలలో ఒక తరగతి సాహిత్య పఠనానికి ఉండేదని, దానిని పునరుద్ధరించాలని కోరారు బాల సాహితీవేత్త రెడ్డి రాఘవయ్య. ప్రపంచం బతకాలంటే బాల సాహిత్యం బతకాలని ముక్తాయించారు. – వాకా మంజులారెడ్డి సోమనాథుడి నుంచి సురవరం వరకు వెల్లివిరిసిన పద్యకవితా సౌరభం తెలంగాణ పద్యకవితా సౌరభానికి తెలుగు విశ్వవిద్యాలయంలోని బిరుదురాజు రామరాజు ప్రాంగణం వేదికయ్యింది. పోతన లాంటి కవులపై సోమనాథుడి కవితా నిర్మాణం, శైలి ప్రభావాన్ని గుర్తు చేసుకుంటూ సోమనాథుడు కందం రాసినా, సీసం రాసినా రసాత్మకత ఉట్టిపడేదనీ, సంస్కృతం కాదు తెలుగుకి ప్రాధాన్యతనివ్వాలంటూ ఆయన రాసిన ‘తెలుగు మాటలనంగ వలదు’ పద్యాన్ని సభాధ్యక్షుడు అనుమాండ్ల భూమయ్య చదువుతూంటే పద్యరసాన్ని ఆస్వాదించారు భాషాప్రేమికులు. అప్పడాల్లాంటి కాగితాల్లో... అప్పడాల్లాంటి కాగితాల్లో ముట్టుకుంటే రాలిపోయే శిథిలప్రాయంలోని పద్యకావ్యాలను దాచుకుని చదువుతున్నామంటూ ఎంతో విలువైన ప్రాచీన పద్యకావ్యాల పునర్ముద్రణకు పూనుకోవాలని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేశారు. పద్యకావ్యంలో ఒదిగిన కొత్తపదాలను తడిమి చూసిన ఈ వేదిక మీద తూర్పు మల్లారెడ్డి కౌస్తుభం అనే ఎత్తుగడతో ప్రారంభించి, ‘వాస్తుభం’ పద ప్రయోగాన్ని ప్రస్తావిస్తూ... దాని అర్థం స్తుభం అంటే పొగడదగినదనీ, ఉర్దూలోని వాహ్ని తీసుకుని వాతో కలిపి వాస్తుభం అయ్యిందనీ, రెండు భాషల కలయికతో కొత్తపద సృష్టి తెలంగాణ ఘనత అనీ వివరించారు. పద్యాన్ని మందారంగా చేసి మకరందాన్ని కురిపించిన పోతన మరెవ్వరూ రాయనంత అందమైన పద్యాలను రాసిన విషయాన్ని ప్రస్తావిస్తూ సంగనభట్ల నర్సయ్య– ఎన్ని నోముల ఫలము ఇంతపొద్దు ఒక వార్త వింటిని మన యశోద చిన్న మగవాని కనెనట చూచివత్తునమ్మ సుధము... అని పాడి శ్రోతలను మైమరపించారు. పుట్టినప్పటి నుండి వెట్టిచాకిరి చేసి... కులకాంత రోజంత కూలిచేసినగాని బుక్కెడన్నం దక్కదాయె అంటూ తెలంగాణ పద్యకవిత్వంలోని ఆధునికతను గండ్ర లక్ష్మణరావు ప్రస్తావించారు. ఛందస్సును ఛేదించిన సురవరం అనంతరం మధ్యాహ్నం జరిగిన తెలంగాణ వచన కవితా వికాసం సదస్సు అనేక దశల్లో కవితాప్రవాహ వేగాన్ని లోతుగా చర్చించింది. వ్యాకరణం, ఛందస్సును ఛేదించుకుని ... అన్న శ్రీశ్రీ, పట్టాభి కంటే ముందే భావ – పద్యకవిత్వాలను నెగేట్ చే సి 1935లోనే సురవరం ప్రతాపరెడ్డి వచన కవిత్వాన్ని తెచ్చారని సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. మాత్ర ఛందస్సు, గేయ ఛందస్సు, ఆ తరువాత వచన కవిత్వం తెలంగాణలో ఆవిష్కృతం అయిన క్రమాన్ని వివరించారు. సురవరం అనంతరం వావి నారాయణ మూర్తి, కవిరాయమూర్తి వచన కవిత్వం కొనసాగించిన విధానాన్ని ఈ సదస్సు గుర్తు చేసుకుంది. దిగంబర కవిత్వం కొనసాగింపుగా వచ్చిన విప్లవ కవిత్వం, అస్తిత్వ కవిత్వం, ఉద్యమ కవిత్వ ప్రవాహాన్ని భాషాభిమానులు తమ జ్ఞాపకాల్లో పొదివిపట్టుకున్నారు. గత 40–50 ఏళ్ళలో వచన కవిత్వంలో వచ్చిన మార్పు మరిదేనిలోనూ రాకపోవడం సామాజిక మార్పు ప్రభావాన్ని ప్రకటిస్తోందన్నారు గౌరవ అతిథి కె.శివారెడ్డి. ఇంకా జూలూరి గౌరీశంకర్, నారదాసు లక్ష్మణరావు, పెన్నా శివరామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. – అత్తలూరి అరుణ కమనీయం.. కవి సమ్మేళనం ఒకే వేదికపై 500 మందికిపైగా కవులు ‘అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కుక్కపిల్ల.. ఆల్లు.. ఈల్లు.. అస్తుండ్లు.. పోతండ్లు..’ ఒకటేమిటి ‘అ’నుంచి ‘ఱ’ వరకు సమస్త పదాలతో వచన కవుల ఆత్మనే కవితా çపంక్తులుగా మలిచి విసిరారు. కమ్మని గడ్డ పెరుగులాంటి కవితలతో అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం తన్మయం చెందింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వచన కవితా పండితులు తమ కవితలతో పదాల్లో నవరసాలను పండించారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శనివారం జరిగిన బృహత్ కవి సమ్మేళనం ఆద్యంతం ఆనందభరితంగా సాగింది. వానమామలై వేదికపై ప్రముఖ కవి దిలావర్ అధ్యక్షతన మొదలైన తొలి సమావేశం సీహెచ్ మధు అధ్యక్షతన జరిగిన తొమ్మిదో సమావేశంతో ముగిసింది. ప్రతి సమావేశానికి ఒక్కో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై 500 మందికిపైగా కవులు తమ కవితలను వినిపించారు. ‘మట్టి పొరల్లోనే మండిపడే బడబాగ్ని.. మధనపడే తిరుగుబాటు, తిరగబడే తీవ్రవాద మొలకలై.. మొక్కలు మారితే విప్లవం వటవృక్షాలుగా మారక ఏమవుతుంది? తుపాకులు ఎగురుతూ.. తూటాల చప్పుళ్లు వినిపిస్తుంటే మర ఫిరంగుల్లా మారక మరేం చేస్తాయి?’ అంటూ అన్వేషి అనే కవి రాజ్యహింసను సూటిగా ప్రశ్నించారు. ‘ఆ రాళ్లు పులకిస్తాయి.. పువ్వులై వికసిస్తాయి.. సౌందర్య సౌరభాలను గుబాళిస్తాయి.. ఆ రాళ్లు నాట్యాలై నర్తిస్తాయి.. శృంగార సోయగాలను వినిపిస్తాయి.. మనసును మత్తెక్కిస్తాయి.. అదే ఉలి సంతకం నేడు తెలుగుగా మహాసభలకు శోభాలంకృతమై తెలుగు వెలుగుల కీర్తికిరీటాలైతాయి..’ అంటూ మరో కవి తన కవిత వినిపించారు. ‘అ’మ్మ మన తోటలో ‘ఆ’వుదూడ నిల్చుంది. ‘ఇ’ంతలో తోటమాలి ‘ఈ’ ప్రాంతం వచ్చినాడు.‘ఉ’రికి ఆవు దూడను చూసి ‘ఊ’రుకోలేక ..‘రు’మాలునుజుట్టి ‘రూ’లుగర్రలను బట్టి ‘లు’ంబినీ వనంను.. ఇలా తెలుగు అక్షరమాల అ నుంచి ఱ వరకు గండి వెంకటేశ్వర్లు చదివిన కవిత సభికులను మంత్రముగ్ధులను చేసింది. ‘విరిసే నవచేతనం ఇది మాగాణం... ఇది మా..గానం. ఇక ఎండదు ఏ వృక్షం.. పండును ప్రతి ఫలపుష్పం. ఈ దారుల నదీనదం ఉరకలెత్తి ఉప్పొంగును. ఇది మాగాణం.. ఇది మా తెలంగాణం’ అంటూ కవి నర్సింహారెడ్డి భవిష్యత్ తెలంగాణను వివరించారు. ‘కంచు కంఠాలతో కండలు తెంచే బఠానీలాంటి తెలంగాణ హఠానీలను కూడా మిఠాయిలా మింగి వేసే తహతహ మాత్రం మెండుగా ఉంది. కానీ కమ్మని కంఠం నాకు లేదు’ అంటూ షేక్ నబీరసూల్ రాసిన కవిత ఆçహూతులను ఆకట్టుకుంది. – వర్ధెల్లి వెంకటేశ్వర్లు సురవర కల్పవృక్షమై... సురవరం, సింగిరెడ్డి, దాశరథి, మాడపాటి పదాలతో కేసీఆర్ ప్రభుత్వ పాలనను వర్ణించాలని కోరగానే, ‘సురవర కల్పవృక్షమై శుభ్రకళా సుకలాప రూపమై’ అన్న తొలిపంక్తిని ఆశువుగా పూరించారు శతావధాని డాక్టర్ జి.ఎం.రామశర్మ. తెలంగాణ సారస్వత పరిషత్‌లో రామశర్మ శతావధానం భాషా చమత్కారాల మధ్య శనివారం ప్రారంభమైంది. ‘ఇంగ్లిషు చదువులు తెలుగు రాతను మార్చాయి. అమ్మ భాషకు కొత్త సొగసులు అద్దేందుకు భాషా పండితులే కాదు, ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. అందుకు ఈ మహాసభలకు హాజరైన వారే సాక్షిభూతులు’ అన్నారు రామశర్మ. సభకు అధ్యక్షత వహించిన అయాచితం నటేశ్వర శర్మ మాట్లాడుతూ... ఒక జాతి చరిత్ర, సంస్కృతి, కళ, సాహిత్యం... అన్నీ భాషపైనే ఆధారపడి ఉంటాయన్నారు. తెలుగు భాష అజంతం, తెలుగు మాట అనంతం అన్నారు అనుసంధానకర్త పెరుంబుదూరు శ్రీరంగాచార్య. ‘తెలుగు భాషకు మాత్రమే ఉన్న ప్రత్యేకత అవధానం. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు విడిపోలేదు, నన్నయ విడిపోలేదు, పోతన విడిపోలేదు. సారస్వతం విడిపోలేదు. వాక్యం రసాత్మకం కావ్యమ్, విశ్వః శ్రేయమ్ కావ్యమ్... అది పరమ సత్యం చేసిన ప్రక్రియ అవధానం. తెలంగాణలోని అవధానులూ అదే నిరూపిస్తున్నారు. పృచ్ఛకుల విషయంలో ప్రాంతీయ భావం లేకపోవడం సంతోషంగా ఉంది. శివకేశవులకు భేదం లేనట్లే ఆంధ్ర, తెలంగాణలకు భేదం లేదు’ అని గౌరవ అతిథి మేడసాని మోహన్ తన అంతరంగాన్ని పంచుకున్నారు. అధికారులు కాని, రాజకీయ నాయకులు కాని తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించట్లేదు. ‘సంస్కృతికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, అన్ని విభాగాలలో ఇంగ్లిషు చలామణీ అయ్యేలా కొంతమంది మేధావులు ప్రచారం చేస్తున్నారు. ఇలాగైతే దేశం బానిసత్వంలోకి వెళ్లిపోతుంది. ఆ ప్రమాదం నుంచి త్వరగా బయటపడాలి’ అని కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ‘పృచ్ఛకులు, అవధాని సమష్టిగా చేసే కృషి భాషోన్నతికి ఉపయోగపడుతుంది. వారి వారి పాండిత్యాలు ప్రదర్శించడమే కాకుండా, శ్రోతలను విజ్ఞానవంతులను చేయాలి’ అని అభిలషించారు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్. ‘1975లో మొదటి ప్రపంచ మహాసభలలో నేను కార్యకర్తగా పనిచేశాను. ఇప్పుడు ఒక కవిగా పాల్గొంటున్నాను’ అని సంబరపడ్డారు పృచ్ఛకుల్లో ఒకరైన వి.వి.సత్యప్రసాద్. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కావూరి పాపయ్య శాస్త్రి, దత్తాత్రేయశర్మ, మాడుగుల నాగఫణిశర్మ తదితరులు పాల్గొన్నారు. – డాక్టర్ వైజయంతి సకల జనుల ఇష్టావధానం! రసరంజకంగా మలుగ అంజయ్య అవధానం తెలుగు గొప్పదనం పద్యమైతే.. ఆ పద్యాన్ని శ్వాసించి, గానించి, కీర్తించి ప్రజల నాలుకలకు వారి గుండెలకు చేరువ చేసిన ఖ్యాతి అవధానులది! తెలుగు సాహిత్యంలో ఇప్పటికీ వన్నె తరగని ఆకర్షక శక్తి, వశీకరణ యుక్తి అవధానానికి ఉందని నిరూపించింది శనివారం రవీంద్రభారతిలోగుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ ప్రాంగణంలో జరిగిన అష్టావధాన కార్యక్రమం. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య డాక్టర్ మలుగ అంజయ్య అవధానం రెండు గంటలపాటు రసరంజకంగా సాగింది. పృచ్ఛకులు (ప్రశ్నించేవారు) అడిగిన ప్రశ్నలకు సుదీర్ఘ సమాసాల జోలికి పోకుండా అలతి అలతి పదాల తెలుగు పదాల్లో బదులిచ్చారు. వడిచర్ల సత్యం దత్తపదిగా సెల్‌ఫోన్, షేరిట్, వైఫై, మెయిల్ పదాలిచ్చి రాముడి పంచన చేరిన తమ్ముడు విభీషణుడిని రావణాసురుడు దూషిస్తున్న ఘట్టాన్ని వర్ణించమని కోరారు. ‘అరివైపైనుండగా... నీకే సెల్లుపోనుండకు, రాముని కోరి భజింపుము సేరియిట్టులే, దశకంఠుడు చెండెను మేలు మేలనన్..’ వంటి పద విరుపులతో మెరుపులు పుట్టించారు. పల్లాలి కొండయ్య ఇచ్చిన ‘దారపు మాలలేసుకుని దంపతులయ్యిరి ప్రేమ మీరగన్’ సమస్యకు మం...దారపు మాలలు వేసుకుని అంటూ చమత్కారంగా పూరించారు. ఈ పద్యంలో తారలు నేల వ్రాలినను తప్పను ధర్మము...అన్న పాదానికి సినీనటుడు తనికెళ్ల భరణి సినీతారలు వ్రాలినా అని చమత్కరిస్తే... ఏ తారలైనా అంటూ అవధాని బదులిచ్చారు. చిక్కా రామదాసు అశేష జనవాహినితో నిండిన సభను వర్ణించాల్సిందిగా కోరారు. అవధాని.. ‘మంజుల సాహితీ మల్లికల్ పుష్పించె, ఆమని రుతువయ్యె హైద్రబాదు..’ అంటూ చక్కని సీసపద్యాన్నెత్తుకోవడంతో సభ్యులు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. పద్యంలో ఒకచోట ‘కవితా జాగృతమయ్యి కళలు పంచె’ అనీ...‘మాన్య చంద్రశేఖరరావు మనసు నిండె’ అంటూ కేసీఆర్, కవితల పేర్లు సమయోచితంగా ప్రస్తావించారు. ఛందోభాషణ, ఆశువు, నిషిద్ధాక్షరి నిర్వహించిన పృచ్ఛకులు అవధాని అంజయ్య పటిమను ప్రశంసించారు. ఈ అవధానంలో వారగణనం ప్రత్యేకంగా నిలిచింది. సంవత్సరం, నెల, తేదీ చెప్పగానే అది ఏ వారమో చెప్పి అవధాని అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. సభ ప్రారంభంలో ప్రఖ్యాత అవధాని మాడుగుల నాగఫణిశర్మ అరగంటపాటు ప్రేక్షకుల్ని పద్యాలతో మైమరపించారు. ప్రపంచ మహాసభల పేరిట కేసీఆర్ భాషకు బ్రహ్మోత్సవం జరపడం తెలుగు వారి సుకృతమని ప్రశంసించారు. పాల్కురికి సోమన, పోతన, నన్నయలాంటి పూర్వకవులను స్మరించుకోవడం మహదానందమన్నారు. సినీనటుడు తనికెళ్ల భరణి ఇది సాహితీ పునరుజ్జీవానికి నాందీవాచకమని, అందుకు ఇక్కడ కిక్కిరిసి నిలుచున్న తెలుగు వాళ్లే సాక్ష్యం అని ఉద్వేగంగా పలికారు. అవధానం పద్యంలో నాల్గు పాదాలను నాల్గు ఆవృత్తాల్లో ముగిస్తూ, మధ్యలో సాహితీ సరసోక్తులు విసురుతూ రసరంజకంగా సాగాలి. అయితే సమయాభావం వల్ల గంటలో వేగావధనంగా ముగిసింది. సభలో యువతరానికి చెందిన కొందరు పద్యాలను చక్కగా రాసుకోవడం విశేషం. హాస్యావధానంలో శంకర నారాయణ సంధించిన చమక్కులు ఆహూతులను అలరించాయి. – రామదుర్గం ప్రతిరోజూ హరికథ సాధన తొమ్మిదో తరగతి చిన్నారి లోహిత బాలసాహిత్య సభకు వచ్చిన వారిని కట్టి పడేసిన కార్యక్రమం చలసాని లోహిత చెప్పిన పార్వతీ కల్యాణం హరికథ. కూకట్‌పల్లికి చెందిన ఈ చిన్నారి తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఆసక్తిగా హరికథ చెప్పిన లోహితను పలకరించినప్పుడు... హరికథతో పరిచయం: అమ్మ వాళ్లది తెనాలి దగ్గర వేమూరు. అక్కడ వరికూటి జయమ్మ లాంటి భాగవతార్లు ఎంతో మంది ఉన్నారు. నాకు మూడేళ్లు ఉన్నప్పుడు అమ్మ వారి హరికథలకు తీసుకెళ్లింది. కొచ్చెల రామకృష్ణ గారి దగ్గర కొంత కాలం శిష్యరికం చేశాను. ఇప్పుడు ఉమామహేశ్వర్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సంస్కృతంలో కుమార సంభవం, తెలుగులో పార్వతీకల్యాణం, సీతా కల్యాణం నేర్చుకున్నాను. కథలే కాదు...: డీఏవీ పబ్లిక్ స్కూల్లో 9 వతరగతి చదువుతున్నాను. వారంలో మూడు సార్లు హరికథ తరగతులుంటాయి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటాను. అమ్మ దగ్గరుండి అన్నీ చూసుకోవటం వల్ల ఏ ఒత్తిడీ లేకుండా నేర్చుకోగలుగుతున్నాను. శోభానాయుడు, కేబి సత్యనారాయణ దగ్గర నృత్యం, నాగరాజ్ ప్రసాద్, శ్రీమన్నారాయణ వద్ద సంగీతం నేర్చుకున్నాను. భవిష్యత్తులో...: ఇటీవలే 108 మంది హరికథ భాగవతుల సత్కార కార్యక్రమం ధర్మపురిలో జరిగింది. అక్కడ సచ్చిదానంద శాస్త్రి హరికథ చెప్పారు. ఆయన చెప్పిన తీరు నన్నెంతో ఉత్సాహపరిచింది. కచ్చితంగా హరికథ భాగవతారిణిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. నాకు హరికథ నేర్పించాలని మా తల్లిదండ్రులకు ఆలోచన కలిగినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాలుగు వందల ప్రదర్శనలు: ఇప్పటి వరకు నృత్య, సంగీత, హరికథ ప్రదర్శనలు నాలుగు వందల వరకు ఇచ్చాను. పిల్లలకు, నా వయసు వారికి హరికథల గురించి తెలియదు. పేరెంట్స్ అలవాటు చేస్తే వాళ్లు చూస్తారు. తెలుసుకుంటారు. నృత్యం, సంగీతం కలిపి హరికథ చెప్పటం జరుగుతుంది. చాలా తృప్తి, సంతోషం కలుగుతాయి. – ఓ.మధు ఇలా చేద్దాం...! ‘వివేకవర్ధని’ మాసపత్రికను వెలువరిస్తూ 1874లో కందుకూరి వీరేశలింగం పంతులు గారొక గొప్ప సంకల్పం చెప్పారు. ‘ఈ పత్రికా ప్రకటనము నందు నా యుద్దేశములు భాషాభివృద్ధియు, దేశాభివృద్ధియు ముఖ్యముగా రెండు. నేనేర్పరచుకొన్న భాషాభివృద్ధి మార్గము తెలుగు భాషలో మృదువైన, సులభమైన, సులక్షణమైన వచన రచన చేయుట. దేశాభివృద్ధి మార్గము జనులలో గల దురాచార దుర్వర్తనముల బాపియు....’’ ఎంత గొప్ప మాట! వేమన, అన్నమయ్య, వీరేశలింగం పంతులు, గురజాడ, గిడుగు, సురవరం ప్రతాపరెడ్డి, ఆళ్వార్‌స్వామి, సినారె... ఇటువంటి మహనీయులు ఒక రకంగా భాషా పరిశోధకులే! వ్యక్తులుగా, వారికి తెలియకుండానే భాషపై లోతైన పరిశోధనలు జరిపి సాహిత్య రూపంలో నూతన ఆవిష్కరణలు చేశారు. వారందరి కృషి వల్లే తెలుగు భాష స్వరూప స్వభావాలు మార్చుకుని ప్రజలకు మరింత ఉపయోగ సాధనమైంది. జనసామాన్యం వాడుకలో భాష చెందుతున్న మార్పులకు అనుగుణంగా ఎందరెందరో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తద్వారా భాషాభివృద్ధికెంతో మేలు జరిగింది. ఇదొక స్రవంతిలా సాగాలి. భాషను దీర్ఘకాలం సజీవంగా ఉంచేందుకు అన్ని స్థాయిల్లో పరిశోధనలు, ప్రయోగాలు, పరిరక్షణ చర్యలుండాలి. మాయబజార్ సినిమాలో ఘటోత్కచుడిగా ఎస్వీరంగారావు, ‘ఎవరో పుట్టించకుండా మాటలెలా పుడుతాయ్...వెయ్ వీరతాడు’ అన్న స్ఫూర్తితోనే ఎక్కడైనా భాష సుసంపన్నమౌతుంది. ‘యూఎన్’ ని నార్లవెంకటేశ్వరరావు ‘ఐక్యరాజ్యసమితి’ అనడమైనా, ‘డ్రెడ్జింగ్ షిప్’ను మరెవరో తెలుగులో ‘తవ్వోడ’ అనడమైనా భాషాపరంగా ఓ ముందడుగు. ఆ క్రమంలోనే స్ప్రింక్లర్ ఇరిగేషన్‌ను ‘తుంపర సేద్యం’అని, గ్లోబల్ వార్మింగ్‌ను ‘భూతాపం’ అనడం వంటి పద సృష్టి భాషా ప్రగతి. ఇలా భాషాభివృద్ధికి 5 ప్రాతిపదికలున్నాయి. 1. అకాడమీలు, విశ్వవిద్యాలయాల్లో పీఠాలు, సాహితీసంస్థల్లో పరిశోధనలు జరగాలి. 2. వినియోగంపై జనమాధ్యమాల్లో ప్రయోగాలు సాగాలి. 3. సాహితీరంగంలో నిత్యసృజన జరగాలి. 4. నిఘంటువులు, ప్రమాణ గ్రంథాలు, పారిభాషిక పదకోశాలు, పాఠ్యపుస్తకాల్లో ఈ నూతన ఆవిష్కరణల్ని ఉపయోగించాలి. 5. ఫలితంగా సమగ్ర భావ మార్పిడి, అభివ్యక్తితో తెలుగుజాతి గరిష్టంగా లబ్దిపొందాలి. – దిలీప్‌రెడ్డి -
భాషకు బ్రహ్మోత్సవం
ఆరంభం అదరహో.. మతాబులు.. బాణ సంచా వెలుగులు జిలుగులు.. ఆకాశంలో సప్తవర్ణ కాంతులు.. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు సంబురం మిన్నంటింది! శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభిస్తున్నట్లు రాత్రి 8.30 గంటలకు అధికారికంగా ప్రకటించిన వెంటనే.. ఆకాశంలో కాంతులు విరజిమ్మాయి. ఎల్ఈడీ.. లేజర్ లైట్ల వెలుతురుతో ఆకాశంలో సప్తవర్ణాలు ఆవిçష్కృతమయ్యాయి. సుమారు పది నిమిషాల పాటు ఈ వెలుగులు.. ఆహూతులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. బాణసంచా వెలుగులను తమ సెల్ఫోన్లలో బంధించేందుకు వీక్షకులు ఆసక్తి చూపారు. ఆకాశంలోని అద్భుత దృశ్యాలను స్టేడియం నలుమూలలా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరల్లో చూసి ఆనందించారు. ఈ మ్యూజికల్ ఫైర్వర్క్స్ను ప్రముఖ కార్పొరేట్ సంస్థ విచ్‌క్రాఫ్ట్ నిర్వహించింది. వీటికి సుమారు కోటి రూపాయల దాకా వెచ్చించినట్టు నిర్వాహకులు తెలిపారు. మహాసభల ముగింపు రోజైన ఈ నెల 19న కూడా లేజర్‌షోతోపాటు బాణసంచా కాంతులతో మరోసారి మంత్రముగ్ధులను చేయనున్నారు. మొత్తంగా వీటన్నింటికిగానూ రూ.2.20 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక సౌరభం.. ప్రపంచ తెలుగు మహాసభలలో తెలంగాణ సాహిత్య సాంస్కృతిక సౌరభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ చరిత్రను, కళలను, వైభవాన్ని ఆవిష్కరించిన రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డి బృందం ప్రదర్శించిన ‘మన తెలంగాణ మాణిక్యవీణ’ సంగీత నృత్య రూపకం అలరించింది. అద్భుతమైన నృత్యం, అందుకు తగిన అభినయంతో అరంగంటకు పైగా సాగిన ప్రదర్శనలో ప్రతి ఒక్కరూ తన్మయత్వం పొందారు. ప్రధాన వేడుకల ప్రారంభోత్సవం అనంతరం మిరుమిట్లు గొలిపే బాణ సంచా వెలుగు జిలుగులు ఒకవైపు సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలు మరోవైపు మహాసభలను కన్నులపండువ చేశాయి. ప్రారంభోత్సవ వేడుకలకు ముందు మయూరి ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన పేరిణీ లాస్యం శతాబ్దాల నాటి కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టింది. శ్రీనిధి, వందేమాతరం శ్రీనివాస్ గీతాలాపన మరో ఆకర్షణ. ఆద్యంతం తెలంగాణ వైభవాన్ని కీర్తిస్తూ సాగిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. అనంతరం లిటిల్ మ్యుజీషియ¯Œ ్స అకాడమీ రామాచారి బృందం పాడిన పాటలు, దేశపతిశ్రీనివాస్ సారథ్యంలో, రాధాకృష్ణన్ సంగీతం కూర్చిన ‘జయజయోస్తు తెలంగాణ’ నృత్య రూపకం మరో అద్భుతమైన ప్రదర్శనగా ఆకట్టుకుంది. ఆహా ఏమి రుచి... ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ వేడుకల్లో తెలంగాణ సంప్రదాయ రుచులు అదుర్స్ అనిపించాయి. తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేష¯Œ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో తెలంగాణ వంటకాలను తెలుగు భాషాభిమానులు ఆరగించి తృప్తిపడ్డారు. హైదరాబాదీ బిర్యానీ, బడేమియా కబాబ్, బొక్కల పులుసు, తెలంగాణ మిర్చి బజ్జీ, బ్రెడ్ ఆమ్లెట్, మలాయి కుల్ఫీ, తెలంగాణ చాయ్, వేడి వేడి గుడాలు వారేవా అనిపించాయి. హైదరాబాద్‌కు వస్తే హైదరాబాదీ బిర్యాని రుచి చూడాల్సిందే. పేరుతోనే ఆకలి పెంచే హైదరాబాదీ బిర్యానీ రుచులు మహాసభల్లోనూ అదిరిపోతున్నాయి. మటన్, చికె¯Œ తో చేసిన కబాబ్స్ నా¯Œ వెజ్ ప్రియుల నోరూరించాయి. వేడి వేడి శనగ, పెసర, బబ్బెర గుడాలు గుప్పెడు నోట్లో వేసుకుంటే చాలు.. గిన్నెలోవి మొత్తం కడుపులో పడే వరకు చెయ్యీ నోరూ ఆగవు. వేడి వేడి చర్చల్లో వీటి రుచి రెట్టింపు అని గ్రహించారేమో, వాటికీ ఒక స్టాల్ పెట్టేశారు. సీజ¯Œ తో సంబంధం లేకుండా అందరికీ ఇష్టమైన పానీయం తేనీరే. దీంతో సభ ప్రాంగణంలోనికి వెళ్లే ముందు చాయ్ కోసం పోటీ పడ్డారు. ముందే చలికాలం కావడంతో మరింత మక్కువ కనిపించింది. తెలుగు భాష తియ్యనిదే అయినా కారం అంటే మమకారం వదలరు. అందుకేనేమో మహాసభల్లో మిర్చిబజ్జీలకు మహా గిరాకీ పలికింది! తొలి తొవ్వ మనదే ఎన్నో సాహితీ ప్రక్రియలు ఇక్కడే పురుడుపోసుకున్నాయి: దేశపతిమాతృభాష మీద తెలంగాణ గడ్డకు అనాదిగా అమితమైన ప్రేమ ఉంది. అనేక సాహిత్య ప్రక్రియలకు తెలుగులో తొలి తొవ్వలు పరచిన వారిలో సింహభాగం తెలంగాణ బిడ్డలే కనిపిస్తారు. ఎన్నో ప్రక్రియలకు తెలంగాణలోనే తొలి పొద్దు పొడిచింది అని ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తన సంగీత నృత్యరూపకం గురించి ఆయన స్పందన. పాట.. ఎన్నో మహోద్యమాలను నడిపింది. దానికి అనుసంధానంగా నృత్యరూపకాలు. ఎన్నో సందర్భాల్లో ఇవి రుజువయ్యాయి. తెలంగాణ గడ్డపైన తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన తెలంగాణ తేజోమూర్తులు అనేక మంది ఉన్నారు. వారి కష్టం వృథా పోకూడదు. వారి వీరోచిత చరిత్ర ప్రజలకు తెలియాలి. నేటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత కవిగా నాపై ఉందని భావించా. పాటతో నృత్యరూపకం అయితే బాగుంటుందని భావించా. దీన్నుంచి పురుడుపోసుకున్నదే ‘జయ జయోస్తు తెలంగాణ’ సంగీత నృత్యరూపకం. వాళ్లు జీవితాన్నే పాడుతారు ∙జ్ఞానపీపురస్కార గ్రహీత సీతాకాంత్ మహాపాత్రద్విభాషాకోవిదులు, జ్ఞానపీ అవార్డు గ్రహీత, ఒరియా నుంచి 12 భారతీయ భాషలూ, 13 భారతీయేతర భాషల్లోకీ అనువదించిన అనేక పరిశోధనాత్మక గ్రంథాలను రాసిన, ఐదు దశాబ్దాలపాటు తన సాహిత్యంతో ఒడిశా ప్రజల, ప్రధానంగా ఆదివాసీల మన్ననలనందుకున్న గొప్ప రచయిత సీతాకాంత్ మహాపాత్ర పుస్తకం పేరు ‘దే సింగ్ లైఫ్’. మన దేశ చరిత్రలో మౌఖిక సాహిత్య ప్రాధాన్యతను గురించి చెప్పమని ‘సాక్షి’ అడిగినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు. ‘వాళ్లు తమ జీవితాన్నే పాడుతారు’. ప్రపంచ తెలుగు మహాసభల్లో సత్కారాన్ని స్వీకరించడానికి హైదరాబాద్ వచ్చిన సీతాకాంత్ పంచుకున్న అంతరంగం... ‘‘వాళ్లు తమ జీవితాన్నే పాడుతారు. మొదట వాళ్ల తల్లులు, ఆ తరువాత వాళ్ల పిల్లలు, మనవలు, మునిమనవరాళ్లు. కానీ వాళ్ల సజీవ సాహితీ ప్రక్రియ అయిన మౌఖిక సాహిత్యం మరణించదు. నిరంతరం, తరం తరం ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తూనే ఉంటుంది. ఇక్కడైనా, ఎక్కడైనా మౌఖిక సాహిత్యానికున్న ప్రత్యేకత అది. వాళ్లు నిరక్షరాస్యులు. అయితేనేం ఎంతో పాండిత్యాన్ని చదివినవారు కూడా వాళ్ల ప్రతిభ ముందు దిగదుడుపే. తూర్పు భారతంలో నేను ఎక్కువగా పనిచేశాను. ఒడిశా, బిహార్, బెంగాల్, జార్ఖండుల్లో విస్తృతంగా ఆదివాసీల జీవితాలను చదవడం కోసమే తిరిగాను. ఆదివాసులకు ఆస్తుల్లేవు. ఆధిపత్యాల్లేవు. అవకాశాలూ లేవు. ‘దే డోంట్ హావ్ పొసిషన్ ఆల్సో’. వాళ్లకి తెలిసిందొక్కటే... జీవితాన్ని అనుభవించడం. వాళ్లది సామూహిక జీవితం. సమైక్య జీవనం. ఆధునిక సమాజంలో ఉన్నట్టు ఒక్కరు పాడితే వెయ్యిమంది వినడం కాదు. వారంతా కలిసి పాడతారు. ఆడతారు. అందరికోసం అందరూ అనేది వారిదైన వారి సంస్కృతి. ఈ రెండు సమూహాలకీ మధ్య ఒక బలమైన గీత ఉంది. అదే కమర్షియలైజేషన్. వ్యాపారీకరణ. ఒక్కరు పాడటం డబ్బు కోసం. కానీ అందరూ కలసి పాడటం ఆనందం కోసం. కళని కొనుక్కోవడం బ్రిటిష్ వారి నుంచే వచ్చింది. కానీ ఆదివాసీలనెవరూ కొనలేరు(నెక్లెస్ రోడ్లో ఆకాశం గుండా ఎగురుతోన్న పక్షుల్ని చూపిస్తూ). ఎందుకంటే వాళ్లు స్వేచ్ఛా జీవులు. వాళ్లకి తమవాళ్లెవరో, పరాయివాళ్లెవరో స్పష్టంగా తెలుసు. బయటి వాళ్లని వాళ్లు ‘దిక్కు’ అని పిలుస్తారు. చేయాల్సింది వాళ్లని మనలో కలుపుకోవడం కాదు. వాళ్ల సంస్కృతినీ, వారి జీవితాలనూ, వారి సాహిత్యాన్నీ కాపాడాలి. అలా అని వారు ఎదుగూబొదుగూ లేకుండా నిరక్షరాస్యులుగా ఉండాలని కాదు. వారి భవిష్యత్ తరాలను అక్షరాస్యులుగా మార్చి వారి కళలను కాపాడాలి. వారి హస్తకళలు ఇప్పుడు ఆధునిక ప్రపంచం గోడలకు వాల్‌హ్యాంగింగ్స్‌గా వేలాడుతున్నాయి. అలాగే ఆధునిక ప్రపంచం వారి చేతితో గీసిన బొమ్మలు వేసిన బట్టలను విస్తృతంగా వాడుకలోకి తెచ్చింది. అలా వారి మనుగడను కొనసాగనివ్వాలి. 200 ఏళ్ల క్రితం తెలుగు ఎలా వుందో, ఇప్పుడలా లేదు. మౌఖిక సంప్రదాయాల్లో కొనసాగింపు అధికం. అనేక తరాలు వాటిని అందిపుచ్చుకుని కొనసాగిస్తాయి. వాటిని అలా బతకనిస్తే చాలు’’ దేశ రాజధానిలోనూ జరగాలి! తెలుగు సంస్కృతి ప్రపంచంలో నలుదిశలా విస్తరించింది. సంస్కృతి పరిపూర్ణమయ్యేది భాషతోనే. అలా తెలుగు భాష విస్తరించని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదు. మేము మా కళ ద్వారా ప్రపంచంలోని అనేక దేశాలలో పర్యటించినప్పుడు అక్కడ తెలుగు మహిమ గురించి మాట్లాడే అవకాశాలెన్నో వచ్చాయి. ఉద్యోగాల కారణంగా ఖండాంతరాలలో స్థిరపడిన వాళ్లు ఒక ఇరవై ఏళ్ల నుంచి తెలుగు భాష, సంస్కృతి మీద మమకారం పెంచుకుంటున్నారు. అమెరికాలో తెలుగు వారి సాంస్కృతిక సభలకు వెళ్లినప్పుడు అనేక మంది తల్లిదండ్రులు వారాంతంలో పిల్లలను కల్చరల్ క్లాస్‌లకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. స్విట్జర్లాండ్, స్టాక్‌హోమ్‌లో ప్రదర్శన ఇచ్చినప్పుడు 90 ఏళ్ల మహిళ ఈ పద విన్యాసం, అంగ విన్యాసం, భావ వ్యక్తీకరణ ఏకకాలంలో ఇంత అద్భుతంగా చేయడం భారతీయులకే సాధ్యం అని మురిసిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చినప్పుడు అనేక మంది ఉత్తరాది కవులు తెలుగు భాషలో, తెలుగు గ్రంథాలలో భావ వ్యక్తీకరణ రమణీయంగా ఉంటుందని ప్రశంసించేవారు. చరిత్రలో కూడా తెలుగు భాష గొప్పదనాన్ని గుర్తించిన రాజు తెలుగేతరుడే. కృష్ణదేవరాయలు తెలుగు భాష సౌందర్యానికి ముగ్ధుడవడంతోపాటు తెలుగు కవులకు ఆశ్రయమిచ్చి తెలుగు సాహిత్యాన్ని తారస్థాయికి తీసుకెళ్లాడు. నేటికీ మనం తెలుగు భాష గురించి గొప్పగా చెప్పుకోవడానికి కృష్ణదేవరాయలు చెప్పిన ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనే జాతీయాన్నే చెప్పుకుంటున్నాం. తెలుగు భాష మహోన్నతంగా విరాజిల్లాలంటే ఇలాంటి సభలు ఇంకా జరగాలి. దేశ రాజధాని నగరంలో కూడా నిర్వహించాలి. – రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులు, ప్రముఖ నాట్యకారులు ఇలా చేద్దాం...! ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నిటా పాఠశాల విద్య ప్రభుత్వ నిర్వహణలోనే ఉంది. మరీ ముఖ్యంగా విద్యాబోధన తల్లి భాషలోనే జరుగుతోంది. మన దగ్గర ఇది పూర్తి విరుద్ధం. పాఠశాల విద్యను దాదాపు ప్రైవేటు పరం చేశారు. ప్రభుత్వ నియంత్రణే లేని ప్రైవేటు రంగంలో ఆంగ్లమాధ్యమ పాఠశాలలే అత్యధికం. అమెరికా, రష్యా, చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలతోపాటు ఐరోపాకు చెందిన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి ఏ దేశం తీసుకున్నా అక్కడి విద్యా బోధన ప్రధానంగా తల్లిభాషలోనే! వలస విముక్త దేశాల్లో ఆంగ్ల దుష్ప్రభావం వల్ల ఎన్ని స్థానిక భాషలు కాలగర్భంలో కలిసిపోయాయో ‘యునెస్కో’వద్ద లెక్కుంది. పలు ప్రపంచ అధ్యయనాల సారం ఏమంటే.. ‘పరభాషల కన్నా తల్లి భాషలో విద్యాబోధన వల్ల పిల్లల్లో మేధోవికాసం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. అలా చేస్తూనే ఒకటి, లేదా రెండు పరభాషల్ని నేర్పించినా 13–14 ఏళ్ల వరకు పిల్లలు అత్యంత తేలిగ్గా వాటిని నేర్చుకోగల్గుతారు. అలాంటి వారే ఎన్నెన్నో పరిశోధనలు జరిపి, కొత్త విషయాలు కనుగొని, వినూత్న ఆవిష్కరణలు చేసిన దాఖలాలున్నాయి. ఇది శాస్త్రీయంగా ధృవపడిన అంశం. చైనాలో అత్యధికులకు బొత్తిగా ఇంగ్లీషు రాదు. ఇంగ్లీషు ఎరిగిన వారూ అదనపు భాషగా నేర్చుకున్నదే! కానీ, విశ్వవ్యాప్తంగా వారు విస్తరించడానికీ, ఇటీవల సాధిస్తున్న ఆధిపత్యానికీ అదేం అవరోధం కాలేదు. పాఠశాల విద్య తల్లిభాష తెలుగులోనే ఉండాలి. ఐదారు తరగతుల నుంచి ఇంగ్లీషును అదనపు భాషగా నేర్పాలి. 12వ తరగతి వరకూ తెలుగు తప్పనిసరి అంశం కావాలి. ఆ పైన కూడా యువతలో ఆసక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రాచీన, ఆధునిక తెలుగుసాహిత్యాన్ని విరివిగా ప్రచురించి, చౌకగా అందుబాటులోకి తేవాలి. శాస్త్ర–సాంకేతిక, విశ్వస్థాయిలో వచ్చే నూతన పదజాలానికి, భావజాలానికి తెలుగులో మంచి అనువాదం, అనుసృజన జరిపించాలి. ఇందుకోసం అకాడమీలు, భాషా పరిశోధనాలయాలు, విశ్వవిద్యాలయాల్లో భాషాపీఠాలకు తగు నిధులిచ్చి నిరంతరం క్రియాశీలంగా కృషి జరిపేట్టు చూడాలి. – దిలీప్‌రెడ్డి తమిళనాట తెలుగు శోకం తమిళనాడులో తెలుగు ‘బతికి బట్ట కట్టడం కష్టమే’నంటున్నారు మాడభూషి సంపత్‌కుమార్. అక్కడ మద్రాస్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన తెలుగు మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. తెలుగువాళ్లు తమిళులుగా మారుతున్నారు..తెలుగు మహాసభల ఏర్పాట్లు బాగున్నాయి. తెలుగు నేల మీద అడుగు పెట్టడమే ఒక పులకింత అయితే ఆత్మీయ స్వాగతం మరింత ఆనందపరిచింది. తమిళనాడులో మన తెలుగు పరిస్థితి ‘బతికి బట్ట కట్టడం కష్టమే’ అన్నట్లుంది. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తమిళనాడులో తెలుగు వాళ్ల సంఖ్య 40 శాతం. ఇప్పుడు రెండు శాతానికి మించి లేదు. ఉన్న తెలుగు జనం మాత్రం ఎక్కడికీ పోవడం లేదు. పిల్లవాడిని పాఠశాలలో చేర్చేటప్పుడు కృష్ణ అనే పేరు ఉంటే కృష్ణన్ అని రాసేస్తారు. అలా తెలుగు వాళ్లు తమిళులుగా మారిపోతున్నారు.తెలుగు టీచర్ రిటైర్ అయితే అంతే..తమిళనాడులో ఒకప్పుడు తెలుగు పాఠశాలలు ఉండేవి. కానీ ఆ స్కూళ్లలో తెలుగు టీచర్ రిటైర్ అయితే ఇక ఆ పోస్టును భర్తీ చేయడం లేదు. దాంతో పిల్లలు అందులో చేరరు. ‘విద్యార్థులు చేరడం లేదు కాబట్టి ఆ పోస్టును రద్దు చేస్తున్నాం’ అని ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెలుగు భాషను అణచివేస్తోంది. 2006లో నిర్బంధ తమిళ విద్య చట్టాన్ని తెచ్చింది. ఇతర భాషలను చదవడానికి ఇప్పుడసలే వీల్లేదు. అందుకే తెలుగు భాషా పరిరక్షణ సమితి తమిళులకు వాళ్ల మాతృభాష మీద ప్రేమ చాలా ఎక్కువ. ఈ క్రమంలో వారి తీరుతో తెలుగు భాష, తెలుగు వాళ్లు వివక్షకు గురవుతున్నారని అనిపించేది. అందుకే తెలుగు వాళ్లను ఒక వేదికపైకి తెచ్చే ప్రయత్నంలోనే భాగంగానే తెలుగు భాçషా పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం. యూనివర్సిటీలో తమిళ ప్రొఫెసర్లు పైకి ఏమీ అనరు. కానీ తమిళనాడులో ఉన్నప్పుడు తమిళులుగానే జీవించవచ్చు కదా, తెలుగు భాష అంటూ ఇవన్నీ ఎందుకు... అని తమలో తాము చర్చించుకుంటారు! తెలుగు మాట్లాడేవారు 16 కోట్లుతెలుగు మాట్లాడేవాళ్లు 16 కోట్ల మంది ఉన్నారు. అయితే ఇందులో సగం మంది తెలుగేతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కాబట్టి ఈ సంఖ్యను ప్రభుత్వాలు అధికారికంగా ఒప్పుకోవు. ప్రభుత్వాలు తమిళనాడుతో మాట్లాడాలి..తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినప్పుడే.. భాష పరిరక్షణకు మాలాంటి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలకు ఊతం వస్తుంది. కన్నడిగులు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల ఫొటోలను ఇళ్లలో పెట్టుకుంటారు. తెలుగులో ముగ్గురికి జ్ఞానపీఠ అవార్డు వస్తే... ఆ సంగతి సాహిత్యకారులకు తప్ప సామాన్యులకు తెలీదు. – వాకా మంజులారెడ్డి తెలుగును కాదని పరభాషని ప్రేమించకూడదుచరిత్రకారులు కొందరు జరిగిన దాన్ని రాస్తారు. కానీ జరుగుతున్న ప్రజల చరిత్రను, వారి అనుభవాలను రాయడమే నేడు అవసరం అంటారు కారా మాష్టారుగా తెలుగు ప్రజలకు పరిచయమైన కాళీపట్నం రామారావు. 93 ఏళ్ల వయోవృద్ధులు కారా ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. నేటి తరానికి కావాల్సిన కథలెలా ఉండాలి? సంస్కృతం చదివిన వారికి కూడా కావ్యాలు చదివే శక్తిలేదిప్పుడు. కూటి కోసం, కూలి కోసం వలసెళుతున్న ఎందరో పేదలు నిలువనీడలేక, బ్రిడ్జిల కింద కూడా తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తుల జీవితాల్ని ఆవిష్కరించే రచనలు, ఆ అభిప్రాయాలను వ్యక్తీకరించే పాత్రలు రచనల్లో కనపడాలి. తెలుగు భాషనీ, సాహిత్యాన్నీ కాపాడుకోవడానికి ఏం చేయాలంటారు? ప్రగతిశీల భావాలు కలిగిన వారే ఆ పని చేయగలరని ఆశ. తెలుగు వారిపై ఆంగ్ల భాషా ప్రభావాన్ని ఎలా చూడాలి? భాషల్లో ఎక్కువ తక్కువలుండవు. తమిళం మాట్లాడేవారికి అదే గొప్ప. తెలుగు మాట్లాడతాం కనుక మనకిది గొప్ప. కానీ తెలుగువాళ్ళు తెలుగుని నిర్లక్ష్యం చేసి ఆంగ్లంలో మాట్లాడటం సరికాదు. అభిప్రాయాల కారణంగా పొరపాట్లు జరుగుతాయి. విజ్ఞానంతో విమర్శనాత్మకంగా మన జీవితాల్ని తరచి చూసుకోవాలి. అది అందరికీ అర్థం అయ్యేట్లు చేయాలి. మంచి ఆలోచన, మంచి పద్ధతి ఎవరినుంచి గ్రహించినా అది కలకాలం ఉంటుంది. కానీ మన భాషని నిర్లక్ష్యం చేసి, పరభాషని ప్రేమించడం కాదు. స్త్రీల సమస్యల్నెలా చూడాలి? స్త్రీల జీవితాలను గురించి మాట్లాడేటప్పుడు మహిళా ఉద్యమకారులు, ఓల్గా లాంటి వారు ఒకప్పుడు తమ రచనల్లోనూ, నిజజీవితంలోనూ పురుష ద్వేషాన్ని ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు వారిలో మార్పొచ్చింది. పురుషుల్ని కాకుండా సామాజిక పరిస్థితుల్ని ద్వేషిస్తున్నారు. ఇది మంచిదే. ఎంతో మంది వారి అభిప్రాయాలను అంగీకరించడానికి కూడా అదే కారణం. ఆగితే స్త్రీల చరిత్రే లేదు జ్ఞానపీపురస్కార గ్రహీత ప్రతిభా రాయ్ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్‌కి విచ్చేసిన ప్రతిభారాయ్ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. తన రచన ‘ఉల్లఘ్న’కు 1985లో ఒడిశా సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు. ఆమె రాసిన ‘యజ్ఞసేని’కి సరళ అవార్డు, అమృతకీర్తి పురస్కార్‌లాంటి ఎన్నో ఆమె ఖాతాలో చేరాయి. ఏడు పదుల వయసు దాటిన ప్రతిభారాయ్ ఇప్పటికీ ఉత్సాహంగా రాస్తున్నారు. ‘నాకీ శక్తి ఎక్కడినుంచి వచ్చిందో తెలుసా?’ అంటూ ఆమే ప్రశ్నించి, తన చుట్టూ ఉన్న జనఘోషే తన రచనాశక్తికి కారణమంటూ ‘సాక్షి’తో ముచ్చటించారు. ∙మీ రచనకు ప్రేరణ ఏమిటి? అమ్మ. ప్రకృతి. ఇవి రెండూ నాలోని రచనాశక్తికి ప్రాణం పోశాయి. తొమ్మిదేళ్ళకే రాయడం మొదలుపెట్టాను. కానీ అవి అందమైన ఇంద్రధనుస్సులో, అమ్మ మీదో, ప్రకృతిని గురించో. అయితే స్త్రీలకు ఇల్లు, భర్త, పిల్లలే పరామవధి. ఇప్పటికీ. రాత వాళ్ళ ప్రాధాన్యత కాకుండా చేశారు. మీ రచనలన్నింటికీ నేపథ్యం అసమానతలే. ఆ సామాజిక చైతన్యానికి స్ఫూర్తి? నా జీవితాన్ని అమితంగా ప్రభావితం చేసిన విషయం మత వివక్ష. మేం నివసించే పరిసరాల్లో మా యింటి చుట్టూ ఉన్న ముస్లింల జీవితాలను నిత్యం వెంటాడే అభద్రతాభావం నా రచనలకు స్ఫూర్తి. ఎక్కడో ఏదో విస్ఫోటనం జరిగితే అక్కడ హిందూ, ముస్లింలిరువురూ ఉంటే కేవలం ముస్లిం యువకుడొక్కడే ఎందుకు జైలుకెళ్ళాల్సి వస్తోంది అన్నది నా ప్రశ్న. దానిపైనే ‘పవిత్ర రాత్రి’ రాశాను. టెర్రరిస్టులనే ముద్రకాదు, సమస్యకు పరిష్కారాలు కావాలి. ఆశించినంతగా స్త్రీల రచనలు రాకపోవడానికి కారణం? ఒకప్పుడు ప్రాచీన స్త్రీల రచనలన్నీ వారి జీవితం ముగిసిన తరువాత ఏ తలదిండుకిందనో, బీరువాలోని చీరల మడతల్లోనో, ఏ వంటింటి మరుగుల్లోనో రాతప్రతులుగా దొరికేవి. జీవితంలో తమకోసం ఒక్క క్షణాన్నీ వెచ్చించలేని పరిస్థితి స్త్రీకి కల్పించారు. అయినా వారి అభిప్రాయాల్ని ఎక్కడోచోట భద్రపరిచారు రహస్యంగా. స్త్రీలు రాయడమే నేరమనే భావనలోంచి ‘వు డేర్ టు రైట్’ అనేదాకా వచ్చాం. మేం రాసే సాహసం చేశాం. ఆనాడు రాసే ఆడవాళ్లని చెడ్డవాళ్లని ముద్రవేసారు. ఇప్పుడు ఇంకేదో ముద్ర వేస్తున్నారు. అయినా మనం ఆగకూడదు. ఆగితే స్త్రీల చరిత్రే లేదు. భాష, లేదా సాహిత్యం ఎలా కాపాడుకోగలం? చదువొక్కటే ఈ రెంటినీ బతికించలేవు. జనజీవితాలే సాహిత్యంగా రావాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, చుట్టూ వున్న సమాజం మన పిల్లల ఎదుగుదలపై ప్రభావాన్ని చూపే అంశాలు. వారే సమాజాన్ని ప్రభావితం చేయగలరు. మార్పుకి నాంది పలకగలరు. తెలుగు మహాసభలపై మీ స్పందన? మాలాంటి ఇతర భాషీయులను కూడా పిలిచారు కాబట్టి, ఇవి తెలుగు సభల్లా కాదు ప్రపంచ భాషా సభల్లా అనిపిస్తున్నాయి. ఇది హర్షించాల్సిన విషయం. మాలాంటి ఎందరినో ఈ సభలకు ఆహ్వానించి సన్మానించడం సంతోషం. ‘‘నేను వర్గరహిత, కులరహిత, వర్ణవివక్షలేని సమాజాన్ని ఆకాంక్షిస్తున్నాను. అవే రాశాను. అదే ఆచరించాను కూడా. లింగ వివక్ష మీద రాసినందుకు ఫెమినిస్ట్నన్న ముద్రవేశారు. కుల, వర్గ వివక్షపైన రాస్తున్నానని నన్ను కమ్యూనిస్టునన్నారు. కానీ నేను హ్యూమనిస్టుని. అసమానతలు లేకుండా, వివక్షకి బలికాకుండా సమానంగా జీవించే సమాజాన్ని చూడాలన్నదే నా జీవితాశయం’’ అంటున్నారు ఒడిశా రచయిత్రి, జ్ఞానపీuЇ పురస్కార గ్రహీత ప్రతిభారాయ్. సంభాషణ: అత్తలూరి అరుణ -
రాయిలాంటి నన్ను సానబెట్టారు
-
రాయిలాంటి నన్ను సానబెట్టారు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అద్భుత సాహిత్యం పండించిన మాగాణి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రపంచ మహాసభల సందర్భంగా ఆయన అధ్యక్ష స్థానంలో మాట్లాడుతూ పదో శతాబ్దంలోనే తొలిసారి జినవల్లబుడి శాసనంలో తెలుగు కందపద్యం ఉందన్నారు. పాల్కురికి సోమన, పోతన, రామదాసు, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి, కాళోజీ, సినారె, సుద్దాల హనుమంతు, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజువంటి ఎంతో మంది సాహిత్య కారులను అందించి మాగాణి తెలంగాణ అని చెప్పారు. ఎన్నో పద్యాలు పాడి అలరించారు. 'ఎంత గొప్పవారైనా అమ్మ ఒడే తొలిబడి.. చనుబాలు తాగించే తల్లి జో అచ్చుతానంద జోజోముకుందా అంటూ ఓ బిడ్డను ఆదర్శ బిడ్డగా తీర్చిదిద్దుతుంది. తన బిడ్డను ప్రపంచానికి పరిచయం కాకుండా ప్రపంచాన్ని కూడా బిడ్డకు పరిచయం చేస్తుంది. బంధువర్గాన్ని తెలిపే తొలి గురువు తల్లి. మా అమ్మగారు నేను చిన్నతనంలో ఉండగా నాకు చక్కటి పద్యాలు చెప్పారు. మేం చదివే రోజుల్లో అయ్యవారి బడే ఉండేది. అక్కడ నుంచే గురువుల విద్య ప్రారంభం అయ్యేది. అందులో నీతి ఎక్కువ ఉండేది. మా స్వగ్రామానికి చెందిన దుబ్బాక గ్రామంలో మృత్యుంజయ శర్మ ఒక పద్యం చెబితే ఐదుసార్లు చదివి అప్పగించాను. రాయి లాంటి నన్ను మా గురువుగారు సాన బెట్టారు. వారి పుణ్యమా అని తొమ్మిదో తరగతిలోనే చెరువుగట్టుపై వృత్తపద్యాలు రాసిన. బమ్మెర పోతన అద్భుత భాగవతం అందించారు. ఎంతోమంది కవులు గొప్పగొప్ప సాహిత్యం అందించారు. నేటి కవుల్లో గోరటి వెంకన్న పాట ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. చక్కటి పదాలతో కష్టమైన విషయాలు కూడా అలవోకగా ఆయన చెప్పగలరు. అమ్మ అంటే కడుపులో నుంచి వచ్చినట్లుంటుంది. మమ్మీ అంటే పెదవుల నుంచి వచ్చినట్లుంటుందని మన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారు ఎన్నో సభల్లో చెప్పారు. ఒకప్పుడు బతకలేక బడి పంతులు అన్నారు. ఇప్పుడు దేశాన్ని బతికించేవారు బడి పంతులు. సమాజం భవిష్యత్తు పంతుల్ల చేతుల్లోనే ఉంది. తెలుగు భాష బతకాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాష పండితులు నడుంకట్టాలి. ఒక భాషా పండితుడు మరో భాషా పండితుడిని తయారు చేయాలి. ఓ కవి మరో కవిని తయారు చేయాలి. తెలుగు భాషను బతికించుకోవడం కోసం ప్రభుత్వం అన్నిరకాలుగా సహాయం చేస్తుంది' అని కేసీఆర్ హామీ ఇచ్చారు. -
అట్టహాసంగా తెలుగు మహాసభలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : అట్టహాసంగా ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ వేడుకలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర విద్యాసాగర్ రావుతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు, తెలుగు సాహితీ వేత్తలు, పరిశోధకులు విద్యార్థులతో ఎల్బీ స్టేడియం నిండిపోయింది. కాకతీయ తోరణంతో రంగురంగుల విద్యుద్దీపాలతో వేదిక మొత్తం కళకళలాడుతోంది. పేరడీ నృత్యంతో మహాసభలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ వైభవాన్ని చాటేలా ఉత్సవాలు జరగనున్నాయి. -
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మహాసభలు జరిగే ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. స్డేడియం వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 9 వరకు ఎల్బీ స్టేడియం కేంద్రంగా ట్రాఫిక్ మళ్లించారు. ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఛాపెల్ రోడ్‌కు మళ్లిస్తారు. అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీటిని గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి ఛాపెల్ రోడ్‌కు పంపిస్తారు. బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి జీపీవో వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్ కోఠి మీదుగా పంపిస్తారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు పంపిస్తారు. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ మీదుగా మళ్లించనున్నారు. కాగా, ప్రపంచ తెలుగు మహా సభలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యే తెలుగు మహా సభలు ఈ నెల19 వరకు జరుగనున్నాయి. మహాసభలకు వివిధ ప్రాంతాల నుంచి 30 వేలమంది అతిథులు హాజరుకానున్నారు. సభలకు వచ్చే వారి కోసం 32 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మహాసభలకు పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు నగర ఇన్చార్జ్ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. మహాసభలకు దేశవిదేశాల నుంచి అతిథులు హాజరుకానున్న నేపథ్యంలో వారు బస చేసే ప్రాంతాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని కొత్వాల్ పేర్కొన్నారు. భద్రత, బందోబస్తు విధుల కోసం నగర పోలీసు విభాగంలోని 9 వేల మందికి తోడు మరో మూడు వేల మందిని మోహరిస్తున్నట్టు తెలిపారు. -
తెలుగు సౌరభం
-
నేటి నుంచే ప్రపంచ తెలుగు మహాసభలు..
-
అమ్మ భాషకు పట్టం
♦ స్వస్తిశ్రీ హేవళంబినామ సంవత్సరం.. దక్షిణాయనం.. హేమంత రుతువు.. మార్గశిర మాసం.. కృష్ణపక్షం.. త్రయోదశి.. సాయంత్రం 6 గంటలు.. స్థలం భాగ్యనగరం.. వేదిక లాల్‌బహదూర్ మైదానం.. పాల్కురికి సోమన ప్రాంగణం, బమ్మెర పోతన వేదిక ♦ తేనెలూరే తియ్యటి తెలుగు భాషకు సమున్నతంగా పట్టంకట్టే మహా వేడుక.. ♦ మరే భాషలో లేని అత్యున్నత సాహితీ ప్రక్రియలను తనలో ఇముడ్చుకుని ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’.. అంటూ ప్రపంచవ్యాప్తంగా జయజయధ్వానాలు అందుకునేలా, మహోజ్వలంగా వెలుగొందేలా మనమంతా కలసి చేసుకునే దివ్యమైన ఉత్సవం.. ప్రపంచ తెలుగు మహాసభలు నేడే మొదలు. సాక్షి, హైదరాబాద్ : తెలుగు వర్ణమాలలో అక్షరాలెన్ని..? తెలుగు భాష ఔన్నత్యానికి ఒక్క నిదర్శనం..? తేనెలూరే ఈ భాషలో ఉత్కృష్ట సాహిత్య ప్రక్రియ అవధానం అంటే ఏంటి..? ప్రపంచ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలపై పేర్కొంటున్న సాహితీ దిగ్గజాల్లో ఒకరి గురించైనా తెలుసా..? నేటి తెలుగు తరానికి ఈ ప్రశ్నలు సంధిస్తే ఒక్కదానికైనా సమాధానం రావడం కష్టమే. వెయ్యేళ్ల తెలుగు భాష పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో దీనితో తెలిసిపోతుంది. తప్పులు లేకుండా, పరభాషా పదాలు లేకుండా తెలుగులో మాట్లాడడం, ఒక్క వాక్యమైనా రాయడం ఎంత మందికి సాధ్యం. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా కీర్తిస్తున్నా.. ప్రపంచంలోని సుమధుర భాషల్లో తెలుగు ముందు వరసలో ఉన్నా.. మరే భాషలోనూ లేని సాహితీ ప్రక్రియలు తెలుగు సొంతమైనా సరే... కనుమరుగయ్యే ప్రమాదమున్న భాషల్లో తెలుగూ చేరబోతోందన్న మాట ఆందోళన కలిగిస్తోంది. కోటి ఆశలతో.. కోటి ఆశలు మోసుకొస్తూ కొత్త ఆలోచనలతో శుక్రవారం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భ వించిన తర్వాత తొలిసారిగా జరుగుతుండ టంతో రాష్ట్ర ప్రభుత్వం వీటిని తొలి తెలుగు మహాసభలుగానే పరిగణిస్తోంది. తెలుగు భాష ఘనతను చాటడం ఒక ఎత్తయితే.. తెలంగాణ యాసకు పట్టాభిషేకం చేయడం ప్రధానంగా మహాసభలను వైభవంగా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగువారిని ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని స్వాగతించింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమవుతున్నాయి. తొలి తెలుగు మహాసభలు జరిగిన హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ క్రీడా ప్రాంగణమే ఈసారి వేడుకలకు ప్రధాన వేదికగా ముస్తాబైంది. ఉప రాష్ట్రపతి హోదాలో ఉన్న తెలుగు బిడ్డ వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా, గవర్నర్లు నరసింహన్, చెన్నమనేని విద్యాసాగర్‌రావులు విశిష్ట అతిథులుగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సభాధ్యక్షుడిగా వేడుకలు మొదలుకాబోతున్నాయి. ప్రధాన వేదిక లాల్‌బహదూర్ క్రీడా ప్రాంగణంతోపాటు రవీంద్రభారతి ప్రధాన మందిరం, మినీ మందిరం, తెలుగు విశ్వవిద్యాలయం సభా మందిరం, తెలుగు లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శిని మందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తులలో తెలుగు భాషా వైభవం కళ్లకు కట్టనుంది. ఇన్నాళ్లూ నిర్లక్ష్య జాడ్యం నీడలో.. మన పొరుగునే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఆవిర్భవించిన కన్నడ, తమిళ రాష్ట్రాలు.. తమ భాషకు ఘనంగా పట్టం కట్టాయి. తమ భాషను బతికించుకోవడమే కాదు, అద్భుతంగా వికసింపచేసుకుంటూ వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఢిల్లీ విశ్వవి ద్యాలయాల్లోనూ వాటికి ప్రత్యేక విభాగాలు తెచ్చుకునే రీతిలో, ప్రాచీన హోదా పొంది భాష బాగు కోసం వందల కోట్లు సాధించు కునే స్థాయిలో కృషి చేశాయి. కానీ అమృత ప్రాయమైన తెలుగు భాషకు ‘గుర్తిం పు’పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడి పోయింది. ‘ఇప్పటికైనా తెలుగు వంతు వచ్చింది..’అన్న ఆశతో తెలుగు ప్రజలు సంతోషిస్తున్నారు. అసలు 1975లో జరిగిన తొలి తెలుగు ప్రపంచ మహాసభల ప్రభావం భాషపై కొంత కనిపించినా.. తర్వాత ఈ సభలు హడావుడికే పరిమితమయ్యాయి. ఆ బాధ ముల్లులా పొడుస్తున్నా.. ఇప్పటి మహాసభలను మాత్రం భాషాభిమానులు కొత్త కోణంలో చూస్తున్నారు. తెలుగు భాష, పద్యం, సాహిత్యంపై తనకున్న అభిమా నాన్ని వీలున్నప్పుడల్లా వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తాజా మహాసభల రథసారథి కావడమే దీనికి కార ణం. తెలుగు భాషాభివృద్ధి కోసం ఆయన చేపట్టిన చర్యలు, ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయటంతో ఆయనపై ఆశాభావం నెలకొంది. మంచిరోజులు వచ్చేనా? 2012 తెలుగు మహాసభల సందర్భంగా.. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేస్తామంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అది మాటలకే పరిమితమైంది. ఆర్భాటానికి పరిమితమయ్యే అలాంటి హామీలు భాషను కాపాడలేవనే సంగతి అందరికీ బోధపడింది. అందుకే తెలుగు భాషను కాపాడేందుకు నిర్బంధ చర్యలు, భాషను సుసంపన్నం చేసుకునేలా ప్రజల్లో ఆసక్తి, చైతన్యం పెంపొందించే చర్యలు అవసరమన్న భాషావేత్తల సూచనలు అమలు కావాల్సి ఉంది. ‘తెలుగు వెలుగులు ప్రపంచా నికి పంచుదాం.. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుదాం’అంటూ ఈ మహాసభలకు ప్రభుత్వం ఖరారు చేసిన నినాదం నలుదిశలా మారుమోగాల్సి ఉంది. మన భాష మరిన్ని తరాలు మహోజ్వలంగా వెలుగొందేందుకు ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలి. అలాగైతేనే మహాసభల సాక్షిగా చేసే తీర్మానాలు నీటిమీద రాతలు కాకుండా ఉంటాయి. ఈ దిశగా ప్రభుత్వంపై ఎంత బాధ్యత ఉందో, తెలుగు ప్రజలందరిపైనా అంతే బాధ్యత ఉంది. తెలుగులో పలకరించుకుందాం.. తెలుగులో రాద్దాం.. అమ్మ భాషను ఆదరిద్దాం.. మన భాషను కాపాడుకుందాం.. అందుకే ఇది మన పండుగ.. ఇంటింటి వేడుక. లోటుపాట్లు ఉండొద్దు: కడియం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. గురువారం ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్లతో కలసి మహాసభల ఏర్పాట్లపై సమీక్షించారు. వేదిక, ఇతర పనులను పరిశీలించారు జిల్లాల నుంచి 30 వేల మందికిపైగా ప్రతినిధులు ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారని.. దేశవిదేశాల నుంచి భాషావేత్తలు, సాహితీ ప్రియులు, విశిష్ట అతిథులు, భాషాభిమానులు మహాసభల్లో పాల్గొంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకల్లా ప్రధాన వేదిక సిద్ధం కావాలని, అధికారులు సమన్వయంతో బాధ్యతలు పంచుకుని సభలను విజయవంతం చేయాలని సూచించారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం ఇలా.. ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతాయి. వేడుకల ప్రధాన అతిథి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా గవర్నర్ నివాసానికి చేరుకుంటారు. అదే సమయానికి సీఎం కేసీఆర్ కూడా అక్కడికి చేరుకుంటారు. వారంతా తేనీటి విందు స్వీకరించి.. ఎల్బీ స్టేడియంలో మహాసభల ప్రాంగణానికి వెళతారు. అతిథులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలుకుతారు. వీఐపీలంతా వేదికపైకి చేరుకుని.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశాక మహాసభలు ప్రారంభమవుతాయి. స్టేడియంలో 10 వేల మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. -
5 వరకు ప్రతినిధుల పేర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటివరకు 2000 మందికిపైగా ప్రతినిధులు వివరాలను నమోదు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 1,473 మంది పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రతినిధుల నమోదుకు డిసెంబర్ 5వ తేదీ వరకు గడువు విధించినట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. సుమారు 6 వేల మంది ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు అకాడమీ అంచనా వేస్తోంది. ఇందుకు తగిన విధంగానే భోజనం, రవాణా, వసతి, తదితర సదుపాయాలపైన అధికారయంత్రాంగం దృష్టి సారించింది. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు, రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగులలిత కళాతోరణం, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలలో మహాసభలు జరుగనున్న సంగతి తెలిసిందే. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో ఆదివాసీ, గిరిజన, జానపద కళారూపాల ప్రదర్శన ఉంటుంది. ప్రతినిధులు తమకు నచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. డిసెంబర్ 15వ తేదీ నుంచి 19 వరకు 5 రోజులపాటు జరుగనున్న ఈ మహాసభల్లో లోపాలకు తావు లేకుండా సాంస్కృతిక, పర్యాటక, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ, ఆర్అండ్బీ, తదితర విభాగాల మధ్య పని విభజన చేశారు. మహాసభల సందర్భంగా 100 పుస్తకాలను ఆవిష్కరించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాట్లు చేస్తోంది. 10 దేశాలు, 52 మంది ప్రతినిధులు... ఈ మహాసభల్లో పాల్గొనేందుకు 10 దేశాల నుంచి 52 మంది అతిథులను ఆహ్వానించగా ఇప్పటి వరకు 34 మంది తమ ఆమోదాన్ని తెలిపారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ స్ట్రేలియా, మలేసియా, మారిషస్, ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయిల్, కువైట్ దేశాల నుంచి అతిథులు తరలిరానున్నారు. వివిధ దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు ఈ సభలకు రానున్నట్లు అంచనా. ఇప్పటి వరకు 152 మంది తమ పేర్లు, వివరాలను నమోదు చేసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 557 మంది ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సభల ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. -
అందరి సమక్షంలో అద్భుతంగా..
సాక్షి, హైదరాబాద్ తెలుగు భాషాభివృద్ధి కోసం పాటు పడుతున్న సాహితీవేత్తలందరి సమక్షంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు తెలుగు భాష మాట్లాడే ముఖ్యమంత్రులు, గవర్నర్ల వంటి ప్రముఖులను మహాసభలకు ఆహ్వానించాలని ఆదేశించారు. ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మారిషస్ ఉపాధ్యక్షుడు పరమ శివమ్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు హాజరవుతారని.. తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును కూడా ఆహ్వానించాలన్నారు. ఈ నెల 15 నుంచి జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. తెలుగుతో పాటు ఇతర గుర్తింపు పొందిన భారతీయ భాషలకు చెందన సాహితీవేత్తలను కూడా మహాసభల సందర్భంగా గౌరవించి, సన్మానించాలని సూచించారు. పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలి తెలుగు మహాసభల ప్రారంభంతో పాటు ముగింపు వేడుకలను కూడా ఎల్బీ స్టేడియంలోనే నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతారని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రముఖులతో పాటు పండితులు, సాహిత్యాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ‘‘ఎల్బీ స్టేడియం కాకుండా మిగతా వేదికల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలి. అక్కడ సాహితీ సభలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. తెలంగాణ వంటకాలతో ఫుడ్‌స్టాల్స్ ఏర్పాటు చేయాలి. వివిధ కళా ప్రక్రియలకు సంబంధించిన స్టాళ్లు కూడా నిర్వహించాలి. తెలంగాణ ఆహార్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం ప్రతిబింబించేలా లేజర్ షో నిర్వహించాలి. చివరి రోజు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చాలి. నగరమంతా అందమైన అలంకరణలుండాలి. పండుగ శోభను సంతరించుకోవాలి..’’అని కేసీఆర్ సూచించారు. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని, తెలుగు సాహితీమూర్తుల పేర్లతో తోరణాలుండాలని చెప్పారు. నగరమంతా బెలూన్లు ఎగురవేయాలని, తెలుగు భాషా ప్రక్రియలతో పాటు హైదరాబాద్ సంస్కృతి ఉట్టిపడేలా ఉర్దూలో కవి సమ్మేళనం, ఖవ్వాలీ కూడా నిర్వహించాలని సూచించారు. వేదిక, తోరణాల డిజైన్లకు ఓకే తెలుగు మహాసభల ప్రధాన వేదిక అయిన ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసే వేదిక డిజైన్‌ను, హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఏర్పా టు చేసే తోరణాల డిజైన్లను సీఎం కేసీఆర్ ఆమోదించారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని.. నగరాన్ని అందంగా ముస్తాబు చేయాలని అధికారులకు సూచించారు. అందరినీ ఆహ్వానించండి.. ప్రతి కార్యక్రమానికి ఒక మంత్రిని ఆహ్వానించి, ప్రభుత్వం తరఫున సాహితీవేత్తలకు సన్మానం చేయించాలని... ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని నగరాల మేయర్లు, సివిల్ సర్వీస్ అధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లను ఆహ్వానించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు మంచి వసతి, భోజనం, రవాణా ఏర్పాటు చేయాలని... పోస్టల్ శాఖ సమన్వయంతో తెలుగు మహాసభల సందర్భంగా ప్రత్యేక స్టాంపులను విడుదల చేయాలని సూచించారు. విమానాశ్రయం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, మహాసభలకు హాజరయ్యే వారికి సహాయపడాలన్నారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, మిథాలీరాజ్, సానియా మీర్జా లాంటి క్రీడాకారులను కూడా మహాసభలకు ఆహ్వానించాలని సూచించారు. తెలుగు పండుగలు, సంవత్సరాలు, నెలలు, కార్తెలతో కూడిన పుస్తకాన్ని ముద్రించి మహాసభల సందర్భంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్ లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్. చిత్రంలో హరీశ్ రావు, ఈటల, సాంస్కృతిక సలహాదారు రమణాచారి, ఇతర ఉన్నతాధికారులు -
ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ
-
వర్షం ఎఫెక్ట్ : 'బతుకమ్మ'కు గిన్నిస్ మిస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆడ బిడ్డల ముఖ్య పండుగ, రాష్ట్ర పండుగ బతుకమ్మ గిన్నిస్ రికార్డును మిస్సయింది. వర్షం భారీగా పడటంతో రికార్డు చేజారింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ(మహా బతుకమ్మ) సంబురం జరుగుతుండగా.. ఎల్బీ స్టేడియంలో కూడా దాదాపు మూడు వేల మందితో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కేలా ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం 300 మంది టీం లీడర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపాలనుకున్నారు. ఆ మేరకే ఉదయం 10 గంటలకు సద్దుల బతుకమ్మ ఉత్సవం ప్రారంభమైంది. మహిళలంతా తంగేడు పూల ఆకృతిలో చేరి మరింత ఆకర్షణీయంగా కనిపించారు. బతుకమ్మ పూలతో తివాచీ ఏర్పాటుచేశారు. ఇందుకోసం మహిళలు ప్రత్యేకంగా పసుపు పచ్చని చీరలు, ఆకుపచ్చని చీరలతో స్టేడియానికి చేరారు. అయితే, అనుకోని విధంగా వర్షం రావడంతో అనుకున్న విధంగా బతుకమ్మ ఫీట్ చేయలేక గిన్నిస్ రికార్డు మిస్సయింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు బుర్రా వెంకటేశం మాట్లాడుతూ వర్షం వల్ల గిన్నిస్ రికార్డు చేయలేకపోయామన్నారు. అటెంప్ట్ మాత్రమే ఫెయిల్ అయిందని, కచ్చితంగా రికార్డ్ నెలకొల్పుతామని, వీలైతే నవంబర్‌లో మరోసారి బతుకమ్మ గిన్నిస్ రికార్డును నెలకొలకొల్పడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డ్ అధికారి స్వప్నిల్ మాట్లాడుతూ మహా బతుకమ్మ గిన్నిస్ రికార్డ్ మిస్సయిందని, బెటర్ లక్ నెక్ట్స్ టైం అని వ్యాఖ్యానించారు. -
నేడు ‘సద్దుల’ సంబురం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ వేడుకను నిర్వహిస్తున్నట్లు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. మహా బతుకమ్మ గిన్నిస్ రికార్డ్స్ పరీక్ష గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 300 మంది టీం లీడర్లకు శిక్షణ ఇచ్చారు. వారికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ నియమనిబంధనలు వివరించారు. హరికృష్ణ మాట్లాడుతూ ఈ పరీక్షలో భాగంగా మహిళలు తంగేడుపువ్వు ఆకృతిలో రూపొందటం, బతుకమ్మ పూలతో తివాచి ఏర్పర్చడం ఉంటుందని తెలిపారు. ఒక అడుగు బతుకమ్మను 3 వేలమంది మహిళలు ఒకేసారి పూలతో తయారు చేస్తూ బతుకమ్మ విశిష్టతను తెలియజేస్తారని వివరించారు. మూడు వేల మందికి చీరలు పంపిణీ చేస్తామన్నారు. తంగేడు ఆకృతికి సంబంధించి పువ్వు ఉన్న పసుపు ఆకారం భాగంలో పసుపు చీరలు ధరించిన మహిళలు నిలబడతారని చెప్పారు. కాండం భాగంలో ఆకుపచ్చ చీరలు ధరించిన మహిళలు పాల్గొంటారని తెలిపారు. ఈ మొత్తం ఈవెంట్‌కు సంబంధించిన ప్లాన్‌ను చిత్రపటం రూపంలో తయారు చేశామని, దాన్ని గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రతినిధికి చూపించామని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ఇందులో పాల్గొనే స్వయం సహాయక సంఘాల మహిళలందరూ ఉదయం 9 గంటలకు ఎల్బీ స్డేడియం చేరుకోవాలని తెలిపారు. ఒంటిగంట తర్వాత ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు మూడు వేల బతుకమ్మలతో మహాప్రదర్శన సాగుతుందని, అనంతరం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తారన్నారు. కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ ఈడీ మనోహర్, జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మహా బతుకమ్మ సంబరాలు
-
పూలవనం.. ఎల్బీ స్టేడియం
-
అంగరంగ వైభవంగా ‘మహా బతుకమ్మ’
-
పూలవనం.. ఎల్బీ స్టేడియం
సాక్షి, హైదరాబాద్: మంగళవారం నాడు ఉయ్యాలో.. లేచెనే గౌరమ్మ ఉయ్యాలో..చన్నీటి జలకాలు ఉయ్యాలో..ఆడెనే గౌరమ్మ ఉయ్యాలో..ముత్యమంత పసుపు ఉయ్యాలో..ముఖమంతా పూసి ఉయ్యాలో..చింతాకు పట్టుచీర ఉయ్యాలో..చింగులు మెరవంగ ఉయ్యాలో.. రంగురంగుల బతుకమ్మలు.. తీరొక్క పూల గుబాళింపు.. వినసొంపైన జానపదాలు.. కోలాటాలు.. వేలాది మంది ఆడపడుచుల ఆటపాటలు.. మంగళవా రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ముద్దబంతై మురి సింది! సాయంత్రం నిర్వహించిన మహా బతుకమ్మ వేడుక ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పడతులు తరలి వచ్చి బతుకమ్మ ఆడారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ వేడుకలను ప్రారంభించారు. మహిళలతో కలసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృ తిక వైభవాన్ని చాటేదే బతుకమ్మ అని చెప్పారు. ‘‘గతంలో బతుకమ్మ ఆట ఆడుకునేందుకు నగరంలో కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అదే హైదరాబాద్‌లో వేలాది మందితో మహా బతుకమ్మ నిర్వహించడం ఆనందంగా ఉంది. ఎల్బీ స్టేడియం పూలవనాన్ని తలపిస్తోంది. అన్ని జాతులు కలిస్తేనే మానవ జాతి. అన్ని పూలు కలిస్తేనే బతుకమ్మ’’ అని అన్నారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధించేందుకు మహిళలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. బహ్మకుమారి డైరెక్టర్ బీకే కులదీప్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తోందన్నారు. అందరిదీ ఒకే కుటుంబం.. అంతా కలసి పువ్వుల్లా నవ్వులు చిందించిననప్పుడే విశ్వశాంతి పరిఢవిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందు కు దేశంలోని 15 రాష్ట్రాల నుంచి తమ ప్రతినిధులు తరలివచ్చారన్నారు. ఈ వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మందికిపైగా మహిళలు తరలివచ్చినట్టు అంచనా. రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ ఎండీ క్రిస్టినా చొంగ్తు, కార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణా పాల్గొన్నారు. -
ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు
-
16, 17 తేదీల్లో రెజ్లింగ్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో రెజ్లింగ్ పోటీలు జరగనున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఆరు విభాగాల్లో ఈ కుస్తీ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో దాదాపు 200 మంది రెజ్లర్లు తలపడనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాభిమానులు ఈ పోటీలకు హాజరై క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కె. రంగారావు, ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌రాజ్, రెజ్లింగ్ సభ్యులు చంద్రశేఖర్, జాఫర్, విజయ్‌కుమార్ యాదవ్, హబీబ్, మోహిన్ అలీఖాన్ పాల్గొన్నారు. -
అదరగొడుతున్న సినీ తారలు.. నీరసించిన నేతలు
హైదరాబాద్ : నగర కార్పొరేటర్లు-సినీ స్టార్స్ మధ్య జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఎల్బీస్టేడియంలో ఆదివారం కోలాహలంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపాటి హాజరయ్యారు. సినీస్టార్స్ శ్రీకాంత్, తరుణ్, సంజనతో పాటు పలువురు సినీతారలు ప్రముఖులు రావడంతో.. టోర్నమెంట్లో సందడి నెలకొంది. ముందుగా మహిళ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహిళ కార్పొరేటర్స్టీం ఫీల్డింగ్ ఎంచుకోగా.. సినీ తార సంజన జట్టు బ్యాటింగ్ చేస్తోంది. సంజన జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తుండటంతో.. కార్పొరేటర్ల జట్టు నీరసించింది. విద్యుత్ ఆదా చేయడానికి ఎల్ఈడీ లైట్ల వాడకం పెంచాలని సినీస్టార్స్ చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంటోంది. -
బతుకమ్మకు గిన్నిస్ రికార్డు!
-
బతుకమ్మకు గిన్నిస్ రికార్డు!
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అంతర్జాతీయ గుర్తింపు • హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ మహా ప్రదర్శ • ఒకే సమయంలో బతుకమ్మ ఆడిన 9,292 మంది మహిళలు సాక్షి, హైదరాబాద్: వర్షం కురిసి వెలిసిన ఆహ్లాదకర వాతావరణం.. వెలుగులు విరజిమ్మే అందమైన నిలువెత్తు పూల గోపురం.. దాని చుట్టూ వేలాది మంది మహిళలు.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ పాటలతో ఆటలు. ఒకవైపు ఆనందోత్సాహాలు, మరోవైపు ఉత్కంఠ భరిత క్షణాలు.. తెలంగాణ సాంస్కృతిక వైభవమైన బతుకమ్మ మహా ప్రదర్శన దృశ్యమిది. వేలాది మంది మహిళలు పాల్గొన్న ఈ బతుకమ్మ సాంస్కృతిక ఉత్సవం గిన్నిస్‌బుక్‌లో సగర్వంగా చోటు దక్కించుకుంది. శనివారం లాల్‌బహదూర్ స్టేడియంలో వేలాదిమంది మహిళలు బతుకమ్మ ఆడుతుండగానే.. ఈ ప్రదర్శన గిన్నిస్‌బుక్ రికార్డ్స్‌కు అర్హత సాధించినట్లు పరిశీలకులు కుమరన్, జయసింహా ప్రకటించారు. 12 వేల మందికిపైగా మహిళలు... రాష్ట్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ మహా ప్రదర్శనకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 12 వేలమంది మహిళలు హాజరయ్యారు. స్టేడియం మధ్యలో 20 అడుగుల ఎత్తయిన బతుకమ్మను తంగేడు, బంతి, గునుగు వంటి తీరొక్క పూలతో తీర్చిదిద్దారు. దానిచుట్టూ చిన్నచిన్న బతుకమ్మలను పెట్టారు. వాటి చుట్టూ 35 వరుసల్లో సుమారు 10 వేలమంది మహిళలు బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలతో ఈ వేడుకలో పాల్గొన్నారు. దీంతో స్టేడియం అంతా సందడి వాతావరణం నెలకొంది. ఒకవైపు నేలపై రంగు రంగుల పూలతో వెలసిన ఇంద్రధనస్సులు, మరోవైపు నింగిలో హరివిల్లులై విరబూసిన మతాబులు ఉత్సవాన్ని నయనానందకరం చేశాయి. సాయంత్రం నాలుగు గంటలకు పడిన వర్షం కారణంగా ఉత్సవానికి కాసేపు ఆటంకం కలిగినా.. తర్వాత మహిళలంతా మరింత ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ప్రతి దృశ్యాన్ని చిత్రీకరించేందుకు డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వేడుకలకు వచ్చిన మహిళల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చందూలాల్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డెరైక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రికార్డు ఇలా.... ఒకే రకమైన పాట, ఆటతో వేలాది మంది మహిళలు ఒకచోట చేరి జరుపుకొనే పండుగగా ఇప్పటివరకు కేరళలోని ఓనమ్ పండుగ ప్రపంచ రికార్డుగా ఉంది. 2015లో 5,211 మంది మహిళలు పాల్గొన్న ఓనమ్ గిన్నిస్‌బుక్‌లో నమోదైంది. బతుకమ్మకు అటువంటి రికార్డు అవసరమని భావించిన ప్రభుత్వం.. సాంస్కృతిక, పర్యాటక శాఖల సమన్వయంతో గిన్నిస్ రికార్డు కోసం ప్రణాళిక సిద్ధం చేసింది. శనివారం జరిగిన మహా ప్రదర్శనకు 12 వేల మంది హాజరుకాగా.. అందులో బతుకమ్మ ఆడేందుకు వచ్చిన 10,029 మంది మహిళలకు నిర్వాహకులు ట్యాగింగ్ చేశారు. అయితే వర్షం తదితరాలవల్ల కొంత మంది మధ్యలో బయటకు వెళ్లి రావడంతో.. బతుకమ్మ ఆడినవారు 9,292 మందిగా లెక్క తేల్చారు. దీంతో ఓనమ్ రికార్డును బతుకమ్మ అధిగమించింది. దాదాపు రెండు గంటల పాటు బతుకమ్మ ఆడినప్పటికీ ఎక్కువమంది ఆడిన సమయం 11.07 నిమిషాలను పరిగణనలోకి తీసుకున్నట్లు గిన్నిస్‌బుక్ పరిశీలకులు తెలిపారు. సెలబ్రిటీల తళుకులు.. వేలాది మంది మహిళలతో నిర్వహించిన బతుకమ్మ మహా ప్రదర్శనలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, క్రీడాకారిణి సానియా మీర్జా, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, మిస్ ఇండియా క్రౌన్ రష్మి ఠాకూర్, పూనమ్‌కౌర్ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక పలు దేశాల నుంచి వచ్చిన 40 మంది మహిళలు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. ప్రయత్నం ఫలించింది బతుకమ్మ పండుగకు ఉదాత్తమమైన చరిత్ర, లక్ష్యం ఉన్నాయి. ఇటువంటి గొప్ప సంస్కృతిని ప్రపంచానికి చాటాలనే మా ప్రయత్నం ఫలించింది. - బుర్రా వెంకటేశం,సాంస్కృతికశాఖ కార్యదర్శి మహిళా శక్తికి కృతజ్ఞతలు వర్షం వచ్చినా మహిళలు వెనక్కి తగ్గకుండా ప్రదర్శనలో పాల్గొన్నారు. మహిళా శక్తికి కృతజ్ఞతలు. - రామ్మోహన్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ మహిళలకు గర్వకారణం ప్రపంచంలో పూల(బతుకమ్మ)కు పూజచేసే సంస్కృతి తెలంగాణలో మినహా మరెక్కడా లేదు. ఈ రికార్డు తెలంగాణ మహిళలందరికీ గర్వకార ణం. - స్వామిగౌడ్, శాసన మండలి చైర్మన్ బతుకమ్మే స్ఫూర్తి నాడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి, నేడు ప్రపంచ గుర్తింపు లభించడానికీ బతుకమ్మే కారణమైంది. ప్రదర్శనలో పాల్గొన్న మహిళలందరికీ అభినందనలు. - చందూలాల్, పర్యాటకశాఖ మంత్రి చాలా సంతోషంగా ఉంది బతుకమ్మకు గిన్నిస్ బుక్‌లో స్థానం లభించ డం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా బతుకమ్మ ఆడాలనే ఇక్కడికి వచ్చా. - సానియా మీర్జా, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ బతుకమ్మకు మరింత కీర్తి తెలంగాణ బతుకమ్మకు గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కడం మరింత కీర్తిని పెంచింది. కేరళలోని ఓనమ్ పండుగను మించి తెలంగాణలో బతుకమ్మ పండుగ జరగడం గర్వకారణం. - నాయిని నర్సింహారెడ్డి, హోంమంత్రి -
గిన్నిస్ రికార్డుల్లో 'బతుకమ్మ'
-
గిన్నిస్ రికార్డుల్లో 'బతుకమ్మ'
హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక వేడుక బతుకమ్మ పండుగ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఎన్నో రోజులుగా అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నం ఫలించింది. వరుణుడు కొద్ది సేపు బయపెట్టి తెలంగాణ ఆడబిడ్డల చేతిలో రికార్డ్‌ను అందించాడు. వర్షం కారణంగా తీవ్ర ఒత్తిడి గురైన పర్యాటక, సాంస్కృతిక, జీహెచ్ఎంసీ అధికారులు వర్షం తగ్గుముఖం పట్టే సరికి ఊపిరి పీల్చుకున్నారు. చివరికి పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం దిగ్విజయం గిన్నిస్ రికార్డ్ సాధించామని ప్రకటించారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా, ఒలింపిక్స్ రజక పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో చీరకట్టుతో విచ్చేసిన విదేశీ వనితలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాయంత్రం 5.12 గంటలకు గిన్నిస్ రికార్డ్స్ పరిశీలనకు జయసింహ(హైదరాబాద్), కుమరన్(బెంగుళూరు), బెల్ది శ్రీధర్, బెల్ది కార్తీక్ గిన్నిస్ బుక్ రికార్డ్స్‌కు విజిల్ ప్రకటించారు. బతుకమ్మ చుట్టూ ఉన్న మహిళలు ఒక్కసారిగా నృత్యం ప్రారంభించారు. తిరిగి సాయంత్రం 5.25 గంటలకు గిన్నిస్ రికార్డ్స్ పరిశీలకు జయసింహ రికార్డ్ పూర్తి అయిందంటూ విజిల్ మోగించారు. మొత్తం ఎల్బీ స్టేడియంలో 10,029 మంది మహిళలు ఉండగా బతుకమ్మ చుట్టూ 9,292 మంది మహిళలు చేరి మహా బతుకమ్మ నృత్యంలో పాల్గొన్నారు. కేరళలో ఓనం పండుగకు 5,211 మంది మహిళలు ఒకేసారి నృత్య ప్రదర్శన చేసి గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. దాన్ని ఇప్పుడు తెలంగాణ ఆడ బిడ్డలు అధిగమించారు. ఎల్బీ స్టేడియంలో రంగురంగుల పూలతో 20 అడుగుల ఎత్తైన మహా బతుకమ్మను అలంకరించారు. 35 వరుసల్లో మహిళలు బతుకమ్మ చుట్టూ ఆడుతూ సందడి వాతావరణం నెలకొల్పారు. బతుకమ్మ పండుగ శోభతో ఎల్బీ స్టేడియం ప్రాంగణం కళకళలాడింది. -
మళ్లీ మొదలైన బతుకమ్మ గిన్నిస్ సంరంభం!
-
మళ్లీ మొదలైన బతుకమ్మ గిన్నిస్ సంరంభం!
హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వేడుక బతుకమ్మ పండుగ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో ఎక్కేందుకు సన్నద్ధమవుతుండగా.. కాసేపు వరుణుడు అడ్డుపడ్డాడు. భారీగా వర్షం కురువడంతో ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన మహా బతుకమ్మ వేడుకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వర్షం వెలియడంతో మళ్లీ బతుకమ్మ సందడి మొదలైంది. ఎల్బీ స్టేడియంలో శనివారం మహా బతుకమ్మ వేడుక కోసం ప్రభుత్వం సకల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా పదివేల మందితో బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేశారు. 20 అడుగుల ఎత్తుతో మహా బతుకమ్మను తీర్చిదిద్దారు. 35 వరుసల్లో పదివేల మంది మహిళలు బతుకమ్మ ఆడేలా వీలు కల్పించారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి.. రంగురంగులో పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొని ఎల్బీ స్టేడియం చేరుకున్నారు. మైదానం నిండా సందడి వాతావరణం నెలకొంది. ’బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో’ అంటూ భక్తిపారవశ్యంతో పాటలు పాడుతూ.. చూడముచ్చటగా మహిళలు బతుకమ్మ ఆడుతున్నారు. తీరొక్క పూల బతుకమ్మలతో పండుగ శోభతో ఎల్బీ స్టేడియం ప్రాంగణం కళకళలాడుతోంది. -
బతుకమ్మ గిన్నిస్ రికార్డుకు అనూహ్య ఆటంకం!
-
ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ సంబరాలు
-
‘మహా బతుకమ్మ’కు భారీ ఏర్పాట్లు
ఎల్బీస్టేడియం, ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ వేడుకలు బతుకుమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఘాట్లు ఏర్పాట్లను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సాక్షి, హైదరాబాద్: నగరంలో మహా బతుకమ్మ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియం, ట్యాంక్ బండ్ లపై మహా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నారు. గురువారం ట్యాంక్ బండ్ పై ఉత్సవ ఏర్పాట్లను జీహెచ్ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఉత్సవ వాతావరణం కనిపించేలా విద్యుత్ దీపాలతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతున్నారు. బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేకంగా కొలనులను ఏర్పాటుచేస్తున్నారు. ఈనెల 8న ఎల్బీస్టేడియంలో, 9న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు గాను 1060 మంది పారిశుధ్య కార్మికులు, 95 మంది ఎస్ఎఫ్ఏలతో కూడిన 11 బతుకమ్మ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. గిన్నిస్ రికార్డు సాధన లక్ష్యంగా ఎల్బీస్టేడియంలో నిర్వహించే మహా బతుకమ్మతో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. మహా బతుకమ్మకు నగరంలోని పదివేల మంది స్వయం సహాయక బృందాల మహిళలు హాజరుకానున్నారు. ట్యాంక్‌బండ్‌తో పాటు సరూర్‌నగర్, ఐడీఎల్ చెరువు, హస్మత్‌పేట్ చెరువు, ప్రగతీనగర్ చెరువు, సున్నం చెరువు, గంగారం చెరువు, దుర్గం చెరువు, పల్లెచెరువు, పెద్ద చెరువు తదితర ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను నిర్వహణకు విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, ప్రత్యేక లైటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని దాదాపు 100ప్రాంతాల్లో భారీ బతుకమ్మలను ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగ ఔనత్యాన్ని తెలిపే హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. నగరం వివిధ మతాలు, సాంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని, నగర ఔనత్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కమిషనర్ నగరవాసులను సూచించారు. నిమజ్జనానికి ప్రత్యేక కొలనులు నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి గాను ప్రత్యేకంగా నిర్మించిన కొలనులను బతుకమ్మల నిమజ్జనానికి ఉపయోగించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించినట్లు కమిషనర్ తెలిపారు. హుస్సేన్‌సాగర్ జలవిహార్ సమీపంలోని నిమజ్జన కొలను వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మల నిమజ్జనానికి కొలనును స్వచ్ఛమైన నీటితో నింపాలని, కొలను చుట్టూ బతుకమ్మలు అడే విధంగా మైదానాన్ని చదును చేయడంతో పాటు లైటింగ్, మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, అడిషనల్ కమిషనర్ రవికిరణ్, శంకరయ్య, చీఫ్ ఇంజనీర్ సుభాష్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
‘మహా బతుకమ్మ’కు భారీ ఏర్పాట్లు
-
1500 మందితో రిహార్సల్స్
సాక్షి,సిటీబ్యూరో: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గురువారం ఎల్బీస్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు. గురువారం 1500 మంది మహిళలు బతుకమ్మ ఆడి రిహార్సల్స్ నిర్వహించారు. ఓనం తరహాలో ఒకే చోట 10వేల మంది మహిళలతో బతుకమ్మ ఆడించి గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించాలని నిర్ణయించారు. 9న సద్దుల బతుకమ్మ సందర్భంగా 10 వేలు, అంతకంటే ఎక్కువ మంది మహిళలను ఒక్కచోట చేర్చాలని పర్యాటక, సాంస్కృతిక శాఖలు నిర్ణయించాయి. టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టీనా జడ్ ఛోంగ్తూ, అధికారులు దినకరబాబు, సాంస్కృతికడైరెక్టర్ మామిడి హరికృష్ణ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
‘మహా బతుకమ్మ’కు భారీ ఏర్పాట్లు
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో మహా బతుకమ్మ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియం, ట్యాంక్ బండ్ లపై మహా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నారు. గురువారం ట్యాంక్ బండ్ పై ఉత్సవ ఏర్పాట్లను జీహెచ్ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఉత్సవ వాతావరణం కనిపించేలా విద్యుత్ దీపాలతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతున్నారు. బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేకంగా కొలనులను ఏర్పాటుచేస్తున్నారు. ఈనెల 8న ఎల్బీస్టేడియంలో, 9న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు గాను 1060 మంది పారిశుధ్య కార్మికులు, 95 మంది ఎస్ఎఫ్ఏలతో కూడిన 11 బతుకమ్మ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. గిన్నీస్ రికార్డు సాధన లక్ష్యంగా ఎల్బీస్టేడియంలో నిర్వహించే మహా బతుకమ్మతో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. మహా బతుకమ్మకు నగరంలోని పదివేల మంది స్వయం సహాయక బృందాల మహిళలు హాజరుకానున్నారు. ట్యాంక్‌బండ్‌తో పాటు సరూర్‌నగర్, ఐడీఎల్ చెరువు, హస్మత్‌పేట్ చెరువు, ప్రగతీనగర్ చెరువు, సున్నం చెరువు, గంగారం చెరువు, దుర్గం చెరువు, పల్లెచెరువు, పెద్ద చెరువు తదితర ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, ప్రత్యేక లైటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని దాదాపు 100ప్రాంతాల్లో భారీ బతుకమ్మలను ఏర్పాటు చేశా>రు. బతుకమ్మ పండుగ ఔనత్యాన్ని తెలిపే హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. నగరం వివిధ మతాలు, సాంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని, నగర ఔనత్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కమిషనర్ నగరవాసులను సూచించారు. నిమజ్జనానికి ప్రత్యేక కొలనులు నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి గాను ప్రత్యేకంగా నిర్మించిన కొలనులను బతుకమ్మల నిమజ్జనానికి ఉపయోగించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించినట్లు కమిషనర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ జలవిహార్ సమీపంలోని నిమజ్జన కొలను వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మల నిమజ్జనానికి కొలనును స్వచ్ఛమైన నీటితో నింపాలని, కొలను చుట్టూ బతుకమ్మలు అడే విధంగా మైదానాన్ని చదును చేయడంతో పాటు లైటింగ్, మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, అడిషనల్ కమిషనర్ రవికిరణ్, శంకరయ్య, చీఫ్ ఇంజనీర్ సుభాష్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్త గుర్తింపు లభించేలా అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియంలో అక్టోబర్ 8న భారీ స్థాయిలో బతుకమ్మ పండుగ చేసేందుకు గ్రేటర్ పరిధిలోని స్వయం సహాయక సంఘాల బృందాల సమాఖ్య ప్రతినిధులతో గురువారం జీహెచ్ఎంసీలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పర్యాటక సంస్థ ఎండీ క్రిస్టినా చోంగ్తు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ భాస్కరాచారి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో 20 అడుగుల ఎత్తయిన బతుకమ్మ చుట్టూ పదివేల మంది మహిళలు బతుకమ్మ ఆడతారని అందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. దాదాపు 50వేల మంది ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉందన్నారు. ఈ వేడుకలో 500 మంది విదేశీ మహిళలు కూడా పాల్గొనడం ప్రత్యేకత అని మేయర్ తెలిపారు. ఇక్కడ జరిగే బతుకమ్మ పండుగతో నగరానికి గుర్తింపుతో పాటు పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. వచ్చే ఏడాది పండుగకు 50వేల మంది విదేశీయులు ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రత్యేక ఆకర్షణగా పుట్టిల ప్రదర్శన.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో అక్టోబర్ 9న మహిళలు భారీసంఖ్యలో స్వచ్ఛందంగా బతుకమ్మ ఆడతారని, ఇందుకోసం ఏర్పా ట్లు చేస్తున్నట్లు మేయర్ రామ్మోహన్ తెలి పారు. అదేరోజు రాత్రి హుస్సేన్‌సాగర్‌లో 300 పుట్టిల ప్రదర్శన ఉంటుందన్నారు. విద్యుత్ కాంతుల వర్ణాలతో పుట్టిల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ అన్నారు. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ వంటకాలతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. -
ఓనం మాదిరిగా బతుకమ్మ
- 15 వేల మంది మహిళలకు ప్రత్యేక రంగు చీరలు - ఎల్బీ స్టేడియంలో మెగా ఫెస్టివల్ సాక్షి, హైదరాబాద్: పూలపండుగను వినూత్నంగా నిర్వహించేందుకు సర్కార్ సమాయత్తమవుతోంది. కేరళ మహిళల మాదిరిగా ఈసారి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనే తెలంగాణ ఆడబిడ్డలు ప్రత్యేక రంగు చీరలతో ఆకట్టుకోనున్నారు. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకుగాను గతేడాది కేటాయించిన రూ.10 కోట్ల బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ ఈసారి రూ.15 కోట్లకు పెంచారు. ప్రతి జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో బతుకమ్మ పండుగ కళ కనబడాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 30 నుంచి తొమ్మిది రోజులపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. కేరళీయుల గ్రామీణ పండుగ ఓనంను అక్కడి ప్రజలు పదిరోజులపాటు చూడముచ్చటగా జరుపుకుంటారు. ఈ పండుగను నేరుగా తిలకించేందుకు విదేశీయులు సైతం హాజరవుతారు. తిరువనంతపురంలో ఓనం పండుగను నిర్వహిస్తున్నట్లుగానే వినూత్నంగా హైదరాబాద్‌లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. కేరళ మహిళలు ‘కసవు చీరలు’ ధరించి ఓనం ఉత్సవాల్లో భాగస్వాము లు అవుతారు. అదే తరహాలో ఇక్కడ కూడా బతుకమ్మ పండుగలో పాల్గొనే మహిళలు తెలంగాణ విశిష్టతను చాటేవిధంగా ప్రత్యేక రంగుతో కూడిన చీరలను ధరించనున్నారు. వచ్చే నెల 6న 15 వేల మంది మహిళలతో ఒకే రంగు చీర ధరింప చేసి ఎల్బీ స్టేడియంలో ఉండచుట్టిన తాడు ఆకారంలో నిలబెట్టి గ్రాండ్ బతుకమ్మ పేరుతో సరికొత్త సాంస్కృతిక అంశాలు మేళవించి బతుకమ్మ ఉత్సవం నిర్వహించనున్నారు. కొందరు అధికారుల ఆలోచనలకు సీఎం కార్యాలయ అధికారులు ఆమోదం తెలినట్లు తెలిసిం ది. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు ఒకట్రెండు రోజుల్లో వెల్లడించనున్నారు. వచ్చే నెల 9న మాత్రం ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు యథావిధిగా నిర్వహించనున్నారు. -
కరాటేలో సత్తా చాటిన జిల్లా కుర్రాళ్లు
ఏలూరు రూరల్ : కరాటే పోటీల్లో జిల్లా కుర్రాళ్లు సత్తా చాటారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కరాటే చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఏలూరుకు చెందిన పి.సాయికుమార్ జూనియర్ కలర్ బెల్ట్ అంశంలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించాడు. ఇదే విభాగంలో పాల్గొన్న వై.రమేష్‌బాబు, కె.జ్ఞాన నాగసాయి బ్రాంజ్‌మెడల్ సొంతం చేసుకున్నారు. జూనియర్ కలర్ బెల్ట్ కుమితేలో ఎస్.సురేష్ సిల్వర్, బి.నాగబాబు బ్రాంజ్‌మెడల్ సాధిం చినట్టు శిక్షకుడు వి.దిలీప్‌కుమార్ తెలిపారు. -
స్టెప్పులేసిన నాయిని సారు
గన్‌ఫౌండ్రీ: ఎల్బీ స్టేడియంలో ఆదివారం గిన్నిస్ రికార్డు నమోదయింది. భారతదేశ సినీ సంగీత నృత్య, ఏరోబిక్ డ్యాన్స్ విభాగంలో ఎరాక్ డ్యాన్స్ ఫిట్నెస్ అకాడమీ 5000 మందితో డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించింది. ముఖ్య అతిథి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలన్నారు. అనంతరం అరగంట పాటు సాగిన ఈ డ్యాన్స్ కార్యక్రమాన్ని తిలకించి మార్వెలెస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా కో–ఆర్డినేటర్ మోహన్ చంద్ర ప్రశంస పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సినీనటి రాధా ప్రశాంతి, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ గవర్నర్ రత్న ప్రభాకర్, మెజీషియన్ సామల వేణు, ఎరాక్ డ్యాన్స్ అకాడమీ, చిరునవ్వు ఆర్ట్స్ అధినేత వై.మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
అంతా ఓట్లు, సీట్లు, నోట్లు, వెన్నుపోట్లే
-
అంతా ఓట్లు, సీట్లు, నోట్లు, వెన్నుపోట్లే
టీఆర్ఎస్ రెండేళ్ల పాలనపై కె.లక్ష్మణ్ ఫైర్ సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఓట్లు, సీట్లు, నోట్లు, వెన్నుపోట్లే ఎజెండాగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన మహాసమ్మేళన్‌లో ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయన్నారు. కేసీఆర్ వారసులకు అధికారాన్ని అప్పగించడం కోసం రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. న్యాయస్థానాలు తప్పని చెప్పినా వినకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 119 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో 30 శాతం మంది సభ్యులు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించినవారేనని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఎంసెట్ 1, 2, 3 అంటూ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటిదాకా బాధ్యులైన మంత్రి కూడా రాజీనామా చేయకపోవడమంటే అవినీతిని సమర్థించడమేనని విమర్శించారు. సెప్టెంబర్ 17న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని అధికారంలోకి వచ్చేదాకా చెప్పిన టీఆర్ఎస్... ఇప్పుడా అంశాన్ని తుంగలో తొక్కిందని పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీ పాలనపై విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. అదే స్ఫూర్తితో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
'ఐదుగురు మంత్రులం వచ్చి 17వేల కోట్ల ప్రాజెక్టులు తెచ్చాం'
హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో బీజేపీ సమ్మేళన్ కు హాజరైన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. యాపీఏ హయాంలో అవినీతి అంతరిక్షం నుంచి పాతాళానికి దిగజారిందని వెంకయ్యనాయుడు విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని.. ఆదివారం ఐదుగురు కేంద్రమంత్రులు రాష్ట్రానికి వచ్చి రూ.17 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించారని దత్తాత్రేయ చెప్పారు. దేశ సమగ్రాభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని టీబీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ అన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ వారసత్వ రాజకీయాలను చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని తెలిపారు. -
పార్టీ బలోపేతం కోసం బీజేపీ కృషి
-
ప్రధాని రాక నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
► రేపు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరుగనున్న భారతీయ జనతా పార్టీ వర్కర్స్ సమ్మేళన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి, రవీంద్రభారతి వైపు పంపిస్తారు. ► అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ, బషీర్‌బాగ్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను చాపెల్ రోడ్ వైపు మళ్ళిస్తారు. ► బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి జీపీఓ, అబిడ్స్ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను హైదర్‌గూడ, కింగ్‌కోఠి మీదుగా పంపిస్తారు. ► ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ మీదుగా మళ్ళిస్తారు. ► కింగ్ కోఠి భారతీయ విద్యాభవన్ మీదుగా నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తాజ్‌మహల్ హోటల్ మీదుగా పంపిస్తారు. ► లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ వైపు, ట్రాఫిక్ కంట్రోల్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్ళిస్తారు. ► కార్యక్రమానికి వచ్చే ఆహుతులు, పాస్‌లు ఉన్న వారికి ఈ మళ్ళింపులు వర్తించవు. వీరికి ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు, గేట్లు కేటాయించారు. ► ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు ఎస్పీ రోడ్, గ్రీన్‌ల్యాండ్స్, క్యాంప్ ఆఫీస్, రాజ్‌భవన్ రోడ్, ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. -
మోదీ కోసం ముస్తాబు
సాక్షి,హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 7న నగరానికి రానున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు, అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో గురువారం ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగసభ ఏర్పాట్లను కిషన్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. -
ఎల్బీ స్టేడియంలో శాంతియాగం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల7న హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్రకమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతం కావాలని కోరుతూ గురువారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారె డ్డి ఆధ్వర్యంలో శాంతి యజ్ఞం, సుదర్శన యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తరలివస్తున్నారన్నారు. వీఐపీ వాహనాలకు బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తా వరకు అనుమతి ఉంటుందన్నారు. వాహనాల పార్కింగ్ైకై నిజాం కళాశాల మైదానం, మహబూబియా పాఠశాల, పబ్లిక్ గార్డెన్ ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. వేదికను పూర్తిగా డిజిటల్ పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. అనంతరం నగర అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, డీసీపీ కమల్‌హాసన్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
సాక్షి ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్
-
యూత్‌లో ఫుల్‌జోష్
ఉత్సాహంగా సాక్షి ఎరీనా వన్ అవార్డుల ప్రదానోత్సవం హాజరైన సినీ, విద్యా, రాజకీయ ప్రముఖులు సాక్షి, హైదరాబాద్: స్పూర్తిదాయక ప్రసంగాలు.. మధ్య, మధ్యలో సినీతారల తళుక్కులు.. హోరెత్తించే యువ ఉత్సాహం.. పాశ్చాత్య, సంప్రదాయ మ్యూజిక్.. బాబా సెహగల్ సినీ సంగీతం.. రోల్ రిడా పతంగ్.. వెరసి యూత్‌లో ఫుల్‌జోష్! ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సాక్షి ఎరీనా వన్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా సాగింది. ‘సాక్షి’ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ రాణిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి, విజ్ఞాన్ యూనివర్సిటీ అధినేత డాక్టర్ రత్తయ్య, ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సినీతార లక్ష్మీ మంచు, నటులు మంచు మనోజ్, సునీల్, ఆది పినిశెట్టి, ఆదా శర్మ, రేష్మి, స్నిగ్ధ, అనసూయ, అడివి శేషు, నిర్మాత దిల్‌రాజ్, ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధూ విశిష్ట అతిథులుగా హాజరై వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) ఉత్తమ కళాశాలగా నిలిచింది. ఉత్తమ బోధన, క్యాంపస్ ప్లేస్మెంట్, బెస్ట్ క్యాంపస్, విద్యార్థుల ప్రతిభ తదితర అంశాల్లో ‘కాలేజ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును దక్కించుకుంది. యుువతలోని ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు సాక్షి మీడియూ గ్రూప్ ‘ఈ మెగా ఈవెంట్’ నిర్వహించడం అభినందనీయమని కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు కొనియాడారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సినీ నటి లక్ష్మి మంచు, విజ్ఞాన్ యూనివర్సిటీ అధినేత లావు రత్తయ్య, సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి, ఐపీఎస్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి, అడ్వర్టైజింగ్ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి మనోళ్లే గొప్పోళ్లు: ఎంపీ మల్లారెడ్డి ప్రపంచ దేశాలతో పోలిస్తే తెలంగాణ యువతలోనే తెలివితేటలు ఎక్కువ. ప్రపంచ దేశాలన్నీ మనల్నే చూస్తున్నాయి. ఇక్కడ ప్రతిభకు కొదవ లేదు. చదువు, పరీక్షలు ఒక్కటే జీవితం కాదు. ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని వెలికి తీసినప్పుడే వాడు గొప్పవాడవుతాడు. కృషి, పట్టుదల చాలు: ప్రవీణ్‌కుమార్ పరీక్షలో మార్కులు తక్కువ వచ్చినా.. ఇంగ్లిష్ అంతగా రాక పోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఉన్నతమైన ఆశయం, కృషి, పట్టుదల ఉంటే విజయం సిద్ధిస్తుంది. సమాజంలో మనల్ని గొప్పవాళ్లుగా నిలబెడుతుంది. సాధారణ విద్యార్థులైన మాలవత్ పూర్ణ, ఆనంద్ ఎవరెస్ట్‌ను అధిరోహించారు. వారి కృషిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. చదువొక్కటే కాదు: డాక్టర్ రత్తయ్య చదువు ఒక్కటే జీవితం కాదు. బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారు మంచి ఉద్యోగాన్నైతే పొందవచ్చు కానీ.. మంచి జీవితాన్ని మాత్రం పొందలేదు. సమాజంలో సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా ఆలోచించే వారికి మంచి గుర్తింపు ఉంటుంది. ఐపీఎస్ సాధిస్తా: ఆనంద్, ఎవరెస్ట్ అధిరోహించిన విద్యార్థి ఇప్పటివరకు మంచును, ఎతైన మంచు శిఖరాలను సినిమాలోనే చూశాను. నిజ జీవితంలో వాటిని చూస్తానా? అనుకున్నాను. కానీ కృషి, పట్టుదలతో ఎవరెస్ట్‌ను అధిరోహించా. పేదవాడికి అవకాశం ఇస్తే.. వారు కూడా నాలాగే విజయం సాధించి చూపిస్తారు. భవిష్యత్తులో ఐపీఎస్ అవుతాను. -
‘సాక్షి’ ఎరీనా విజేతలు వీరే...
