16, 17 తేదీల్లో రెజ్లింగ్‌ టోర్నీ | wrestling event held in LB stadium on 16 and 17 | Sakshi
Sakshi News home page

16, 17 తేదీల్లో రెజ్లింగ్‌ టోర్నీ

Feb 15 2017 12:38 PM | Updated on Apr 7 2019 3:34 PM

16, 17 తేదీల్లో రెజ్లింగ్‌ టోర్నీ - Sakshi

16, 17 తేదీల్లో రెజ్లింగ్‌ టోర్నీ

తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో రెజ్లింగ్‌ పోటీలు జరగనున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో రెజ్లింగ్‌ పోటీలు జరగనున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఆరు విభాగాల్లో ఈ కుస్తీ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో దాదాపు 200 మంది రెజ్లర్లు తలపడనున్నట్లు పేర్కొన్నారు.

క్రీడాభిమానులు ఈ పోటీలకు హాజరై క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షులు కె. రంగారావు, ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌రాజ్, రెజ్లింగ్‌ సభ్యులు చంద్రశేఖర్, జాఫర్, విజయ్‌కుమార్‌ యాదవ్, హబీబ్, మోహిన్‌ అలీఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement