రెండేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో ఓట్లు, సీట్లు, నోట్లు, వెన్నుపోట్లే ఎజెండాగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన మహాసమ్మేళన్‌లో ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయన్నారు. కేసీఆర్ వారసులకు అధికారాన్ని అప్పగించడం కోసం రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. న్యాయస్థానాలు తప్పని చెప్పినా వినకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.