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం(21-02-2016) ఎల్బీ స్టేడియంలో సాక్షి ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్ కేక పుట్టించింది. గానం, సంగీతం, ఆటలు తదితర అంశాల్లో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలు,బహుమతులు అందజేశారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచే స్టేడియంలో సందడి నెలకొంది. పలువురు సెలబ్రిటీలు వేడుకలకు హాజరై ఉత్సాహపరిచారు. బాబా సెహగల్ పాటలు ఉర్రూతలూగించాయి. ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ స్ఫూర్తి దాయక ప్రసంగం.. విద్యావేత్త డాక్టర్ లావు రత్తయ్య అనుభవ పూర్వక సందేశం, ఎంపీ మల్లారెడ్డి ఉల్లాసభరిత ప్రసంగం యువతను ఆకర్షించాయి. చిత్ర దర్శకుడు దశరథ్, సినీనటులు మంచు లక్ష్మి, మనోజ్, నిర్మాత శివకుమార్ మాట్లాడారు. క్రీడాకారిణి సింధు.. విద్యార్థులకు ఇలాంటి మంచి వేదిక ఇచ్చిన సాక్షికి అభినందనలు తెలిపారు. ‘మలుపు’ చిత్ర హీరో ఆది, నిక్కి గల్రానీ, హీరో సునీల్ ఆటపాటలతో అలరించారు. అడవి శేష్, అదాశర్మ తమ కొత్త చిత్రం గీతాలకు సెప్పులేసి ఆకట్టుకున్నారు. విజేతలు వీరే... బాటిల్ ఆఫ్ బ్యాండ్స్ విజేత - గన్స్ అవే గ్రూప్ - గీతం యూనివర్సిటీ రన్నరప్- బీయాండ్ స్టార్స్ - టీకేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ సింగింగ్ వి- పవన్ కల్యాణ్- మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ర- సాదియా షఫీ- అమ్జద్ అలీ ఖాన్ కాలేజ్ ఇన్స్ట్రుమెంట్ సోలో వి- మహ్మద్ జైద్ - అమ్జద్ అలీ ఖాన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ర - సాయి తేజ - భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డాన్స్ - గ్రూప్ వి- వెడ్లీ గ్రూప్ - విజయ్ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ర- సుమిత్ గ్రూప్ - సీఎమ్మార్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూటషన్స్ డ్యాన్స్ సోలో వి - ఆర్. అభిషేక్ కుమార్ - మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ర- అనులిత - సీఎమ్మార్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ థియేటర్ అండ్ యాక్టింగ్ వి- హిమ అండ్ గ్రూప్ - విజయ్ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్టాండప్ కామెడీ వి- జి. మల్లేష్ - జాహ్నవి డిగ్రీ కాలేజ్ యాంకరింగ్ వి- ప్రియాంక నహత - ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటింగ్ ఆఫ్ ఇండియా ర- ప్రభు కుమార్ - సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కాలేజ్ ఆఫ్ ది ఇయర్ చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పెయింటింగ్ వి - ఎం. మేఘన - జేఎన్ఏఎఫ్ఏయూ ర- దీప్ ఘోష్ - పీఆర్ఆర్ లా కాలేజ్ ఫొటోగ్రఫీ వి - ఎం. అభిలాష్ రెడ్డి - నల్లా నర్సింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ ర- ఎస్. శ్రీనివాస్ రెడ్డి - మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ శిల్ప కళ వి - కె. భార్గవి - హోలీ మేరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్ కాపీ రైటింగ్, ప్రజెంటేషషన్ వి - బి. లోకేష్ - సీఎమ్మార్ గ్రూప్ ఇనిస్టిట్యూషన్స్ పోస్టర్ మేకింగ్ వి - అమరేందర్, లోకేష్ - సీఎమ్మార్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ జంక్ యార్డ్ వి - అంజలి పోల్కర్ - శ్రీ సాయి జ్యోతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ర - సింధుజ, జ్యోతిర్మయి, ఎం. కీర్తి - ఎంఎల్ఆర్ఐటీఎం రోబోటిక్స్ వి - ఏ ధీరజ్, సీహెచ్ వంశీ, వైష్ణవి - ఏస్ ఇంజినీరింగ్ కాలేజ్ ర - హరిప్రియరెడ్డి, డి. అభిలాష్, సిరిపురిం - సీఎమ్మార్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్ కాలేజ్ బ్లాగ్ వి - సి. కేదార్ - సీఎమ్మార్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ర - వి. వేణుగోపాల్ రెడ్డి - సీఎమ్మార్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాస్ షేక్ జావిద్ - హైదరాబాద్ యూనివర్సిటీ మోస్ట్ ఇన్నోవేటివ్ సెన్సైస్ ఐడియాస్ వి - డి. శతకీర్తి - సీఎమ్మార్ల గ్రూప్ ఇనిస్టిట్యూషన్ ర - బి. లోకేష్ - సీఎమ్మార్ గ్రూప్ ఇనిస్టిట్యూషన్ ఆర్టికల్ రైటింగ్ వి - వేదాంత్ - సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ ర - ఏ. మల్లేశ్వరి - వసుంధర డిగ్రీ కాలేజ్ డిబేట్ వి - వి. జోసెఫ్ వినోద్, ఆకాంక్ష తన్వార్ - సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ ర - ఏ. మల్లేశ్వరి, రచన - వసుంధర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ పబ్లిక్ స్పీకింగ్ వి - వి. జోసెఫ్ వినోద్ - సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్ రన్నర్ 1- ఏ. మల్లేశ్వరి - వసుంధర ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ రన్నర్ 2 - ఆండ్య్రూ - సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ క్విజ్ వి - సయ్యద్ మంజూర్, ముహుర్ అలీ - ఐసీఎస్ఐ ఎంఎక్స్డీ చాప్టర్ ర - ఏ. శ్రీకాంత్ రెడ్డి, సూర్యతేజ- ఏస్ ఇంజినీరింగ్ కాలేజ్ క్రికెట్ వి- సజన్ కుమార్ - మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ర - రోహిత్ రెడ్డి - టీకేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ బాస్కెట్ బాల్ వి- రామమిశ్రా - లయోలా అకాడమీ (ఉమెన్స్) వి- సంతోష్ - సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ (మెన్) చెస్ వి- కె. ప్రణీత - సీబీఐటీ (ఉమెన్) ర - ఎం. జోత్స్న - సీబీఐటీ వి- మాణిక్య తేజ - సీబీఐటీ (మెన్) ర- కేఆర్ ప్రద్యుమ్న - ఎంజీఐటీ క్యారమ్స్ - సింగిల్స్ వి- జి శ్రావికా రెడ్డి - సీబీఐటీ (ఉమెన్) ర - ఎస్ఎం. మనిషా - గవర్నమెంట్ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ వి- సయ్యద్ హఫీజ్ పాషా - ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (మెన్) ర - అబ్దుల్ రాబ్ - ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ క్యారమ్స్ - డబుల్ వి - జి. శ్రావికా రెడ్డి, దివ్య - సీబీఐటీ (ఉమెన్) ర - ఏ. ప్రసన్న లక్ష్మి శ్రీ, ఎస్. మమత - గవర్నమెంట్ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ వి - కె. సిద్ధార్థ, ఎ. సాయికిరణ్ - ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (మెన్) ర - శ్రీహరి, కష్ణకాంత్ - సీబీఐటీ టేబుల్ టెన్నిస్ - సింగిల్స్ వి- రవళి - సీబీఐటీ (ఉమెన్) ర - ఏ. నవ్య నిఖిత - తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ వి- నాగసాయి అఖిల్ - ఇనిస్టిట్యూట్ ఏయిరోనాటికల్ ఇంజినీరింగ్ (మెన్) ర - పి. యశ్వాంత్రాజ్ - ఇనిస్టిట్యూట్ ఏయిరోనాటికల్ ఇంజినీరింగ్ టేబుల్ టెన్సిస్ - ఉమెన్ టీం వి- రవళి , మానస, శ్రావ్య - సీబీఐటీ ర - నవ్య నిఖిత, తేజస్విని రామన్, సంయుక్త - తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ టేబుల్ టెన్సిస్ - మెన్ టీం వి - నాగసాయి అఖిల్, యశ్వాంత్, అజయ్ - ఇనిస్టిట్యూట్ ఏయిరోనాటికల్ ఇంజినీరింగ్ ర - జయదీప్, శ్రేయ్ లొకాటియా, అమిత్, భవేష్ - సీబీఐటీ త్రో బాల్ వి- శివాని - విల్లామేరీ డిగ్రీ కాలేజ్ (ఉమెన్) ర- అమత - సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్ వి- ఎం. కిరణ్‌కుమార్ - సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ (మెన్) ర- డి. మధు - భవన్స్ వివేకానంద డిగ్రీ కాలేజ్ బ్యాడ్మింటన్ వి- కార్తిక్ - సీబీఐటీ (సింగిల్స్) ర - వేదు - గీతం యూనివర్సిటీ వి- మణిదీప్, సంతోష్ - శ్రీ సాయి జ్యోతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ (డబుల్స్) ర - ప్రమోద్, మనీష్ - విద్యాజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిజైన్ అండ్ ఫ్యాషన్ వి- కావ్య - సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజ్ ర - కోట భార్గవి - హోలీ మేరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ర్యాంప్ వాక్/మోడలింగ్ వి- సయ్యద్ అలీ మహ్మద్ - ఉస్మానియా యూనివర్సిటీ (మెన్) వి- సోనల్ అగర్వాల్ - హమ్స్టెక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైన్ -
యూత్ ఫెస్ట్.. సూపర్‌హిట్
అట్టహాసంగా ‘సాక్షి ఎరీనా వన్’ వేడుక సిటీబ్యూరో: ఒకటీ రెండూ కాదు.. సిటీకి చెందిన 225 కాలేజీల విద్యార్థుల మధ్య పోటీ. పలు సాంస్కృతిక అంశాల్లో నువ్వా.. నేనా.. అన్నట్టు తలపడ్డారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ‘సాక్షి’ మీడియా నిర్వహించిన ‘సాక్షి ఎరీనా వన్’ ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహించింది. ఆదివారం ఎల్బీ స్టేడియంలో విన్నర్స్, అచీవర్స్, స్టూడెంట్స్, సెలబ్రీటీస్ మధ్య ఎరీనా ఫినాలే గ్రాండ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. వేలమంది విద్యార్థుల కేరింతల మధ్య సెలబ్రిటీస్ ఆటపాటలతో ప్రాంగణం జోష్‌తో నిండిపోయింది. ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ స్ఫూర్తి దాయక ప్రసంగం.. విద్యావేత్త డాక్టర్ లావు రత్తయ్య అనుభవ పూర్వక సందేశం, ఎంపీ మల్లారెడ్డి ఉల్లాసభరిత ప్రసంగం యువతను ఆకర్షించాయి. చిత్ర దర్శకుడు దశరథ్, సినీనటులు మంచు లక్ష్మి, మనోజ్, నిర్మాత శివకుమార్ మాట్లాడారు. క్రీడాకారిణి సింధు.. విద్యార్థులకు ఇలాంటి మంచి వేదిక ఇచ్చిన సాక్షికి అభినందనలు తెలిపారు. ‘మలుపు’ చిత్ర హీరో ఆది, నిక్కి గల్రానీ, హీరో సునీల్ ఆటపాటలతో అలరించారు. అడవి శేష్, అదాశర్మ తమ కొత్త చిత్రం గీతాలకు సెప్పులేసి ఆకట్టుకున్నారు. ‘సాక్షి’కి కృతజ్ఞతలు చదువుతో పాటు ఇతర అభిరుచుల్లో ముందున్న మాలోని ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ‘సాక్షి’ ఎరీనా వన్ మంచి వేదికైంది. రోబోటిక్స్ విభాగంలో రాణించడం చాలా ఆనందంగా ఉంది. కాలేజీ లెక్చరర్ల సపోర్ట్‌తో వందలాది మంది విద్యార్థులు పోటీపడిన ఈ విభాగంలో ఉత్తమ ప్రతిభను కనబరిచా. ఈ గుర్తింపు సాక్షితో వచ్చిందే. - ఎస్.శివ తేజ, బీటెక్ విద్యార్థి, సీఎంఆర్ కాలేజీ చాలా హ్యాపీగా ఉంది.. విద్యార్థులకు చదువుతో పాటు మంచి అభిరుచులు ఉంటాయి. వీటిని కొంత మంది ఉపాధిగా కూడా ఎంచుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ‘సాక్షి’ ఎరీనా వన్ ఫెస్ట్ నిర్వహించడం ఆనందంగా ఉంది. థియేటర్ విభాగంలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు హ్యపీగా ఉంది. ఇలాంటి పోటీలు ఏ మీడియా చేయలేదు. ఈ గురుతర బాధ్యతను తీసుకున్న సాక్షికి నా సెల్యూట్. - థెర్రిస్సామ్నా, బీఎస్సీ నర్సింగ్, విజయ మేరీ కాలేజీ కళాత్మకతకు ఇదే ‘సాక్షి’ టాలెంట్ ఉన్నా సరైన వేదిక లేని మాలాంటి వారందరికీ ‘ఎరీనా వన్’ మంచి వేదికైంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. పెయింటింగ్ విభాగంలో విజేతగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నా. నాలో ఉన్న కళను ప్రపంచానికి చాటగలిగినందుకు సంతోషంగా ఉంది. - మేఘన, జేఎన్ఏఎఫ్ఏయూ ప్రతిభావంతులకు వేదిక.. నేను పాటలు బాగా పాడతా. డాన్స్ కూడా చేస్తా. ఇన్నాళ్లు నా ప్రతిభను ప్రదర్శించేందుకు సరైన వేదిక దొరకలేదు. ఇప్పుడీ ఈ మహదావకాశం సాక్షి ఎరీనా వన్ ద్వారా రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ వేలాది మంది ప్రేక్షకుల ముందు సోలో డాన్స్ చేయడం లైఫ్‌లో మరచిపోలేను. - శాలినీ, బీటెక్ విద్యార్థిని, ఎంఎల్ఆర్ఐటీ -
సందడిగా ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్
హైదరాబాద్: విద్యకే పరిమితం కాకుండా.. విద్యార్థులలోని సృజనాత్మక శక్తులను... వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రయత్నంలో భాగంగా ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యూత్ ఫెస్ట్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సినీ తారల తళుకులు.. హుషారెత్తించే కామెడీ స్కిట్లు.. విద్యార్థుల సందడితో స్టేడియం మార్మోగుతోంది. ఈ రోజు సాయంత్రం మొదలయిన ఈ యూత్ ఫెస్ట్‌కు వివిధ రంగాల ప్రముఖులు, సినీతారలు మంచు మనోజ్, మంచు లక్ష్మీ, ఆది పినిశెట్టి, సునీల్, సంజనా, నిర్మాత దిల్‌రాజు తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ సింగర్స్ బాబా సెహగల్, రోల్ రిదా తమ పాటలతో ఉర్రూతలూగించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ఇండియా నంబర్ వన్ స్పోర్ట్స్ బైక్ బజాజ్ పల్సర్ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గానం, సంగీతం, ఆటలు తదితర అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆదివారం బహుమతులను అందజేస్తారు. ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సినీ తార మంచు లక్ష్మి, విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ ఎల్.రత్తయ్య, సుల్తాన్ ఉల్ ఉలూం కాలేజ్ గౌరవ సెక్రటరీ జాఫర్ జావిద్ తదితరులు ఫెస్ట్‌ను ప్రారంభించారు. -
నేడు ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్
వేదిక : ఎల్బీ స్టేడియం సవుయుం : సాయంత్రం3 గంటల నుంచి సందడి చేయనున్న సినీ తారలు సాక్షి, సిటీబ్యూరో: విద్యకే పరిమితం కాకుండా.. విద్యార్థులలోని సృజనాత్మక శక్తులను... వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రయత్నిస్తోంది. దీని కోసం ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యూత్ ఫెస్ట్ అంగరంగ వైభవంగా జరుగనుంది. సినీ తారల తళుకులు.. హుషారెత్తించే కామెడీ స్కిట్లు.. విద్యార్థుల సందడితో స్టేడియుం మార్మోగనుంది. సాయంత్రం 3 గంటలకు మొదలయ్యే ఈ ఫెస్ట్‌కు వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. సినీతారలు అదా శర్మ, డింపుల్ చోపదే, రెజీనా, సునీల్, మంచు మనోజ్, నాని, ఆది, ఆది పినిశెట్టి తదితరులు సందడి చేయనున్నారు. వీరితో పాటు ప్రముఖ సింగర్స్ బాబా సెహగల్, రోల్ రిదా తమ పాటలతో ఉర్రూతలూగించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ఇండియా నంబర్ వన్ స్పోర్ట్స్ బైక్ బజాజ్ పల్సర్ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గానం, సంగీతం, ఆటలు తదితర అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆదివారం బహుమతులను అందజేస్తారు. ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సినీ తార మంచు లక్ష్మి, విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ ఎల్.రత్తయ్య, సుల్తాన్ ఉల్ ఉలూం కాలేజ్ గౌరవ సెక్రటరీ జాఫర్ జావిద్ తదితరులు ఫెస్ట్‌ను ప్రారంభించనున్నారు. ఈ మెగా ఫెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ కళాశాలల గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ పాస్‌ల కోసం ‘సాక్షి’ ఎరీనా వన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెంట్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. మరిన్ని వివరాలకు 95058 34448, 040-23256134కు కాల్ చేయవచ్చు. -
హైదరాబాద్ విజయం
సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో చెన్నై వారియర్స్‌పై హైదరాబాద్ ఏసెస్ ఆధిపత్యం కొనసాగింది. చెన్నైలో జరిగిన తొలి దశ మ్యాచ్‌లో ఆ జట్టును చిత్తు చేసిన ఏసెస్ రెండో మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. సోమవారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 5-3, 5-2, 5-4, 5-4, 5-6 (25-19 గేమ్‌ల)తో చెన్నైని చిత్తు చేసింది. ఆదివారం నాగ్‌పూర్ ఆరెంజర్స్ చేతిలో పరాజయం పాలైన ఏసెస్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో చెలరేగారు. ముందుగా లెజెండ్స్ మ్యాచ్‌లో థామస్ జొహన్సన్ 5-3తో రైనర్ షట్లర్‌ను ఓడించి జట్టుకు ఆధిక్యం అందించాడు. మహిళల సింగిల్స్‌లో మార్టినా హింగిస్ 5-2 తో హీతర్ వాట్సన్‌ను చిత్తు చేసి ఆధిక్యాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత మిక్స్డ్ డబుల్స్‌లోనూ హైదరాబాద్ జోడి కార్లోవిచ్-హింగిస్ 5-4తో చెన్నై జంట వెర్డాస్కో-వాట్సన్‌ను ఓడించింది. పురుషుల డబుల్స్‌లో ఏసెస్ ద్వయం కార్లోవిచ్-జీవన్ 5-4తో వెర్డాస్కో-విష్ణువర్ధన్‌లపై గెలవగా... చివరి మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో మాత్రం వారియర్స్ ప్లేయర్ వెర్డాస్కో 6-5తో కార్లోవిచ్‌ను ఓడించి ప్రత్యర్థి ఏకపక్ష విజయాన్ని అడ్డుకున్నాడు. శుక్రవారం నాగ్‌పూర్‌లో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఏసెస్, ఆరెంజర్స్‌తో రెండోసారి తలపడుతుంది. -
సల్లంగ జూడు బతుకమ్మా..
