టీఎన్‌జీఓ క్రీడలు షురూ | tngo sports began | Sakshi
Sakshi News home page

టీఎన్‌జీఓ క్రీడలు షురూ

Jan 8 2015 1:23 AM | Updated on Oct 8 2018 3:44 PM

టీఎన్‌జీఓ క్రీడలు షురూ - Sakshi

టీఎన్‌జీఓ క్రీడలు షురూ

హైదరాబాద్ జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్‌జీఓ) క్రీడలు ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్‌జీఓ) క్రీడలు ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగిన ఈ క్రీడల ప్రారంభోత్సవానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనచారి, మండలి స్పీకర్ స్వామి గౌడ్‌లు ముఖ్యఅతిథులుగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్‌లో 400 మీటర్ల పరుగులో శ్రీనివాస్ (గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్) విజేతగా నిలిచి  స్వర్ణం గెలిచాడు. రహీమ్ (గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్) రెండో స్థానంతో రజత పతకాన్ని గెలిచాడు. కబడ్డీ టోర్నీలో గాంధీ మెడికల్ కాలేజి జట్టు 30-21 స్కోరుతో గాంధీ హాస్పిటల్ జట్టుపై విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement