
యూత్ చెస్ టోర్నీఆరంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యూత్ చెస్ టోర్నమెంట్ శనివారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఆరంభమైంది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యూత్ చెస్ టోర్నమెంట్ శనివారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఆరంభమైంది. రాష్ట్ర చెస్ అడ్‌హాక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అధికారిక టోర్నమెంట్ రెండు రోజుల పాటు జరుగుతుంది. కమిటీ చైర్మన్, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహారెడ్డి పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నీలో తెలంగాణలోని 10 జిల్లాలకు చెందిన 56 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వీరిలో 11 మంది ఇంటర్నేషనల్ ‘ఫిడే’ రేటింగ్ ఆటగాళ్లు ఉన్నారు. టోర్నమెంట్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు.