
యువతతో కలిసి స్టెప్పులు వేస్తున్న నాయిని..
సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలన్నారు.
గన్‌ఫౌండ్రీ: ఎల్‌బీ స్టేడియంలో ఆదివారం గిన్నిస్ రికార్డు నమోదయింది. భారతదేశ సినీ సంగీత నృత్య, ఏరోబిక్ డ్యాన్స్ విభాగంలో ఎరాక్ డ్యాన్స్ ఫిట్‌నెస్ అకాడమీ 5000 మందితో డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించింది. ముఖ్య అతిథి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలన్నారు.
అనంతరం అరగంట పాటు సాగిన ఈ డ్యాన్స్ కార్యక్రమాన్ని తిలకించి మార్వెలెస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా కో–ఆర్డినేటర్ మోహన్ చంద్ర ప్రశంస పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సినీనటి రాధా ప్రశాంతి, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ గవర్నర్ రత్న ప్రభాకర్, మెజీషియన్ సామల వేణు, ఎరాక్ డ్యాన్స్ అకాడమీ, చిరునవ్వు ఆర్ట్స్ అధినేత వై.మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.