-
ఆ పూల రంగు.. మనసు నిండు
-
ఆ పూల రంగు.. మనసు నిండు
‘సల్లంగ జూడు బతుకమ్మా.. పోయి రావమ్మా బతుకమ్మా..’ అంటూ తెలంగాణ ఆడపడుచులంతా ట్యాంక్ బండ్ వైపు సాగుతున్నారు. ఎల్బీ స్టేడియం నుంచి దాదాపు 10 వేల బతుకమ్మలతో బయలుదేరిన ర్యాలీ.. కన్నుల పండువగా కొనసాగుతున్నది. బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు వివిధ జిల్లాల నుంచే కాక నగరం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తంగేడు, రంగులద్దిన గునుగు తదితర పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి గంగమ్మ వైపు పయనమయ్యారు. హుస్సేన్‌సాగర్ తీరంలో ‘సద్దుల బతుకమ్మ’ ఉత్సవానికి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసిసిన సంగతి తెలిసిందే. మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని నడుస్తూ..తెలంగాణ కళారూపాలు, విన్యాసాల నడుమ ప్రదర్శనగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటారు. అక్కడ గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు ర్యాలీగా వచ్చిన మహిళలకు స్వాగతం పలుకుతున్నారు. జిల్లాల వారీగా శకటాల ప్రదర్శన, వాటిని అనుసరిస్తూ మహిళల బతుకమ్మ ఆట, కళారూపాల విన్యాసాలు క్రమపద్ధతిలో జరిగేలా ఏర్పాట్లు చేశారు. మరికొద్ది గంటల్లో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. 10 వేల మంది ఎల్బీ స్టేడియం నుంచి బతుకమ్మలతో ట్యాంక్‌బండ్ ప్రధాన ఉత్సవ వేదిక దాకా ర్యాలీగా సాగుతున్నారు. 10 వేల బతుకమ్మలను పేర్చారు. ఇందుకోసం 65 వేల టన్నుల పూలను ఏర్పాటుచేశారు. మంగళవారం ఉదయం నుంచి బతుకమ్మను పేర్చేందుకు ఏర్పాట్లు జరిగాయి సాయంత్రం 4:30 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి బతుకమ్మ ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా 6 గంటలకు ప్రారంభమైంది. -
‘బతుకమ్మ’ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు
* రేపు సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 వరకు * ట్యాంక్‌బండ్, ఎల్బీస్టేడియం కేంద్రంగా అమలు సాక్షి, సిటీబ్యూరో: మధ్య మండల పరిధిలోని ఎల్బీ స్టేడియంతో పాటు అప్పర్ ట్యాంక్‌బండ్‌పై మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపు నిబంధన విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఇవి అమలులో ఉండనున్నాయి. ఆ సమయంలో సికింద్రాబాద్, కట్టమైసమ్మ, కవాడీగూడ, ఇక్బాల్మీనార్, ఏఆర్ పెట్రోల్ పంప్, డీజేఆర్ స్టాట్యూ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, పోలీసు కంట్రోల్ రూమ్, నాంపల్లి, హిమాయత్‌నగర్ వై జంక్షన్, పంజగుట్ట, రాజ్‌భవన్, బుద్ధభవన్ వైపునకు ప్రయాణించే వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని కమిషనర్ కోరారు. కార్యక్రమాలకు హాజరయ్యే ఆహుతులు తమకు జారీ చేసిన పాసుల శ్రేణిని బట్టి నిర్ణీత ప్రాంతాల్లో ఆపి దిగిపోవడంతో పాటు కేటాయించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కారు పాసుల్లేని వాహనాలను ట్రాఫిక్ మళ్లింపులు ఉన్న ప్రాంతాలు దాటి రావడానికి అనుమతించరు. చిల్డ్రన్ పార్క్ జంక్షన్ దాటి, ఎల్బీ స్టేడియం నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ మధ్య ఉన్న బషీర్‌బాగ్, లిబర్టీ, అంబేద్కర్ స్టాట్యూ మధ్య వాహనాలను అనుమతించరు. ఆహుతులు తమ డ్రైవర్ నెంబర్లను దగ్గర ఉంచుకుని, కార్యక్రమం ముగిసిన తర్వాత మాత్రమే నిర్ణీత ప్రాంతాలకు కార్లను పిలిపించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. బతుకమ్మ సంబరాలకు భారీ బందోబస్తు ఖైరతాబాద్: బతుకమ్మ సంబరాలకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు ఏసీపీలు, 20మంది సీఐలు, 60మంది ఎస్ఐలతో పాటు మొత్తం 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా నుంచి 200 మంది మహిళలతో పాటు 10 వేల మంది మహిళా పొదుపు సంఘాల మహిళలు మొత్తం 12వేల మంది మహిళలు లాల్‌బహదూర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. వీరితో పాటు రాజకీయ, ఇతర ప్రముఖులు, నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో జిల్లాల వారీగా ప్రత్యేక శకటాలు లాల్‌బహదూర్ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ప్రదర్శనగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో 20వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ ఘాట్లకు రూ.70లక్షలు బంజారాహిల్స్: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లస్ రోడ్, ట్యాంక్‌బండ్ పైన ఉన్న బతుకమ్మ ఘాట్లలో బతుకమ్మ నిమజ్జనాలు చేసేందుకు ఏడు ఘాట్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు రూ.70లక్షల నిధులు వెచ్చిస్తున్నట్లు జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్ కిషన్ తెలిపారు. ఈ ఘాట్లలో పరిశుభ్రమైన నీరు ఉండే విధంగా చెత్తను తొలగిస్తున్నామని రోడ్డు మరమ్మతులు చేపట్టి లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన నీళ్లలో బతుకమ్మ నిమజ్జనం చేసే విధంగా కొన్ని చోట్ల టబ్‌ల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. సోమవారం సాయంత్రానికి ఘాట్ల వద్ద పూర్తి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. -
తెలంగాణ ఫండ్‌కి స్టార్ క్రికెట్
తెర మీద సందడి చే సే న టీనటులు ఇప్పుడు క్రీడా మైదానంలో అభిమానులను అలరించనున్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి సహాయనిధి కోసం తెలంగాణ స్టార్స్, చెన్నై హీరోస్ జట్ల మధ్య ఆగస్టు 9న క్రికెట్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మధ్యా హ్నం రెండు గంటలకు ఆట మొదలవుతుంది. తెలంగాణ సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తోంది. ‘‘తెలుగు ఇండస్ట్రీలోని హీరోలందరూ కలిసికట్టుగా ఆడనున్నారు. గెలిచిన జట్టుకు ‘కాకతీయ కప్’ ఇస్తాం’’ అని హీరో జై ఆకాశ్ చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ సినీ ఆర్టిస్ట్స్ సంఘ గౌరవాధ్యక్షుడు నాగరాజు, అధ్యక్షుడు సంగకుమార్ పాల్గొన్నారు. -
ప్లీనరీ సైడ్‌లైట్స్..
శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ ఆద్యంతం కళాకారుల పాటలు, కేసీఆర్ మార్కు పంచ్ డైలాగులు, కార్యకర్తల కేరింతలు, బాణసంచా పేలుళ్లతో సందడిగా జరిగింది. అందులో పలు అంశాలు సభకు హాజరైనవారిని బాగా ఆకట్టుకున్నాయి. * టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభా వేదిక వద్దకు రాగానే కార్యకర్తల నినాదాలు మిన్నంటాయి. ఆయన కార్యకర్తలకు అభివాదం చేసి వేదికపై ఆసీనులయ్యారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కేసీఆర్‌కు దట్టీ కట్టారు. * టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్‌ను ప్రకటించిన సమయంలో వేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంత్రాల నుంచి గులాబీ పూలవర్షం కురిపించారు. * వేదికతో పాటు మహిళలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు కూర్చున్న గ్యాలరీలపై పూలవర్షం కురవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమయంలో కార్యకర్తలు భారీగా బాణసంచా కాల్చారు. * వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం గిరిజన సంస్కృతిని ప్రతి బింబించేలా ఏర్పాటు చేసిన డమరుకాన్ని కేసీఆర్ మో గించడం ఆకట్టుకుంది. ఇదే సమయంలో ‘గులాబీ జెండా లు ఎగరాలి.. ద్రోహుల గుండెలు అదరాలి..’ అంటూ పాటరావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. * టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నాయిని నరసింహారెడ్డి ప్రకటించిన అనంతరం కళాకారులు ఆలపించిన ‘సల్లంగుండాలయ్యా.. మాసారూ కేసీఆరూ.. మీరు పైలం గుండాలయ్యా మా ముఖ్యమంత్రిగారు..’ అన్న పాట బాగా ఆకట్టుకుంది. * కేసీఆర్‌కు ఎక్సైజ్ మంత్రి పద్మారావు బోనం ఆకారంలో ఉన్న కళాకృతిని ఇచ్చి శిరస్సుపై పగిడి పెట్టి సన్మానించారు. * కొందరు మహిళలు బతుకమ్మలు పేర్చుకొని వచ్చి కేసీఆర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. * కేసీఆర్ తన ప్రసంగంలో పలుమార్లు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ.. అడిగి మరీ కార్యకర్తల చేత చప్పట్లు కొట్టించారు. ప్లీనరీ తీర్మానాల ఆమోదం సమయంలోనూ గట్టిగా చప్పట్లు కొట్టాలని పదేపదే కార్యకర్తలను కోరారు. వేదికపైనున్న ముఖ్య నేతలు సైతం గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరడం గమనార్హం. * త్వరలో పార్టీ కార్యకర్తలకు పదవుల పందేరం మొదలుపెడతామని, ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేయరాదని సీఎం సూచించినపుడు కార్యకర్తల చప్పట్లు, ఈలలతో ప్రాంగణం మారుమోగింది. * కేసీఆర్ పలువురు నాయకులపై పంచ్ డైలాగులు విసిరి అందరినీ నవ్వించారు. కార్యసాధకుడు లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుదిరగడంటూ ఓ పద్యం వినిపించడం ఆకర్షించింది. * అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌ను సన్మానించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీపడ్డారు. ఈ సమయంలో వేదిక కిక్కిరిసిపోవడంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకొని అందరినీ కిందకు పంపించివేశారు. * ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎయిర్ కూలర్లు తరచూ ఆగిపోవడంతో కార్యకర్తలు ప్లకార్డులతో విసురుకోవడం కనిపించింది. వేదికపై ఉన్న మంత్రులు సైతం ఉక్కపోత భరించలేక పార్టీ కరపత్రాలతో విసురుకున్నారు. * వేదికపై నుంచి ఎమ్మెల్యే, సినీనటుడు బాబూమోహన్, ఎంపీ కవిత మహిళలకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. * మంత్రులు హరీశ్, కేటీఆర్‌ల ప్రసంగాల సమయంలో చప్పట్లు, ఈలలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. * ‘తెలంగాణ సీఎంగా కేసీఆర్ అవడంతో మా కల నిజమైం ద’ంటూ కళాకారులు ఓ పాట పాడిన సమయంలో కేసీఆర్.. ‘ఇది డబ్బాగొట్టే పాట’ అంటూ నవ్వించారు. * ఉద్యమ సమయంలో తన జీపుపై నుంచి జెతైలంగాణ నినాదాలు చేసిన స్వీటీ అనే బాలిక .. సభకు వచ్చి తాను పైలట్ అయ్యేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని వేదికపైకి ఎక్కి సీఎంకు వినతిపత్రం సమర్పించింది. దీంతో ఆయన ఆ బాలికకు ఎంత ఖర్చైనా ఇచ్చి పైలట్ చేస్తామని చెప్పి, అందరితో చప్పట్లు కొట్టించడం ఆకట్టుకుంది. ఆయన ‘పంచ్’ వేస్తే.. ప్లీనరీలో కేసీఆర్ తనదైన శైలిలో పడికట్టు పదాలతో, పంచ్ డైలాగులతో సభకు హాజరైనవారిని ఆకట్టుకున్నారు. * రాష్ట్రంలో కోతుల బెడద అధికంగా ఉన్న నేపథ్యంలో ‘కోతులుండే జాగాను మనం ఖరాబు చేస్తే.. మనం ఉండే జాగాలకచ్చి అవి మన పంటలను ఖరాబు చేస్తున్నాయి. అందుకే ప్రతి గ్రామంలో వేలాదిగా చెట్లు నాటాలి..’ అని సూచించారు. * కరెంట్ కోతలపై విపక్షాలు అసెంబ్లీలో ఆందోళన చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ‘మేం అధికారం చేపట్టి గోచిగూడా సర్దుకోకముందే ఆందోళన చేస్తున్నరు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో లాంతర్లు, ఎండిన వరి కంకులు తేకుండా పంటలకు నీళ్లిచ్చినం..’’ అన్నారు. * పలువురు మంత్రులు తీర్మానం సమయంలో సుదీర్ఘంగా ప్రసంగించడంతో.. ‘మనం నాయకులం సమయం విషయంలో సోయి ఉండాలె. కార్యకర్తలందరూ చాలా దూరం పోవాలె. పెద్ద అంశమైతే ఏడు నిమిషాలు, చిన్న తీర్మానమైతే మూడు నిమిషాల్లో ప్రసంగాలను ముగించండి..’ అని కేసీఆర్ సూచించారు. కానీ పలువురు మంత్రులు పది నిమిషాలకు పైగా ప్రసంగం కొనసాగించారు. * విద్యుత్ కోతలు లేకుండా చేసిన ఆ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని ‘ఇక నుంచి కరెంట్ రెడ్డి అని పిలవాల’న్నారు. * సభా ప్రాంగణంలో కేసీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన చిన్నపాటి తోరణాలను చించుకునేందుకు కార్యకర్తలు పోటీపడడంతో కేసీఆర్ వారినుద్దేశిస్తూ.. ‘సభ అయిపోయినంక ఎవరికి దమ్ముంటే వారు పీక్కోని పోండి.. అప్పటివరకు ఆగండి..’ అని తనదైన శైలిలో చెప్పారు. అలరించిన ఆటా పాట ప్లీనరీ ప్రధాన వేదికకు ఆనుకుని వేసిన ప్రత్యేక స్టేజీపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బృందం ఆధ్వర్యంలో కళా బృందాల ఆటాపాట కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. గతానికి భిన్నంగా ఈసారి తెలంగాణ సంస్కృతితో పాటు మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం వంటి పథకాలకు సంబంధించిన గేయాలు పాడారు. ‘పల్లె మేలుకోవాలి.. ఇళ్లు మేలుకోవాలి.. ప్రతి మహిళా మేలుకోవాలి’, ‘కొమ్మలల్లా కోయిలమ్మా పాటపాడుతున్నాది.. జై తెలంగాణ అని’, ‘జయజయహే తెలంగాణ’, ‘ఉస్మానియా క్యాంపస్‌లో వీరుల్లారా.. వీరవనితల్లారా..’ అన్న పాటలకు మంచి స్పందన కనిపించింది. కార్యకర్తలు పార్టీ పతాకాలను ఊపుతూ కళాకారులను అభినందించారు. -
అట్టహాసంగా టీఆర్ఎస్ ప్లీనరీ
-
అట్టహాసంగా టీఆర్ఎస్ ప్లీనరీ
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించి విజయఢంకా మోగించారు. ఆ తర్వాత అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ ఇది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో యాభై లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేసిన టీఆర్ఎస్.. నియోజకవర్గానికి 300 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 36 వేల మంది ప్రతినిధులను ప్లీనరీకి ఆహ్వానించింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా.. మరింత ఎక్కువగా యాభైవేల మందికి సరిపడేలా ఏర్పాట్లూ చేసింది. జాతీయ స్థాయిలో అన్ని పార్టీల దృష్టిని ఆకర్షించేలా చర్యలు చేపట్టింది. అంతకు ముందు అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్‌తో పాటు పార్టీ నేతలు నివాళులు అర్పించారు. -
ఎల్బీ స్టేడియం గుబాళింపు
హైదరాబాద్ : గులాబీ ధూంధాంకు రంగం సిద్ధమైంది. పద్నాలుగేళ్ల ప్రయాణం.. ఉద్యమాల ప్రస్థానం.. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిందన్న గౌరవం.. కొత్త రాష్ట్ర తొలి ఎన్నికల్లోనే అధికార పీఠం కైవసం.. వీటన్నింటినీ ప్రతిబింబించేలా, దాదాపు ఏడాది పాలనపై ప్రచారమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని నిర్వహిస్తోంది. అధికారంలోకి వచ్చాక ఇదే తొలి ప్లీనరీ సమావేశం కావడం విశేషం. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మరికాసేపట్లో ప్లీనరీ మొదలు కానుంది. ప్లీనరీలో 12 తీర్మానాలను ఆమోదించనున్నారు. మరోవైపు ప్లీనరీలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా కళాకారులతో కలిసి గొంతు కలుపుతున్నారు. పార్టీ నేతలు గులాబీ కండువాలు ధరించి ప్లీనరీ వేదికపై ఆసీనులయ్యారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. మరోవైపు సైకిల్ దిగి కారు ఎక్కిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మెడలో గులాబీ కండువా ధరించి ప్లీనరీకి హాజరయ్యారు. -
టీఆర్ఎస్ ప్లీనరీకి.. సకల ఏర్పాట్లు
హైదరాబాద్ సిటీ : అధికార టీఆర్ఎస్ ప్లీనరీని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం పని మొదలు పెట్టింది. ఈనెల 24న ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్లీనరీ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ మేరకు వేదిక, సభా ప్రాంగణం ఏర్పాట్ల కమిటీ చైర్మన్, మంత్రి పద్మారావు గౌడ్ శుక్రవారం ఎల్బీ స్టేడియాన్ని సందర్శించారు. జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి కలిపి 36వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. -
24 న టీఆర్ఎస్ తొలి ’ప్లీనరీ సమావేశం’
-
భాగ్యనగరంలో మహిళా టెన్నిస్ సందడి
నేటినుంచి ఫెడ్ కప్ టోర్నీ బరిలో 11 జట్లు భారత కెప్టెన్‌గా సానియా సాక్షి, హైదరాబాద్: దాదాపు పదేళ్ల క్రితం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సొంత నగరం హైదరాబాద్‌లో ఒక అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంది. ఇప్పుడు ప్రపంచ నంబర్‌వన్ హోదాలో మరోసారి ఆమె స్వస్థలంలో అభిమానులను అలరించబోతోంది. మంగళవారం నుంచి భాగ్యనగరంలో ప్రారంభం కానున్న ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2) టోర్నీలో సానియా భారత జట్టుకు నాయకత్వం వహించనుంది. ఈ నెల 18 వరకు ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్‌తో పాటు మలేసియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, సింగపూర్, తుర్క్మెనిస్తాన్, కిర్గిస్తాన్, ఇరాన్, ఇండోనేసియా, శ్రీలంక, పసిఫిక్ ఓషియానియా జట్లు పాల్గొంటున్నాయి. చివరి నిమిషంలో ఇరాక్ పోటీనుంచి తప్పుకోవడంతో బరిలో 11 జట్లు నిలిచాయి. ఈ జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. తమ గ్రూప్‌లోని ఇతర రెండు జట్లతో ఒక్కో జట్టు బెస్టాఫ్ త్రీ పద్ధతిలో (రెండు సింగిల్స్, ఒక డబుల్స్ కలిపి ఒక మ్యాచ్) తలపడుతుంది. ఆయా గ్రూప్‌లో అగ్ర స్థానంలో నిలిచిన నాలుగు జట్ల మధ్య రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి. తుది విజేతగా నిలిచే టీమ్ 2016లో జరిగే ఆసియా/ఓషియానియా గ్రూప్ 1 పోటీలకు అర్హత సాధిస్తుంది. సోమవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పోటీల ‘డ్రా’ను విడుదల చేశారు. తొలి రోజు జరిగే పోటీల్లో భారత్ మ్యాచ్ లేదు. సానియా కెప్టెన్‌గా ఉన్న భారత జట్టులో అంకితా రైనా, ప్రార్థనా తోంబరే, నటాషా పల్హా ఇతర సభ్యులు. ‘డ్రా’ విడుదల కార్యక్రమంలో టోర్నమెంట్ డెరైక్టర్ అశోక్ కుమార్, చీఫ్ రిఫరీ ఆండ్రీ కోర్నిలోవ్, వివిధ జట్ల సభ్యులు పాల్గొన్నారు. -
స్టార్ షో..
-
టీఎన్జీఓ క్రీడలు షురూ
ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీఓ) క్రీడలు ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగిన ఈ క్రీడల ప్రారంభోత్సవానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనచారి, మండలి స్పీకర్ స్వామి గౌడ్లు ముఖ్యఅతిథులుగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్‌లో 400 మీటర్ల పరుగులో శ్రీనివాస్ (గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్) విజేతగా నిలిచి స్వర్ణం గెలిచాడు. రహీమ్ (గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్) రెండో స్థానంతో రజత పతకాన్ని గెలిచాడు. కబడ్డీ టోర్నీలో గాంధీ మెడికల్ కాలేజి జట్టు 30-21 స్కోరుతో గాంధీ హాస్పిటల్ జట్టుపై విజయం సాధించింది. -
కొత్త కొత్తగా ఉంది!
చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌పై హింగిస్ వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: దాదాపు దశాబ్ద కాలం తర్వాత హైదరాబాద్ నగరం మరో చెప్పుకోదగ్గ టెన్నిస్ టోర్నీకి వేదిక అయింది. ఎల్బీ స్టేడియంలో నేడు, రేపు చాంపియన్స్ లీగ్ టెన్నిస్ టోర్నీ మ్యాచ్‌లు జరగనున్నాయి. సోమవారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లో హైదరాబాద్, బెంగళూరును ఎదుర్కొంటుంది. మంగళవారం పుణేతో హైదరాబాద్ తలపడుతుంది. జోరుగా ప్రాక్టీస్... ఆదివారం ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్ ఏసెస్ ఆటగాళ్లు చాలా సేపు ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత యువ ఆటగాళ్లతో మాజీ వరల్డ్ నంబర్‌వన్ మార్టినా హింగిస్ ముచ్చటించింది. చిన్నారులు తమ అభిమాన ప్లేయర్లతో ఫొటోలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. అనంతరం ఏసెస్ జట్టు యజమానులు రాజేశ్, కృష్ణంరాజులతో కలిసి ఆటగాళ్లు మీడియాతో మాట్లాడారు. ‘చాంపియన్స్ టెన్నిస్ లీగ్ ఆలోచనే చాలా కొత్తగా ఉంది. ఆటతో పాటు అనేక మంది మాజీ సహచరులను కలిసే అవకాశం కూడా దక్కుతోంది. ఫార్మాట్ కూడా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఫిలిప్పోసిస్తో నేను గతంలోనూ మిక్స్డ్ డబుల్స్ ఆడాను’ అని హింగిస్ వ్యాఖ్యానించింది. భారత వాతావరణం అంతా కొత్తగా అనిపిస్తోందని ఆమె చెప్పింది. ‘మ్యాచ్‌కు దాదాపు నాలుగు వేల మంది ప్రేక్షకులు వస్తారని విన్నాను. హోంగ్రౌండ్లో ప్రేక్షకులు మాకు మద్దతిస్తారని ఆశిస్తున్నాను. ఇవాళ ప్రాక్టీస్ కూడా కొత్తగా అనిపించింది. ఇంత మంది మధ్య నేనెప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు’ అని హింగిస్ వెల్లడించింది. ఏసెస్‌ను విజేతగా నిలబెడతామని ఈ సందర్భంగా ఫిలిప్పోసిస్ విశ్వాసం వ్యక్తం చేశాడు. యూజ్నీ తనదైన శైలిలో సెల్యూట్ చేసి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హౌస్‌ఫుల్... సోమ, మంగళవారాల్లో ఇక్కడ జరిగే సీటీఎల్ టోర్నీ మ్యాచ్‌ల కోసం టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ‘బుక్ మై షో’ ద్వారా ఆన్లైన్ అమ్మకాలకు మంచి ఆదరణ లభించిందని నిర్వాహకులు చెప్పారు. ఇప్పుడు అంతర్జాతీయ సర్క్యూట్లో రెగ్యులర్ ఆటగాళ్లు కాకపోయినా, గతంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టెన్నిస్ స్టార్లు ఈ బరిలోకి దిగుతుండటంతో ఈ టోర్నీ పట్ల ఆసక్తి నెలకొంది. ఎల్బీ స్టేడియంలో చాలా కాలంగా పెద్దగా మ్యాచ్‌లు జరగని సెంటర్ కోర్టును సీటీఎల్ కోసం ఉపయోగించనున్నారు. ఇందు కోసం అపరిశుభ్రంగా ఉన్న కోర్టులను ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్ది సిద్ధం చేశారు. నేటి మ్యాచ్‌లో ఎవరితో ఎవరు... లెజెండ్స్: ఫిలిప్పోసిస్ ఁ ఎన్క్విస్ట్ మిక్స్డ్ డబుల్స్: హింగిస్, యూజ్నీ ఁ వీనస్ విలియమ్స్, లోపెజ్ మహిళల సింగిల్స్: హింగిస్ ఁ వీనస్ పురుషుల డబుల్స్: యూజ్నీ, జీవన్ ఁ లోపెజ్, రామ్‌కుమార్ రామనాథన్ పురుషుల సింగిల్స్: యూజ్నీ ఁ లోపెజ్. -
బహిరంగసభకు భారీ జనసమీకరణ
ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న టీఆర్ ఎస్ బహిరంగసభకు జిల్లా నుంచి దాదాపు లక్షన్నర మంది హాజరవుతారని రాష్ట్రవిద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చెప్పారు. నల్లగొండ రూరల్ :ఈ నెల 12న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభకు జిల్లా నుంచి లక్షన్నర మంది హాజరవుతారని విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని సాయికృష్ణరెన్సీ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11న ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ జరుగుతుందని, దీంట్లోభాగంగా 8, 9 తేదీల్లో అన్ని నియోజకవర్గాలలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తారని వివరించారు. ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో తా ను హాజరవుతానని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలున్న చోటవారే బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. జిల్లా నుంచి ప్లీనరీకి 300 మంది అతిథులు పాల్గొంటారని వివరించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా సంక్షేమ పథకాలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా సీఎం కేసీఆర్ నూతన ఆలోచనలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం బంగారుతల్లి, భూతల్లి పేరిట ఆర్భాట ప్రకటనలు చేసిందన్నారు. కల్యాణ లక్ష్మి పేరిట రూ.51వేలు దళిత, గిరిజనులకు అందజేస్తు వారికి అండగా ఉన్నామన్నారు. రైతుల రుణమాఫీ, పెన్షన్ల పెంపు, ఆటో ట్యాక్సీల రద్దు లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కరెంట్ సమస్యను అధిగమించేందుకు వీలైనంత త్వరలో కరెంట్‌ను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. గత పాలకుల నిర్వాహకం వల్లే విద్యుత్ సమస్య, రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును టీడీపీ అడ్డుకుందని, కరెంట్ కోసం పొలవరం ప్రాజెక్టులోని ఏడు మండలాలను ఆంధ్రాకు మలుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు సభ ద్వారానే సమాధానం చెబుతాం ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలకు హైదరాబాదులో నిర్వహించే బహిరంగ సభ ద్వారానే సమాధానం చెబుతామని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి గాలి విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఆంధ్రా పార్టీలకు, ఆంధ్రా నాయకత్వానికి ఊడిగం చేయడం మానుకోవాలన్నారు. 12న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశమున్నట్లు సమాచారముందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, గాదరి కిషోర్, గొంగడి సునీత, ఎమ్మెల్సీ పూల రవీందర్, శంకరమ్మ, వేనేపల్లి చందర్రావు, దుబ్బాక నర్సింహారెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్, మాలే శరణ్యారెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, ఫరీద్, తదితరులు పాల్గొన్నారు. నియోజకవ ర్గస్థాయి సమావేశాలు నిర్వహించాలి : మంత్రి జగదీష్‌రెడ్డి ఈ నెల 12న హైదరాబాద్‌లో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభ నేపథ్యంలో బుధ, గురువారాల్లో నిర్వహించి నియోజకవర్గ స్థాయి సమావేశాలకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బాధ్యతలు తీసుకోవాలని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సూచించారు. సాయి రెసిడెన్సీ లో మంగళవారం జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడారు. 11 ప్లీనరీ, 12న బహిరంగ సభ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ప్లీనరీకి జిల్లా నుంచి హాజరయ్యే వారికి పాస్‌లు అందజేయాలని సూచించారు. బహిరంగ సభకు వాహనాల ఏర్పాటు ఆయా నియోజవర్గాలోనే చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కె.ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, గాదరి కిషోర్, గొంగడి సునీత, నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, శంకరమ్మ, వి.చందర్రావు, చాడ కిషన్‌రెడ్డి, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్ ఉన్నారు. -
పరేడ్ గ్రౌండ్లో అనుమతి ఇవ్వకుంటే...
హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ఈ నెల 11న టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్నారు. సభావేదికకు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఖరారు చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ సభకు అనుమతి రాకపోతే అంతకుమించిన మైదానంలో సభ నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారుచేస్తామని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ప్లీనరీ కోసం ఏడు కమిటీలను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. -
యూత్ చెస్ టోర్నీఆరంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యూత్ చెస్ టోర్నమెంట్ శనివారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఆరంభమైంది. రాష్ట్ర చెస్ అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అధికారిక టోర్నమెంట్ రెండు రోజుల పాటు జరుగుతుంది. కమిటీ చైర్మన్, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహారెడ్డి పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నీలో తెలంగాణలోని 10 జిల్లాలకు చెందిన 56 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వీరిలో 11 మంది ఇంటర్నేషనల్ ‘ఫిడే’ రేటింగ్ ఆటగాళ్లు ఉన్నారు. టోర్నమెంట్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు. -
ఘనంగా బతుకమ్మ సంబరాలు!
హైదరాబాద్: తెలంగాణ అంతటా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ అంతా బతుకమ్మ పాటలతో మారుమ్రోగుతోంది. ఎల్బి స్టేడియం నుంచి బతుకమ్మల ఊరేగింపు ఈ సాయంత్రం ప్రారంభమైంది. ఎంపి కవిత ఊరేగింపును ప్రారంభించారు. పది వేల బతుకమ్మలు ట్యాంక్‌బండ్ వద్దకు బయలుదేరాయి. ట్యాంక్‌బండ్ జనసంద్రమైంది. మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ట్యాంక్‌బండ్ పరిసరాలలో బతుకమ్మల పాటలే వినవస్తున్నాయి.బతుకమ్మ సంబరాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆటపాటలతో సంబరాలు ఘనగా కొనసాగుతున్నాయి. దాండియా, కోలాటాలు, పాటలతో ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతోంది. తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దంపతులు ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. ఈ దంపతులు ఆనందంగా బతుకమ్మ ఆడారు. ** -
భువి నిండుగ...విరి పండుగ
బతుకమ్మ సంబరాలకు సన్నాహాలు ముస్తాబవుతున్న పూల గోపురాలు జిల్లాల వైభవాన్ని చాటే శకటాలు సిద్ధం పది వేల బతుకమ్మల తయారీ కూకట్‌పల్లిలో కొలువుదీరనున్న 17 అడుగుల బతుకమ్మ భాగ్యనగరి పూలతో సింగారించుకుంటోంది. వీధులన్నీ విరి తోటలవుతున్నాయి. వాడలన్నీ వర్ణరంజితమవుతున్నాయి. ఇళ్ల ముందర బతుకమ్మలు కొలువుదీరుతున్నాయి. బతుకమ్మ ఒడిలో ఒదిగిపోవాలని పూలు పోటీ పడుతున్నాయి. ఆబాలగోపాలం ఆటపాటలలో మునిగి తేలుతున్నారు. తెలంగాణ వైభవానికి దర్పణం పట్టేలా ఈ వేడుక లు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సాక్షి, సిటీబ్యూరో/కూకట్పల్లి: పూల పండుగకు మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. తంగేడు, చామంతి, తీరొక్క రంగుల్లో ముంచి పేర్చిన గడ్డిపూలు, మందారాలు, బంతిపూలతో తీర్చిదిద్దే పూల గోపురాలు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక సౌరభాలను గుభాళించనున్నాయి. బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, ఎల్బీ స్టేడియం ప్రాంతాలను అందమైన విద్యుద్దీపాలతో అలంకరించారు. మరికొద్ది గంటల్లో వేలాది బతుకమ్మలతో, లక్షలాది మంది మహిళలతో భాగ్యనగరంలో మహాద్భుతమైన పూల జాతర ఆవిష్కృతం కానుంది. మరోవైపు రాష్ర్టంలోని పది జిల్లాల వైభవాన్ని చాటిచెప్పే శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సద్దుల బతుకమ్మ సంబురాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వ సన్నద్ధమవుతోంది. 10 వేల పూల గోపురాలు బతుకమ్మ వేడుకలకు ఎల్బీ స్టేడియం, ఎగ్జిబిషన్ గ్రౌండ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాలను అందంగా అలంకరించారు. ట్యాంక్‌బండ్ పైన స్వాగత వేదికలను తీర్చిదిద్దారు. కొన్ని చోట్ల ఉప వేదికలను ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున బతుకమ్మలను తయారు చేస్తున్నారు. ఇందుకోసం వేలాది మందిని నియమించారు. ఇప్పటికే వేలాది బతుకమ్మల తయారీ పూర్తయింది. 10 వేల బతుకమ్మలను వేడుకల కోసం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రాజీవ్ సాగర్లు ఎల్బీ స్టేడియంలో బతుకమ్మల తయారీని పర్యవేక్షిస్తున్నారు. బతుకమ్మలకు కావలసిన తంగేడు, గునుగు పూలను శుద్ధి చేసి పేరుస్తున్నారు. మరోవైపు కడియం, బెంగుళూరు నుంచి 35 వేల టన్నుల బంతిపూలను తెప్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా కానుగూరు నుంచి వచ్చిన ఐ.నాగరాజు బృందం, నగరానికి చెందిన అనిత బృందాలు బతుకమ్మల తయారీలో నిమగ్నమయ్యాయి. పండుగ సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో అరగంట పాటు లేజర్‌షోను ఏర్పాటు చేయనున్నారు. శకటాలు సిద్ధం మరోవైపు వివిధ జిల్లాల చరిత్ర, సంస్కృతులను చాటే శకటాలను ఎగ్జిషన్ గ్రౌండ్లో సిద్ధం చేశారు. ఆ ప్రాంతాల విశిష్టతను తెలిపే ఆకర్షణీయమైన చిత్రాలు, నినాదాలతో శకటాలను రూపొందించారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బీపీ ఆచార్య, సమాచార కమిషనర్ చంద్రవదన్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్. కవితాప్రసాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను సందర్శించి, శకటాల తయారీని పరిశీలించారు. ముంబైకి చెందిన విజ్‌క్రాఫ్ట్ ప్రతినిధులు శకటాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు.‘ఒక్కొక్క శకటంతో పాటు సుమారు 40 మంది కళాకారుల చొప్పున మొత్తం 2 వేల మంది ప్రదర్శనలిస్తారని’ కవితాప్రసాద్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో 25 వేల మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇన్చార్జ్ జేసీ సంజీవయ్య తెలిపారు. కూకట్‌పల్లిలో 17 అడుగుల బతుకమ్మ ఏటా బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహిస్తోన్న కూకట్‌పల్లిలో ఈ ఏడాది కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి పూలు తెప్పిస్తున్నారు. నిజమాబాద్, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల నుంచి పూలను తరలిస్తున్నారు. ఆడపిల్ల పుట్టడం శుభసూచకంగా భావించే సత్సంప్రదాయానికి బతుకమ్మ వేడుక ప్రతీక. ఆ సంప్రదాయాన్ని గత 17 ఏళ్లుగా పాటిస్తూ, తమ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు ప్రతీకగా వేడుకలు నిర్వహిస్తోన్న గుండాల చ ంద్రమ్మ కుటుంబం ఈసారి 17 అడుగుల బతుకమ్మను తయారు చేస్తోంది. ‘తమకు ఐదుగురు కుమారులని...అమ్మాయిలు లేరనే బెంగ ఉండేదని.. తమ కొడుక్కి కూతురు పుట్టిన సంతోషంతో బతుకమ్మను అంచెలంచెలుగా పెంచుతున్నటు’్ల చంద్రమ్మ చెప్పారు. -
2న ఘనంగా సద్దుల బతుకమ్మ
10 వేల బతుకవ్ములతో ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపు బతుకమ్మల నిమజ్జనానికి 8 ఘాట్లు హైదరాబాద్: బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించిన తరువాత తొలిసారిగా జరుగుతున్న బతుకమ్మ పండుగ ముగింపు(సద్దుల బతుకమ్మ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పండుగ కోసం ఇప్పటికే రూ. పదికోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ రెండో తేదీన హైదరాబాద్‌లో 25 వేల మంది మహిళలతో భారీ ఎత్తున ముగింపు వేడుకలకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో పదివేల బతుకమ్మలు.., తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆయా జిల్లాల ఔన్నత్యాన్ని చాటే శకటాల ప్రదర్శన, లేజర్ షోల వుధ్య వేడుక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం సచివాలయంలో దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. దసరా ముందురోజు నిర్వహించే ఈ బతుకమ్మల కోసం 350 క్వింటాళ్ల పూలను సవుకూర్చనున్నారు. ఇందుకోసం రూ. 60 లక్షల వ్యయం చేయనున్నారు. పదివేల బతుకమ్మలను పేర్చడానికి ఎల్బీ స్టేడియంలో 1,200 మంది మహిళలు పనిచేస్తారని, వీరికి ప్రభుత్వమే అన్ని సదుపాయలు కల్పిస్తుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ పాల్గొననున్నారు. ట్యాంక్‌బండ్ వద్ద బుద్ధభవన్ వైపు బతుకమ్మల నిమజ్జనానికి ఎనిమిది ఘాట్లను ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ రెండున ‘తెలంగాణ’ మాస పత్రిక.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక మాసపత్రికను తీసుకువస్తోంది. ఈ పత్రికకు ‘తెలంగాణ’ అని నామకరణం చేసినట్లు తెలిసింది. తొలి సంచికను అక్టోబర్ 2వ తేదీన సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. దీనికి అష్టకాల రామ్మోహన్రావు సంపాదకులుగా వ్యవహరిస్తారని అధికారవర్గాల సమాచారం. -
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ గురువారం ఎల్బీ స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులను భారీగా మోహరించినట్లు అనురాగ్ శర్మ తెలిపారు. సభలు, విజయోత్సవాలు నిషేధమని, కౌంటింగ్ కేంద్రాల నుండి ఎలాంటి ర్యాలీలకు అనుమతిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
వీహెచ్ కు చేదు అనుభవం
హైదరాబాద్: గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన వి. హనుమంతరావు(వీహెచ్)కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను, ఎంపీనని చెప్పినా వేదికపైకి పంపడానికి పోలీసులు నిరాకరించారు. ఎల్బీస్టేడియంలో రాహుల్ సభ వద్ద వీహెచ్ కు అవమానం జరిగింది. వేదికపైకి అనుమతి నిరాకరించడంతో వీహెచ్ కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు వీహెచ్ కు అనుమతించకపోవడంతో ఆగ్రహంతో అక్కడి నుంచి తప్పుకున్నారు. -
ఇక తెరపైకి.. వీఐపీలు
సాక్షి, సిటీబ్యూరో : పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నగరంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని తారస్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. గురువారం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేయనున్నారు. చాలాకాలం తర్వాత రాహుల్ నగరానికి వస్తుండటంతో నగర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమైన జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లిలలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ నగర శివారు శాసనసభా స్థానాలపై దృష్టి సారించారు. శని, ఆదివారాల్లో నగరంలో వివిధ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. -
మోడీ శైలే వేరు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ సభల్లో క్లుప్తంగా, చెప్పదలుచుకున్న విషయాలపై సూటిగా మాట్లాడిన బీజేపీ అగ్రనేత నరేంద్ర మోడీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మాత్రం తనదైన బాణీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పెద్దలకు చురకలంటించారు. అడపాదడపా చలోక్తులు సంధించారు. అవి ఆయన మాటల్లోనే... ఢిల్లీలో ఎలాంటి ప్రభుత్వం కొలువు దీరాలి. గట్టిగా చెప్పండి.. ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న ప్రభుత్వం కావాలా? తల్లీకొడుకుల(సోనియా, రాహుల్) ఆక్సిజన్‌తో నడిచే సర్కారు కావాలా? రిమోట్ కంట్రోల్‌తో నడిచే ప్రభుత్వం కావాలా? - గత ఎన్నికల సమయంలో పది కోట్ల మందికి ఉపాధి చూపుతామని తల్లీకొడుకుల ప్రభుత్వం చెప్పింది. ఈ సభలో ఉన్న వారిలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వచ్చిందా? మీ దోస్తుల్లో ఎవరైనా ఉద్యోగం పొందారా? వారి దోస్తుల్లో ఎవరికైనా వచ్చిందా? - మోడీ ప్లస్ పవన్‌కల్యాణ్ ప్లస్ బాబు... 1 ప్లస్ 1 ప్లస్ 1... ఎవరినైనా అడిగితే 3(ముగ్గురు) అంటారు. అది అర్థమెటిక్. కానీ నాకు కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఇక్కడ ముగ్గురు కాదు. 111 (నూటాపదకొండు). - దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రావాలంటే వీసా ఉండాల్సిన పరిస్థితి నుంచి కొద్దిలో తప్పించుకున్నాం. ఆ పుణ్యం సర్దార్ వల్లభాయ్ పటేల్‌దే. ఆ ఉక్కు మనిషి ఈ సంస్థానాన్ని దేశంలో విలీనం చే యించి దీన్ని భారత్‌లో భాగం చేశారు. తెలుగువారిపై పగ కాదా..? మోడీ పాల్గొన్న నాలుగు వేదికల్లో ఓ అంశాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ఇందిర కుటుంబానికి ముందు నుంచీ తె లుగువారంటే కోపముందని వివరించారు. ఇందిరాగాంధీ హయాంలో రాష్ట్రపతిగా కాంగ్రెస్ అధికారిక అభ్యర్థి, తెలుగు వ్యక్తి నీలం సంజీవరెడ్డి గెలవకుండా ఆమె వీవీగిరిని గెలిపించారని గుర్తు చేశారు. దళిత ముఖ్యమంత్రి అంజయ్యను విమానాశ్రయం లో తీవ్రంగా అవమానించి రాజీవ్‌గాంధీ ఆయ న కంట నీరు పెట్టించారన్నారు. దానిపై విమర్శలు చెలరేగడంతో కోపంతో కొద్దిరోజులకే అంజయ్యను పదవి నుంచి తప్పించారన్నారు. పీవీ నరసింహారావు గొప్ప ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయేలా పనిచేస్తే ఆయనను దారుణంగా అవమానిందన్నారు. ఆయన జయంతి, వర్ధంతి సమయాల్లో ఆ పార్టీ నేతలు కనీసం పుష్పాంజలి కూడా ఘటించరని పేర్కొన్నారు.